Saturday, 29 July 2017

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా..?


ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా..?














Why Did You Leave Your Last Job?..(గతంలో మీరు చేసిన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు..?).. 


        ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు చెప్పే సమాధానం పైనే... ఉద్యోగం రావడమా.. లేక వదిలేసుకోవడమా.. అనేది తేలుతుంది. యుద్ధంలో ప్రత్యర్థి వదిలిన తూటా వంటిది ఈ ప్రశ్న. దాన్ని ధీటుగా ఎదుర్కోకుంటే ఏం జరుగుతుందో ఇంటర్వ్యూలోనూ అదే పరిస్థితి.
ఇంటర్వూల్లో ఎక్కువ మందిని రిక్రూటర్స్ అడిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎలాసమాధానం చెప్పాలో తెలియక కొంతమంది, తెలిసినా చెప్పడానికి తడబడేవాళ్లు చాలామంది. కేవలం ఈ ఒక్క ప్రశ్నతో మీలో ఉండే ప్రతిభపాటవాలేంటో రిక్రూటర్స్ తేల్చివేయగలరట. ఎందుకంటే ఇదివరకు మీరు చేసిన జాబ్ నిజంగా నచ్చకవదిలేశారా..లేకపోతే మీ చేసిన పనులు కంపెనీకి నచ్చక వారే తీసేశారా..అనేది కేవలం ఈ ఒక్క ప్రశ్నలోనే దాగి ఉందట..మరి అలాంటి ప్రశ్నకు పదిరకాలుగా సమాధానాలు చెప్పవచ్చంటున్నారు. నిపుణులు అవేటంటే..
1. పాత కంపెనీలో చాలా అనుభవం గడించాను. ఇక అందులో కొత్తగా నేర్చుకోవడానికంటూ ఏమి మిగల్లేదు. కొత్త చాలెంజింగ్ కెరీర్ కోసం ప్రయత్నిస్తుండగా మీ కంపెనీ గురించి విన్నాను.
2. నేను పనిచేసిన పాత కంపెనీలో చాలా కష్టపడాను. కానీ, కెరీర్ పరంగా ఉన్నతంగా ఏమీ లేకపోయినా..నేను సర్దుకుపోయి పనిచేశాను..నాకిచ్చిన పనుల్ని పూర్తిచేశాను. ప్రస్తుతం కొత్త చాలెంజింగ్ కెరీర్ మొదలుపెట్టాలనుకుంటున్నాను.
3. నేను పనిచేసిన కంపెనీ, ప్రస్తుతం నా స్వబావానికి సరిపడటం లేదు. అందులో పనిచేయడం ఇష్టంలేకపోవడంతో నేను కొత్త కెరీర్ ప్రారంభించాలనుకుని, మీ కంపెనీని సంప్రదించాను.
4. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే నేను చేసిన పనులకు పేరు రావాలని కూడా కోరుకుంటాను. ఎంత కష్టపడిన అక్కడ నాకు తగినంత గుర్తింపు లభించలేదు.
5. నేను పనిచేసిన కంపెనీలో ఎన్నో అచీవ్‌మెంట్లు సాధించాను. ఇకపై అక్కడ చేయడానికి ఏమీ మిగల్లేదు. ఇదే సరైన సమయం అనుకుని ఆ కంపెనీ నుంచి బయటకు రావాలనుకున్నాను.
6. ఇన్ డోర్ మార్కెటింగ్ చేసేవాడిని. ఈ మధ్యనే నేను అవుట్‌డోర్ మార్కెటింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ, ఆ కంపెనీ వాటికి సంబంధించిన జాబ్స్ ఏమీ లేవు.
7. నా పాత కంపెనీ మొదలుపెట్టిన దగ్గరనుంచి నేను అందులో పనిచేశాను. దాని అభివృద్ధికి చాలా కాలం శ్రమించాను. ఇప్పుడు కొత్త పని అనుభవం కోసం మీ కంపెనీలో చేరాలనుకుంటున్నాను.
8. నేను ఇప్పటివరకు పనిచేసిన కంపెనీల్లో మీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కెరీర్ పరంగా నాకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను.
9. నేను పనిచేస్తున్న కంపెనీలో చాలా నష్టం రావడంతో అది త్వరలోనే ముసివేసే ప్రమాదముంది.
10. మీ కంపెనీ పనితీరు నచ్చడంతో మీ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాను

No comments:

Post a Comment