Showing posts with label CAREER DEVELOPMENT. Show all posts
Showing posts with label CAREER DEVELOPMENT. Show all posts

Wednesday 16 August 2017

ఇవన్నీ ఎవర్ గ్రీన్...! భవిష్యత్తు వీటిదే!!


ఇవన్నీ ఎవర్ గ్రీన్...! భవిష్యత్తు వీటిదే!!

           డిమాండ్‌ ఉండే రంగాలను ఎంచుకుంటే జాబ్‌ సాధించడం సులువవుతుంది. అలా కాకుండా ఉద్యోగాల్లో గ్రోత్ లేని రంగాన్ని ఎంచుకుంటే జాబ్‌ సాధించడం కాస్త కష్టమవుతుంది. అందుకే కోర్సు ఎంపిక చేసుకునే సమయంలోనే ఏయే రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని అంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే చదవండి. 

కొత్త ఏడాదిలో ఏ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంటుంది? ఏ కోర్సు చదివితే ఉపయోగకరంగా ఉంటుంది? జీతం ఏయే రంగాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రతి విద్యార్థికి వస్తుంటాయి.
 
సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్స్‌

అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంట్రీలెవెల్‌లో చేరాలనుకునే వారికి ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవసరం.
ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఐటీరంగం ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. రాబోయే పదేళ్లలో ఈ రంగంలో ఉదోగ్యాల పెరుగుదల 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జీతం కూడా ఎక్కువే. పాతిక వేల జీతంతో ఉద్యోగం ప్రారంభించాలనుకునే వారికి ఐటీసెక్టర్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. ప్రతిచోటా, ప్రతిపనిలోనూ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ అవసరమవుతోంది. రాబోయే రోజుల్లో అవసరాలకు తగినట్టుగా వాటిలో మార్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని అంటున్నారు నిపుణులు.
 
ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్ట్‌

అర్హత : మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ సైకాలజీ
భవిష్యత్తులో సైకాలజిస్ట్‌లకు మంచి డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం సైకాలజిస్ట్‌ల అవసరాన్ని గుర్తిస్తున్నాయి. పోటీ రంగంలో నెగ్గుకు రావాలన్నా, కంపెనీ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నా ఉద్యోగులు మానసికంగా బలంగా ఉండాలనే విషయాన్ని కంపెనీలు అర్థం చేసుకున్నాయి. అంతేకాకుండా వ్యాపారంలోనూ సైకలాజికల్‌ ప్రిన్సిపుల్స్‌ను వర్తింపచేయడం, ఎంప్లాయుస్‌ పర్‌ఫార్మెన్స్‌ను పెంచడం వంటి వన్నీ సైకాలజి్‌స్టల చేతుల్లోనే ఉంటాయి. అందుకే కంపెనీలు తప్పనిసరిగా సైకాలజి్‌స్టలను ఎంపిక చేసుకుంటున్నాయి. రాబోయే పదేళ్లలో ఈ ఉద్యోగాలు 26 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
 
పర్సనల్‌ ఫైనాన్స్‌ అడ్వైజర్‌

అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ
వేగంగా విస్తరిస్తున్న ఉద్యోగాల్లో ఇది ఒకటి. రాబోయే పదేళ్లలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. చాలా మందికి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలో తెలియదు. ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడి వస్తుందో అవగాహన ఉండదు. వీరందరూ ఫైనాన్స్‌ అడ్వైజర్‌లపైనే ఆధారపడతారు. కాబట్టి మంచి డిమాండ్‌ ఉంటుంది. వృత్తిలో ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది. సర్కిల్‌ పెరగడానికి స్కోప్‌ ఉండే ఆక్యుపేషన్‌ ఇది.
 
సర్వే రీసెర్చర్స్‌
 
అర్హత : మాస్టర్‌ డిగ్రీ
కంపెనీలు వ్యాపార విస్తరణ నిర్ణయాలు తీసుకునే ముందు సైంటిఫిక్‌గా సర్వేలు, రీసెర్చ్‌లు చేయిస్తున్నాయి. ఆ తరువాతే ముందడుగు వేస్తున్నాయి. ఏ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాలన్నా దానివల్ల కలిగే లాభ, నష్టాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ ఫీల్డ్‌లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. 2022 కల్లా ఈ ఉద్యోగాలు 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
 
వెబ్‌ డిజైనర్స్‌
 
అర్హత : బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంట్రీలెవెల్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ తప్పనిసరి.
 
వెబ్‌ ప్రపంచం ఎంతగా విస్తరించిందో తెలిసిందే. చిన్న చిన్న కంపెనీలు, సంస్థలు సొంతం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వెబ్‌సైట్ల రూపకల్పన, నిర్వహణలో వెబ్‌డిజైనర్ల పాత్ర చాలా కీలకం. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఉదోగ్యాల వృద్ధి 20 శాతం ఉంటుందని భావిస్తున్నారు. ముందు ముందు ఈ రంగంలో విస్తరణ మరింత జరిగే అవకాశం ఉంది. హై ప్రొఫెషనల్స్‌ ‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సర్వీస్‌ను బట్టి వేతనాలు ఉంటాయి. వెబ్‌డిజైనర్‌గా ప్రముఖ కంపెనీలో చేరితే జీతం నెలకు 40 వేలకు పైనే వచ్చే అవకాశం ఉంది.
 
ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్స్‌
 
అర్హత : సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీ
వాతావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారిస్తోంది. ప్రకృతిని కాపాడుకుంటే తప్ప మనుగడ సాధించలేమనే విషయాన్ని అందరూ గుర్తించారు. ప్రకృతికి దూరంగా జీవించడం సాధ్యం కాదనే విషయాన్ని తెలుసుకున్నారు. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఎన్విరాన్‌మెంట్‌ టెక్నాలజీకి సంబంధించి ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో 15 శాతం ఉద్యోగాల వృద్ధి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
మెడికల్‌ అసిస్టెంట్స్‌
 
అర్హత : సంబంధిత రంగంలో డిప్లొమా
ఈ ఏడాది ఫార్మా సంబంధ రంగంలో ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్‌ ఉంటుందని నిపుణుల అంచనా. మెడికల్‌ అసిస్టెంట్స్‌కు సైతం డిమాండ్‌ ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో గ్రోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల వృద్ధి 22 శాతం ఉండే అవకాశం ఉంది. జీతం పాతిక వేల వరకు ఉంటుంది.
 
అథ్లెటిక్‌ ట్రెయినర్స్‌
 
అర్హత : బ్యాచిలర్‌ డిగ్రీ 
ఎక్కువ మంది ఈ రంగం వైపు దృష్టి సారించరు. కానీ రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల వృద్ధి 30 శాతం ఉంటుందని అంచనా. మంచి జీతం, హోదా కోరుకునే వారు ఈ ఫీల్డ్‌ను ఎంచుకోవచ్చు. వృత్తిలో ఎదుగుదలతో పాటు సంతృప్తి ఉంటుంది. స్పోర్ట్స్‌ పట్ల ఆసక్తి ఉండే వారికి ఇది మంచి రంగం.
 
పర్సనల్‌ అండ్‌ హోమ్‌ కేర్‌ అసిస్టెంట్స్‌ 
ఎక్కువ గ్రోతకు ఆస్కారం ఉన్న ఫీల్డ్‌ ఇది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమై పోయింది. ఇలాంటి సమయంలో చిన్న పిల్లలను చూసుకోవడానికి, వృద్ధులను చూసుకోవడానికి హోమ్‌ కేర్‌ అసిస్టెంట్స్‌ అవసరమవుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగాల్లో వృద్ధి 48 శాతం ఉంటుందని అంచనా. జీతం 20 వేల వరకు లభిస్తుంది. అనుభవాన్ని బట్టి జీతంలో పెరుగుదల ఉంటుంది.
 
బయోమెడికల్‌ ఇంజనీర్స్‌

అర్హత : సంబంధిత రంగంలో బ్యాచిలర్‌ డిగ్రీ
హెల్త్‌కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. మెడికల్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం వంటివి ఈ ఉద్యోగంలో భాగంగా ఉంటాయి. జీతం ఎక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈ ఫీల్డ్‌ను ఎంచుకోవచ్చు. బయోమెడికల్‌ ఇంజనీర్స్‌కు రాబోయే రోజుల్లో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య 27 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

Thursday 3 August 2017

కెరీర్‌లో తొలి అడుగులు తడబడకుండా


కెరీర్‌లో తొలి అడుగులు తడబడకుండా















                జీవితంలో మర్చిపోలేని సందర్భాల్లో కెరీర్‌ ప్రారంభం ఒకటి. ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలతో కెరీర్‌లో తొలి ప్రయాణం ప్రారంభమవుతుంది. జాబ్‌ వచ్చిన ఉత్సాహం, బాధ్యతయుతమైన ప్రొఫెషనల్‌ జీవితం ప్రారంభిస్తున్నామనే ఆనందం వెరసి కెరీర్‌ తొలి దశను అసక్తికరంగా మారుస్తుంది. భావి జీవితంలో చేరుకునే ఉన్నత శిఖరాలకు ఈ దశ పునాదిగా నిలుస్తుంది. ఇక్కడ అడుగులు తడబడితే కెరీర్‌ జర్నీ రాంగ్‌ రూట్‌లోకి వెళుతుంది. అప్పుడే జాబ్‌లో చేరిన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కెరీర్‌ను రైట్‌ ట్రాక్‌లో నడిపించాలంటే నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. వీటిని ఆచరించినప్పుడే కెరీర్‌ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా డెస్టినేషన్‌ను చేరుకుంటుంది. అందుకు ఏమి చేయాలో చుద్దాం...
 
ప్రొఫెషనల్‌ లైఫ్‌ కాలేజ్‌ లైఫ్‌ రెండూ భిన్నం. కంపెనీ కల్చర్‌లో సింక్‌ అవుతూ ఫైల్స్‌, ఎగ్జిక్యూషన్‌, ప్రాజెక్ట్స్‌, మీటింగ్స్‌ వంటి ప్రొఫెషనల్‌ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
విమర్శను స్వీకరించాలి.
 
కెరీర్‌ తొలినాళ్లలో ప్రశంసలతోపాటు విమర్శలు కూడా రావడం సహజం. అయితే ప్రశంసను ఎలా పాజిటివ్‌గా తీసుకుంటామో విమర్శను కూడా అలాగే స్వీకరించాలి. విమర్శకు సిద్ధంగా లేకపోతే కెరీర్‌ రాంగ్‌ట్రాక్‌లోకి వెళుతుంది. ఎవరూ పనికట్టుకొని విమర్శించరు. ఉద్యోగంలో చేరిన కొత్తలో తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దే దిశగా మాత్రమే వ్యాఖ్యానిస్తారు. అంతే తప్ప వ్యక్తిగత అంశాలను దృష్టిలో ఉంచుకొని విమర్శ ఉండదు. కాబట్టి దానిని పాజిటివ్‌గా స్వీకరించాలి. తప్పును సరిదిద్దుకొని మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాలి. కెరీర్‌ అనే సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఈ జర్నీలో ఎదిగే క్రమంలో ఒదిగి ఉండటం నేర్చుకోవాలి.
 
పని తీరుతోనే
పని తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో చేతలే మాట్లాడాలి. నోరు కాదు. సాధ్యమైనంత వరకు కామ్‌గా కూల్‌గా అనవసర విషయాల జోలికి వెళ్లకుండా విధులు నిర్వహించాలి. ఒక్కోసారి సదరు వ్యక్తుల పనితో సంస్థకు మేలు జరిగి ఉండవచ్చు. అయితే దీన్ని మేనేజర్‌ గుర్తించకపోవచ్చు. అంతమాత్రన ప్రతి ఒక్కరి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించడం, ఎవరూ సాధించనిది మనం మాత్రమే చేశామనే అహంతో వ్యవహరించకూడదు. శ్రమకు ఫలితం వెంటనే రాకపోయినా .ఎప్పుడో ఒక్కసారి మాత్రం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. ఒక్కోసారి గుర్తింపు పొందాలనే తొందర్లో తప్పులు చేస్తుంటారు. కప్పిపుచ్చుకునే క్రమంలో మరో తప్పు ఇలా పునరావృతం అవుతుంటాయి. ఈ సందర్భంలో తప్పును ధైర్యంగా ఒప్పుకోవాలి. దీని వల్ల మొదట్లో కొంత వరకు ప్రతికూలత కనిపించినప్పటికీ కెరీర్‌లో ప్రారంభంలోనే తప్పును నిజాయితీగా ఒప్పుకునే గుణం మీపై పాజిటివ్‌ ఇంప్రెషన్‌ను క్రియేట్‌ చేస్తుంది.
 
భిన్నంగా
విద్యార్థి దశలో చదువు తప్ప ఎటువంటి బాధ్యతలు ఉండవు. అపరిమిత స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగ జీవితం సరిగ్గా దీనికి భిన్నం. ఉద్యోగిగా బాధ్యతలతోపాటు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. విద్యార్థి దశలో అన్నింటికీ టీచర్ల గైడెన్స్‌ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఇవి పరిమితం. విద్యార్థిలా ప్రతీదానికీ ఇతరులను సంప్రదించడం మంచిది కాదు.
 
తప్పనిసరైన సమయంలో మాత్రమే తోటి సహచరుల సహకారం తీసుకోవాలి. ఇచ్చిన సమయం/దానికంటే ముందు అందరిలా కాకుండా భిన్నంగా చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది.
 
అడాప్ట్‌ కల్చర్‌
ప్రతి కంపెనీకి తనదైన సొంత వర్క్‌ కల్చర్‌ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా దాన్ని అడాప్ట్‌ చేసుకోవాలి. పని వేళల నుంచి ఫైల్‌ ఎగ్జిక్యూషన్‌ వరకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వర్కింగ్‌ టైమ్‌, ఏం చేయాలి, ఏవిధంగా చేయాలి, సహోద్యోగులతో ఎలా ప్రవర్తించాలి, డ్రెస్‌కోడ్‌ వంటి అంశాల్లో కంపెనీ కల్చర్‌తో సింకవ్వాలి. అన్ని నిబంధనలు రాతపూర్వకంగా ఉండవు. కొన్నిటిపై అనుభవ పూర్వకంగా అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలో సీనియర్ల సలహాలు తీసుకోవచ్చు. సాధ్యమైనంత ఫెయిర్‌గా ఉండాలి.
 
నో పర్సనల్‌ వర్క్‌
చాలా మంది ఉద్యోగ నిర్వహణ టైమ్‌లో కూడా పర్సనల్‌ విషయాలతో బిజీగా కనిపిస్తుంటారు. వ్యక్తిగత మెయిల్స్‌ చెక్‌ చేస్తూ, సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ/చాట్‌ చేస్తూ బిజీగా ఉంటారు. ఆఫీస్‌ టైంలో ప్రొఫెషనల్‌ లైఫ్‌ను పర్సనల్‌ లైఫ్‌తో లింక్‌ చేయవద్దు. రెంటి మధ్య ఉండే సున్నితమైన పరిమితిని గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.
వర్క్‌ ప్లేస్‌లో సహచరులతో స్నేహ భావంతో ఉండటం తప్పులేదు. అంతేకానీ దాన్ని అవకాశంగా తీసుకుని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు.

Wednesday 2 August 2017

కెరీర్‌ను నిర్దేశించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌


కెరీర్‌ను నిర్దేశించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌














            భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన వాటిలో కెరీర్‌ ఒకటి. కెరీర్‌ ఎంపికలో తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పదో తరగతి తరవాత, ఇంటర్‌ అనంతరం, డిగ్రీ తరవాత... ఇలా ప్రతి దశలో కెరీర్‌కు సంబంధించి ఆపై ఏమిటి అనే ప్రశ్నను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఈ విషయంలో చాలా మంది తమ ఆసక్తి ఏమిటో సరిగ్గా గ్రహించరు. స్నేహితులు, బంధువులను అనుకరిస్తారు. లేదంటే గుడ్డిగా వారిని అనుసరిస్తారు. అలా కాకుండా తమ సామర్థ్యం ఏమిటో గమనించి తదనుగుణమైన కెరీర్‌ ఎంచుకుంటే సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేయవచ్చన్నది నిపుణుల మాట. సొంత ఆలోచన, సరైన ప్లానింగ్‌తో కెరీర్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. అంతేతప్ప ఇతరుల ప్రభావం ఉండకూడదు. ఒక రంగానికి సంబంధించిన ప్రొఫైల్‌ చూసి తద్వారా సకె ్సస్‌, ఫేమ్‌ వస్తుందని భావించి ఆ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం సహేతుకం కాదు. మన సామర్థ్యాలకు సరిపోయే కెరీర్‌కే ఓటేయ్యాలి. ప్రతి కెరీర్‌కు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు అవసరమవుతాయి. అవి ఆయా అభ్యర్థుల సామర్థ్యాలతో సరిపోలినప్పుడు మాత్రమే అలాంటి కెరీర్‌ను తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కెరీర్‌లో విజయం సాధించగలరు. అయితే ఫలానా కెరీర్‌ మనకు సూట్‌ అవుతుందని ఎలా తెలుస్తుందనేది ప్రశ్నార్థకం. ఇటువంటి సందర్భంలోనే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు ఉపయోగపడతాయి.
 
సామర్థ్యం, యోగ్యత
ఆప్టిట్యూడ్‌ అంటే..సామర్థ్యం, యోగ్యత. కొన్ని ప్రత్యేకమైన పనులను నిర్వహించడానికి వ్యక్తికి సహజంగా లేదా నేర్చుకోవడం ద్వారా వచ్చిన సామర్థ్యాన్ని ఆప్టిట్యూడ్‌గా నిర్వచిస్తారు. కొందరిలో ఇది స్వాభావికంగా(పుట్టుకతో) వస్తే, ఇంకొందరు తమ ప్రయత్నాల ద్వారా పెంపొందించుకుంటారు. ఒక వ్యక్తిలో విభిన్న సామర్థ్యాలు ఉండకపోవచ్చు కానీ ఏదో ఒకసామర్థ్యం మాత్రం తప్పక దాగి ఉంటుంది. అదేమిటో గుర్తించడానికి ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు చాలా ఉపయోగపడతాయి.
 
కెరీర్‌ టూల్‌
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు వ్యక్తిలోని మేథస్సును, జ్ఞానాన్ని అంచనా వేస్తాయి. ఇందులో సహజ సామర్థ్యాలు, ఆసక్తులు, విలువలు, నైపుణ్యాలు ఆధారంగా మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ప్రశ్నలు వస్తుంటాయి. వీటికి ఇచ్చే సమాధానాల ద్వారా మానసిక సామర్థ్యాన్ని, బలాలు, బలహీనతలను అంచనా వేస్తారు. తద్వారా వ్యక్తుల సామర్థ్యాలకు సరిపోయే కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి సంఖ్యలకు సంబంధించి మంచి అవగాహన ఉంటే ఫైనాన్స, మేనేజ్‌మెంట్‌ రంగాలను కెరీర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. స్పాటియల్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటే డిజైనింగ్‌, ఆర్కిటెక్చర్‌ వంటి సృజనాత్మక రంగాలను ఎంచుకోవచ్చు. అప్పటికే ఉద్యోగంలో ఉంటే అందులో రాణించడానికి ఏమి చేయాలి అనే అంశాన్ని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు వివరిస్తాయి. ఇటువంటి ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఇంటర్నెట్‌లో చాలా ఉన్నాయి.
 
గైడ్‌గా
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు కెరీర్‌, ఎడ్యుకేషనకు సంబంధించి స్పష్టతను, నమ్మకాన్ని కలిగిస్తాయి. తదుపరి ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలోనూ ఈ టెస్ట్‌లు గైడ్‌ చేస్తాయి. చాలా మంది తమ ఆసక్తిని బట్టి కెరీర్‌ ఎంచుకుంటారు. ఆసక్తి, ఆప్టిట్యూడ్‌ రెండూ వేర్వేరు అంశాలు. ఆసక్తి అనేది జీవిత అనుభవాలతో సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి కేవలం ఆసక్తి ఆధారంగా కెరీర్‌ను ప్లాన చేసుకోవడం కష్టం. కాబట్టి ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటే ఆ రంగంలో రాణించడానికి అవసరమైన సామర్థ్యాలు ఉండాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Monday 31 July 2017

జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు


జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు














             ఉద్యోగాల్లో, టెక్నాలజీలో ఎన్నో మార్పులు చూస్తున్నాం. జాబ్‌సెర్చ్‌కు సంబంధించి మాత్రం ఎప్పటికీ మారని ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములాలు కొన్ని ఉంటుండటం విశేషం. స్కిల్స్‌ అప్‌డేషన్‌, ఫ్లెక్సిబుల్‌ నేచర్‌, నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండటం. ఈ మూడింటికి తోడుఇటీవలి కాలంలో చేరిన మరో అంశం, ఆన్‌లైన్‌ యాక్టివ్‌గా ఉండి బ్రాండింగ్‌ చేసుకోవడం.
జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌ మారుతోంది. చేతిలో డిగ్రీతో యువత క్యాంపస్‌ బయట కాలు పెట్టగానే అవకాశాలు వెల్‌కమ్‌ చెబుతున్నాయి. అయితే ఆ అవకాశాలను అందుకోవాలంటే మాత్రం ట్రెండ్‌కు అనుగుణంగా తాము ఉన్నామని వీరు నిరూపించుకోవాలి. అందుకోసం జాబ్‌ సీకర్‌గా అభ్యర్థి తన అప్రోచను మార్చుకోవాలి. ఆనలైన ఫ్లాట్‌ఫామ్‌ను యాక్టివ్‌గా వినియోగించుకుని స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. జాబ్‌కు రెడీ క్యాండేట్‌గా మనల్ని మనం బెస్ట్‌ బ్రాండ్‌గా ప్రమోట్‌ చేసుకోవాలి. ఇందుకు సంబంధించి అనుసరించాల్సి వ్యూహాలు, బ్రష్‌ అప్‌ చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో జాబ్‌ సెర్చ్‌ను సక్సెస్‌ఫుల్‌ చేసుకోవాలి అంటే కొన్ని అంశాలు పాటించడం తప్పనిసరి. ఆనలైనలో యాక్టివ్‌గా ఉండటం, స్కిల్స్‌ను పెంపొందించుకోవడం, ఫ్లెక్సిబుల్‌గా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం వీటిలో కొన్ని. చూడ్డానికి ఇవి మాములు అంశాలుగానే అనిపిస్తాయి. ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స అయినప్పటికీ జాబ్‌ సెర్చ్‌ను సక్సెస్‌ఫుల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై నిలబెట్టే ఎవర్‌ గ్రీన ఫార్ములాలు ఇవి అనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు.
 
అప్రోచ్ మార్చుకోవాలి
జాబ్‌ సెర్చ్‌లో తొలి దశ.. జాబ్‌ సీకర్‌గా ఉద్యోగం కోసం ఏ విధంగా అప్రోచ అవుతున్నాం అనేది ముఖ్యం. చాలా మంది హైరింగ్‌ నోటిఫికేషన చూడగానే కేవలం రెజ్యూమె ఫార్వర్డ్‌ చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. ఇక్కడే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలి. జాబ్‌ సీకర్‌గా మన అప్రోచను సమీక్షించుకోవాలి. రెజ్యూమెతోపాటు ఒక రిఫరెన్స ఉండేలా చూసుకోవాలి. అదే కంపెనీ ఉద్యోగులైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో మీరు అందరికంటే ఒక అడుగు ముందు ఉండటానికి వీలు ఉంటుంది. దీంతో మీ అవకాశాలు మెరుగవుతాయి.
 
బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో
జాబ్‌ సీకర్‌గా.. జాబ్‌ మార్కెట్లో మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్‌గా ప్రొజెక్ట్‌ చేసుకోవాలి. అంటే ఒక కంపెనీ తన ప్రొడక్ట్‌ను మార్కెట్‌ చేసుకోవడానికి ఎటువంటి బ్రాండింగ్‌ వ్యూహాలను అనుసరిస్తుందో అదే స్థాయిలో మిమల్ని మీరు ప్రమోట్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కంపెనీలు బ్రాండింగ్‌ కోసం మార్కెటింగ్‌ టెక్నిక్స్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ వ్యూహాలపై ప్రధానంగా దృష్టిసారిస్తే.. క్వాలిఫికేషన్స, స్కిల్స్‌ ఆధారంగా మీరు ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తద్వారా సదరు ఉద్యోగానికి మీరు మాత్రమే బెస్ట్‌ అనిపించుకునే విధంగా ఒక ప్రొడక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి. క్వాలిఫికేషన్స, స్కిల్స్‌ ఆధారంగా ఎంప్లాయర్‌ వద్ద మిమ్మల్ని మీరు మార్కెటింగ్‌ చేసుకోవాలి.
 
బి యాక్టివ్‌
డిజిటల్‌ యుగంలో రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆనలైన వేదికగా చేసుకుని చాలా మంది ఎంప్లాయర్స్‌ రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నారు. కాబట్టి మోడ్రన ఏజ్‌ జాబ్‌ సీకర్‌గా సోషల్‌ మీడియా/ఆనలైనలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన అంశాలను పోస్ట్‌ చేయకుండా మీ ప్రొఫైల్‌కు సరిపోయే ఇండస్ర్టీ సంబంధిత విషయాలను, లేటెస్ట్‌ ఆప్‌డేట్స్‌ను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూండాలి. లింక్‌డిన్‌ వంటి ప్రొఫెషనల్‌ జాబ్‌ లిస్టింగ్‌ సైట్లలో రెజ్యూమెను షేర్‌ చేస్తుండాలి.
 
స్కిల్‌ బేస్డ్‌ రెజ్యూమె
జాబ్‌ సెర్చ్‌లో కీలకమైంది రెజ్యూమె. ఇప్పుడు కొన్ని ఉద్యోగాల్లో నాలెడ్జ్‌ కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే రెజ్యూమెను స్కిల్డ్‌ బేస్డ్‌గా ప్రిపేర్‌ చేసుకోవాలి. మీ స్కిల్స్‌ అప్లయ్‌ చేసిన జాబ్‌/కంపెనీకి ఏ విధంగా అడ్వాంటేజ్‌ కాగలవో వివరిచాలి.
 
అనుభవం ముఖ్యమే
జాబ్‌ సీకర్‌గా గుర్తు పెట్టుకోవాల్సిన మరో కీలక అంశం పలానా ఉద్యోగం లేదా పలానా కంపెనీ అంటూ పరిమితులు విధించుకో వడం. ఎటువంటి అవకాశం వచ్చినా చిన్నదా, పెద్దదా అని చూడకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. కేవలం పలానా జాబ్‌ అంటూ కూర్చుంటే సమయం, ప్రతిభ రెండూ వృథా అవుతాయి. చిన్న ఉద్యోగమైనా దాని ద్వారా ఎంతో విలువైన అనుభవం వస్తుంది. తరవాతి దశ జాబ్‌ సెర్చ్‌లో ఈ అనుభవం కీలకంగా ఉంటుంది. అనుభవం లేని ఫ్రెషర్‌ కంటే కొంత అనుభవం ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకోవడానికి ఎంప్లాయర్స్‌ ప్రాధాన్యం ఇస్తారు.

Friday 9 June 2017

నైపుణ్యాల పెంపుతో.. మెరుగైన కెరీర్‌


నైపుణ్యాల పెంపుతో.. మెరుగైన కెరీర్‌









         ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. చేస్తున్న జాబ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా నైపుణ్యాలకు(స్కిల్స్‌) పదును పెట్టాల్సిందే. సాంకేతికంగా, స్వాభావికంగా జాబ్‌ నేచర్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను అప్‌ డేట్‌ చేసుకుంటేనే సక్సెస్‌ సాధ్యమవుతుంది. అప్‌గ్రేడ్‌ కావడం అనేది నిరంతర ప్రక్రియ. అలా అయితేనే కెరీర్‌లో అనుకున్న స్థాయిలో చేరుకోగలం. 
         ఉద్యోగం లేదా ఎంచుకునే రంగం ఎప్పూడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఉదాహరణకు ఐటీ రంగంలో ప్రస్తుతం బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగంలో డేటా అనలిస్ట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌కు అధిక డిమాండ్‌ ఉంది. కాబట్టి సంబంధిత రంగంలో జరుగుతున్న లేటెస్ట్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్స్‌ను సమయానుగుణంగా అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి.

ముందు రీసెర్చ్‌
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ. దీనికి సహనం, నిబద్ధత చాలా అవసరం. స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే ముందు ఏయే అంశాల్లో మెరుగుపడాలి అనే విషయంలో కొంత కసరత్తు(రీసెర్చ్‌) చేయాలి. ఇందుకు ముందుగా మీలోని నైపుణ్యాలను ఒక నోట్‌ రూపంలో ప్రిపేర్‌ చేసుకోవాలి. తరవాత సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌ను మీలోని నైపుణ్యాలతో బేరీజు వేసుకోవాలి. దాని ఆధారంగా కొత్త దృష్టి సారించాల్సిన నైపుణ్యాలపై రీసెర్చ్‌ చేయాలి. ఏయే అంశాల్లో మెరుగుపడాలి, అందుకు ఏవిధంగా, ఎక్కడ శిక్షణ తీసుకోవాలి అనే విషయంలో మీ స్నేహితులు, సీనియర్లు, పరిశ్రమ ప్రముఖులు, ఆన్‌లైన్‌ రిసోర్సెస్‌, సోషల్‌ మీడియా వంటి మాధ్యమాల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించాలి. దాని ఆధారంగా నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవడం మొదలు పెట్టాలి.

లేటెస్ట్‌గా
మీరు ఎంచుకున్న లేదా పని చేస్తున్న రంగంలో వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఏవిధంగా రూపాంతరం చెందింది అనే విషయాలను విశ్లేషించుకోవాలి. ఇందుకు చేయాల్సిందల్లా కనీసం రోజుకు 30 నిమిషాల సమయాన్ని ఆ రంగానికి చెందిన మేగజైన్స, న్యూస్‌ ఆర్టికల్స్‌, వెబ్‌సోర్సెస్‌, ప్రముఖుల ఆభిప్రాయాలను చదవడానికి కేటాయించాలి. తద్వారా సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పోకడల (లేటెస్ట్‌ ట్రెండ్స్‌)పై అవగాహన ఏర్పడుతుంది. మీ సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ను విస్తృతం చేసుకోవడానికి ఈ అంశం దోహదపడుతుంది.

ఆన్‌లైన్‌ సోర్సెస్‌ 
స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉండే చక్కని అవకాశం ఆనలైన సోర్సెస్‌. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఎటువంటి సమాచారమైనా ఒకే క్లిక్‌తో మన ముందు ప్రత్యక్షమవుతుంది. వివిధ రంగాల్లో ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న స్కిల్స్‌, వాటికి అనుగుణంగా కావాల్సిన నైపుణ్యాలను డేటాతో ప్రెజెంట్‌ చేసే ఆనలైన వెబ్‌సైట్స్‌, బ్లాగులు ఎన్నో. వాటిని సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవడం ద్వారా కూడా మనం ఎంచుకున్న రంగంలోని లేటెస్ట్‌ ట్రెండ్స్‌/స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. అంతేకాకుండా వెబినార్‌ ్స(వెబ్‌ బేస్డ్‌ సెమినార్స్‌) ద్వారా సంబంధిత రంగానికి చెందిన వాస్తవ సమాచారం లభిస్తుంది. ఎందుకంటే ఇండస్ర్టీలు మాత్రమే వెబినార్స్‌ను నిర్వహిస్తుంటాయి. వీటిల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత రంగానికి చెందిన విలువైన ఇన్ఫర్మేషన్‌ దొరుకుతుంది.

రైటింగ్స్‌..పబ్లిషింగ్స్‌
మీ కెరీర్‌కు సంబంధించిన నూతన పరిశోధనలు, స్కిల్స్‌పై ఆర్టికల్స్‌ రాయటం అలవాటు చేసుకోవాలి. ఇందుకు ఆనలైన బ్లాగింగ్‌ ద్వారా ఈ ప్రయత్నం చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. తద్వారా సంబంధిత రంగంలోని రచయితలు, ప్రముఖులతో సులువుగా పరిచయం ఏర్పడుతుంది. ఆభిప్రాయాలను మరొకరు షేరు చేసుకోవచ్చు, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ విస్తృతమవుతుంది. మరింత ఆసక్తి ఉంటే మీ రైటింగ్స్‌ను పుస్తకం లేదా జర్నల్స్‌ రూపంలో పబ్లిష్‌ చేయవచ్చు. 

ఈవెంట్స్‌ ద్వారా
ట్రేడ్‌ షోస్‌, కాన్ఫరెన్స్, ఇండస్ర్టీ ఈవెంట్లు, ఎగ్జిబిషన్స్‌, వర్క్‌షాప్స్‌, ఇంటర్న్‌షిప్స్‌, సెమినార్స్‌ కూడా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి ఈవెంట్స్‌కు హాజరవడం ద్వారా సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ ట్రెండ్స్‌ను ప్రత్యక్షంగా గమనించే అవకాశం లభిస్తుంది. అక్కడ ప్రముఖులు ఇచ్చే ఉపాన్యాసాల ద్వారా విలువైన సమాచారం దొరుకుతుంది. వారిని కలుసుకోవడం, ఆభిప్రాయాలను తెలుసుకోవడం, షేర్‌ చేసుకోవడం వంటివి చేయవచ్చు. ఈ సందర్భంలో అనుభవజ్ఞులతో మాట్లాడటానికి సందేహించవద్దు. చాలా మంది తమ అనుభవాన్ని షేర్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి ఈవెంట్ల ద్వారా మన ప్రతిభ సామర్థ్యాలను కూడా ప్రదర్శించవచ్చు. ఉదాహరణకు కంపెనీ సేల్స్‌ ప్రాజెక్ట్‌ను తీసుకుంటే..వాటిని ఏవిధంగా అధికం చేస్తావు, అందుకు తగినట్లుగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఉద్యోగుల్లో స్కిల్‌ గ్యాప్‌ను అధిగమించేందుకు ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తావు వంటి అంశాలను వివరించాలి. తద్వారా మంచి అవకాశం లేదా స్టార్టప్‌ ప్రారంభించాలనే ఆలోచన ఉంటే అందుకు కావల్సిన నిధులను సమకూర్చే సంస్థ/వ్యక్తులు లభించవచ్చు.

కోర్సెస్‌
పలు రకాల కోర్సులను పూర్తి చేయడం ద్వారా కూడా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. కోర్సులను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్‌ విధానానికొస్తే, మార్కెట్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు సంబంధిత రంగంలోని లెటెస్ట్‌ డెవలప్‌మెంట్స్‌కు అనుగుణంగా షార్ట్‌టర్మ్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంటాయి. వీటి ద్వారా కూడా స్కిల్స్‌లో అప్‌డేట్‌ కావచ్చు. ఈ తరహా ఇన్‌స్టిట్యూట్‌లు మనకు చాలా కనిపిస్తుంటాయి. అయితే ఆయా సంస్థలు చేసే ప్రచారంతోకాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎన్నో సంస్థలు ఇందుకు సంబంధించిన షార్ట్‌టర్మ్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వాటిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా ఇవి మీ బడ్జెట్‌, షెడ్యూల్‌కు అనుగుణంగా ఉండటం చాలా కలిసొచ్చే అంశం. 

స్కిల్స్‌ను ఎందుకు అప్‌డేట్‌ చేసుకోవాలంటే.. 
  • జాబ్‌ సెర్చింగ్‌లో మిగతా వారికంటే ముందు నిలవడానికి.
  • జాబ్‌ మార్కెట్‌ స్వరూపం మారుతోంది.
  • సంబంధిత రంగంపై మీకు ఉన్న అవగాహన కలుగుతుంది.
  • జాబ్‌సెర్చింగ్‌లో ఆత్మవిశ్వాసం, విశ్వసనీయత పెరుగుతాయి.
  • స్కిల్స్‌ పరంగా వచ్చే గ్యాప్‌ను నివారించవచ్చు.