ఇవి తెలిస్తే ఇంటర్వ్యూ తేలికే!
మీ గురించి చెప్పండి?
ఇక్కడ ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?
మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు?
మీ బలహీనతలేంటి?
ఐదేళ్ల తరువాత మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారు?
ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవడానికి మార్కెట్లో అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా అవసరమైన టెక్నిక్స్‌ను నేర్చుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో సులభంగా సక్సె్‌సకావచ్చు. అవే ఎ.బి.సి.డి.ఇ.
ఎ - ఆటిట్యూడ్ ఆఫ్ పాజిటివిటి : పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అంతా మంచే జరుగుతుందని అనుకుంటే మంచే జరుగుతుంది. ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’ అనే సామెత తెలుసు కదా. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు వెళ్లే మార్గంలో ఎన్నో అడ్డంకులుంటాయి. వాటన్నింటిని అధిగమిస్తేనే విజయం మీ సొంతమవుతుంది. పౌలో చెప్పినట్టుగా ఏదైనా కావాలని మీరు బలంగా కోరుకున్నట్లయితే అది మీకు దక్కడానికి ప్రపంచమంతా మీకు సహాయపడుతుంది. పుస్తకాలు చదవడం ద్వారా కూడా పాజిటివ్ థింకింగ్‌ను పెంచుకోవచ్చు. పాజిటివ్‌గా ఉంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది.
బి - బుకిష్ నో హౌ : జ్ఞానం చాలా శక్తివంతమైంది. ఇంటర్వ్యూని విజయవంతంగా పూర్తి చేయాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. ఇందుకోసం పుస్తకాలు చదవాలి. లైబ్రరీలకు వెళ్లాలి. ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడాలి. మీరు ఏరంగంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రంగంపై అవగాహన పెంచుకోవాలి.
సి - కాంపిటెన్సీస్ : స్కిల్స్ పెంచుకోవడానికి టెక్నిక్స్ నేర్చుకోవాలి. కన్వర్జేషన్ స్మూత్‌గా సాగడానికి, ఎఫెక్టివిగా వినడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి స్కిల్స్ చాలా అవసరం. విద్యార్థులు ఇంటర్వ్యూను కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొవాలంటే అవసరమైన ట్రెయినింగ్ తీసుకోవడం, టెక్నిక్స్ నేర్చుకోవడం మంచిది.
డి - డ్రీమ్ : ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలో ప్రయత్నిస్తారు. అందుకే ఐదేళ్ల తరువాత మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారని అడుగుతారు. గొప్ప గొప్ప పనులు పూర్తి చేయాలంటే కలలు కూడా కనాలి. ప్లానింగ్ ఒక్కటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి.
No comments:
Post a Comment