నైపుణ్యాల పెంపుతో.. మెరుగైన కెరీర్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. చేస్తున్న జాబ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా నైపుణ్యాలకు(స్కిల్స్) పదును పెట్టాల్సిందే. సాంకేతికంగా, స్వాభావికంగా జాబ్ నేచర్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను అప్ డేట్ చేసుకుంటేనే సక్సెస్ సాధ్యమవుతుంది. అప్‌గ్రేడ్ కావడం అనేది నిరంతర ప్రక్రియ. అలా అయితేనే కెరీర్‌లో అనుకున్న స్థాయిలో చేరుకోగలం.
ఉద్యోగం లేదా ఎంచుకునే రంగం ఎప్పూడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఉదాహరణకు ఐటీ రంగంలో ప్రస్తుతం బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగంలో డేటా అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌కు అధిక డిమాండ్ ఉంది. కాబట్టి సంబంధిత రంగంలో జరుగుతున్న లేటెస్ట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్స్‌ను సమయానుగుణంగా అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.
ముందు రీసెర్చ్
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ. దీనికి సహనం, నిబద్ధత చాలా అవసరం. స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునే ముందు ఏయే అంశాల్లో మెరుగుపడాలి అనే విషయంలో కొంత కసరత్తు(రీసెర్చ్) చేయాలి. ఇందుకు ముందుగా మీలోని నైపుణ్యాలను ఒక నోట్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. తరవాత సంబంధిత రంగంలోని లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ను మీలోని నైపుణ్యాలతో బేరీజు వేసుకోవాలి. దాని ఆధారంగా కొత్త దృష్టి సారించాల్సిన నైపుణ్యాలపై రీసెర్చ్ చేయాలి. ఏయే అంశాల్లో మెరుగుపడాలి, అందుకు ఏవిధంగా, ఎక్కడ శిక్షణ తీసుకోవాలి అనే విషయంలో మీ స్నేహితులు, సీనియర్లు, పరిశ్రమ ప్రముఖులు, ఆన్‌లైన్ రిసోర్సెస్, సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించాలి. దాని ఆధారంగా నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవడం మొదలు పెట్టాలి.
లేటెస్ట్‌గా
మీరు ఎంచుకున్న లేదా పని చేస్తున్న రంగంలో వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఏవిధంగా రూపాంతరం చెందింది అనే విషయాలను విశ్లేషించుకోవాలి. ఇందుకు చేయాల్సిందల్లా కనీసం రోజుకు 30 నిమిషాల సమయాన్ని ఆ రంగానికి చెందిన మేగజైన్స, న్యూస్ ఆర్టికల్స్, వెబ్‌సోర్సెస్, ప్రముఖుల ఆభిప్రాయాలను చదవడానికి కేటాయించాలి. తద్వారా సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పోకడల (లేటెస్ట్ ట్రెండ్స్)పై అవగాహన ఏర్పడుతుంది. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను విస్తృతం చేసుకోవడానికి ఈ అంశం దోహదపడుతుంది.
ఆన్‌లైన్ సోర్సెస్
స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే చక్కని అవకాశం ఆనలైన సోర్సెస్. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎటువంటి సమాచారమైనా ఒకే క్లిక్‌తో మన ముందు ప్రత్యక్షమవుతుంది. వివిధ రంగాల్లో ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న స్కిల్స్, వాటికి అనుగుణంగా కావాల్సిన నైపుణ్యాలను డేటాతో ప్రెజెంట్ చేసే ఆనలైన వెబ్‌సైట్స్, బ్లాగులు ఎన్నో. వాటిని సబ్‌స్ర్కైబ్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఎంచుకున్న రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్/స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. అంతేకాకుండా వెబినార్ ్స(వెబ్ బేస్డ్ సెమినార్స్) ద్వారా సంబంధిత రంగానికి చెందిన వాస్తవ సమాచారం లభిస్తుంది. ఎందుకంటే ఇండస్ర్టీలు మాత్రమే వెబినార్స్‌ను నిర్వహిస్తుంటాయి. వీటిల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత రంగానికి చెందిన విలువైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
రైటింగ్స్..పబ్లిషింగ్స్
మీ కెరీర్‌కు సంబంధించిన నూతన పరిశోధనలు, స్కిల్స్‌పై ఆర్టికల్స్ రాయటం అలవాటు చేసుకోవాలి. ఇందుకు ఆనలైన బ్లాగింగ్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. తద్వారా సంబంధిత రంగంలోని రచయితలు, ప్రముఖులతో సులువుగా పరిచయం ఏర్పడుతుంది. ఆభిప్రాయాలను మరొకరు షేరు చేసుకోవచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ విస్తృతమవుతుంది. మరింత ఆసక్తి ఉంటే మీ రైటింగ్స్‌ను పుస్తకం లేదా జర్నల్స్ రూపంలో పబ్లిష్ చేయవచ్చు.
ఈవెంట్స్ ద్వారా
ట్రేడ్ షోస్, కాన్ఫరెన్స్, ఇండస్ర్టీ ఈవెంట్లు, ఎగ్జిబిషన్స్, వర్క్‌షాప్స్, ఇంటర్న్‌షిప్స్, సెమినార్స్ కూడా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి ఈవెంట్స్‌కు హాజరవడం ద్వారా సంబంధిత రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్‌ను ప్రత్యక్షంగా గమనించే అవకాశం లభిస్తుంది. అక్కడ ప్రముఖులు ఇచ్చే ఉపాన్యాసాల ద్వారా విలువైన సమాచారం దొరుకుతుంది. వారిని కలుసుకోవడం, ఆభిప్రాయాలను తెలుసుకోవడం, షేర్ చేసుకోవడం వంటివి చేయవచ్చు. ఈ సందర్భంలో అనుభవజ్ఞులతో మాట్లాడటానికి సందేహించవద్దు. చాలా మంది తమ అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి ఈవెంట్ల ద్వారా మన ప్రతిభ సామర్థ్యాలను కూడా ప్రదర్శించవచ్చు. ఉదాహరణకు కంపెనీ సేల్స్ ప్రాజెక్ట్‌ను తీసుకుంటే..వాటిని ఏవిధంగా అధికం చేస్తావు, అందుకు తగినట్లుగా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఉద్యోగుల్లో స్కిల్ గ్యాప్‌ను అధిగమించేందుకు ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తావు వంటి అంశాలను వివరించాలి. తద్వారా మంచి అవకాశం లేదా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన ఉంటే అందుకు కావల్సిన నిధులను సమకూర్చే సంస్థ/వ్యక్తులు లభించవచ్చు.
కోర్సెస్
పలు రకాల కోర్సులను పూర్తి చేయడం ద్వారా కూడా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. కోర్సులను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ విధానానికొస్తే, మార్కెట్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు సంబంధిత రంగంలోని లెటెస్ట్ డెవలప్‌మెంట్స్‌కు అనుగుణంగా షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తుంటాయి. వీటి ద్వారా కూడా స్కిల్స్‌లో అప్‌డేట్ కావచ్చు. ఈ తరహా ఇన్‌స్టిట్యూట్‌లు మనకు చాలా కనిపిస్తుంటాయి. అయితే ఆయా సంస్థలు చేసే ప్రచారంతోకాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎన్నో సంస్థలు ఇందుకు సంబంధించిన షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా ఇవి మీ బడ్జెట్, షెడ్యూల్‌కు అనుగుణంగా ఉండటం చాలా కలిసొచ్చే అంశం.
స్కిల్స్‌ను ఎందుకు అప్‌డేట్ చేసుకోవాలంటే..
- జాబ్ సెర్చింగ్‌లో మిగతా వారికంటే ముందు నిలవడానికి.
- జాబ్ మార్కెట్ స్వరూపం మారుతోంది.
- సంబంధిత రంగంపై మీకు ఉన్న అవగాహన కలుగుతుంది.
- జాబ్‌సెర్చింగ్‌లో ఆత్మవిశ్వాసం, విశ్వసనీయత పెరుగుతాయి.
- స్కిల్స్ పరంగా వచ్చే గ్యాప్‌ను నివారించవచ్చు.
No comments:
Post a Comment