Showing posts with label అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం. Show all posts
Showing posts with label అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం. Show all posts

Sunday 30 July 2017

అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం


అర్హతలు ఎక్కువైనా ఆందోళన అనవసరం










                 కొన్ని సందర్భాల్లో జాబ్‌ మార్కెట్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మన అర్హతలకు సరిపోయే జాబ్‌ నోటిఫికేషన్లు అన్నివేళలా ఉండాలని ఏమి లేదు. ఒక్కోసారి అందుబాటులో ఉన్న అవకాశాలకు సంబంధించి అర్హతలపరంగా మనం ‘ఓవర్‌ క్వాలిఫైడ్‌’ కావచ్చు. అదే ప్రతికూలంగానూ మారొచ్చు. ఓవర్‌ క్వాలిఫైడ్‌ అంశం అనేది ఫ్రెషర్స్‌తోపాటు కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ వచ్చిన అనుభవజ్ఞులకూ సవాలుగా నిలుస్తుంది. అయితే ఈ అంశాన్ని నెగిటివ్‌గా కాకుండా స్ఫూర్తిగా తీసుకుంటే ఎన్నో అవకాశాలు ముంగిట నిలుస్తాయి. వచ్చే ప్రతి అవకాశాన్ని ఆశావహ దృక్ఫథంతో తీసుకుని ముందుకు సాగితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. ఓవర్‌ క్వాలిఫైడ్‌ అంశాన్ని జాబ్‌ సెర్చ్‌లో మన బలంగా చేసుకొని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. 

ఏదైనా జాబ్‌ వేకెన్సీ సంబంధించి వెలువడే నోటిఫికేషన్‌లోనే దానికి కావల్సిన అర్హత, నైపుణ్యాలను స్పష్టంగా పేర్కొంటారు. అందులో పేర్కొన్న అర్హత కంటే ఉన్నత స్థాయి డిగ్రీ మీ వద్ద ఉంటే ఓవర్‌ క్వాలిఫైడ్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక అనలిస్ట్‌ జాబ్‌కు బీఎస్సీని అర్హతగా పేర్కొంటే మీరు ఎంఎస్సీ చేసి ఉంటారు. అంత మాత్రన మీరు ఆ ఉద్యోగానికి అనర్హులు అని అర్థం కాదు. కాకపోతే రిక్రూట్‌మెంట్‌లో బీఎస్సీ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారని భావం. కాకపోతే స్కిల్స్‌ పరంగా ఎంప్లాయర్‌ను ఆకట్టుకుంటే జాబ్‌ మీ సొంతమవుతుంది. కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ వచ్చినా ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ పర్సన్‌ గతంలో తాము చేసిన దాని కంటే తక్కువ స్థాయిలో పని చేయాల్సిన అవసరం రావచ్చు. దీన్ని కూడా నేర్చుకోవడంలోనే భాగంగా భావించాలి. అంతేతప్ప నెగిటివ్‌గా ఫీల్‌ కాకూడదు.
నేరుగా వివరించాలి
జాబ్‌ సెర్చ్‌లో భాగంగా చాలా సంస్థలకు రెజ్యూమె పంపి స్తుంటారు. కానీ ఒక కాల్‌ కూడా రాదు. ఆరా తీస్తే ఆఫర్‌ చేస్తున్న జాబ్‌కు కావల్సిన అర్హతల కంటే మీరు ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావడమే అందుకు కారణంగా తెలుస్తుంది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎటువంటి ఉద్వేగాలకు లోనుకాకుండా సానుకూలంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ అంశాన్ని అధిగమించేందుకు మన ముందు ఉన్న మార్గాలను తెలుసుకోవాలి. ముందుగా ఎంప్లాయర్‌/రిక్రూటర్‌ లేదా హెచ్‌ఆర్‌ హెడ్‌ను ఫోన్‌ లేదా వ్యక్తిగతంగా కలిసి ఎదురవుతున్న సమస్యను వివరించండి. దాంతోపాటు మన ప్రతిభ సామర్థ్యాలను వివరించే ప్రయత్నం కూడా చేయాలి. అర్హత, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాలను చక్కగా ప్రెజెంట్‌ చేయాలి. మీ స్కిల్స్‌పై ఎంప్లాయర్‌కు ముందుగానే అవగాహన ఉంటుంది. దీంతో ఎంప్లాయర్‌ దృష్టిలో ఉంటారు. కాబట్టి ఏదైనా జాబ్‌ ఉంటే వెంటనే రెజ్యూమెతో నిమిత్తం లేకుండానే మీకు అవకాశం కల్పించవచ్చు. 
క్రియేట్‌ చేసుకోవాలి 
అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే వాటిని వెతుక్కుంటూ వెళ్లడం తెలివైన పని. ముందుగా ఏ రంగంలో ఎటువంటి పొజిషన్‌లో జాబ్‌ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన హోం వర్క్‌ చేయాలి. అదే క్రమంలో జాబ్‌ మార్కెట్లో ఉన్న అవకాశాలను ఒక్కసారి పరిశీలించండి.
వాటిని మీకు ఉన్న అర్హతతో బేరీజు వేసుకొండి. అందులోని కొన్ని జాబ్స్‌కు మీరు క్వాలిఫైడ్‌ కావచ్చు. అటువంటప్పుడు మీ అదనపు అర్హత సదరు జాబ్స్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో విశ్లేషించుకోవాలి. రెజ్యూమెలో మాత్రం ఆ విశ్లేషణకు చోటు ఇవ్వవద్దు. ఇంటర్వ్యూ సమయంలో మీ అదనపు అర్హత వల్ల ఎంప్లాయర్‌ ఏవిధంగా లాభపడగలరో వివరించాలి. తద్వారా మీరు ఓవర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ అవకాశం లభించవచ్చు.
అప్‌ డేట్‌ రెజ్యూమె 
ప్రస్తుతం ఎటువంటి జాబ్‌కు అప్లయి చేయాలన్నా రెజ్యూమె తప్పనిసరి. కాబట్టి రెజ్యూమెను కొంత వరకు అప్‌డేట్‌ చేసుకోవడం కూడా కీలకమే. ఈ క్రమంలో మన వ్యక్తిగత సమాచారాన్ని కొంత వరకు తగ్గించుకోవాలి. ఆఫర్‌ చేస్తున్న జాబ్‌కు సరిపోయేలా రెజ్యూమెను స్మార్ట్‌గా రూపొందించుకోవాలి. అర్హతల నుంచి స్కిల్స్‌ వరకు రెజ్యూమెను మరోసారి రీ రైట్‌ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ పదాల్లో ముగించే ప్రయత్నం చేయాలి. అదనపు అర్హతల విషయాన్ని చివర్లో నామమాత్రంగా ప్రస్తావించాలి. రెజ్యూమె అప్‌ డేట్‌/రీ రైట్‌ అనేది ఒక్కోసారి మన వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు ప్రొఫెషనల్‌ రెజ్యూమె రైటర్స్‌ సహాయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
బీ జెన్యూన్‌ 
ఓవర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ..ఒక్కోసారి ఇంటర్వ్యూ కాల్‌ రావచ్చు. ఇంటర్వ్యూలో ఎంప్లాయర్‌కు మీ అదనపు అర్హతలపై పలు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో అదనపు అర్హత ఆ సంస్థకు ఏవిధంగా ఉపయోగపడగలదో ఎంప్లాయర్‌కు ఆకట్టుకునేలా వివిధ రకాల విశ్లేషణలతో వివరించే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావడం వల్ల అవకాశాలు లభించడం కష్టంగా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎంప్లాయర్స్‌ మిమ్మల్ని తక్కువ పేప్యాకేజ్‌కే రిక్రూట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
కాబట్టి ఆర్థిక అవసరాలు, తప్పనిసరి పరిస్థితుల్లో జాబ్‌కు అప్లయ్‌ చేశాడు అనే భావన కలగకుండా జాగ్రత్త పడాలి. జాబ్‌ పట్ల ఆసక్తి ఉన్న జెన్యూన్‌ అభ్యర్థిగా కనిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఆఫర్‌ చేస్తున్న వేతనం మీ అర్హతకు తక్కువ అనే భావన కలుగుతోందా? అనే ప్రశ్న ఎంప్లాయర్‌ నుంచి రావచ్చు. కాబట్టి అటువంటి ప్రశ్నలకు సానుకూల దృక్ఫథంతో స్మార్ట్‌గా సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. ‘నేను ఓవర్‌ క్వాలిఫైడ్‌ కావచ్చు. కాకపోతే నేర్చుకోవడంలో మాత్రం ఓవర్‌ క్వాలిఫై కాదు, నేర్చుకోవడానికి నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి దీన్ని మంచి అవకాశంగా భావిస్తాను’ అనే తరహాలో సమాధానం ఇవ్వాలి.