Sunday 9 April 2017

జాబ్ సాధించాలంటే...


జాబ్ సాధించాలంటే...

    జాబ్‌ ఇంటర్వ్యూకి వెడుతున్నారా? ఉద్యోగం సాధించాలంటే 
కింద పేర్కొన్న అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అవి... 


 
  • మీరు హాజరవుతున్న కంపెనీకి సంబంధించిన సమచారాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి.
  • ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఊహించి వాటికి జవాబులు ఎలా చెప్పాలో కూడా సిద్ధం కావాలి. 
  • ఇంటర్వ్యూకి వెళ్లేటప్పడు ఆహార్యం విషయంలో కూడా జాగ్రత్తవహించాలి. 
  • ఇంటర్వ్యూకు ఒక పది నిమిషాల ముందరే హాజరవాలి. 
  • మొదటి ఇంప్రెషనే బెస్ట్‌ ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడాలి. 
  • ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సబ్జెక్టుమీద మంచి పట్టును ప్రదర్శించాలి. 
  • ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్‌ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 
  • చెడు అలవాట్లు, మానరిజమ్స్‌ను పోగొట్టుకోవాలి. 
  • ఇంటర్వ్యూ చేసే వారిని వారి సంస్థ గురించి ప్రశ్నలు వేయొచ్చు. ఇందువల్ల ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని ఇంటర్వ్యూ చేసేవారు గుర్తించగలరు. 
  • ఇంటర్వ్యూ అయిన తర్వాత ధన్యవాదాలు చెప్పాలి. ఈ-మెయిల్‌ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. 
  • ఇంటర్వ్యూ వీడియోలను చూస్తే ఇంటర్వ్యూ మరింత బాగా చేయగలరు. 
ఇంటర్వ్యూ అధికారిని ప్రభావితం చేసేదెలా! 

  •  ఏ ఇంటర్వ్యూకు వె ళ్లినా అదే మీకున్న చివరి అవకాశంగా భావించాలి. అప్పుడే ఆ ఇంటర్వ్యూ విషయంలో సీరియస్‌గా ఉంటారు. సక్సెస్‌కైనా అదే పెద్ద వేదిక అవుతుంది. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అనే ధోరణిలో ఉన్నవారు ఏ ఒక్క ఇంటర్వ్యూకు తమ సర్వశక్తులూ వెచ్చించరు. అదే వారి వరుస వైఫల్యాలకు కారణమవుతుంది. 
  • ఇంటర్వ్యూ అనగానే ఎంతసేపూ కంపెనీ వారేదో అడుగుతారు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుందనే ధోరణితోనే చాలా మంది ఉంటారు. కానీ, ఫైనల్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థి కూడా కంపెనీకి కొన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా,... ‘‘మీరిచ్చే ఉద్యోగానికి సదరు వ్యక్తి ఏ రకమైన నేపథ్యంతో ఉండాలని మీరు భావిస్తారు?, ఈ ఉద్యోగంలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లేమిటి? ఉద్యోగంలోకి ప్రవేశించిన తొలి 90 రోజుల్లో నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఏముంటాయి? ఇంకేదైనా విషయంలో నేను మరింత స్పష్టంగా ఏదైనా వివరణ ఇవ్వడం అవసరమని మీరనుకుంటున్నారా?’’ వంటి ప్రశ్నలను యాజమాన్యం మీద వినయంగా సంధించవచ్చు. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని, అంకిత భావాన్నీ తెలియచేస్తుంది. 
  • ఉద్యోగానికి అవసరమైన మీ అనుభవాలు, నైపుణ్యాల గురించే కాకుండా, మీ వ్యక్తిగ తమైన వివరాల గురించి కూడా ఇంకా వివర ంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు కొంత భిన్నంగా వ్యవహరించాలి. పొడిపొడిగా రొటీన్‌ సమాధానాలు చెప్పకుండా, ఒక కథలా చెబితే అవి వారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆ కథలో వారు ఆశించిన దానికన్నా మిన్నగా మీరు ఆ సంస్థకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాననే భావాన్ని ఆ కథ ద్వారా వారికి చెప్పగలిగితే మరీ మంచిది. 
డ్రెస్‌సెన్స్‌ ముఖ్యమే! 
ఇంటర్వ్యూలో సక్సెస్‌ కావాలంటే అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెబితే సరిపోదు. డ్రెస్‌ సెన్స్‌ నుంచి పెర్‌ఫ్యూమ్‌ వరకు అన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి చిన్న విషయాలే కదా నిర్లక్ష్యంగా ఉండకండి. 
 
డ్రెస్‌ ఫిట్‌గా ఉండేలా చూసుకోండి : మీరు ధరించిన డ్రెస్‌ బాగా పొడవుగా ఉన్నా లేక చిన్నగా ఉన్నా చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి ధరించే దుస్తులు ఏవయినా ఫిట్‌గా ఉండేలా చూసుకోండి. కళ్ల జోడు కూడా ముఖానికి ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. ముక్కుపైకి జారిపోయినట్లుగా ఉండకూడదు.
 
స్ట్రాంగ్‌ పెర్‌ఫ్యూమ్‌ వద్దు : పెర్‌ఫ్యూమ్‌ వాడే అలవాటు ఉన్నా ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో స్ట్రాంగ్‌ పెర్‌ఫ్యూమ్‌ల జోలికి వెళ్లకూడదు. లైట్‌ పెర్‌ఫ్యూమ్‌ని ఉపయోగించవచ్చు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు.
 
షూస్‌ :  ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో స్పోర్ట్స్‌ షూ ధరించకూడదు. ఫార్మల్‌ షూస్‌ మాత్రమే వేసుకోవాలి. అవి నీట్‌గా పాలిష్‌ చేసి ఉండాలి. ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి.
ముదురు రంగు దుస్తులు మేలు :  లేత రంగు దుస్తులతో పోలిస్తే ముదురు రంగు దుస్తులు దృఢమైన అభిప్రాయాన్ని కలగిస్తాయి. ఒకవేళ మీరు ప్రెజెంటేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌తో బ్లెండ్‌ కాకుండా చూసుకోవాలి.
 
అభరణాలు అతిగా వద్దు :  ఐదు వేళ్లకు ఐదు ఉంగరాలు, మెడలో గొలుసుతో ఇంటర్వ్యూకు అటెండ్‌ కావడం సరికాదు. సీ్త్రలు ఫిట్‌గా, చూడటానికి పర్‌ఫెక్ట్‌గా అనిపించే నగలను ధరించవచ్చు. అయితే అతిగా ఉండకుండా చూసుకోవాలి. చేతి గాజులు శబ్దం రాకుండా చూసుకోవాలి.
 
షేవింగ్‌ మరువద్దు :  ఇంటర్వ్యూకు వెళ్లే రోజున షేవింగ్‌ చేసుకోవడం మరువద్దు. ఎలకి్ట్రక్‌ రేజర్స్‌, ట్రిమర్స్‌తో కట్‌ చేసుకున్నా గుడ్‌ లుకింగ్‌ ఉంటుంది.

ప్రింటెడ్‌ కర్టెన్లు అండ్ సోఫా కవర్లు


స్వయం ఉపాధి 
ఒకప్పుడు ఆహారం, దుస్తులు, ఇల్లు అనేవి కనీసావసరాలు. ప్రస్తుతం వీటిని అవసరాలుగా మాత్రమే కాదు స్టేటస్‌ సింబల్స్‌గా కూడా పరిగణిస్తున్నారు. అందంగా అలంకరించిన ఇంటిని సోషల్‌ స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. గృహాలంకరణకు లక్షలు/ కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. నిర్మాణానికంటే గృహాలంకరణకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం గృహాలంక రణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నవి మాత్రం డోర్‌/ విండో కర్టెన్లేనని కచ్చితంగా చెప్పవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సోఫాలు, పలు డిజైన్లతో రూపొందిన చెక్క కుర్చీలు, డైనింగ్‌ టేబుల్‌్క్ష చైర్స్‌ వంటివాటిపై వేసే కవర్స్‌, బెడ్‌షీట్స్‌, బ్లాంకెట్స్‌, పిల్లో కవర్స్‌, టవల్స్‌, హ్యాండ్‌నేప్‌కిన్స, డోర్‌/ విండో కర్టెన్స వంటి ఉత్పత్తుల తయారీ అనేది ‘హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం’గా గుర్తింపు పొందింది. ఈ రంగం ఏటా వృద్థి సాధిస్తూ లాభాల బాటలో ఉంది.
 
భారత హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం
మనదేశంలో హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం మార్కెట్‌ విలువ ఏడాదికి రూ.20,000 కోట్లు. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఏటా 30 శాతం వృద్ధి చెందుతోంది. మొత్తం టెక్స్‌టైల్స్‌ మార్కెట్లో కేవలం కర్టెన్లు, సోఫా ్క్ష ఫర్నిచర్‌ కవర్ల పరిమాణమే 40 శాతంగా అంటే రూ.8000 కోట్లుగా ఉంది. ఇది ఏటా 30 నుంచి 40 శాతం మేర వృద్ధి చెందుతోంది.
 
వివిధ రకాల ఫ్యాబ్రిక్స్‌
పాలిస్టర్‌, కాటన, సిల్క్‌, లైనెన, వెల్వెట్‌, లేస్‌, శాటిన ఇంకా ఇతర ముడిపదార్థాలతో తయారైన గుడ్డల ఆధారంగా కర్టెన్లు, ఫర్నిచర్‌ కవర్స్‌ తయారు చేస్తారు.
 
నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌
టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ విభాగంలో మానవ తయారీ ఫైబర్‌ ఆధారితమైన ఆధునిక ఉత్పత్తిగా ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ను చెప్పవచ్చు. ఇది గుడ్డ మాదిరి కనిపించే పొలి ప్రోపెలిన్. ఫైబర్‌ అమర్చిన, వడకని/ నేయని ప్రత్యేక తరగతికి చెందిన ఫ్యాబ్రిక్‌. స్పన్ బౌండ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ను ప్రస్తుతం అనేక రంగాల్లో వివిధ అవసరాల మేరకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌తో కర్టెన్లు, ఫర్నిచర్‌ కవర్లను తయారు చేయడం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.
 
నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ ప్రత్యేకత
చాలా తక్కువ బరువుతో ఉంటుంది, చదరపు మీటర్‌ 15 గ్రా. నుంచి 250 గ్రా. వరకు ఉంటుంది.
నీళ్లలో పెట్టినా కూడా కుంచించుకు పోదు
సులభంగా శుభ్రపరిచే వీలుంటుంది
అంటే స్ర్కీన్ ప్రింటింగ్‌, ఆఫ్‌సెట్‌, హీట్‌ ట్రాన్సఫర్‌ తదితర అన్ని విధాలైన ప్రింటింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది
పర్యావరణానికి అనుకూలం, రీసైక్లింగ్‌ చేసుకోవచ్చు
గాలి ప్రసరణ ధారాళంగా జరుగుతుంది
దీని తయారీ వ్యయం కూడా చాలా తక్కువ (ఇతర ఫ్యాబ్రిక్స్‌తో పోలిస్తే) అందుకే ఈ ఫ్యాబ్రిక్‌ను పలు అవసరాలకోసం విరివిగా ఉపయోగిస్తున్నారు
 
అవసరమైన యంత్ర పరికరాలు:
రోల్‌ టు రోల్‌ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ స్ర్కీన్, ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ యంత్రాలు
రోల్‌ స్లిట్టింగ్‌ మిషన్
ఇండస్ట్రియల్‌ స్టెబింగ్‌ మిషన్లు
డిజైన్ సాఫ్ట్‌వేర్‌
ఇతర పరికరాలు
 
ముడి పదార్థాలు
చదరపు మీటరు 50 నుంచి 120 గ్రాముల బరువుండే వివిధ రంగుల నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ రోల్స్‌
స్ర్కీన్ ప్రింటింగ్‌ ఇంక్‌
ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ఇంక్‌
రింగ్స్‌, దారాలు
 
తయారీ
పూర్తి స్థాయి పరిశ్రమలో నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ ప్లెయిన్ రోల్స్‌ సేకరించి వాటిపై ముందుగా ఎంపిక చేసుకొన్న డిజైన్లను స్ర్కీన్/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ద్వారా అందంగా ముద్రించి సైజుల వారీగా కర్టెన్లు కుట్టి మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. కేవలం ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ను కూడా రోల్‌/ కట్‌పీస్‌లుగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.
 
మార్కెటింగ్‌ విధానం
హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్లు, ఇతర ప్రైవేట్‌ కార్యాలయాలను సంప్రదించి మార్కెటింగ్‌ అవకాశాలను పొందవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను అనుసరించి కూడా మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగు పరచుకోవచ్చు.
 
పరిశ్రమ వివరాలు 
పూర్తిస్థాయి పరిశ్రమ: రోజుకు 3000 మీటర్ల ఫ్యాబ్రిక్‌ ప్రింటింగ్‌, కర్టెన్లు అండ్ ఫర్నిచర్‌ కవర్ల తయారీ 
పరిశ్రమ వ్యయం: రూ.100 లక్షలు (కోటి) 
సాధారణ పరిశ్రమ: కేవలం కర్టెన్లు, కవర్ల తయారీ
సామర్థ్యం: రోజుకు 500 కర్టెన్లు, 300 సోఫా కవర్లు తయారీ 
పరిశ్రమ వ్యయం: రూ.25 లక్షలు

సిఐఎఫ్‌ఎన్ఇటి


సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ నాటికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ట్రైనింగ్‌(సిఐఎఫ్‌ఎన్ఇటి)- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్ (నాటికల్‌ సైన్స్) 
సీట్లు: 33
కాలవ్యవధి: నాలుగేళ్లు(ఎనిమిది సెమిస్టర్లు) 
క్యాంపస్‌: సిఐఎఫ్‌ఎన్ఇటి, కొచ్చి
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపిసి) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు
 
వయసు: అక్టోబరు 1 నాటికి 17 నుంచి20 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కామన్ ఎంట్రెన్స టెస్ట్‌ అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ద్వారా
 
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌: జూన 10న
 
దరఖాస్తు ఫీజు: రూ.500(ఎస్సీ/ఎస్టీలకు రూ.250)
 
వెస్సెల్‌ నేవిగేటర్‌ కోర్స్‌(విఎనసి)/ మెరైన ఫిట్టర్‌ కోర్స్‌(ఎంఎఫ్‌సి)
 
కాలవ్యవధి: రెండేళ్ల ట్రేడ్‌ కోర్స్‌(నాలుగు సెమిస్టర్లు) 
క్యాంపస్‌లు: సిఐఎఫ్‌ఎన్ఇటి(కొచ్చి/చెన్నై/ విశాఖపట్నం)
సీట్లు: విఎన్‌సిలో 48, ఎంఎఫ్‌సిలో 48 (ప్రతి క్యాంపస్‌లో కోర్సుకు 16 సీట్లు ఉన్నాయి) 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విఎనసి కోర్సుకు మేథ్స్‌, సైన్స్ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయసు: ఆగస్టు 1 నాటికి 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
 
ఎంపిక: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ ద్వారా
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌: జూన 17న
 
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, పూరి, పాట్నా, మంగళూర్‌, పోర్ట్‌ బ్లెయిర్‌, పాండిచేరి, కాకినాడ
 
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టయిపెండ్‌ ఇస్తారు.
 
దరఖాస్తు ఫీజు: రూ.300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150)
 
అభ్యర్థులు తమ దరఖాస్తు హార్డు కాపీని కింది చిరునామాకు పంపుకోవాలి
 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ రెండో వారంలో.

చిరునామా: The Director, CIFNET, Fine Arts Avenue, Cochin- 682016

కరెంట్ అఫైర్స్... వీక్లీ రౌండప్


ఏపీ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించారు.
 
2012 సంవత్సరానికి
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు:ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు: సంగీతం శ్రీనివాసరావు 
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: దగ్గుపాటి సురేష్‌బాబు 
రఘుపతి వెంకయ్య అవార్డు: కోడి రామకృష్ణ
 
2013 సంవత్సరానికి
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు: హేమమాలిని
బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు: కోదండరామిరెడ్డి 
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: దిల్‌ రాజు 
రఘుపతి వెంకయ్య అవార్డు: వాణిశ్రీ
 
ఇండియన్ ఐడల్‌ రేవంత్
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్‌’లో తెలుగు గాయకుడు ఎల్‌.వి. రేవంత్ విజేతగా నిలిచాడు. 2017 ఏప్రిల్‌ 2న జరిగిన తుది పోటీలో రేవంత్ విజేతగా నిలిచినట్లు సచిన తెందుల్కర్‌ ప్రకటించారు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. పంజాబ్‌కు చెందిన ఖుదాబక్ష్‌ రెండో స్థానంలో, మరో తెలుగు కుర్రాడు రోహిత్ మూడో స్థానంలో నిలిచారు.
 
దేశంలో పొడవైన సొరంగ మార్గం
జమ్మూ-శ్రీనగర్‌లను కలిపే దేశంలో అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 ఏప్రిల్‌ 2న ప్రారంభించారు. రూ.9000 కోట్ల ఖర్చుతో 9 కి.మీ. సొరంగ మార్గాన్ని నిర్మించారు. దీన్ని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. జాతీయ రహదారి-44 వెంబడి చెనాని-నాష్రీ మధ్య ఈ సొరంగం నిర్మించారు. సొరంగం నిర్మాణానికి ముందు వీటి మధ్య దూరం 41 కి.మీ., ఇప్పడది 10.9 కి.మీ. తగ్గింది. తద్వారా ఏటా రూ.99 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుంది.
 
విద్యా సంస్థల జాతీయ ర్యాంకింగ్‌ 
కేంద్ర ప్రభుత్వం విడదల చేసిన జాతీయ ర్యాం కింగ్స్‌ జాబితాలో బెంగళూరుకు చెందిన ఐఐఎస్‌సీ మొదటిస్థానంలో, ఐఐటీ మద్రాస్‌ రెండో స్థానంలో నిలిచాయి. ఏడు ఐఐటీలు, జేఎనయూ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. హైదారాబాద్‌లోని హెచ సీయూ 14, ఉస్మానియా వర్సిటీ 38, ఐఐటీహెచ 26, వరంగల్‌ నిట్‌ 82వ స్థానంలో నిలిచాయి.

ఇంధన సుస్థిరతలో భారత్‌కు 87వ స్థానం 
దేశ ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం పాత్ర, పర్యావరణ సుస్థిరత, అందరికీ విద్యుత్ వంటి 18 అంశాల ప్రాతిపదికన ప్రపంచ ఆర్థికమండలి విడుదల చేసిన జాబితాలో భారత్ 87వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉంది. ఇంధన సంబంధిత కాలుష్యం విషయంలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. అందరికీ విద్యుత్ విషయంలో 101, విద్యుత్ ఉత్పత్తి వల్ల వెలువడుతున్న కర్బన కాలుష్యం విషయంలో 117వ స్థానంలో భారత నిలిచింది. ప్రపంచ ఆర్థికమండలి అంతర్జాతీయ ఇంధన వనరుల వ్యవస్థ పనితీరు సూచి -2017 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది.
 
వ్యవసాయాభివృద్ధికి ‘రాఫ్తార్‌’ 
రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడంతో పాటు, గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాఫ్తార్‌ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాషీ్ట్రయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కేవీవై) స్థానంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకర విధానాలు పేరుతో దీన్ని ప్రారంభించింది. ఆర్‌కేవీవైని 4 శాతం వ్యవసాయాభివృద్ధి లక్ష్యంతో ప్రారంభించగా, ఈ రాఫ్తార్‌ 5-6 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
 
‘పవర్‌ టెక్స్‌ ఇండియా’ ప్రారంభం 
మరమగ్గాల ఆధునీకరణ, వస్త్ర ఉత్పత్తి రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ‘పవర్‌ టెక్స్‌ ఇండియా’ పథకాన్ని కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఏప్రిల్‌ 1న మహారాష్ట్ర భివండీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 8 ప్రధాన టెక్స్‌టైల్‌ క్లస్టర్లను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి సిరిసిల్లకు చోటు దక్కింది.
 
మలేషియా ప్రధాని భారత పర్యటన 
మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మొత్తం ఏడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారతీయ పర్యాటకులకు వీసా రుసుం రద్దు, యూరియా కొనుగోలు, ఏపీలో పామాయిల్‌ అభివృద్ధి తదితర అంశాలపై ఒప్పందం కుదిరింది.
 
స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ ప్రారంభం
వివిధ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే లక్ష్యంతో చేపట్టిన ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన- 2017’ను 2017 ఏప్రిల్‌ 1న కేంద్రమంత్రి ప్రకాశ జవదేకర్‌ నోయిడాలో ప్రారంభించారు. దేశంలోని 26 కేంద్రాల్లో ఈ హ్యాకథాన ప్రారంభమైంది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన’లో నవ కల్పనల్ని ప్రోత్సహిస్తూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనల్ని ఆహ్వానిస్తారు.

ఒకే ఒక్కటి చాలు! ...లైఫ్ సెటిల్!!


ఒకే ఒక్కటి చాలు! ...లైఫ్ సెటిల్!!

 లక్షలాది మంది యువత ఏదో ఒక జాబ్ దొరికితే చాలనుకుంటుంటారు. కాని, సరైన అవగాహన, కుశలత, తర్ఫీదు లేకపోవడంతో విజయం ముందు బోర్లా పడుతుంటారు. ఈ కింది పరీక్షల్లో ఏదో ఒకదాంట్లో విజయం సాధించినా జీవితం సెటిల్ అయినట్టే...
 
1.ఐబిపిఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష...
బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇదొక మహదవకాశం. బ్యాంక్ పిఒ అనేది ఎంట్రీ లెవల్ పోస్టు. అయితే, రెండేళ్ల తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలను వహించవచ్చు. బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం... నోటిఫికేషన్ జూలైలో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్, మెయిన్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది.
 
2. ఎస్‌బిఐ పిఒ...
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్టేట్ బ్యాంక్ నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి మొదటి రెండేళ్లలో శిక్షణ, ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి. జనరల్ బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. 
 
3. ఐబిపిఎస్ స్పెషల్ ఆఫీసర్...
ఐబిపిఎస్‌‌లో స్పెషల్ ఆఫీసర్ నియామకం కూడా మంచి అవకాశంగా గుర్తించాలి. వీరిని వివిధ విభాగాల్లో ప్రత్యేక పాత్ర పోషించేందుకు నియమిస్తారు. వీరిలో ఐటి, లా, అగ్రికల్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, తదితర విభాగాలు ఉంటాయి.
 
4.ఎస్ఎస్‌సి సిజిఎల్...
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సివిల్ పోస్టులను ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో నియమిస్తారు.
 
ఎగ్జామినర్... అంటే వివిధ సరకులను పరీక్షించడం, శాంపిల్స్ సేకరించడం, ఎగుమతి, దిగుమతి అవుతున్న సరుకుల నాణ్యతను పరీక్షించడం,తదితర బాధ్యతలు ఉంటాయి.
 
అసిస్టెంట్ సిఎస్ఎస్... వివిధ శాఖలలో ఫైళ్ల నిర్వహణ, తదితర బాధ్యతలు ఉంటాయి. అలాగే, ప్రివింటివ్ ఆఫీసర్, ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎంఇఎ, సిబిఐలో సబ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, తదితర పోస్టులు ఉంటాయి.  
 
5.ఆర్‌బిఐ గ్రేడ్ బి ఎగ్జామినేషన్...
ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, తదితర అంశాల గురించి అవగాహన కల్పించే ఉద్యోగం ఇది. అలాగే, ఐఎంఎ, వరల్డ్ బ్యాంక్, తదితర ఆర్థిక సంస్థలు, వాటి కార్యకలాపాల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
 
6.ఎల్ఐసి ఎఎఒ...
అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, డెవలప్‌మెంట్ రంగాల్లో వీరిని నియమిస్తారు. ఇది క్లాస్-1 ఆఫీసర్ కేడర్ పోస్టు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత కెరీర్‌లో ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి.
 
7.యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్...
వివిధ రకాల సివిల్ సర్వెంట్స్‌ను ఎంపిక చేస్తారు. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపిఎస్), ఐఎ అండ్ ఎఎస్... ఇండియన్ఆడిట్ ఎకౌంట్స్ సర్వీస్, ఐఆర్ఎస్, ఐసిఎఎస్...ఇండియన్ సివిల్ ఎకౌంట్స్ సర్వీసెస్, ఐసి అండ్ జిఇఎస్... ఇండియన్ కస్టమ్స్ అండ్ జనరల్ ఎక్సైజ్ సర్వీస్, ఐఆర్ఎస్ఒ... ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్స్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్, ఐఐఎస్... ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లకు ఈ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
 
8.ఐబిపిఎస్ అండ్ ఎస్‌బిఐ క్లర్క్...
వీరిని క్యాష్ డిపాజిట్ అండ్ విత్ డ్రాయల్ కౌంటర్లలో నియమిస్తారు. చెక్ లను వెరిఫై చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ లను ఇవ్వడం, లెడ్జర్ మెయింటినెన్స్, తదితర విధులు ఉంటాయి. ఎంపికైన తర్వాత ఆరు నెలల పాటు శిఓణ ఉంటుంది.
 
9.ఇండియన్ రైల్వేస్...
గ్రాడ్యుయేట్లకు ఇదొక మంచి అవకాశం. వందలాది పోస్టులను ఆర్ఆర్‌బి నాన్ టెక్నికల్ రిక్రూట్‌మెంట్ కింద నియమిస్తారు. కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ఎంక్వయిరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, సీనియర్ టైమ్ కీపర్, తదితర పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది.
 
10. టెట్...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఈ పరీక్షను నిర్వహిస్తాయి. ఏ గ్రాడ్యుయేట్ అయినా ఈ పరీక్ష వ్రాయవచ్చు. అన్ని స్థాయిల పాఠశాలల్లోనూ వీరిని నియమిస్తారు.
 
సో... ఈ పదింటిలో ఏ ఒక్క దాన్ని కొట్టినా జీవితంలో సెటిల్ అయిపోయినట్టే! మరి ఆయా సంస్థల వెబ్ సైట్లు, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈలోగా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది రెడీగా ఉండండి... ఆల్ ది బెస్ట్...

QUIZ-09



Q1. Sports Ministry has approved the appointment of two top foreign athletics coaches, one each in race walking and 400m race keeping in mind 2020 Olympics. 2020 summer Olympics will be held in ______.
(a) Beijing, China
(b) Tokyo, Japan
(c) Muscat, Oman
(d) Pyeongchang, South Korea
(e) Rio de Janeiro, Brazil

Q2. National Film Awards were announced recently for year 2016, Akshay Kumar won the Best Actor award for Rustam. It was _______ edition of National Film Awards.
(a) 56th
(b) 45th
(c) 55th
(d) 64th
(e) 68th

Q3. Name the lender that has announced that its Unified Payments Interface (UPI) will also be available on Chillr, a multi-bank mobile payments app.
(a) Axis Bank
(b) South India Bank
(c) HDFC Bank
(d) ICICI Bank
(e) SBI

Q4. Name the Noble Prize winner who has been recently appointed as the United Nations Messenger of Peace by Secretary-General Antonio Guterres.
(a) Bob Dylan
(b) William C. Campbell
(c) Kailash Satyarthi
(d) Peter W. Higgs
(e) Malala Yousafzai

Q5. Name the public sector bank that has embarked upon an ambitious project of upgrading the bandwidth at all its branches to 2 Mbps in partnership with BSNL.
(a) South Indian Bank
(b) Canara Bank
(c) SBI
(d) UCO Bank
(e) IDFC Bank

Q6. National Payments Corporation of India (NPCI), the umbrella organization for all retail payment systems in the country, has disbursed ________ prize money to about 18 lakh winners under the NITI Aayog’s Lucky Draw schemes for consumers and merchants.
(a) Rs 245 crore
(b) Rs 230 crore
(c) Rs 225 crore
(d) Rs 220 crore
(e) Rs 215 crore

Q7. India has ranked ______ globally in total 136 countries in Travel and Tourism Competitiveness report 2017 by World Economic Forum.
(a) 35th
(b) 45th
(c) 25th
(d) 40th
(e) 48th

Q8. Indian boxer K Shyam Kumar won a gold medal in the 49- kilogram category at the Thailand International Tournament. What is the capital of Thailand?
(a) Muscat
(b) Pattaya
(c) Bangkok
(d) Chiang Rai
(e) Chiang Mai

Q9. India and Bangladesh have signed 22 agreements in strategic sectors like defence and civil nuclear cooperation during Bangladesh Prime Minister visit to India. Who is the President of Bangladesh?
(a) Sheikh Hasina
(b) Abdul Hamid
(c) Zillur Rahman
(d) Shahabuddin Ahmad
(e) Hussain Muhammad

Q10. In which of the following Indian cities the National Basketball Association (NBA) has recently announced the setting up of its first basketball school?
(a) Bengaluru
(b) New Delhi
(c) Kanpur
(d) Chennai


(e) Mumbai
Solutions

S1. Ans.(b)
Sol. Sports Minister Mr. Vijay Goel has approved the appointment of two top foreign athletics coaches, one each in race walking and 400m race. 2020 summer Olympics will be held in Tokyo, Japan.

S2. Ans.(d)
Sol. The 64th National Film Awards were announced in which the Directorate of Film Festivals presents its annual National Film Awards to honor the best films of 2016 in the Indian cinema.

S3. Ans.(c)
Sol. HDFC Bank announced its Unified Payments Interface (UPI) will also be available on Chillr, a multi-bank mobile payments app. Currently, UPI is available on HDFC Bank’s own mobile banking app.

S4. Ans.(e)
Sol. Malala Yousafzai, the youngest winner of the Nobel Peace Prize has become the youngest United Nations Messenger of Peace. The United Nations stated that the 19-year-old Pakistani education activist will be appointed by Secretary-General Antonio Guterres on April 10, 2017, and it will help to promote girl education around the world.

S5. Ans.(b)
Sol. Canara Bank, a public sector bank, has embarked upon an ambitious project of upgrading the bandwidth at all its branches to 2 Mbps in partnership with BSNL.

S6. Ans.(a)
Sol. National Payments Corporation of India (NPCI), the umbrella organization for all retail payment systems in the country, has disbursed over Rs. 245 crore worth of prize money to about 18 lakh winners under the NITI Aayog’s Lucky Draw schemes for consumers and merchants which are Lucky Grahak Yojna (LGY) and Digi-Dhan Vyapar Yojna (DVY).

S7. Ans.(d)
Sol. India has jumped 12 places to 40th rank globally in total 136 countries in Travel and Tourism Competitiveness report 2017 by World Economic Forum.

S8. Ans.(c)
Sol. Indian boxer K Shyam Kumar won a gold medal in the 49- kilogram category at the Thailand International Tournament. Bangkok is capital of Thailand

S9. Ans.(b)
Sol. India and Bangladesh have signed 22 agreements in strategic sectors like defense and civil nuclear cooperation during Bangladesh Prime Minister Sheikh Hasina's visit to India. Abdul Hamid is the President of Bangladesh.

S10. Ans.(e)

Sol. The National Basketball Association (NBA) announced the setting up of its first basketball school, a network of tuition-based basketball development programmes, in Mumbai.


QUIZ-09


Q1. UNESCO celebrates International Mother Language Day (IMLD) on 21 February every year. What was the theme of IMLD 2017?
Answer: Towards Sustainable Futures through Multilingual Education

Q2. Name the hospital that will provide medical support to forest department employees and local communities in the areas where WWF-India (World Wide Fund for Nature-India) operates for conservation.
Answer: Apollo Hospitals

Q3. Bharat QR code was launched recently to make retail e-payments more seamless and help India to get a step ahead towards Cashless Economy. Who launched Bharat QR code?
Answer: Shri R. Gandhi

Q4. Name the country that has committed to start initial deliveries of military helicopters to India in 2018 in order to an agreement signed in October 2016, to manufacture 200 of the KA-226T helicopters for the Indian Armed Forces.
Answer: Russia

Q5. The Ahmedabad-based Entrepreneurship Development Institute of India (EDII), an acknowledged national resource institute for entrepreneurship education, research, training and institution-building, has received the prestigious award for the year 2016-17 for the best overall presentation of its 2015-2016 annual report. Name of that award is _______________.
Answer: International Mercury Awards (IMA)

Q6. Tata Power Renewable Energy Ltd, a wholly-owned subsidiary of Tata Power, has synchronized its 15 MW solar plant in which of the following Indian States, recently?
Answer: Telangana

Q7. The ninth BRICS Summit will be held in China's Xiamen city from September 3 to 5, 2017. What is the theme of BRICS Summit 2017?
Answer: Stronger Partnership for a Brighter Future

Q8. The Centre and the state of Sikkim has signed a Memorandum of Understanding (MoU) under the Ujwal DISCOM Assurance Yojana (UDAY) for operational improvement of the state’s power distribution department, recently. Which of the following Indian State has joined UDAY Scheme for the first time?
Answer: Andhra Pradesh

Q9. Which state government have recently launched the country’s first sex offender’s registry which will contain all identification details of sex offenders and would be kept in public domain?
Answer: Kerala

Q10. India signed an agreement with Japan on enhancing railway safety in the Indian Railways with focus on railway track and rolling stock safety, recently. What is the name of central bank of Japan?
Answer: Bank of Japan

Q11. India has signed an agreement with Japan on enhancing railway safety in the Indian Railways with focus on railway track and rolling stock safety. Who is the present chairman of Railway Board?
Answer: AK Mittal

Q12. The Central Board of Excise and Customs (CBEC) has celebrated the Central Excise Day across the country on-
Answer: 24th February

Q13. Global payments network Visa has signed a memorandum of understanding (MoU) with the Andhra Pradesh government to help transform ____________ into India's first 'less cash' city.
Answer: Vishakhapatnam

Q14. Name the Nobel-winning economist, mathematician, who has passed away in USA recently?
Answer: Kenneth J Arrow

Q15. Which country has became Germany’s most important trading partner in 2016, overtaking the United States?
Answer: China