Showing posts with label Interview Tip. Show all posts
Showing posts with label Interview Tip. Show all posts

Tuesday, 1 August 2017

రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు

రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు













       సివి(కరికులమ్‌ వీటే)..జాబ్‌ సెర్చ్‌లో ప్రొఫెషనల్‌ అప్రోచ్‌కు ప్రతిరూపం. అచీవ్‌మెంట్స్‌, ఫ్యూచర్‌ గోల్స్‌ వంటి అంశాల ఆధారంగా పాజిటివ్‌ యాంగిల్‌లో మనల్ని మనం ప్రజెంట్‌ చేసుకోవడానికి దోహదపడే కీలకమైన డాక్యుమెంట్‌. అటువంటి సివిలో రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు ఏమిటి? వేటిని క్రాస్‌చెక్‌ చేసుకుంటారు? అసలు సివిని మొదట చూడగానే వారు ఏయే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు?
వ్యక్తిగత నైపుణ్యాలు, అర్హతలు, సాధించిన విజయాలు వంటి వాటిని సంక్షిప్తంగా ఆసక్తితో, ఆకట్టుకునేలా రీడర్‌ ఫ్రెండ్లీగా సివిని రూపొందించుకోవాలి. ఈ విషయంలో కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
 
స్కిల్‌-టాలెంట్‌
రిక్రూటర్లు ముందుగా సివిలోని స్కిల్‌, టాలెంట్‌ కాలమ్‌ను పరిశీలిస్తారు. అయితే చాలామంది జాబ్‌ సీకర్స్‌ నైపుణ్యాలు (స్కిల్స్‌), ప్రతిభ (టాలెంట్‌) రెండిటినీ ఒకటే అంశంగా సివిలో పేర్కొంటారు. కానీ, ఇక్కడ గమనించాల్సింది ఇవి రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు జావా/ హెచ్‌టిఎంఎల్‌/సిఎ్‌సఎస్‌ లాంగ్వేజె్‌సలో ప్రావీణ్యం ఉండటాన్ని నైపుణ్యంగా భావిస్తారు. ఈ లాంగ్వేజె్‌సను ఉపయోగించి ప్రోగ్రామ్స్‌ లేదా కోడ్స్‌ రాసే సామర్థ్యాన్ని ప్రతిభ (టాలెంట్‌)గా పరిగణిస్తారు. ఉద్యోగ నిర్వహణలో కీలకమైన ఇటువంటి అంశాలకు రిక్రూటర్లు చాలా ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి స్కిల్‌, టాలెంట్‌ రెంటిని మిక్స్‌ చేయకుండా వేర్వేరుగా సివిలో ప్రజెంట్‌ చేయాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని 2-3 లైన్లలో సంక్షిప్తంగా విడివిడిగా వివరించాలి. అంతేగానీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సుదీర్ఘ పేరాగ్రా్‌ఫలతో సివిని రూపొందించడం సరికాదు. రిక్రూటర్లు అంతా లెంథీ సమాచారాన్ని చదవడానికి అంతగా ఆసక్తి చూపించరు.
 
గ్యాప్‌..సాధారణమే
అనుభవం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ సందర్భంగా పేర్కొంటున్న సంవత్సరాలన్నీ వరుస క్రమంలో ఎటువంటి గ్యాప్‌లు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా గ్యాప్‌ ఉంటే ఆ విషయాన్ని, అందుకు గల కారణాన్ని వివరించాలి. గ్యాప్‌ విషయంలో స్పష్టతతో లేకపోతే దాని ప్రభావం నెగిటివ్‌గా ఉంటుంది. సొంతంగా బిజినెస్‌ చేయడం, ఉన్నత చదువులు తదితర కారణాలతో ప్రస్తుతం చాలా మంది కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ తీసుకుంటున్నారు. దీంతో ఎక్స్‌పీరియెన్స్‌ కాలమ్‌లో గ్యాప్‌ వస్తుంది. కాబట్టి ఆ గ్యాప్‌ ఎందుకు వచ్చింది, దాని గల కారణాలను సవివరంగా పేర్కొనాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు కెరీర్‌ గ్యాప్‌ను సాధారణ అంశంగానే భావిస్తున్నాయి. కాబట్టి నెగిటివ్‌ ఇంప్రెషన్‌ క్రియేట్‌ అవుతుందనే ఉద్దేశంతో కెరీర్‌ గ్యాప్‌ను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు.
 
ఫ్యాక్ట్స్‌ను ఒక్కటి రెండుసార్లు
సివి అనేది ప్రొఫెషనల్‌ అప్రోచ్‌కు ప్రతిరూపం వంటిది. కాబట్టి ఫ్యాక్ట్స్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. స్కూలింగ్‌, కాలేజ్‌, స్కిల్స్‌, ఎక్స్‌పీరియెన్స్‌, అచీవ్‌మెంట్స్‌ వంటి అంశాలు ఎర్రర్‌ ప్రూఫ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీటి ఆధారంగానే జాబ్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌ అప్పగిస్తారు. సివిలో ఫ్యాక్ట్స్‌కు అనుగుణంగా సామర్థ్యం లేకపోవడం కెరీర్‌ పరంగా రెడ్‌ సిగ్నల్‌ వంటిది.
 
క్రమానుసారంగా
అచీవ్‌మెంట్స్‌..చాలా కీలకమైనవి. విద్యార్థి లేదా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను సివిలో కాలక్రమానుసారం క్రమపద్ధతిలో పేర్కొనాలి. కానీ చాలామంది ఎటువంటి టైమ్‌లైన్‌ను ఫాలో కాకుండా అడ్డదిడ్డంగా అచీవ్‌మెంట్స్‌ను మిక్స్‌ చేస్తుంటారు. అలా కాకుండా కాలక్రమానుసారంగా అచీవ్‌మెంట్‌, సమయం, దానివల్ల ఏర్పడిన ప్రభావం వంటి అంశాలను విపులంగా వివరించాలి. రిక్రూటర్లకు ఈ అంశమే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది.
 
సోషల్‌ నెట్‌వర్కింగ్‌
చాలామంది రిక్రూటర్లు ఇంటర్య్వూ కంటే ముందు జాబ్‌ సీకర్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందుకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ను ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను జాబ్‌సెర్చ్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. జాబ్‌/ఇండస్ర్టీకి సంబంధించిన కీవర్డ్స్‌ ప్రొఫైల్‌ హెడ్డింగ్‌లో ఉండేలా చూసుకోవాలి. సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ న్యూస్‌, అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఉండాలి. తద్వారా రిక్రూటర్లు ఒక నిర్ణయానికి రావడానికి కావల్సిన రైట్‌ రిఫరెన్స్‌ లభించినట్లవుతుంది.
 
బ్యాడ్‌ రిఫరెన్స్‌
చాలా మంది జాబ్‌ సీకర్స్‌ రిఫరెన్స్‌ను కూడా షేర్‌ చేస్తుంటారు. ఎంతో కీలకమైన రిఫరెన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిని క్రాస్‌ చెక్‌ చేసినప్పుడు రిఫర్‌ చేసిన వ్యక్తి సరిగ్గా స్పందించకపోతే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ క్రియేట్‌ అవుతుంది. అంతేకాకుండా రిక్రూటర్లు రిఫరెన్స్‌ను తప్పకుండా క్రాస్‌ చెక్‌ చేసుకుంటారు. కాబట్టి బాగా తెలిసి, ఫోన్‌ చేయగానే చురుగ్గా స్పందించే వ్యక్తి నుంచి మాత్రమే రిఫరెన్స్‌ తీసుకోవడం ప్రయోజనకరం. రిఫరెన్స్‌ అవసరం అనే ఉద్దేశంతో ఏదో ఒకటి షేర్‌ చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
 
ఓకే కానీ..పరిధిని దాటొద్దు
ఆకర్షణీయమైన నమూనా (టెంప్లేట్‌)లో అందమైన, అర్ధవంతమైన పదాలతో చూడగానే ఆకట్టుకునే విధంగా సివిని రూపొందించడం ప్రయోజనకరమే. రిక్రూటర్లు వారానికి కొన్ని వందల సంఖ్యల్లో సివి, రెజ్యూమెలను పరిశీలిస్తుంటారు. వాటిలో ఏ రెజ్యూమె ఏ నమూనా (టెంప్లేట్‌)లో ఉందో చెప్పడం రిక్రూటర్లకు కూడా కష్టమే. కాబట్టి టెంప్లేట్‌ వంటి అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక నమూనాలో పరిధి మేరకు సింపుల్‌గా చదవడానికి సౌకర్యవంతంగా ఉండేలా సివి రూపొందించుకోవాలి.
  • స్కిల్‌, టాలెంట్‌ రెంటిని మిక్స్‌ చేయకుండా వేర్వేరుగా సివిలో ప్రజెంట్‌ చేయాలి.
  • విద్యార్థి లేదా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను సివిలో కాలక్రమానుసారం క్రమపద్ధతిలో పేర్కొనాలి.
  • ఒక నమూనాలో పరిధి మేరకు సింపుల్‌గా చదవడానికి సౌకర్యవంతంగా ఉండేలా సివి రూపొందించుకోవాలి. అంతేకానీ పిక్చర్స్‌, డిజైన్స్‌ వంటి వాటితో సివిని అడ్డదిడ్డంగా రూపొందించడం సమంజసం కాదు

Monday, 31 July 2017

పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌


పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌














        ఇంటర్వ్యూ ఉద్యోగ సాధనలో కీలకమైన దశ. కెరీర్‌ను ప్రభావితం చేసే నిర్ణయాత్మక తరుణం. ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం వస్తుందో, దానికి రెట్టింపు ఉత్తేజంతో ప్రిపరేషన్‌ సాగిస్తేనే విజయం సొంతమవుతుంది. ఇప్పుడిక ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినప్పటి నుంచి ఏవిధంగా ప్రిపేర్‌ కావాలో చూద్దాం..
రాహుల్‌ ఫోన్‌ రింగవుతోంది. శశాంక్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తోంది. పనిలో బిజీగా ఉన్నా.. తరవాత కాల్‌ చేస్తా అంటూ మెసేజ్‌ చేశాడు రాహుల్‌. శశాంక్‌, రాహుల్‌ ఇద్దరూ ఒకే కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం రాహుల్‌ ఒక ఎంఎన్‌సీలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రాజెక్ట్‌ హెడ్‌. లంచ్‌ సమయంలో రాహుల్‌ ఫోన్‌ చేశాడు. ఈ సందర్భంగా తనకు ఒక ఎంఎన్‌సీ నుంచి ఇంటర్వ్యూ కాల్‌ వచ్చిన విషయాన్ని శశాంక్‌ రాహుల్‌తో ప్రస్తావించాడు. మొదటి సారి ఇంటర్వ్యూ కాల్‌ రావడంతో గైడెన్స్‌ ఇస్తావా అని అడిగాడు శశాంక్‌. ఇప్పుడు ఆఫీసులో బిజీ కాబట్టి సాయంత్రం ఇంటికి వస్తే ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్‌ కావాలో వివరిస్తా అన్నాడు రాహుల్‌.
అనుకున్న విధంగానే సాయంత్రం శశాంక్‌, రాహుల్‌ కలుసుకున్నారు. ముందుగా ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినందుకు శశాంక్‌కు కంగ్రాట్స్‌ చెప్పాడు రాహుల్‌. దానికి థ్యాంక్స్‌ చెబుతూ శశాంక్‌, వచ్చింది కాల్‌ మాత్రమే జాబ్‌ కాదన్నాడు. నీవు ఇచ్చే గైడెన్సే తనను జాబ్‌ సాధన దిశగా విజయవంతంగా నడిపిస్తుందని గుర్తుంచుకో అన్నాడు. పథ నిర్దేశం ఆరంభమైంది.
కీలకమైన అడుగు
ఇంటర్వ్యూ అనేది జాబ్‌ సాధనలో కీలకమైన అడుగు. ఇంటర్వ్యూలో నీవు ఎలా వ్యవహరిస్తావు అనే దానిపై మాత్రమే అవకాశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎటువంటి ఒత్తిడికి లోనుకారాదు. నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నావో ఇంటర్వ్యూలో కూడా అలాగే ఉండు. నీ ఆలోచనలు, ఆభిప్రాయాలను స్పష్టంగా చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూలో సగం విజయం సాధించినట్లే. ముందుగా ఇంటర్వ్యూ ఫార్మాట్‌ తెలుసుకోవాలి. ఈ విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఫార్మాట్‌ తెలిస్తే తదనుగుణంగా సన్నాహాలు చేసుకోవడం సులువు.
కంపెనీ క్షుణంగా
ఇంటర్వ్యూలో అందరిని కామన్‌గా అడిగే ప్రశ్నలు ఉంటాయి. వాటి గురించి ఆందోళన అవసరం లేదు. కాకపోతే ఇంటర్వ్యూ ఆఫర్‌ చేసిన కంపెనీ గురించిన వివరాలను క్షుణంగా తెలుసుకోవాలి. కంపెనీ లక్ష్యాలు, పాటించే విలువల గురించి అవగాహన పెంచుకోవాలి. ఎటువంటి ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది, కంపెనీకి ఏయే దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి, ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు, కొన్నేళ్లుగా కంపెనీ తీరు ఎలా ఉంది వంటి అంశాలపై అప్‌డేట్‌ కావడడం మంచిది. ఆ వివరాలు, అప్లయ్‌ చేసుకున్న జాబ్‌ నేచర్‌ ఆధారంగా ఎటుంటి ప్రశ్నలు ఎదురుకావచ్చో ముందే ఊహించుకుని ప్రిపేర్‌ కావడం మంచిది. అప్పుడే కంపెనీపై మీకున్న అవగాహన ఎంప్లాయర్‌కు అర్ధమవుతుంది. అవకాశాలను మెరుగుపరుస్తుంది.
నైపుణ్య ప్రదర్శన
అప్లికేషన్‌లో ప్రస్తావించిన నైపుణ్యాలను(స్కిల్స్‌), చేసిన ప్రాజెక్ట్‌/ఇంటర్న్‌షిప్‌ వంటి అంశాలను ఒక సారి పరిశీలించుకోవాలి. అందులో ప్రస్తావించిన వాటిని ఎంప్లాయర్‌కు ఏవిధంగా ప్రభావవంతంగా ప్రదర్శించగలవో ఆలోచించాలి. మనం బీటెక్‌లో ఉన్నప్పుడు నీవు కోడింగ్‌ మీద ప్రాజెక్ట్‌ చేశావుగా. ఆ ప్రాజెక్ట్‌ కంపెనీకి ఏవిధంగా ప్రయోజనకరంగా ఉంటుందో ప్రదర్శించి చూపించాలి. స్టేజ్‌ ఫియర్‌ వంటి వాటి నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ముందు ఆ ప్రాజెక్ట్‌ను ప్రదర్శిస్తూ ప్రాక్టీస్‌ చేయాలి. తద్వారా ఆత్మవిశ్వాసంతో మనస్కిల్స్‌ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇచ్చే ప్రజెంటేషన్‌ ద్వారా సదరు జాబ్‌/కంపెనీకి నీవే పర్‌ఫెక్ట్‌ అని ఎంప్లాయర్‌ భావించేలా ఉండాలి.
చివర్లో
ఇంటర్వ్యూ చివర్లో సాధారణంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ ప్రొఫైల్‌, జాబ్‌ నేచర్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడగటం ప్రయోజనకరం అని గుర్తుంచుకో. కాకపోతే ప్రశ్నలు సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న లేటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌పై చర్చించుకునేలా చూసుకోవాలి.
సాలరీ : లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌
ఇంటర్వ్యూలో శాలరీ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. కాబట్టి ప్రస్తుత మార్కెట్లో అటువంటి జాబ్‌కు ఆయా కంపెనీలు ఎంత ఆఫర్‌ చేస్తున్నాయి వంటి వాటి ద్వారా వ్యక్తిగత సామర్థ్యాన్ని స్వీయ విశ్లేషణ చేసుకుని నీవు అనుకున్న శాలరీకి కాస్త అటు ఇటుగా చెప్పడం ఉత్తమం.

ఈ 10 ప్రశ్నలకు ముందే ప్రిపేర్ అవ్వండి


ఈ 10 ప్రశ్నలకు ముందే ప్రిపేర్ అవ్వండి













                  ప్రస్తుతం దేశ యువతను నిరుద్యోగం కమ్ముకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ.. విద్యార్హత ఏదైనా సరే.. స్వీపర్ పోస్టులకు కూడా దరఖాస్తు చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చదువు అయిపోగానే ఏవో కొన్ని కోర్సులు నేర్చుకుని ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నారు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో రెజ్యూమ్‌లను, సర్టిఫికెట్లను క్రియేట్ చేసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న నేటి తరం యువత సంఖ్య తక్కువేమీ కాదు. కష్టపడి చదివినా, ప్రైమరీ ఎగ్జామ్‌లో పాస్ అయినా.. ఇంటర్వ్యూలో మాత్రం నెగ్గలేకపోతున్న యువతలో నిరాశ, నిస్పృహలు కమ్ముకుంటున్నాయి. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఒక్కోసారి ఏ ప్రశ్న అడిగారో కూడా తెలుసుకోలేక పోవడంతో నోటిదాకా వచ్చిన కూడు చేజారిపోయినట్లు ఉద్యోగం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతోంది. అయితే చాలా మంది ఓ పది ప్రశ్నల దగ్గర బోల్తా కొడుతున్నారనీ, వాటికి సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నందునే జాబ్‌లో సెలెక్ట్ అవడం లేదనేది నిపుణుల వాదన. ఆ పది ప్రశ్నలేంటో తెలుసుకుని వాటికి సమాధానాలను ముందే ప్రిపేర్ అవండి మరి.
 
1. What are the three reasons we should not hire you?

2. How will you describe yourself using five adjectives?

3. What do your colleagues think that you should stop doing?

4. Could you talk about some events that influenced you to become what you are today?

5. Why are you switching jobs? why are you leaving your last employer?

6. Could you talk about an issue on which you disagreed with your manager?

7. Which are the other companies you are interviewing with and for what positions?

8. How would you like your manager to work with you, or would you prefer to work alone and why?

9. Why are you the right candidate for the role?

10. What will give you a sense of fulfilment in your professional life?

తప్పుల్లోనూ పాజిటివ్‌!


తప్పుల్లోనూ పాజిటివ్‌!












          ఇంటర్వ్యూ.. కెరీర్‌ను నిర్ణయించే కీలక దశ. ఎంత మెరిట్‌ సాధించినా.. రెజ్యూమెను మరెంత పర్‌ఫెక్ట్‌గా రూపొందించినప్పటికీ ఇంటర్వ్యూ అనగానే చాలామంది బిగుసుకుపోతారు. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? ఏవిధంగా సమాధానం చెప్పాలి? ఎలా వ్యవహరించాలి? అనే అంశాల్లో సరైన అవగాహన లేక తొందరపాటులో అనేక తప్పులు చేస్తుంటారు. ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను వెనక్కి తీసుకోలేం. కానీ వాటిని సరైన దిశలో అన్వయించడం ద్వారా పాజిటివ్‌ ఇంప్రెషన్‌ కొట్టేయవచ్చు. అందుకు ఏం చేయాలో చూద్దాం..
 
తొందర్లో
ఉద్యోగం కోసం చాలాకాలంగా ప్రయత్నించి విసుగెత్తి పోతే, వ్యక్తిగత కారణాల రీత్యా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉన్న సందర్భాల్లో ఎక్కువ తప్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు కారణం తొందరపాటు. అడిగిన ప్రశ్నకు అవగాహన లేకున్నా ఏదో ఒకటి చెబుదాం అనే తొందర్లో తప్పులు చేస్తుంటారు. ఇంటర్వ్యూను తిరిగి నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా ఎంప్లాయర్‌ను ఇంప్రెస్‌ చేయవచ్చు.
 
తప్పులు సహజం
ఇంటర్వ్యూ అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఒక్కోసారి గేమ్‌ ఛేంజర్‌ కూడా కావచ్చు. ఇటువంటి సందర్భంలో తప్పులు చేయడం మానవ సహజం. ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా ఇస్తే దానికి కంగారు పడాల్సిన పని లేదు. చిరునవ్వుతో చేసిన తప్పును ఒప్పుకొనే ప్రయత్నం చేయాలి. ‘సమాధానం తెలియదు సార్‌, తెలుసుకుంటాను’ అని వినయంగా చెప్పాలి. తద్వారా ఎప్పుడూ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండే మీలోని ఆటిట్యూడ్‌ కనిపిస్తుంది.
 
సమయపాలన
ఇంటర్వ్యూలో అన్నిటి కంటే కీలకమైంది పంక్చువాలిటీ (సమయపాలన). నిర్దేశిత సమయానికి, అనుకున్న ప్రదేశానికి చేరుకోవాలి. ఎలాగైన సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎంతో ప్లానింగ్‌తో ఉంటాం. కానీ ట్రాఫిక్‌ జామ్‌ తదితర కారణాలతో అనుకున్న సమయానికి చేరుకోలేకపోవచ్చు. కాబట్టి ఇంటర్వ్యూయర్‌కు ఈ విషయాన్ని తెలియజేయాలి. మీ తప్పును ఒప్పుకోవడంతోపాటు క్షమాపణ కూడా కోరాలి. తద్వారా మీ సమయంతోపాటు ఇతరుల సమయానికి ఎంత విలువ ఇస్తున్నారు అనే విషయం స్పష్టమవుతుంది.
 
వాదన కూడదు
ఇంటర్వ్యూలో సహజంగా ఏదైనా ఒక అంశంపై అభిప్రాయం చెప్పండని అడుగుతారు. అటువంటి సమయంలో మీరు వెల్లడించిన అభిప్రాయాలతో ఇంటర్వ్యూయర్‌ ఏకీభవించకపోవచ్చు. ఆ సందర్భంలో ఇంటర్వ్యూయర్‌తో ఎటువంటి వాదోపవాదాలు చేయకుండా ఉండాలి. మీ ఇద్దరి మధ్య అర్థవంతమైన చర్చ జరిగే దిశగా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మీదే అనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ మీ ఒపీనియనను సమర్థించుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని జ్ఞానాన్ని పరస్పరం షేర్‌ చేసుకునే వేదికగా మలుచుకోవాలి.
 
నిజాయితీతో
ఇంటర్వ్యూలో అన్ని విషయాలను నిజాయితీతో వెల్లడించాలి. ముఖ్యంగా గతంలో జాబ్‌ చేసి ఉంటే ఆ విషయాన్ని ప్రస్తావించాలి. కొన్నిసార్లు కెరీర్‌లో బ్రేక్‌ కూడా వచ్చి ఉండొచ్చు. ఇటువంటి విషయా లను కూడా ఇంటర్వ్యూలో ధైర్యంగా ప్రస్తావించాలి. నిజాయితీగా వ్యవహరించే గుణం ఎంప్లాయర్‌ను మరింత ఇంప్రెస్‌ చేస్తుంది.

Sunday, 30 July 2017

అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం


అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం










                 కొన్ని సందర్భాల్లో జాబ్‌ మార్కెట్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మన అర్హతలకు సరిపోయే జాబ్‌ నోటిఫికేషన్లు అన్నివేళలా ఉండాలని ఏమి లేదు. ఒక్కోసారి అందుబాటులో ఉన్న అవకాశాలకు సంబంధించి అర్హతలపరంగా మనం ‘ఓవర్‌ క్వాలిఫైడ్‌’ కావచ్చు. అదే ప్రతికూలంగానూ మారొచ్చు. ఓవర్‌ క్వాలిఫైడ్‌ అంశం అనేది ఫ్రెషర్స్‌తోపాటు కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ వచ్చిన అనుభవజ్ఞులకూ సవాలుగా నిలుస్తుంది. అయితే ఈ అంశాన్ని నెగిటివ్‌గా కాకుండా స్ఫూర్తిగా తీసుకుంటే ఎన్నో అవకాశాలు ముంగిట నిలుస్తాయి. వచ్చే ప్రతి అవకాశాన్ని ఆశావహ దృక్ఫథంతో తీసుకుని ముందుకు సాగితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. ఓవర్‌ క్వాలిఫైడ్‌ అంశాన్ని జాబ్‌ సెర్చ్‌లో మన బలంగా చేసుకొని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. 

ఏదైనా జాబ్‌ వేకెన్సీ సంబంధించి వెలువడే నోటిఫికేషన్‌లోనే దానికి కావల్సిన అర్హత, నైపుణ్యాలను స్పష్టంగా పేర్కొంటారు. అందులో పేర్కొన్న అర్హత కంటే ఉన్నత స్థాయి డిగ్రీ మీ వద్ద ఉంటే ఓవర్‌ క్వాలిఫైడ్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక అనలిస్ట్‌ జాబ్‌కు బీఎస్సీని అర్హతగా పేర్కొంటే మీరు ఎంఎస్సీ చేసి ఉంటారు. అంత మాత్రన మీరు ఆ ఉద్యోగానికి అనర్హులు అని అర్థం కాదు. కాకపోతే రిక్రూట్‌మెంట్‌లో బీఎస్సీ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారని భావం. కాకపోతే స్కిల్స్‌ పరంగా ఎంప్లాయర్‌ను ఆకట్టుకుంటే జాబ్‌ మీ సొంతమవుతుంది. కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ వచ్చినా ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ పర్సన్‌ గతంలో తాము చేసిన దాని కంటే తక్కువ స్థాయిలో పని చేయాల్సిన అవసరం రావచ్చు. దీన్ని కూడా నేర్చుకోవడంలోనే భాగంగా భావించాలి. అంతేతప్ప నెగిటివ్‌గా ఫీల్‌ కాకూడదు.
నేరుగా వివరించాలి
జాబ్‌ సెర్చ్‌లో భాగంగా చాలా సంస్థలకు రెజ్యూమె పంపి స్తుంటారు. కానీ ఒక కాల్‌ కూడా రాదు. ఆరా తీస్తే ఆఫర్‌ చేస్తున్న జాబ్‌కు కావల్సిన అర్హతల కంటే మీరు ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావడమే అందుకు కారణంగా తెలుస్తుంది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎటువంటి ఉద్వేగాలకు లోనుకాకుండా సానుకూలంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ అంశాన్ని అధిగమించేందుకు మన ముందు ఉన్న మార్గాలను తెలుసుకోవాలి. ముందుగా ఎంప్లాయర్‌/రిక్రూటర్‌ లేదా హెచ్‌ఆర్‌ హెడ్‌ను ఫోన్‌ లేదా వ్యక్తిగతంగా కలిసి ఎదురవుతున్న సమస్యను వివరించండి. దాంతోపాటు మన ప్రతిభ సామర్థ్యాలను వివరించే ప్రయత్నం కూడా చేయాలి. అర్హత, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాలను చక్కగా ప్రెజెంట్‌ చేయాలి. మీ స్కిల్స్‌పై ఎంప్లాయర్‌కు ముందుగానే అవగాహన ఉంటుంది. దీంతో ఎంప్లాయర్‌ దృష్టిలో ఉంటారు. కాబట్టి ఏదైనా జాబ్‌ ఉంటే వెంటనే రెజ్యూమెతో నిమిత్తం లేకుండానే మీకు అవకాశం కల్పించవచ్చు. 
క్రియేట్‌ చేసుకోవాలి 
అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే వాటిని వెతుక్కుంటూ వెళ్లడం తెలివైన పని. ముందుగా ఏ రంగంలో ఎటువంటి పొజిషన్‌లో జాబ్‌ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన హోం వర్క్‌ చేయాలి. అదే క్రమంలో జాబ్‌ మార్కెట్లో ఉన్న అవకాశాలను ఒక్కసారి పరిశీలించండి.
వాటిని మీకు ఉన్న అర్హతతో బేరీజు వేసుకొండి. అందులోని కొన్ని జాబ్స్‌కు మీరు క్వాలిఫైడ్‌ కావచ్చు. అటువంటప్పుడు మీ అదనపు అర్హత సదరు జాబ్స్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో విశ్లేషించుకోవాలి. రెజ్యూమెలో మాత్రం ఆ విశ్లేషణకు చోటు ఇవ్వవద్దు. ఇంటర్వ్యూ సమయంలో మీ అదనపు అర్హత వల్ల ఎంప్లాయర్‌ ఏవిధంగా లాభపడగలరో వివరించాలి. తద్వారా మీరు ఓవర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ అవకాశం లభించవచ్చు.
అప్‌ డేట్‌ రెజ్యూమె 
ప్రస్తుతం ఎటువంటి జాబ్‌కు అప్లయి చేయాలన్నా రెజ్యూమె తప్పనిసరి. కాబట్టి రెజ్యూమెను కొంత వరకు అప్‌డేట్‌ చేసుకోవడం కూడా కీలకమే. ఈ క్రమంలో మన వ్యక్తిగత సమాచారాన్ని కొంత వరకు తగ్గించుకోవాలి. ఆఫర్‌ చేస్తున్న జాబ్‌కు సరిపోయేలా రెజ్యూమెను స్మార్ట్‌గా రూపొందించుకోవాలి. అర్హతల నుంచి స్కిల్స్‌ వరకు రెజ్యూమెను మరోసారి రీ రైట్‌ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ పదాల్లో ముగించే ప్రయత్నం చేయాలి. అదనపు అర్హతల విషయాన్ని చివర్లో నామమాత్రంగా ప్రస్తావించాలి. రెజ్యూమె అప్‌ డేట్‌/రీ రైట్‌ అనేది ఒక్కోసారి మన వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు ప్రొఫెషనల్‌ రెజ్యూమె రైటర్స్‌ సహాయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
బీ జెన్యూన్‌ 
ఓవర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ..ఒక్కోసారి ఇంటర్వ్యూ కాల్‌ రావచ్చు. ఇంటర్వ్యూలో ఎంప్లాయర్‌కు మీ అదనపు అర్హతలపై పలు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో అదనపు అర్హత ఆ సంస్థకు ఏవిధంగా ఉపయోగపడగలదో ఎంప్లాయర్‌కు ఆకట్టుకునేలా వివిధ రకాల విశ్లేషణలతో వివరించే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావడం వల్ల అవకాశాలు లభించడం కష్టంగా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎంప్లాయర్స్‌ మిమ్మల్ని తక్కువ పేప్యాకేజ్‌కే రిక్రూట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
కాబట్టి ఆర్థిక అవసరాలు, తప్పనిసరి పరిస్థితుల్లో జాబ్‌కు అప్లయ్‌ చేశాడు అనే భావన కలగకుండా జాగ్రత్త పడాలి. జాబ్‌ పట్ల ఆసక్తి ఉన్న జెన్యూన్‌ అభ్యర్థిగా కనిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఆఫర్‌ చేస్తున్న వేతనం మీ అర్హతకు తక్కువ అనే భావన కలుగుతోందా? అనే ప్రశ్న ఎంప్లాయర్‌ నుంచి రావచ్చు. కాబట్టి అటువంటి ప్రశ్నలకు సానుకూల దృక్ఫథంతో స్మార్ట్‌గా సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. ‘నేను ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావచ్చు. కాకపోతే నేర్చుకోవడంలో మాత్రం ఓవర్‌ క్వాలిఫై కాదు, నేర్చుకోవడానికి నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి దీన్ని మంచి అవకాశంగా భావిస్తాను’ అనే తరహాలో సమాధానం ఇవ్వాలి.

Saturday, 29 July 2017

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా..?


ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా..?














Why Did You Leave Your Last Job?..(గతంలో మీరు చేసిన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు..?).. 


        ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు చెప్పే సమాధానం పైనే... ఉద్యోగం రావడమా.. లేక వదిలేసుకోవడమా.. అనేది తేలుతుంది. యుద్ధంలో ప్రత్యర్థి వదిలిన తూటా వంటిది ఈ ప్రశ్న. దాన్ని ధీటుగా ఎదుర్కోకుంటే ఏం జరుగుతుందో ఇంటర్వ్యూలోనూ అదే పరిస్థితి.
ఇంటర్వూల్లో ఎక్కువ మందిని రిక్రూటర్స్ అడిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎలాసమాధానం చెప్పాలో తెలియక కొంతమంది, తెలిసినా చెప్పడానికి తడబడేవాళ్లు చాలామంది. కేవలం ఈ ఒక్క ప్రశ్నతో మీలో ఉండే ప్రతిభపాటవాలేంటో రిక్రూటర్స్ తేల్చివేయగలరట. ఎందుకంటే ఇదివరకు మీరు చేసిన జాబ్ నిజంగా నచ్చకవదిలేశారా..లేకపోతే మీ చేసిన పనులు కంపెనీకి నచ్చక వారే తీసేశారా..అనేది కేవలం ఈ ఒక్క ప్రశ్నలోనే దాగి ఉందట..మరి అలాంటి ప్రశ్నకు పదిరకాలుగా సమాధానాలు చెప్పవచ్చంటున్నారు. నిపుణులు అవేటంటే..
1. పాత కంపెనీలో చాలా అనుభవం గడించాను. ఇక అందులో కొత్తగా నేర్చుకోవడానికంటూ ఏమి మిగల్లేదు. కొత్త చాలెంజింగ్ కెరీర్ కోసం ప్రయత్నిస్తుండగా మీ కంపెనీ గురించి విన్నాను.
2. నేను పనిచేసిన పాత కంపెనీలో చాలా కష్టపడాను. కానీ, కెరీర్ పరంగా ఉన్నతంగా ఏమీ లేకపోయినా..నేను సర్దుకుపోయి పనిచేశాను..నాకిచ్చిన పనుల్ని పూర్తిచేశాను. ప్రస్తుతం కొత్త చాలెంజింగ్ కెరీర్ మొదలుపెట్టాలనుకుంటున్నాను.
3. నేను పనిచేసిన కంపెనీ, ప్రస్తుతం నా స్వబావానికి సరిపడటం లేదు. అందులో పనిచేయడం ఇష్టంలేకపోవడంతో నేను కొత్త కెరీర్ ప్రారంభించాలనుకుని, మీ కంపెనీని సంప్రదించాను.
4. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే నేను చేసిన పనులకు పేరు రావాలని కూడా కోరుకుంటాను. ఎంత కష్టపడిన అక్కడ నాకు తగినంత గుర్తింపు లభించలేదు.
5. నేను పనిచేసిన కంపెనీలో ఎన్నో అచీవ్‌మెంట్లు సాధించాను. ఇకపై అక్కడ చేయడానికి ఏమీ మిగల్లేదు. ఇదే సరైన సమయం అనుకుని ఆ కంపెనీ నుంచి బయటకు రావాలనుకున్నాను.
6. ఇన్ డోర్ మార్కెటింగ్ చేసేవాడిని. ఈ మధ్యనే నేను అవుట్‌డోర్ మార్కెటింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ, ఆ కంపెనీ వాటికి సంబంధించిన జాబ్స్ ఏమీ లేవు.
7. నా పాత కంపెనీ మొదలుపెట్టిన దగ్గరనుంచి నేను అందులో పనిచేశాను. దాని అభివృద్ధికి చాలా కాలం శ్రమించాను. ఇప్పుడు కొత్త పని అనుభవం కోసం మీ కంపెనీలో చేరాలనుకుంటున్నాను.
8. నేను ఇప్పటివరకు పనిచేసిన కంపెనీల్లో మీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కెరీర్ పరంగా నాకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను.
9. నేను పనిచేస్తున్న కంపెనీలో చాలా నష్టం రావడంతో అది త్వరలోనే ముసివేసే ప్రమాదముంది.
10. మీ కంపెనీ పనితీరు నచ్చడంతో మీ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాను

రెజ్యూమ్‌లో ఈ 10 పదాలు వాడకపోవడమే మంచిదట..!


రెజ్యూమ్‌లో ఈ 10 పదాలు వాడకపోవడమే మంచిదట..!














బీటెక్, డిగ్రీ, పీజీ.. ఎడ్యుకేషన్ ఏదయినా సరే.. అందరి అంతిమ లక్ష్యం ఓ మంచి జాబ్. ‘ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలి’ అనే సామెతలాగే... రెజ్యూమ్ చూడు.. ఆ తర్వాతే అభ్యర్థిని చూడు అనేది ఇంటర్వ్యూ పరిభాషలా మారింది. అందుకే తన లక్షణాలు, విద్యార్హతలు, గుణగణాలు, సాధించిన విజయాలన్నింటినీ సీవీలో ఏకరువు పెడుతుంటారు కొందరు. కొందరు సింపుల్‌గా ఒక పేజీలో సీవీని పూర్తి చేస్తే.. మరికొందరు రెండు పేజీల్లో తమ రెజ్యూమ్‌ను రూపొందిస్తారు. పదో తరగతి నుంచి మొదలుకుని.. చివరి విద్యాభ్యాసం వరకూ అన్ని వివరాలను పొందుపరుస్తారు. టెక్నికల్ నాలెడ్జి ఎంత ఉందో కూడా చెప్పేస్తారు.
ఇంటర్వ్యూల్లో కొన్ని వేల రెజ్యూమ్‌లను చూసిన నిపుణులు.. ఆసక్తికరమయిన విషయాలను వెల్లడిస్తున్నారు. రెజ్యూమ్‌ను చూసి అభ్యర్థి ఏంటనేది 70 శాతం వరకూ చెప్పగలమంటున్నారు. దాదాపు 80 శాతం మంది అభ్యర్థులను రెజ్యూమ్ చూసే రిజెక్ట్ చేస్తుంటామని కూడా తెలిపారు. రెజ్యూమ్‌లో అభ్యర్థులు అందరూ కొన్ని కామన్ పదాలను వాడుతంటారనీ, తద్వారా వారిలో ఆలోచన గుణం లేదని స్పష్టమవుతుందని చెబుతున్నారు. నిరుద్యోగులు ఓ పది పదాలను రెజ్యూమ్‌లో పదేపదే వాడుతుంటారనీ, అవి ఇంటర్వ్యూ చేసే వారికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయంటున్నారు. మరి ఆ పది పదాలంటో ఓ లుక్కేయండి.. వాటిని మీ రెజ్యూమ్‌లో సాధ్యమైనంత తక్కువగా, వీలయితే అసలే లేకుండా చూసుకోండి.
‘leadership’,
‘specialised’
‘expert’.
excellent,’
‘strategic’
‘experienced.’
‘responsible,’
‘passionate,’
‘certified’
‘dynamic.’

Friday, 10 March 2017

ఇంటర్వ్యూ.. నాలెడ్జ్‌ టెస్ట్‌ కాదు

ఇంటర్వ్యూ.. నాలెడ్జ్‌ టెస్ట్‌ కాదు


చందేరి-పోచంపల్లి చీరల మధ్య వ్యత్యాసం ఏమిటి.

 మీరు ఆంగ్ల దినపత్రికలో రిపోర్టరుగా పని చేశారా, అయితే పత్రికల్లో రిపోర్టింగ్‌ ఎలా ఉంటుంది.
‘శక్తిమాన్‌’ అనే అశ్వం గాయపడి మరణించింది - తెలుసు కదా, మరి లా అండ్‌ అర్డర్‌ విధుల్లో గుర్రాలను ఉపయోగించవచ్చంటారా
జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ..... ఓషో ఫిలాసఫీ.... మావోయిజం.... పర్యావరణ సమస్యలపై మీ అభిప్రాయం ఏమిటి.
ఈ ప్రశ్నలను చూసి ఇవన్నీ ఏవో టీవీ షోలోనో లేకుంటే ఏ పత్రికా విలేకరులో అడిగినవో అనుకుం టున్నారా!..... కానే కాదు. సివిల్‌ సర్వీసెస్‌ ఇంట ర్వ్యూల్లో తెలుగు అభ్యర్థులు కొన్నేళ్ళుగా ఎదుర్కొన్న కొన్నిప్రశ్నలు ఇవి.

పబ్లిక్‌ సర్వీ్‌సకు అభ్యర్థి వ్యక్తిగతంగా ఏ మేరకు సూటవుతారన్నది తేల్చడమే సివిల్స్‌ ఇంటర్వూ లక్ష్యం. నిష్పాక్షికతకు తోడు సమర్థులు ఇంటర్వ్యూ బోర్డులో ఉంటారు. అభ్యర్థి మేధో లక్షణాలను పరిశీలించేందుకు ఈ ఇంటర్వ్యూను ఉద్దేశించలేదు. కరెంట్‌ అఫైర్స్‌పై అభ్యర్థికి ఉన్న ఆసక్తి, సామాజిక లక్షణాలను మాత్రమే పరిశీలిస్తారు.

ఇంటర్వ్యూలో భాగంగా పరిశీలించే లక్షణాలు:


అందర్నీ కలుపుకొని వెళ్ళే శక్తియుక్తులు స్పష్టత, తార్కికత జడ్జిమెంట్‌లో సమతుల్యత వైవిధ్యం, ఆసక్తులపై లోతైన చర్చ. నాయకత్వ సామర్థ్యం, సామాజిక సంబంధాలు మేథో, నైతిక సమగ్రత

ఇంటర్వ్యూకు సంబంధించి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. యూపీఎస్సీ నోటిఫికేషన్‌ను సునిశితంగా పరిశీలిస్తే అభ్యర్థులో ఆయా లక్షణాలను ఆశిస్తోందని తేటతెల్లమవుతుంది. ఇంటర్వ్యూ యావత్తు మీకు సంబంధిం చే. అంతే తప్ప మీకు తెలిసిన సమాచారంపై కాదన్నది గ్రహించాలి. అభ్యర్థి తనకున్న విలువలు, ఆలోచనలు తదితరాలన్నీ ఈ ఇంటర్వూలో వెల్లడి చేయగలగాలి. అదంతా తార్కికంగా, ఇంటర్వ్యూ బోర్డును ఒప్పించే విధంగా జరగాలి. ఈ జాబ్‌కు నేను అర్హుడిని అని రుజువు చేయాలి. ఏ అభ్యర్థినీ తక్కువ చేయాలన్న యోచనలో బోర్డు మెంబర్లు ఎవ్వరూ ఉండరు. ప్రతి అభ్యర్థికీ కనీసం 150 మార్కులు ఇచ్చే మూడ్‌ లో వారు ఇంటర్వ్యూని ఆరంభిస్తారు. అంతకు మించి లేదంటే తగ్గించి మార్కులు పడటం అన్నది అంతా అభ్యర్థి వ్యక్తిగత పర్ఫార్మెన్స్‌పైనే ఉంటుంది. మీవైన లక్షణాలను వ్యక్తం జేసే సదవకాశాన్ని బోర్డు తప్పకుండా ప్రతి అభ్యర్థికి ఇస్తుంది. అవంటూ మీకుంటే సర్వీసు రాకుండా ఎవరూ అడ్డగించలేరన్నది వాస్తవం.

సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఏయే లక్షణాలను పరీక్షిస్తున్నారో తెలుసుకునేందుకు కొన్ని పరిణామాలను తీసుకుని పరిశీలిద్దాం.
గత ఏడాది ఇంటర్వ్యూలో జె.స్నేహజ అనే అభ్యర్థి 206 మార్కులు పొందారు. ఇంటర్వ్యూలో వివిధ అభ్యర్థులు సాధించిన మార్కులను పరిశీలిస్తే ఆమె రెండో స్థానంలో ఉన్నారు. ఆమె చార్టర్డ్‌ అకౌంటెంట్‌. ఆమెను అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే..


ప్రశ్న: సత్యం స్కామ్‌పై నీ అభిప్రాయం ఏమిటి?


- సబ్జెక్టుపై ఆమె ఆసక్తి ఏ మేర లోతైనదో, - ఇష్యూని ఏ రూపంలో ఆమె సపోర్ట్‌ చేస్తారో, - సమస్యను పరిష్కరించడంలో ఆమెకు ఉన్న సమతుల్యత

 పాఠ్యపుస్తక దృక్పథంతో సత్యం స్కామ్‌ను విశ్లేషించిన పక్షంలో బోర్డును ఆమె సంతృప్తిపర్చ లేకపోయేవారు. ఈ విషయంలో ఆమె తన సొంత అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా సబ్జెక్టుపై ఆసక్తిని ప్రదర్శించగలిగారు. అదే సమయంలో భారతదేశంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను మెరగుపర్చేందుకు కొన్ని సూచనలూ చేశారు.

రూల్‌ నెం 1: కేవలం సమాధానం ఇస్తే సరిపోదు. మీకు మీరుగా ప్రజంట్‌ అవ్వాలి. పర్సనాలిటీలో సానుకూల లక్షణాలు ప్రతిబింబించాలి.
రిషాంతరెడ్డి అనే మరో అభ్యర్థి ఇంటర్వ్యూను కూడా ప్రస్తావించుకుందాం. ఇంటర్వ్యూలో అతనికి 204 మార్కులు లభించాయి. మొదటి సారి అతనికి 162 మార్కులే లభించాయి. ఈ తేడాపై ప్రశ్నిస్తే రెండోసారి ఇంటర్వ్యూ లాజిక్‌ను అర్థం చేసుకోగలిగినట్లు రిషాంత తెలిపారు. తనేమిటో వ్యక్తం అయ్యే విధం గా అడిగే ప్రశ్న కోసం ఎదురుచూశారు. నిరూపించుకున్నారు.

రూల్‌ నెం.2: బోర్డు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిరునవ్వుతో ‘నో’ చెప్పి సౌకర్యంగా ఉండండి. ఒక ఇష్యూపై మీ అభిప్రాయం చెప్పే అవకాశం అక్కడ ఇస్తున్నారు. లేదంటే ఒక సందర్భాన్ని విడమర్చి మీ స్పందన తెలుసుకుంటున్నారు. అందువల్ల అవకాశాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. బౌండరీని తాకేలా ఆడుకోండి.
ఇక్కడే ఎంపిక కాని మరికొంత మంది అభ్యర్థులు చేసిన తప్పులను పరిశీలిద్దాం. వారి పేర్లు మనకొద్దు

బి అనే అభ్యర్థి ఫైనార్ట్స్‌లో పీజీ చేశారు. ప్రతి ప్రశ్నకు ఆమె చక్కగా జవాబు చెప్పారు. ఆమె కూడా 165 మార్కులే పొందారు. సి అనే అభ్యర్థిని నాగా సమస్యపై అభిప్రాయం అడిగారు. తనకా సమస్య తెలియదని చెప్పారు.

ఎ అనే విద్యార్థి ఎందుకు తప్పారంటే ఫ్యాక్ట్స్‌తో కూడిన ప్రశ్నలకు జవాబు చెప్పిన తరవాత నెర్వ్‌సగా ఫీలయ్యారు. ఇంటర్వ్యూ సగంలో ఉన్న సమయంలో తనకు తాను ఎవాల్యుయేట్‌ చేసుకున్నారు. దాంతో ఫోకస్‌ కోల్పోయి, వ్యక్తిగత లక్షణాలను వ్యక్తం చేయలేకపోయారు.
బి పాఠ్యపుస్తకాల్లో ఉండే జవాబులు చెప్పారు. అవి సొంతం కావని, రీప్రొడక్షన్‌ అని బోర్డు ఇట్టే పసిగట్టింది.
సి అనే అభ్యర్థికి వాస్తవిక సమాచారంతో కూడిన ప్రశ్నలు అడగలేదు. తనని అభిప్రాయం మాత్రమే అడిగారు. అభ్యర్థి కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు. అయితే సమస్యపై జడ్జిమెంట్‌లో బ్యాలెన్స్‌ , తార్కిక అవగాహన లోపించింది.

రూల్‌ నెం 3: ఇంటర్వ్యూ మధ్యలో ఎవాల్యుయేషన్‌ మంచిది కాదు. మొత్తం ఫోకస్‌ బోర్డుపైనే ఉండాలి.

రూల్‌ నెం 4: ఆసక్తి లేని వర్ణన కూడదు. హాబీస్‌ నుంచి దూరంగా జరిగారు. అక్కడ ఆ నిర్ణయానికి ఎలా వచ్చావన్నది ముఖ్యం. మీరు కరెక్ట్‌ అని భావించిన మార్గంలో వెళ్ళేందుకు బోర్డు అనుమతిస్తుంది.
వీటన్నింటినీ క్షుణ్ణంగా చూసినప్పుడు ఒక విషయం అవగతమవుతుంది. అభ్యర్థికి ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని బోర్డు పరీక్షిస్తుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో నాలెడ్జ్‌ పరీక్ష అప్పటికే పూర్తయింది. అందువల్ల మీ మెయిన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ బాగుంటే సర్వీస్‌ దక్కుతుంది. ఇంటర్వ్యూలో పర్‌ఫార్మెన్స్‌ సర్వీ్‌సను నిర్ణయిస్తుంది. ఐఎఎస్‌ కావాలని అనుకుంటే ఇంటర్వ్యూలోనూ స్కోర్‌ చాలా అవసరం. ఐఎఎ్‌సకు ఎంపికైన తరవాత కేడర్‌ కూడా ఇంటర్వ్యూ స్కోర్‌పైనే అధారపడి ఉంటుంది.
ఝ ‘మే ఐ కమిన’ అని లోపలికి వెళ్ళి సభ్యులందరినీ విష్‌ చేయాలి. సభ్యుల అనుమతి తీసుకుని కూర్చోవాలి. మహిళా సభ్యురాలు బోర్డులో ఉంటే, ముందు ఆమెకు విష్‌ చేయాలి. తరవాత మిగిలిన పురుష సభ్యులందరికీ కలిపి విష్‌ చేయవచ్చు. లేడీస్‌ ఫస్ట్‌ అన్న విషయాన్ని మన్నించాలి. బోర్డ్‌ ఛైర్‌ పర్సన, సభ్యుల మధ్య తేడా మాత్రం చూపించవద్దు.


అభ్యర్థుల్లో చూసే లక్షణాలు


నిజాయతీ, ఇంటెగ్రిటీ
నిబద్ధత, సిన్సియారిటీ బాధ్యతలను తీసుకునేందుకు సంసిద్ధత మైండ్‌ అలర్ట్‌నెస్‌ - పరిస్థితికి తగ్గట్టు షార్ప్‌గా స్పందించే గుణం విశ్లేషణ సామర్థ్యం - ఒక విషయంలోని కీలక మైన పాయింట్‌ని ఎంత త్వరగా పట్టుకోగలరు ఆర్టిక్యులేషన సామర్థ్యాలు ఆలోచనలో స్పష్టత పరిశీలన సామర్థ్యాలు పరిసరాలపై ఏ మేరకు ఆసక్తి ఉంది ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళను ఊహించగలగడం

బిహేవియర్‌ ఎలా ఉండాలంటే...


ప్రశ్న పూర్తికాకుండానే సమాధానం చెప్పే పని చేయవద్దు. మంచి లిజనర్‌గా ఉండాలి. ముందు ప్రశ్నను సరిగ్గా వినండి, అర్థం చేసుకోండి. అందుకు కొద్దిగా సమయం తీసుకోండి. బోర్డు సభ్యులు అడగకుండానే మీ రికార్డులు తదితరాలు చూపెట్టే ప్రయత్నం చేయవద్దు. మహిళా అభ్యర్థులు చీర కట్టుకోవడం అభిలష ణీయం. లైట్‌ కలర్‌ఫుల్‌ స్లీవ్‌ షర్ట్‌, టైతో పురుషులు వెళితే బాగుంటుంది. ఏ దుస్తులు ధరించినా హుందాగా ఉండేలా చూసుకోవాలి. కూర్చున్న తీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కనబరిచేలా ఉండాలి. ఎడ్జ్‌పై కాకుండా సీటు బ్యాక్‌ ఆనుకునేలా కూర్చోండి. క్రాస్‌ లెగ్స్‌తో కూర్చోవడాన్ని ఆశించరు. చేతులను కొంత వరకు అటూ ఇటూ ఆడించవచ్చు. ఇంటర్వూ చివర్లో థాంక్యూ అని చెప్పి రావాలి. బాగా జాప్యం కలగలిసి సాయంత్రం ఇంటర్వ్యూ జరిగితే గుడ్‌ ఈవెనింగ్‌ చెప్పి రావాలి.సివిల్స్‌ ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్వూ బోర్డ్‌లోని సభ్యులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, అందుకు అభ్యరులు ఎలా సన్నద్ధం కావాలో తెలియ జేస్తూ ఢిల్లీ, హైదరా బాద్‌ల్లోని ప్రముఖ సివిల్స్‌ కోచింగ్‌ సంస్థ ‘లా ఎక్స్‌లెన్స ఐఎఎస్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు ‘దిక్సూచి’కి ప్రత్యేకంగా రాసిన కథనం. మానసిక సంసిద్ధత ముందసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి సిఏ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చింది. ఈ ప్రశ్న ఆమె విద్యానేపథ్యం నుంచి అడిగినది. దీనిని బోర్డు అడగడంలో ఉద్దేశం... ఎ అనే అభ్యర్థి విద్యా నేపథ్యం చాలా గొప్పగా ఉంది. ఐఐటి బ్యాక్‌గ్రౌండ్‌. కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 165

 రూమ్‌లోకి ఎంటర్‌ కాగానే... 


సహానుభూతి, కంపాషన సభ్యులతో ‘ఐ కాంటాక్ట్‌’ పెట్టుకోవాలి. అంతే తప్ప ఏదీ షేర్‌ చేసుకోరాదు. 

Tuesday, 28 February 2017

ఫ్రెషర్స్‌ కోసం ఐదు పుస్తకాలు


మీరు ఫ్రెషరా? ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ అయిదు పుస్తకాలు మీ కోసమే. వీటిని చదివి నైపుణ్యాలకు పదును పెట్టుకోండి. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, దాన్ని సాధించడం ఓ కళ. దీనికి తగిన ప్లానింగ్‌, ప్రిపరేషన్‌ అవసరం. దీనికోసం ఉపయోగపడే ఈ పుస్తకాలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఇంటర్నెట్‌లో శోధించండి. 
1. What Color Is Your Parachute - Richard N Bolles
2. Resume Magic: Trade Secrets of a Professional Resume Writer - Susan Britton Whitcomb
3. Interview Magic Susan - Britton Whitcomb
4. The Confidence Code - Katty Kay and Claire shipman
5. Guerrilla Marketing for Job hunters 3.0 - Jay Conrad Levinson & David E Perry

ఇవి తెలిస్తే ఇంటర్వ్యూ తేలికే!

ఇవి తెలిస్తే ఇంటర్వ్యూ తేలికే!


మీ గురించి చెప్పండి? 
ఇక్కడ ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? 
మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు? 
మీ బలహీనతలేంటి? 

ఐదేళ్ల తరువాత మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారు?
 
ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఇంటర్వ్యూలో ఎదురవుతుంటాయి. ఎందుకంటే చాలాసార్లు వీటికి సరియైన సమాధానం ఉండదు. మరి ఇంటర్వ్యూలను ఎదుర్కొనేదెలా? ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో విద్యార్థి ఉంటాడు. ఒక ఉద్యోగి మరింత ఉన్నత స్థానాన్ని కోరుకుంటాడు. లక్ష్యం ఏదైనా ఇంటర్వ్యూను సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేయడం చాలాముఖ్యం. 
ఇంటర్వ్యూలను ఎలా ఫేస్‌ చేయాలో తెలుసుకోవడానికి మార్కెట్లో అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా అవసరమైన టెక్నిక్స్‌ను నేర్చుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో సులభంగా సక్సె్‌సకావచ్చు. అవే ఎ.బి.సి.డి.ఇ.
 
ఎ - ఆటిట్యూడ్‌ ఆఫ్‌ పాజిటివిటి : పాజిటివ్‌ థింకింగ్‌ ఉండాలి. అంతా మంచే జరుగుతుందని అనుకుంటే మంచే జరుగుతుంది. ‘వేర్‌ దేర్‌ ఈజ్‌ ఎ విల్‌, దేర్‌ ఈజ్‌ ఎ వే’ అనే సామెత తెలుసు కదా. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు వెళ్లే మార్గంలో ఎన్నో అడ్డంకులుంటాయి. వాటన్నింటిని అధిగమిస్తేనే విజయం మీ సొంతమవుతుంది. పౌలో చెప్పినట్టుగా ఏదైనా కావాలని మీరు బలంగా కోరుకున్నట్లయితే అది మీకు దక్కడానికి ప్రపంచమంతా మీకు సహాయపడుతుంది. పుస్తకాలు చదవడం ద్వారా కూడా పాజిటివ్‌ థింకింగ్‌ను పెంచుకోవచ్చు. పాజిటివ్‌గా ఉంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది.

బి - బుకిష్‌ నో హౌ : జ్ఞానం చాలా శక్తివంతమైంది. ఇంటర్వ్యూని విజయవంతంగా పూర్తి చేయాలంటే సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌లో పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలిగేలా ప్రిపేర్‌ అవ్వాలి. ఇందుకోసం పుస్తకాలు చదవాలి. లైబ్రరీలకు వెళ్లాలి. ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడాలి. మీరు ఏరంగంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రంగంపై అవగాహన పెంచుకోవాలి.

సి - కాంపిటెన్సీస్‌ : స్కిల్స్‌ పెంచుకోవడానికి టెక్నిక్స్‌ నేర్చుకోవాలి. కన్వర్జేషన్‌ స్మూత్‌గా సాగడానికి, ఎఫెక్టివిగా వినడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి స్కిల్స్‌ చాలా అవసరం. విద్యార్థులు ఇంటర్వ్యూను కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొవాలంటే అవసరమైన ట్రెయినింగ్‌ తీసుకోవడం, టెక్నిక్స్‌ నేర్చుకోవడం మంచిది.

డి - డ్రీమ్‌ : ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్‌ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలో ప్రయత్నిస్తారు. అందుకే ఐదేళ్ల తరువాత మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారని అడుగుతారు. గొప్ప గొప్ప పనులు పూర్తి చేయాలంటే కలలు కూడా కనాలి. ప్లానింగ్‌ ఒక్కటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి.

ఇ - ఎక్స్‌ప్రెస్‌ : తెలిసిన విషయాన్ని సరియైున పద్ధతిలో చెప్పడం కూడా ముఖ్యమే. ఇంటర్వ్యూలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కమ్యునికేషన్‌పైనే విజయం ఆధారపడి ఉంటుంది. నాకు తెలుసు కానీ, ఎలా చెప్పాలో తెలియలేదు అంటారు. అలాంటి వాటికి తావివ్వకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే బాగా ఎక్స్‌ప్రెస్‌ చేయగలుగుతారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని సూటిగా చెప్పేందుకు అవసరమైన టెక్నిక్స్‌ను నేర్చుకోండి. అవకాశం మళ్లీమళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం సరికాదు. వీటిని ఫాలో అయిపోండి. ఇంటర్వ్యూలో విజేతలు కండి.

Wednesday, 22 February 2017

Interview Tip 4


HI FRIENDS:



                  As Results of IBPS, SBI and other banks are out and you all will be busy with your preparations for GDs and Interviews. 
Interview is the last and final step for your journey of selection to an organisation,
you are advised to Prepare extremely well to remain confident in your interview session.
Here are some Important basic tips which will help you a lot. 
Steps to a Successful Job InterviewYou've made it to the interview stage! But before you step through that door, 
make sure you know the basic steps of a successful job interview.Preparation Learn about the company and the position.
 Check out their web site, use online corporate directories such as www.hoovers.com 
 request information from the company's public relations department.You should track down all sorts of useful information, 
such as the company's size, history, main products and services, the names of top executives and current news stories. 
Rehearse with mock interviews. 
Check with your school's career planning center to see if they offer a program to help you improve your interview skills.
  Double-check the time and location of the interview. If it's in an area that's new to you, 
consult a map or take a 'test-run' the day before to make sure you know how to get there.
  Prepare what you want to say in the interview. 
Think about your greatest strengths and weaknesses, your most significant work or school experiences,
 your future plans and your ideal job.
  Review your resume and think about how your experiences can be matched up with the job's requirements.
Go through the current affairs for the last six months.
Read out thoroughly the important and burning issues.
Exercise or do yoga daily.
Revise your subjects of graduation or post graduation.
Have a sound Knowledge of your Locality and about your State.
INTERVIEW DAY
Dress appropriately. Choose conservative clothing and keep jewelry and accessories to a minimum. 
Be punctual. Arrive focus a little early to allow yourself time to relax and. 
Bring along some basic interview tools: extra copies of your resume and a pad of paper and pen. 
Take notes on any interesting points or questions. 
Your notes will come in handy when preparing for a second interview or writing a follow-up letter. 
Be sure to listen actively throughout the interview. 
It's easy to spend all your time planning your answers, but remember—this is a conversation.
 Listening carefully helps you to respond appropriately. 
Avoid generalities and cliches("I'm a people-person"). Give concrete examples when describing your work experience. 
And always be positive.
 Don't be critical of previous co-workers or bosses. The way you talk about your former 
 current boss may be seen as an indication of how you will talk about your future boss.
  Demonstrate that you have thought seriously about this career path and this company by asking intelligent questions about the position.
 Draw upon your research about the company, or ask about the working conditions,
 the chances for advancement and major projects your prospective job would entail. 

 FEW IMPORTANT QUESTIONS ASKED IN THE INTERVIEW:
1.  Tell me about yourself.

          This is a common question—and sometimes the hardest. It's a broad, general question, 

and the worst thing you can do is give a broad, general answer. 

So how do you make the most of this question? 

Use it as a springboard to introduce the topics you want to discuss.

Focus your answer by picking one or two things and then use specific details to bring the topic alive. 


Example: 


           I'm a hard worker and I think I generally have good organizational skills. In college, 

I led a team of designers to create the Web site for each of the University's volunteer organizations...  

Decide in advance what you want the interviewer to know: Your favorite job experience,

 your most valuable activities in college, your goals and dreams.


2. i) Why Should We Hire You?

    Summarize your experiences: 

"With five years' experience working in the financial industry and my proven record of saving the company money,

 I could make a big difference in your company. I'm confident I would be a great addition to your team." 


  ii) Why should we hire you?



        Stress your knowledge, work experience, skills, and abilities. Always highlight specifics, not generalities. 
Anyone can make a bold statement, but what sells you is when you can back it up with proven experience.
3. What are your major weaknesses? 
 "I used to have a tendency to procrastinate.
 So now I am always sure to set a strict schedule for all of my projects well in advance and I set personal deadlines. 
This organization has really helped." 
 I tend to be a perfectionist. 
 I sometimes work too hard, leading to unnecessary stress. 
 I am always working on improving my communication skills to be a more effective presenter.


4. What is your greatest Strength? 

    Just be positive.Try Our Tip.You should highlight your communication skill, problem solving skills, 
your ability to work better under pressure, your ability to focus on projects and your leadership skills.

5. Why did you leave your last job?

 If You Quit: Again, be honest and stay positive. 
State that the work being offered wasn't challenging enough, 

that you are seeking higher levels of responsibility
simply that you are ready to make the next step on your career ladder --
 and that the job for which you are interviewing is the ideal next step.
 
6. Do you have any questions for us? Or do you want to ask any question?

    I'm very interested in this job. It's exactly the kind of job that I'm looking for. 
 

What is the next step in the interview process?
7. What prompted your decision to apply for this position? Or Why do you want to join a Bank?

The question behind this question may be: 
 Do you know what motivates you?
  How much do you really want this job?
  Do you really understand what it takes to be successful in this job? 
 Why us? How do you know you would be happy in our organization? 
Suggestions:
If you apply for positions that match your true needs, this should be an easy question.
 Link your interest and enthusiasm to the skills and knowledge that are most relevant for the position. 
Mention what you like about the organization and the people who work there.

8. Where do you see yourself five years from now? 

Suggestions:Focus on tackling the challenges within the job to which you are applying.
 For the longer term, 
you can underline how you wish to develop your career by developing new skills .
and knowledge that are meaningful both to you and to the organization. 
9. Do you believe in teamwork?

You should always say YES. You should have some examples ready to deliver.
 It should seem that you are a good performer in team rather than solo.
 Always remember that you should not brag, just say it in a natural tone.
Wait patiently for this question and answer cleverly.
 Try Our Tip.You should highlight the best points that relate to your position of job. 
Never highlight things, which you can't do.

10.  Do you rate MONEY or WORK more important?
 MONEY is always important but WORK is most important.

11. Describe your work ethic?

Try to give benefits of the organizationTry Our Tip
.Always try to show that you are determined to get the job done and enjoy hard work
.12.  Why Do You Want to join this organisation? 

      The interviewer is listening for an answer that indicates you've given this some thought and are 
not sending out resumes just because there is an opening.
 For example, "I've selected key companies whose mission statements are in line with my values,
 where I know I could be excited about what the company does,
 and this company is very high on my list of desirable choices." 

13. What Can You Do for Us That Other Candidates Can't? 

        What makes you unique? This will take an assessment of your experiences, skills and traits. 
Summarize concisely: "I have a unique combination of strong technical skills, 
and the ability to build strong customer relationships.This allows me to use my knowledge and 
break down information to be more user-friendly." 

14. How long will you stay with the company? 

      Short, direct comments that express that you want to stay on board as long as 
you are contributing successfully to the company and growing as a professional are sufficient. 
There is no need to discuss how many years you have left on station.
                                     AND AT LAST
***ALL THE BEST FOR YOUR INTERVIEW! JUST GIVE YOUR 200%!***