పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్ విభాగంలో 493 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులకు మార్చి 20 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ తెలిపారు. బీసీ-సీ విభాగానికి చెందిన ఒక మహిళా అభ్యర్థి మినహా మిగతా వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. ఎంపికైన వారిలో 23 మంది ఎంటెక్ పూర్తిచేసిన వారుండగా, 271మంది బీటెక్ చదివిన వారు ఉన్నట్టు వెల్లడించారు. కాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ రాతపరీక్ష తుది ఫలితాలను మార్చి 15న విడుదల చేయనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష కీని సోమవారం విడుదల చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోపు పోలీస్ నియామక బోర్డుకు ఆన్‌లైన్ (మెయిల్) ద్వారా తెలియజేయవచ్చు.
కటాఫ్ కిరికిరి.. కానిస్టేబుల్ ఫలితాల్లో అక్రమాలు..!
కటాఫ్ ప్రకటించకుండానే తుది ఫలితాలు
ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అన్యాయం
డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన
గోప్యత పాటిస్తున్నారంటూ ఆరోపణలు
ప్రతి ఒక్కరి ప్రశ్నకు లిఖితపూర్వక జవాబు
సంతృప్తిచెందకపోతే కోర్టుకెళ్లొచ్చు: బోర్డు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): నేను బీసీ ‘ఏ’ కేటగిరీకి చెందినవాడిని. మా సామాజిక వర్గం, మా గ్రామానికే చెందిన వాడికి నా కంటే తక్కువ మార్కులు వచ్చినా ఎంపికయ్యాడు. నేను ఎంపిక కాలేదు. ఇదెలా సాధ్యం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ప్రశ్న ఇది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే అభ్యర్థి తక్కువ మార్కులు వచ్చినా అర్హత సాధించాడు. అక్రమాలు జరగడం వల్లే ఇది సాధ్యమైంది.
.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారమిది.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తొలుత, కటాఫ్ మార్కులు ప్రకటించకుండా నేరుగా ఫైనల్ ఫలితాలు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. సివిల్, ఏఆర్, సీపీఎల్, టీస్ఎస్‌పీ , ఫైర్ సర్వీస్ విభాగాల్లో 11,281 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలను గత శుక్రవారం విడుదల చేశారు. తుది ఫలితాల్లో 10,113 మంది ఎంపికయ్యారు. ఫలితాలు చూసుకున్న అభ్యర్థులు.. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారుఎంపిక కావడాన్ని గుర్తించారు. కటాఫ్ మార్కులు లేకుండా ఫలితాలను విడుదల చేశారని, తక్కువ మార్కులు వచ్చిన వారు ఎంపికయ్యారని, అక్రమాలు జరిగాయంటూ డీజీపీ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. మార్కులు, రిజర్వేషన్, ఇతర అంశాల్లో అక్రమాలు జరిగాయని, కటాఫ్ మార్కులు ప్రకటించకుండానే ఫలితాలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మహిళలకు 33ు రిజర్వేషన కల్పించినట్లు చెబుతున్నా విడుదలైన ఫలితాల ప్రకారం 15శాతం మించి రిజర్వేషన్ లభించలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు వచ్చి, అభ్యంతరాలకు సంబంధించిన వినతి పత్రాలు తీసుకుని అభ్యర్థులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
కటాఫ్ మార్కుల వివరాల్ని నియామక బోర్డు అధికారులు సోమవారం సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దాని ప్రకారం, అభ్యర్థి తనకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలుసుకునేందుకు వీలుంది. ఇతరులకు వచ్చిన మార్కులు, తదితర వివరాలు తెలుసుకునేందుకు అవకాశం లేదు. వ్యత్యాసం తెలుసుకునే వెసులుబాటు లేకుండా చేయడం సందేహాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి అభ్యర్థి ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలు కల్పించారు.
అడిగితే వెబ్‌సైట్ ద్వారా జవాబులిస్తాం: పూర్ణచంద్రరావు
కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అభ్యర్థులకు అభ్యంతరాలుంటే చాలెంజ్ చేసుకోవచ్చని పోలీస్ నియామక బోర్డు చైర్మన పూర్ణచంద్ర రావు తెలిపారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు తమ సందేహాల్ని ఈనెల 24 నుంచి బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాలెంజ్ చేయవచ్చని, వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లిఖితపూర్వక సమాధానం పంపిస్తామని వివరించారు. అప్పటికీ అభ్యర్థులు సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు. అభ్యర్థుల డ్రైవింగ్ లైసెన్సుకు మార్కులు కేటాయించామన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశామని చెప్పారు.

No comments:
Post a Comment