Showing posts with label జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు. Show all posts
Showing posts with label జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు. Show all posts

Monday, 31 July 2017

జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు


జాబ్‌ సెర్చ్‌కు బెస్ట్‌ మార్గాలు














             ఉద్యోగాల్లో, టెక్నాలజీలో ఎన్నో మార్పులు చూస్తున్నాం. జాబ్‌సెర్చ్‌కు సంబంధించి మాత్రం ఎప్పటికీ మారని ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములాలు కొన్ని ఉంటుండటం విశేషం. స్కిల్స్‌ అప్‌డేషన్‌, ఫ్లెక్సిబుల్‌ నేచర్‌, నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండటం. ఈ మూడింటికి తోడుఇటీవలి కాలంలో చేరిన మరో అంశం, ఆన్‌లైన్‌ యాక్టివ్‌గా ఉండి బ్రాండింగ్‌ చేసుకోవడం.
జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌ మారుతోంది. చేతిలో డిగ్రీతో యువత క్యాంపస్‌ బయట కాలు పెట్టగానే అవకాశాలు వెల్‌కమ్‌ చెబుతున్నాయి. అయితే ఆ అవకాశాలను అందుకోవాలంటే మాత్రం ట్రెండ్‌కు అనుగుణంగా తాము ఉన్నామని వీరు నిరూపించుకోవాలి. అందుకోసం జాబ్‌ సీకర్‌గా అభ్యర్థి తన అప్రోచను మార్చుకోవాలి. ఆనలైన ఫ్లాట్‌ఫామ్‌ను యాక్టివ్‌గా వినియోగించుకుని స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. జాబ్‌కు రెడీ క్యాండేట్‌గా మనల్ని మనం బెస్ట్‌ బ్రాండ్‌గా ప్రమోట్‌ చేసుకోవాలి. ఇందుకు సంబంధించి అనుసరించాల్సి వ్యూహాలు, బ్రష్‌ అప్‌ చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో జాబ్‌ సెర్చ్‌ను సక్సెస్‌ఫుల్‌ చేసుకోవాలి అంటే కొన్ని అంశాలు పాటించడం తప్పనిసరి. ఆనలైనలో యాక్టివ్‌గా ఉండటం, స్కిల్స్‌ను పెంపొందించుకోవడం, ఫ్లెక్సిబుల్‌గా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం వీటిలో కొన్ని. చూడ్డానికి ఇవి మాములు అంశాలుగానే అనిపిస్తాయి. ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స అయినప్పటికీ జాబ్‌ సెర్చ్‌ను సక్సెస్‌ఫుల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై నిలబెట్టే ఎవర్‌ గ్రీన ఫార్ములాలు ఇవి అనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు.
 
అప్రోచ్ మార్చుకోవాలి
జాబ్‌ సెర్చ్‌లో తొలి దశ.. జాబ్‌ సీకర్‌గా ఉద్యోగం కోసం ఏ విధంగా అప్రోచ అవుతున్నాం అనేది ముఖ్యం. చాలా మంది హైరింగ్‌ నోటిఫికేషన చూడగానే కేవలం రెజ్యూమె ఫార్వర్డ్‌ చేయడానికి మాత్రమే పరిమితం అవుతారు. ఇక్కడే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలి. జాబ్‌ సీకర్‌గా మన అప్రోచను సమీక్షించుకోవాలి. రెజ్యూమెతోపాటు ఒక రిఫరెన్స ఉండేలా చూసుకోవాలి. అదే కంపెనీ ఉద్యోగులైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో మీరు అందరికంటే ఒక అడుగు ముందు ఉండటానికి వీలు ఉంటుంది. దీంతో మీ అవకాశాలు మెరుగవుతాయి.
 
బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో
జాబ్‌ సీకర్‌గా.. జాబ్‌ మార్కెట్లో మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్‌గా ప్రొజెక్ట్‌ చేసుకోవాలి. అంటే ఒక కంపెనీ తన ప్రొడక్ట్‌ను మార్కెట్‌ చేసుకోవడానికి ఎటువంటి బ్రాండింగ్‌ వ్యూహాలను అనుసరిస్తుందో అదే స్థాయిలో మిమల్ని మీరు ప్రమోట్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కంపెనీలు బ్రాండింగ్‌ కోసం మార్కెటింగ్‌ టెక్నిక్స్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ వ్యూహాలపై ప్రధానంగా దృష్టిసారిస్తే.. క్వాలిఫికేషన్స, స్కిల్స్‌ ఆధారంగా మీరు ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తద్వారా సదరు ఉద్యోగానికి మీరు మాత్రమే బెస్ట్‌ అనిపించుకునే విధంగా ఒక ప్రొడక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి. క్వాలిఫికేషన్స, స్కిల్స్‌ ఆధారంగా ఎంప్లాయర్‌ వద్ద మిమ్మల్ని మీరు మార్కెటింగ్‌ చేసుకోవాలి.
 
బి యాక్టివ్‌
డిజిటల్‌ యుగంలో రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆనలైన వేదికగా చేసుకుని చాలా మంది ఎంప్లాయర్స్‌ రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నారు. కాబట్టి మోడ్రన ఏజ్‌ జాబ్‌ సీకర్‌గా సోషల్‌ మీడియా/ఆనలైనలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన అంశాలను పోస్ట్‌ చేయకుండా మీ ప్రొఫైల్‌కు సరిపోయే ఇండస్ర్టీ సంబంధిత విషయాలను, లేటెస్ట్‌ ఆప్‌డేట్స్‌ను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూండాలి. లింక్‌డిన్‌ వంటి ప్రొఫెషనల్‌ జాబ్‌ లిస్టింగ్‌ సైట్లలో రెజ్యూమెను షేర్‌ చేస్తుండాలి.
 
స్కిల్‌ బేస్డ్‌ రెజ్యూమె
జాబ్‌ సెర్చ్‌లో కీలకమైంది రెజ్యూమె. ఇప్పుడు కొన్ని ఉద్యోగాల్లో నాలెడ్జ్‌ కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే రెజ్యూమెను స్కిల్డ్‌ బేస్డ్‌గా ప్రిపేర్‌ చేసుకోవాలి. మీ స్కిల్స్‌ అప్లయ్‌ చేసిన జాబ్‌/కంపెనీకి ఏ విధంగా అడ్వాంటేజ్‌ కాగలవో వివరిచాలి.
 
అనుభవం ముఖ్యమే
జాబ్‌ సీకర్‌గా గుర్తు పెట్టుకోవాల్సిన మరో కీలక అంశం పలానా ఉద్యోగం లేదా పలానా కంపెనీ అంటూ పరిమితులు విధించుకో వడం. ఎటువంటి అవకాశం వచ్చినా చిన్నదా, పెద్దదా అని చూడకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. కేవలం పలానా జాబ్‌ అంటూ కూర్చుంటే సమయం, ప్రతిభ రెండూ వృథా అవుతాయి. చిన్న ఉద్యోగమైనా దాని ద్వారా ఎంతో విలువైన అనుభవం వస్తుంది. తరవాతి దశ జాబ్‌ సెర్చ్‌లో ఈ అనుభవం కీలకంగా ఉంటుంది. అనుభవం లేని ఫ్రెషర్‌ కంటే కొంత అనుభవం ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకోవడానికి ఎంప్లాయర్స్‌ ప్రాధాన్యం ఇస్తారు.