ఇంటర్వ్యూ.. నాలెడ్జ్ టెస్ట్ కాదు
ఇంటర్వ్యూ.. నాలెడ్జ్ టెస్ట్ కాదు
చందేరి-పోచంపల్లి చీరల మధ్య వ్యత్యాసం ఏమిటి.
మీరు ఆంగ్ల దినపత్రికలో రిపోర్టరుగా పని చేశారా, అయితే పత్రికల్లో రిపోర్టింగ్ ఎలా ఉంటుంది.
‘శక్తిమాన్’ అనే అశ్వం గాయపడి మరణించింది - తెలుసు కదా, మరి లా అండ్ అర్డర్ విధుల్లో గుర్రాలను ఉపయోగించవచ్చంటారా
జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ..... ఓషో ఫిలాసఫీ.... మావోయిజం.... పర్యావరణ సమస్యలపై మీ అభిప్రాయం ఏమిటి.
ఈ ప్రశ్నలను చూసి ఇవన్నీ ఏవో టీవీ షోలోనో లేకుంటే ఏ పత్రికా విలేకరులో అడిగినవో అనుకుం టున్నారా!..... కానే కాదు. సివిల్ సర్వీసెస్ ఇంట ర్వ్యూల్లో తెలుగు అభ్యర్థులు కొన్నేళ్ళుగా ఎదుర్కొన్న కొన్నిప్రశ్నలు ఇవి.
పబ్లిక్ సర్వీ్‌సకు అభ్యర్థి వ్యక్తిగతంగా ఏ మేరకు సూటవుతారన్నది తేల్చడమే సివిల్స్ ఇంటర్వూ లక్ష్యం. నిష్పాక్షికతకు తోడు సమర్థులు ఇంటర్వ్యూ బోర్డులో ఉంటారు. అభ్యర్థి మేధో లక్షణాలను పరిశీలించేందుకు ఈ ఇంటర్వ్యూను ఉద్దేశించలేదు. కరెంట్ అఫైర్స్‌పై అభ్యర్థికి ఉన్న ఆసక్తి, సామాజిక లక్షణాలను మాత్రమే పరిశీలిస్తారు.
ఇంటర్వ్యూలో భాగంగా పరిశీలించే లక్షణాలు:
అందర్నీ కలుపుకొని వెళ్ళే శక్తియుక్తులు స్పష్టత, తార్కికత జడ్జిమెంట్‌లో సమతుల్యత వైవిధ్యం, ఆసక్తులపై లోతైన చర్చ. నాయకత్వ సామర్థ్యం, సామాజిక సంబంధాలు మేథో, నైతిక సమగ్రత
ఇంటర్వ్యూకు సంబంధించి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. యూపీఎస్సీ నోటిఫికేషన్‌ను సునిశితంగా పరిశీలిస్తే అభ్యర్థులో ఆయా లక్షణాలను ఆశిస్తోందని తేటతెల్లమవుతుంది. ఇంటర్వ్యూ యావత్తు మీకు సంబంధిం చే. అంతే తప్ప మీకు తెలిసిన సమాచారంపై కాదన్నది గ్రహించాలి. అభ్యర్థి తనకున్న విలువలు, ఆలోచనలు తదితరాలన్నీ ఈ ఇంటర్వూలో వెల్లడి చేయగలగాలి. అదంతా తార్కికంగా, ఇంటర్వ్యూ బోర్డును ఒప్పించే విధంగా జరగాలి. ఈ జాబ్‌కు నేను అర్హుడిని అని రుజువు చేయాలి. ఏ అభ్యర్థినీ తక్కువ చేయాలన్న యోచనలో బోర్డు మెంబర్లు ఎవ్వరూ ఉండరు. ప్రతి అభ్యర్థికీ కనీసం 150 మార్కులు ఇచ్చే మూడ్ లో వారు ఇంటర్వ్యూని ఆరంభిస్తారు. అంతకు మించి లేదంటే తగ్గించి మార్కులు పడటం అన్నది అంతా అభ్యర్థి వ్యక్తిగత పర్ఫార్మెన్స్‌పైనే ఉంటుంది. మీవైన లక్షణాలను వ్యక్తం జేసే సదవకాశాన్ని బోర్డు తప్పకుండా ప్రతి అభ్యర్థికి ఇస్తుంది. అవంటూ మీకుంటే సర్వీసు రాకుండా ఎవరూ అడ్డగించలేరన్నది వాస్తవం.
సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఏయే లక్షణాలను పరీక్షిస్తున్నారో తెలుసుకునేందుకు కొన్ని పరిణామాలను తీసుకుని పరిశీలిద్దాం.
గత ఏడాది ఇంటర్వ్యూలో జె.స్నేహజ అనే అభ్యర్థి 206 మార్కులు పొందారు. ఇంటర్వ్యూలో వివిధ అభ్యర్థులు సాధించిన మార్కులను పరిశీలిస్తే ఆమె రెండో స్థానంలో ఉన్నారు. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్. ఆమెను అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే..
ప్రశ్న: సత్యం స్కామ్‌పై నీ అభిప్రాయం ఏమిటి?
- సబ్జెక్టుపై ఆమె ఆసక్తి ఏ మేర లోతైనదో, - ఇష్యూని ఏ రూపంలో ఆమె సపోర్ట్ చేస్తారో, - సమస్యను పరిష్కరించడంలో ఆమెకు ఉన్న సమతుల్యత
పాఠ్యపుస్తక దృక్పథంతో సత్యం స్కామ్‌ను విశ్లేషించిన పక్షంలో బోర్డును ఆమె సంతృప్తిపర్చ లేకపోయేవారు. ఈ విషయంలో ఆమె తన సొంత అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా సబ్జెక్టుపై ఆసక్తిని ప్రదర్శించగలిగారు. అదే సమయంలో భారతదేశంలో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరగుపర్చేందుకు కొన్ని సూచనలూ చేశారు.
రూల్ నెం 1: కేవలం సమాధానం ఇస్తే సరిపోదు. మీకు మీరుగా ప్రజంట్ అవ్వాలి. పర్సనాలిటీలో సానుకూల లక్షణాలు ప్రతిబింబించాలి.
రిషాంతరెడ్డి అనే మరో అభ్యర్థి ఇంటర్వ్యూను కూడా ప్రస్తావించుకుందాం. ఇంటర్వ్యూలో అతనికి 204 మార్కులు లభించాయి. మొదటి సారి అతనికి 162 మార్కులే లభించాయి. ఈ తేడాపై ప్రశ్నిస్తే రెండోసారి ఇంటర్వ్యూ లాజిక్‌ను అర్థం చేసుకోగలిగినట్లు రిషాంత తెలిపారు. తనేమిటో వ్యక్తం అయ్యే విధం గా అడిగే ప్రశ్న కోసం ఎదురుచూశారు. నిరూపించుకున్నారు.
రూల్ నెం.2: బోర్డు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిరునవ్వుతో ‘నో’ చెప్పి సౌకర్యంగా ఉండండి. ఒక ఇష్యూపై మీ అభిప్రాయం చెప్పే అవకాశం అక్కడ ఇస్తున్నారు. లేదంటే ఒక సందర్భాన్ని విడమర్చి మీ స్పందన తెలుసుకుంటున్నారు. అందువల్ల అవకాశాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. బౌండరీని తాకేలా ఆడుకోండి.
ఇక్కడే ఎంపిక కాని మరికొంత మంది అభ్యర్థులు చేసిన తప్పులను పరిశీలిద్దాం. వారి పేర్లు మనకొద్దు
బి అనే అభ్యర్థి ఫైనార్ట్స్‌లో పీజీ చేశారు. ప్రతి ప్రశ్నకు ఆమె చక్కగా జవాబు చెప్పారు. ఆమె కూడా 165 మార్కులే పొందారు. సి అనే అభ్యర్థిని నాగా సమస్యపై అభిప్రాయం అడిగారు. తనకా సమస్య తెలియదని చెప్పారు.
ఎ అనే విద్యార్థి ఎందుకు తప్పారంటే ఫ్యాక్ట్స్‌తో కూడిన ప్రశ్నలకు జవాబు చెప్పిన తరవాత నెర్వ్‌సగా ఫీలయ్యారు. ఇంటర్వ్యూ సగంలో ఉన్న సమయంలో తనకు తాను ఎవాల్యుయేట్ చేసుకున్నారు. దాంతో ఫోకస్ కోల్పోయి, వ్యక్తిగత లక్షణాలను వ్యక్తం చేయలేకపోయారు.
బి పాఠ్యపుస్తకాల్లో ఉండే జవాబులు చెప్పారు. అవి సొంతం కావని, రీప్రొడక్షన్ అని బోర్డు ఇట్టే పసిగట్టింది.
సి అనే అభ్యర్థికి వాస్తవిక సమాచారంతో కూడిన ప్రశ్నలు అడగలేదు. తనని అభిప్రాయం మాత్రమే అడిగారు. అభ్యర్థి కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు. అయితే సమస్యపై జడ్జిమెంట్‌లో బ్యాలెన్స్ , తార్కిక అవగాహన లోపించింది.
రూల్ నెం 3: ఇంటర్వ్యూ మధ్యలో ఎవాల్యుయేషన్ మంచిది కాదు. మొత్తం ఫోకస్ బోర్డుపైనే ఉండాలి.
రూల్ నెం 4: ఆసక్తి లేని వర్ణన కూడదు. హాబీస్ నుంచి దూరంగా జరిగారు. అక్కడ ఆ నిర్ణయానికి ఎలా వచ్చావన్నది ముఖ్యం. మీరు కరెక్ట్ అని భావించిన మార్గంలో వెళ్ళేందుకు బోర్డు అనుమతిస్తుంది.
వీటన్నింటినీ క్షుణ్ణంగా చూసినప్పుడు ఒక విషయం అవగతమవుతుంది. అభ్యర్థికి ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని బోర్డు పరీక్షిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నాలెడ్జ్ పరీక్ష అప్పటికే పూర్తయింది. అందువల్ల మీ మెయిన్స్ పర్‌ఫార్మెన్స్ బాగుంటే సర్వీస్ దక్కుతుంది. ఇంటర్వ్యూలో పర్‌ఫార్మెన్స్ సర్వీ్‌సను నిర్ణయిస్తుంది. ఐఎఎస్ కావాలని అనుకుంటే ఇంటర్వ్యూలోనూ స్కోర్ చాలా అవసరం. ఐఎఎ్‌సకు ఎంపికైన తరవాత కేడర్ కూడా ఇంటర్వ్యూ స్కోర్‌పైనే అధారపడి ఉంటుంది.
ఝ ‘మే ఐ కమిన’ అని లోపలికి వెళ్ళి సభ్యులందరినీ విష్ చేయాలి. సభ్యుల అనుమతి తీసుకుని కూర్చోవాలి. మహిళా సభ్యురాలు బోర్డులో ఉంటే, ముందు ఆమెకు విష్ చేయాలి. తరవాత మిగిలిన పురుష సభ్యులందరికీ కలిపి విష్ చేయవచ్చు. లేడీస్ ఫస్ట్ అన్న విషయాన్ని మన్నించాలి. బోర్డ్ ఛైర్ పర్సన, సభ్యుల మధ్య తేడా మాత్రం చూపించవద్దు.
అభ్యర్థుల్లో చూసే లక్షణాలు
నిజాయతీ, ఇంటెగ్రిటీ
నిబద్ధత, సిన్సియారిటీ బాధ్యతలను తీసుకునేందుకు సంసిద్ధత మైండ్ అలర్ట్‌నెస్ - పరిస్థితికి తగ్గట్టు షార్ప్‌గా స్పందించే గుణం విశ్లేషణ సామర్థ్యం - ఒక విషయంలోని కీలక మైన పాయింట్‌ని ఎంత త్వరగా పట్టుకోగలరు ఆర్టిక్యులేషన సామర్థ్యాలు ఆలోచనలో స్పష్టత పరిశీలన సామర్థ్యాలు పరిసరాలపై ఏ మేరకు ఆసక్తి ఉంది ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళను ఊహించగలగడం
బిహేవియర్ ఎలా ఉండాలంటే...
ప్రశ్న పూర్తికాకుండానే సమాధానం చెప్పే పని చేయవద్దు. మంచి లిజనర్‌గా ఉండాలి. ముందు ప్రశ్నను సరిగ్గా వినండి, అర్థం చేసుకోండి. అందుకు కొద్దిగా సమయం తీసుకోండి. బోర్డు సభ్యులు అడగకుండానే మీ రికార్డులు తదితరాలు చూపెట్టే ప్రయత్నం చేయవద్దు. మహిళా అభ్యర్థులు చీర కట్టుకోవడం అభిలష ణీయం. లైట్ కలర్‌ఫుల్ స్లీవ్ షర్ట్, టైతో పురుషులు వెళితే బాగుంటుంది. ఏ దుస్తులు ధరించినా హుందాగా ఉండేలా చూసుకోవాలి. కూర్చున్న తీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కనబరిచేలా ఉండాలి. ఎడ్జ్‌పై కాకుండా సీటు బ్యాక్ ఆనుకునేలా కూర్చోండి. క్రాస్ లెగ్స్‌తో కూర్చోవడాన్ని ఆశించరు. చేతులను కొంత వరకు అటూ ఇటూ ఆడించవచ్చు. ఇంటర్వూ చివర్లో థాంక్యూ అని చెప్పి రావాలి. బాగా జాప్యం కలగలిసి సాయంత్రం ఇంటర్వ్యూ జరిగితే గుడ్ ఈవెనింగ్ చెప్పి రావాలి.సివిల్స్ ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్వూ బోర్డ్‌లోని సభ్యులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, అందుకు అభ్యరులు ఎలా సన్నద్ధం కావాలో తెలియ జేస్తూ ఢిల్లీ, హైదరా బాద్‌ల్లోని ప్రముఖ సివిల్స్ కోచింగ్ సంస్థ ‘లా ఎక్స్‌లెన్స ఐఎఎస్’ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ‘దిక్సూచి’కి ప్రత్యేకంగా రాసిన కథనం. మానసిక సంసిద్ధత ముందసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి సిఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. ఈ ప్రశ్న ఆమె విద్యానేపథ్యం నుంచి అడిగినది. దీనిని బోర్డు అడగడంలో ఉద్దేశం... ఎ అనే అభ్యర్థి విద్యా నేపథ్యం చాలా గొప్పగా ఉంది. ఐఐటి బ్యాక్‌గ్రౌండ్. కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 165
రూమ్‌లోకి ఎంటర్ కాగానే...
సహానుభూతి, కంపాషన సభ్యులతో ‘ఐ కాంటాక్ట్’ పెట్టుకోవాలి. అంతే తప్ప ఏదీ షేర్ చేసుకోరాదు.
No comments:
Post a Comment