Showing posts with label రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు. Show all posts
Showing posts with label రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు. Show all posts

Tuesday 1 August 2017

రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు

రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు













       సివి(కరికులమ్‌ వీటే)..జాబ్‌ సెర్చ్‌లో ప్రొఫెషనల్‌ అప్రోచ్‌కు ప్రతిరూపం. అచీవ్‌మెంట్స్‌, ఫ్యూచర్‌ గోల్స్‌ వంటి అంశాల ఆధారంగా పాజిటివ్‌ యాంగిల్‌లో మనల్ని మనం ప్రజెంట్‌ చేసుకోవడానికి దోహదపడే కీలకమైన డాక్యుమెంట్‌. అటువంటి సివిలో రిక్రూటర్లను ఆకట్టుకునే అంశాలు ఏమిటి? వేటిని క్రాస్‌చెక్‌ చేసుకుంటారు? అసలు సివిని మొదట చూడగానే వారు ఏయే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు?
వ్యక్తిగత నైపుణ్యాలు, అర్హతలు, సాధించిన విజయాలు వంటి వాటిని సంక్షిప్తంగా ఆసక్తితో, ఆకట్టుకునేలా రీడర్‌ ఫ్రెండ్లీగా సివిని రూపొందించుకోవాలి. ఈ విషయంలో కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
 
స్కిల్‌-టాలెంట్‌
రిక్రూటర్లు ముందుగా సివిలోని స్కిల్‌, టాలెంట్‌ కాలమ్‌ను పరిశీలిస్తారు. అయితే చాలామంది జాబ్‌ సీకర్స్‌ నైపుణ్యాలు (స్కిల్స్‌), ప్రతిభ (టాలెంట్‌) రెండిటినీ ఒకటే అంశంగా సివిలో పేర్కొంటారు. కానీ, ఇక్కడ గమనించాల్సింది ఇవి రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు జావా/ హెచ్‌టిఎంఎల్‌/సిఎ్‌సఎస్‌ లాంగ్వేజె్‌సలో ప్రావీణ్యం ఉండటాన్ని నైపుణ్యంగా భావిస్తారు. ఈ లాంగ్వేజె్‌సను ఉపయోగించి ప్రోగ్రామ్స్‌ లేదా కోడ్స్‌ రాసే సామర్థ్యాన్ని ప్రతిభ (టాలెంట్‌)గా పరిగణిస్తారు. ఉద్యోగ నిర్వహణలో కీలకమైన ఇటువంటి అంశాలకు రిక్రూటర్లు చాలా ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి స్కిల్‌, టాలెంట్‌ రెంటిని మిక్స్‌ చేయకుండా వేర్వేరుగా సివిలో ప్రజెంట్‌ చేయాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని 2-3 లైన్లలో సంక్షిప్తంగా విడివిడిగా వివరించాలి. అంతేగానీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సుదీర్ఘ పేరాగ్రా్‌ఫలతో సివిని రూపొందించడం సరికాదు. రిక్రూటర్లు అంతా లెంథీ సమాచారాన్ని చదవడానికి అంతగా ఆసక్తి చూపించరు.
 
గ్యాప్‌..సాధారణమే
అనుభవం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ సందర్భంగా పేర్కొంటున్న సంవత్సరాలన్నీ వరుస క్రమంలో ఎటువంటి గ్యాప్‌లు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా గ్యాప్‌ ఉంటే ఆ విషయాన్ని, అందుకు గల కారణాన్ని వివరించాలి. గ్యాప్‌ విషయంలో స్పష్టతతో లేకపోతే దాని ప్రభావం నెగిటివ్‌గా ఉంటుంది. సొంతంగా బిజినెస్‌ చేయడం, ఉన్నత చదువులు తదితర కారణాలతో ప్రస్తుతం చాలా మంది కెరీర్‌ మధ్యలో బ్రేక్‌ తీసుకుంటున్నారు. దీంతో ఎక్స్‌పీరియెన్స్‌ కాలమ్‌లో గ్యాప్‌ వస్తుంది. కాబట్టి ఆ గ్యాప్‌ ఎందుకు వచ్చింది, దాని గల కారణాలను సవివరంగా పేర్కొనాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు కెరీర్‌ గ్యాప్‌ను సాధారణ అంశంగానే భావిస్తున్నాయి. కాబట్టి నెగిటివ్‌ ఇంప్రెషన్‌ క్రియేట్‌ అవుతుందనే ఉద్దేశంతో కెరీర్‌ గ్యాప్‌ను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు.
 
ఫ్యాక్ట్స్‌ను ఒక్కటి రెండుసార్లు
సివి అనేది ప్రొఫెషనల్‌ అప్రోచ్‌కు ప్రతిరూపం వంటిది. కాబట్టి ఫ్యాక్ట్స్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. స్కూలింగ్‌, కాలేజ్‌, స్కిల్స్‌, ఎక్స్‌పీరియెన్స్‌, అచీవ్‌మెంట్స్‌ వంటి అంశాలు ఎర్రర్‌ ప్రూఫ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీటి ఆధారంగానే జాబ్‌ రెస్పాన్స్‌బిలిటీస్‌ అప్పగిస్తారు. సివిలో ఫ్యాక్ట్స్‌కు అనుగుణంగా సామర్థ్యం లేకపోవడం కెరీర్‌ పరంగా రెడ్‌ సిగ్నల్‌ వంటిది.
 
క్రమానుసారంగా
అచీవ్‌మెంట్స్‌..చాలా కీలకమైనవి. విద్యార్థి లేదా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను సివిలో కాలక్రమానుసారం క్రమపద్ధతిలో పేర్కొనాలి. కానీ చాలామంది ఎటువంటి టైమ్‌లైన్‌ను ఫాలో కాకుండా అడ్డదిడ్డంగా అచీవ్‌మెంట్స్‌ను మిక్స్‌ చేస్తుంటారు. అలా కాకుండా కాలక్రమానుసారంగా అచీవ్‌మెంట్‌, సమయం, దానివల్ల ఏర్పడిన ప్రభావం వంటి అంశాలను విపులంగా వివరించాలి. రిక్రూటర్లకు ఈ అంశమే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది.
 
సోషల్‌ నెట్‌వర్కింగ్‌
చాలామంది రిక్రూటర్లు ఇంటర్య్వూ కంటే ముందు జాబ్‌ సీకర్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందుకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ను ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను జాబ్‌సెర్చ్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. జాబ్‌/ఇండస్ర్టీకి సంబంధించిన కీవర్డ్స్‌ ప్రొఫైల్‌ హెడ్డింగ్‌లో ఉండేలా చూసుకోవాలి. సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ న్యూస్‌, అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఉండాలి. తద్వారా రిక్రూటర్లు ఒక నిర్ణయానికి రావడానికి కావల్సిన రైట్‌ రిఫరెన్స్‌ లభించినట్లవుతుంది.
 
బ్యాడ్‌ రిఫరెన్స్‌
చాలా మంది జాబ్‌ సీకర్స్‌ రిఫరెన్స్‌ను కూడా షేర్‌ చేస్తుంటారు. ఎంతో కీలకమైన రిఫరెన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిని క్రాస్‌ చెక్‌ చేసినప్పుడు రిఫర్‌ చేసిన వ్యక్తి సరిగ్గా స్పందించకపోతే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ క్రియేట్‌ అవుతుంది. అంతేకాకుండా రిక్రూటర్లు రిఫరెన్స్‌ను తప్పకుండా క్రాస్‌ చెక్‌ చేసుకుంటారు. కాబట్టి బాగా తెలిసి, ఫోన్‌ చేయగానే చురుగ్గా స్పందించే వ్యక్తి నుంచి మాత్రమే రిఫరెన్స్‌ తీసుకోవడం ప్రయోజనకరం. రిఫరెన్స్‌ అవసరం అనే ఉద్దేశంతో ఏదో ఒకటి షేర్‌ చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
 
ఓకే కానీ..పరిధిని దాటొద్దు
ఆకర్షణీయమైన నమూనా (టెంప్లేట్‌)లో అందమైన, అర్ధవంతమైన పదాలతో చూడగానే ఆకట్టుకునే విధంగా సివిని రూపొందించడం ప్రయోజనకరమే. రిక్రూటర్లు వారానికి కొన్ని వందల సంఖ్యల్లో సివి, రెజ్యూమెలను పరిశీలిస్తుంటారు. వాటిలో ఏ రెజ్యూమె ఏ నమూనా (టెంప్లేట్‌)లో ఉందో చెప్పడం రిక్రూటర్లకు కూడా కష్టమే. కాబట్టి టెంప్లేట్‌ వంటి అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక నమూనాలో పరిధి మేరకు సింపుల్‌గా చదవడానికి సౌకర్యవంతంగా ఉండేలా సివి రూపొందించుకోవాలి.
  • స్కిల్‌, టాలెంట్‌ రెంటిని మిక్స్‌ చేయకుండా వేర్వేరుగా సివిలో ప్రజెంట్‌ చేయాలి.
  • విద్యార్థి లేదా ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలను సివిలో కాలక్రమానుసారం క్రమపద్ధతిలో పేర్కొనాలి.
  • ఒక నమూనాలో పరిధి మేరకు సింపుల్‌గా చదవడానికి సౌకర్యవంతంగా ఉండేలా సివి రూపొందించుకోవాలి. అంతేకానీ పిక్చర్స్‌, డిజైన్స్‌ వంటి వాటితో సివిని అడ్డదిడ్డంగా రూపొందించడం సమంజసం కాదు