Showing posts with label పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌. Show all posts
Showing posts with label పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌. Show all posts

Monday, 31 July 2017

పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌


పిలుపు రాగానే ఇంటర్వ్యూ సక్సెస్‌ రూట్‌














        ఇంటర్వ్యూ ఉద్యోగ సాధనలో కీలకమైన దశ. కెరీర్‌ను ప్రభావితం చేసే నిర్ణయాత్మక తరుణం. ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం వస్తుందో, దానికి రెట్టింపు ఉత్తేజంతో ప్రిపరేషన్‌ సాగిస్తేనే విజయం సొంతమవుతుంది. ఇప్పుడిక ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినప్పటి నుంచి ఏవిధంగా ప్రిపేర్‌ కావాలో చూద్దాం..
రాహుల్‌ ఫోన్‌ రింగవుతోంది. శశాంక్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తోంది. పనిలో బిజీగా ఉన్నా.. తరవాత కాల్‌ చేస్తా అంటూ మెసేజ్‌ చేశాడు రాహుల్‌. శశాంక్‌, రాహుల్‌ ఇద్దరూ ఒకే కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం రాహుల్‌ ఒక ఎంఎన్‌సీలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రాజెక్ట్‌ హెడ్‌. లంచ్‌ సమయంలో రాహుల్‌ ఫోన్‌ చేశాడు. ఈ సందర్భంగా తనకు ఒక ఎంఎన్‌సీ నుంచి ఇంటర్వ్యూ కాల్‌ వచ్చిన విషయాన్ని శశాంక్‌ రాహుల్‌తో ప్రస్తావించాడు. మొదటి సారి ఇంటర్వ్యూ కాల్‌ రావడంతో గైడెన్స్‌ ఇస్తావా అని అడిగాడు శశాంక్‌. ఇప్పుడు ఆఫీసులో బిజీ కాబట్టి సాయంత్రం ఇంటికి వస్తే ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్‌ కావాలో వివరిస్తా అన్నాడు రాహుల్‌.
అనుకున్న విధంగానే సాయంత్రం శశాంక్‌, రాహుల్‌ కలుసుకున్నారు. ముందుగా ఇంటర్వ్యూ కాల్‌ వచ్చినందుకు శశాంక్‌కు కంగ్రాట్స్‌ చెప్పాడు రాహుల్‌. దానికి థ్యాంక్స్‌ చెబుతూ శశాంక్‌, వచ్చింది కాల్‌ మాత్రమే జాబ్‌ కాదన్నాడు. నీవు ఇచ్చే గైడెన్సే తనను జాబ్‌ సాధన దిశగా విజయవంతంగా నడిపిస్తుందని గుర్తుంచుకో అన్నాడు. పథ నిర్దేశం ఆరంభమైంది.
కీలకమైన అడుగు
ఇంటర్వ్యూ అనేది జాబ్‌ సాధనలో కీలకమైన అడుగు. ఇంటర్వ్యూలో నీవు ఎలా వ్యవహరిస్తావు అనే దానిపై మాత్రమే అవకాశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎటువంటి ఒత్తిడికి లోనుకారాదు. నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నావో ఇంటర్వ్యూలో కూడా అలాగే ఉండు. నీ ఆలోచనలు, ఆభిప్రాయాలను స్పష్టంగా చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూలో సగం విజయం సాధించినట్లే. ముందుగా ఇంటర్వ్యూ ఫార్మాట్‌ తెలుసుకోవాలి. ఈ విషయంలో ఒక్కో కంపెనీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఫార్మాట్‌ తెలిస్తే తదనుగుణంగా సన్నాహాలు చేసుకోవడం సులువు.
కంపెనీ క్షుణంగా
ఇంటర్వ్యూలో అందరిని కామన్‌గా అడిగే ప్రశ్నలు ఉంటాయి. వాటి గురించి ఆందోళన అవసరం లేదు. కాకపోతే ఇంటర్వ్యూ ఆఫర్‌ చేసిన కంపెనీ గురించిన వివరాలను క్షుణంగా తెలుసుకోవాలి. కంపెనీ లక్ష్యాలు, పాటించే విలువల గురించి అవగాహన పెంచుకోవాలి. ఎటువంటి ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది, కంపెనీకి ఏయే దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి, ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు, కొన్నేళ్లుగా కంపెనీ తీరు ఎలా ఉంది వంటి అంశాలపై అప్‌డేట్‌ కావడడం మంచిది. ఆ వివరాలు, అప్లయ్‌ చేసుకున్న జాబ్‌ నేచర్‌ ఆధారంగా ఎటుంటి ప్రశ్నలు ఎదురుకావచ్చో ముందే ఊహించుకుని ప్రిపేర్‌ కావడం మంచిది. అప్పుడే కంపెనీపై మీకున్న అవగాహన ఎంప్లాయర్‌కు అర్ధమవుతుంది. అవకాశాలను మెరుగుపరుస్తుంది.
నైపుణ్య ప్రదర్శన
అప్లికేషన్‌లో ప్రస్తావించిన నైపుణ్యాలను(స్కిల్స్‌), చేసిన ప్రాజెక్ట్‌/ఇంటర్న్‌షిప్‌ వంటి అంశాలను ఒక సారి పరిశీలించుకోవాలి. అందులో ప్రస్తావించిన వాటిని ఎంప్లాయర్‌కు ఏవిధంగా ప్రభావవంతంగా ప్రదర్శించగలవో ఆలోచించాలి. మనం బీటెక్‌లో ఉన్నప్పుడు నీవు కోడింగ్‌ మీద ప్రాజెక్ట్‌ చేశావుగా. ఆ ప్రాజెక్ట్‌ కంపెనీకి ఏవిధంగా ప్రయోజనకరంగా ఉంటుందో ప్రదర్శించి చూపించాలి. స్టేజ్‌ ఫియర్‌ వంటి వాటి నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ముందు ఆ ప్రాజెక్ట్‌ను ప్రదర్శిస్తూ ప్రాక్టీస్‌ చేయాలి. తద్వారా ఆత్మవిశ్వాసంతో మనస్కిల్స్‌ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇచ్చే ప్రజెంటేషన్‌ ద్వారా సదరు జాబ్‌/కంపెనీకి నీవే పర్‌ఫెక్ట్‌ అని ఎంప్లాయర్‌ భావించేలా ఉండాలి.
చివర్లో
ఇంటర్వ్యూ చివర్లో సాధారణంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ ప్రొఫైల్‌, జాబ్‌ నేచర్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడగటం ప్రయోజనకరం అని గుర్తుంచుకో. కాకపోతే ప్రశ్నలు సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న లేటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌పై చర్చించుకునేలా చూసుకోవాలి.
సాలరీ : లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌
ఇంటర్వ్యూలో శాలరీ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. కాబట్టి ప్రస్తుత మార్కెట్లో అటువంటి జాబ్‌కు ఆయా కంపెనీలు ఎంత ఆఫర్‌ చేస్తున్నాయి వంటి వాటి ద్వారా వ్యక్తిగత సామర్థ్యాన్ని స్వీయ విశ్లేషణ చేసుకుని నీవు అనుకున్న శాలరీకి కాస్త అటు ఇటుగా చెప్పడం ఉత్తమం.