Thursday, 17 August 2017

హిడెన్‌ జాబ్స్‌ను సెర్చ్‌ చేయండిలా..



హిడెన్‌ జాబ్స్‌ను సెర్చ్‌ చేయండిలా..














            ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే ఏ కంపెనీ అయినా ఏమి చేస్తుంది. నోటిఫికేషన్‌ జారీ చేయడం, దరఖాస్తులు స్వీకరించడం, ఇంటర్వ్యూ/రాత పరీక్ష నిర్వహించడం వంటి విధానాలను అనుసరిస్తుంది. ఇది అందరూ అనుసరించే సంప్రదాయ పద్ధతి. కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్‌ క్రమంగా తగ్గుతోంది.
 
కారణలేమైనా నోటిఫికేషన్స్‌ను వెలువరించకుండా రిఫరెన్స్‌, జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక జాబ్‌ సీకర్‌ ‘హిడెన్‌ జాబ్స్‌/అన్‌లిస్టెడ్‌ జాబ్స్‌’ను ఏ విధంగా సెర్చ్‌ చేయాలి. అందుకు ఏయే మార్గాలు అనుసరించాలో చూద్దాం..
ఒక కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే దాన్ని నోటిఫికేషన్‌ను జారీ చేసి నిర్దేశిత రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ విధానాల్లో భర్తీ చేస్తారు. ఇటువంటి జాబ్స్‌ను హిడెన్‌ జాబ్స్‌ లేదా అన్‌లిస్టెడ్‌ జాబ్స్‌గా పేర్కొంటారు. ఒక అంచనా మేరకు దాదాపుగా 60 నుంచి 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు ఎటువంటి ప్రకటన లేకుండానే ఈ విధానంలో భర్తీ అవుతున్నాయి.
 
నెట్‌వర్కింగ్‌
ఇటువంటి హిడెన్‌ జాబ్స్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడే కీలకమైన సాధనం నెట్‌వర్కింగ్‌. అంటే పరిచయాలను పెంచుకోవాలి. వాటిని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ముందుగా మన ప్రొఫైల్‌ను అనుసరించి సంబంధిత రంగంలోని ప్రొఫెషనల్స్‌తో పరిచయాలు పెంచుకోవాలి. ఈ క్రమంలో నిజాయితీగా వ్యవహరించాలి. ఈ పరిచయాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. కేవలం జాబ్‌ లేదా అవసరమైన సందర్భంలోనే కాకుండా ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సందర్భంలో మీరు జాబ్‌ పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారనే విషయం వారికి తెలిసేలా నడుచుకోవాలి. తద్వారా ఒక రకమైన సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వారి దృష్టిలో ఏదైనా అవకాశం ఉంటే ముందు మీ పేరే స్ఫురణలోకి వస్తుంది.
 
రెజ్యూమె సబ్మిషన్‌
కొన్ని కంపెనీలు అభ్యర్థులు నేరుగా రెజ్యూమెను సబ్మిట్‌ చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి ముందుగా మీ ప్రొఫైల్‌కు సరిపడే కంపెనీలను లిస్టవుట్‌ చేసుకోవాలి. తరవాత ఆయా కంపెనీల రిక్రూట్‌మెంట్‌ మేనేజర్ల సమాచారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు వారిని ఉద్దేశిస్తూ నేరుగా కవర్‌ లెటర్‌తో కూడిన రెజ్యూమెను ఫార్వర్డ్‌ చేయాలి. అయితే ఇటువంటి కంపెనీలు ఎటిఎస్‌ (అప్లికెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌) ద్వారా రెజ్యూమెలను షార్ట్‌లిస్ట్‌ చేస్తుంటాయి. కాబట్టి రెజ్యూమెలోని పదాలు, ఎటిఎస్‌ విధానానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
మేనేజర్‌తో నేరుగా
ఒక్కోసారి మేనేజర్లను నేరుగా కలవడం ద్వారా కూడా హిడెన్‌ జాబ్స్‌ను దక్కించుకోవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా మన ప్రొఫైల్‌కు సరిపడే కంపెనీల హెచ్‌ఆర్‌/రిక్రూట్‌మెంట్‌ మేనేజర్ల సమాచారాన్ని పొందొచ్చు. తరవాత ఈ-మెయిల్‌ లేదా ఇతర మార్గాల ద్వారా వారిని కలుసుకునేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. వారిని కలిసినప్పుడు మన సామర్థ్యాలు అంటే..అర్హత, అనుభవం, నైపుణ్యాలు వంటి వాటిని ప్రభావవంతంగా వివరించాలి. తద్వారా మనపై ఒక పాజిటివ్‌ ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది. కంపెనీలో ఏదైనా అవకాశం ఉంటే ముందే మన పేరే స్ఫురణకు రావచ్చు. అంతేకాకుండా ఏదైనా అవకాశం ఉంటే రిఫర్‌ చేయమని కూడా రిక్వెస్ట్‌ చేయవచ్చు. కాబట్టి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్స్‌, సోషల్‌ మీడియా ద్వారా నిత్యం టచ్‌లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా ఇచ్చే సలహాలు, సూచలనలకు మీరు ఎంత విలువ ఇస్తున్నారో వారికి తెలిసేలా వ్యవహరించాలి. తద్వారా అవకాశాలు మెరుగవుతాయి.
 
జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌
జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవడం మరో మార్గం. కొన్ని కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఇటువంటి వెబ్‌సైట్స్‌ సహాయం తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవడం ప్రయోజనకరం. ఎందుకంటే ఏవైనా నియామకాలు చేపట్టాలనుకుంటే జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్‌లోని డేటా బేస్‌ ఆధారంగా జాబ్‌ సీకర్స్‌కు నేరుగా రిక్రూటర్లు కాల్‌ చేస్తుంటారు. కాబట్టి అర్హతలు, అనుభవం, నైపుణ్యాలు, వంటి అంశాల ఆధారంగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. కొన్ని కంపెనీలు సోషల్‌ మీడియా ద్వారా అప్లికేషన్స్‌ పరిశీలించి అభ్యర్థులకు నేరుగా కాల్‌ చేస్తుంటాయి. కాబట్టి సోషల్‌ మీడియాలో కూడా పాజిటివ్‌ ప్రొఫైల్‌ను మెయింటైన్‌ చేయాలి.
 
రిఫరెన్స్‌
హిడెన్‌ జాబ్స్‌ విషయంలో ప్రభావవంతంగా పని చేసేవి రిఫరెన్స్‌. చాలా మంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు మాజీ ఉద్యోగులు, గతంలో తమతో కలిసి పని చేసిన వారికి అవకాశం కల్పిస్తుంటారు. అంతేకాకుండా సంస్థలోని ఉద్యోగుల రిఫరెన్స్‌ ద్వారా కూడా కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఇటువంటి అంతర్గత రిఫరెన్స్‌కు కూడా కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. సరైన ఉద్యోగిని రిఫర్‌ చేస్తే బోనస్‌ను కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ను విస్త్రతం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
 
జాబ్‌ ఫెయిర్స్‌, జాబ్‌ అలర్ట్స్‌
మరో మార్గం..జాబ్‌ ఫెయిర్స్‌, జాబ్‌ అలర్ట్స్‌. వివిధ కంపెనీలు నిర్దేశిత సమయాల్లో జాబ్‌ ఫెయిర్స్‌ నిర్వహిస్తుంటాయి. వాటి ద్వారా కూడా హిడెన్‌ జాబ్స్‌ను దక్కించుకోవచ్చు. ఆన్‌లైన్‌ జాబ్‌లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌ లేదా సంబంధిత సేవలను ఆఫర్‌ చేస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్స్‌ దగ్గర రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే మన ప్రొఫైల్‌కు సరిపడ జాబ్‌ అలర్ట్స్‌ వస్తుంటాయి. వాటి ద్వారా కూడా అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

No comments:

Post a Comment