Thursday 3 August 2017

కెరీర్‌లో తొలి అడుగులు తడబడకుండా


కెరీర్‌లో తొలి అడుగులు తడబడకుండా















                జీవితంలో మర్చిపోలేని సందర్భాల్లో కెరీర్‌ ప్రారంభం ఒకటి. ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలతో కెరీర్‌లో తొలి ప్రయాణం ప్రారంభమవుతుంది. జాబ్‌ వచ్చిన ఉత్సాహం, బాధ్యతయుతమైన ప్రొఫెషనల్‌ జీవితం ప్రారంభిస్తున్నామనే ఆనందం వెరసి కెరీర్‌ తొలి దశను అసక్తికరంగా మారుస్తుంది. భావి జీవితంలో చేరుకునే ఉన్నత శిఖరాలకు ఈ దశ పునాదిగా నిలుస్తుంది. ఇక్కడ అడుగులు తడబడితే కెరీర్‌ జర్నీ రాంగ్‌ రూట్‌లోకి వెళుతుంది. అప్పుడే జాబ్‌లో చేరిన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కెరీర్‌ను రైట్‌ ట్రాక్‌లో నడిపించాలంటే నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. వీటిని ఆచరించినప్పుడే కెరీర్‌ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా డెస్టినేషన్‌ను చేరుకుంటుంది. అందుకు ఏమి చేయాలో చుద్దాం...
 
ప్రొఫెషనల్‌ లైఫ్‌ కాలేజ్‌ లైఫ్‌ రెండూ భిన్నం. కంపెనీ కల్చర్‌లో సింక్‌ అవుతూ ఫైల్స్‌, ఎగ్జిక్యూషన్‌, ప్రాజెక్ట్స్‌, మీటింగ్స్‌ వంటి ప్రొఫెషనల్‌ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.
విమర్శను స్వీకరించాలి.
 
కెరీర్‌ తొలినాళ్లలో ప్రశంసలతోపాటు విమర్శలు కూడా రావడం సహజం. అయితే ప్రశంసను ఎలా పాజిటివ్‌గా తీసుకుంటామో విమర్శను కూడా అలాగే స్వీకరించాలి. విమర్శకు సిద్ధంగా లేకపోతే కెరీర్‌ రాంగ్‌ట్రాక్‌లోకి వెళుతుంది. ఎవరూ పనికట్టుకొని విమర్శించరు. ఉద్యోగంలో చేరిన కొత్తలో తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దే దిశగా మాత్రమే వ్యాఖ్యానిస్తారు. అంతే తప్ప వ్యక్తిగత అంశాలను దృష్టిలో ఉంచుకొని విమర్శ ఉండదు. కాబట్టి దానిని పాజిటివ్‌గా స్వీకరించాలి. తప్పును సరిదిద్దుకొని మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాలి. కెరీర్‌ అనే సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఈ జర్నీలో ఎదిగే క్రమంలో ఒదిగి ఉండటం నేర్చుకోవాలి.
 
పని తీరుతోనే
పని తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో చేతలే మాట్లాడాలి. నోరు కాదు. సాధ్యమైనంత వరకు కామ్‌గా కూల్‌గా అనవసర విషయాల జోలికి వెళ్లకుండా విధులు నిర్వహించాలి. ఒక్కోసారి సదరు వ్యక్తుల పనితో సంస్థకు మేలు జరిగి ఉండవచ్చు. అయితే దీన్ని మేనేజర్‌ గుర్తించకపోవచ్చు. అంతమాత్రన ప్రతి ఒక్కరి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించడం, ఎవరూ సాధించనిది మనం మాత్రమే చేశామనే అహంతో వ్యవహరించకూడదు. శ్రమకు ఫలితం వెంటనే రాకపోయినా .ఎప్పుడో ఒక్కసారి మాత్రం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. ఒక్కోసారి గుర్తింపు పొందాలనే తొందర్లో తప్పులు చేస్తుంటారు. కప్పిపుచ్చుకునే క్రమంలో మరో తప్పు ఇలా పునరావృతం అవుతుంటాయి. ఈ సందర్భంలో తప్పును ధైర్యంగా ఒప్పుకోవాలి. దీని వల్ల మొదట్లో కొంత వరకు ప్రతికూలత కనిపించినప్పటికీ కెరీర్‌లో ప్రారంభంలోనే తప్పును నిజాయితీగా ఒప్పుకునే గుణం మీపై పాజిటివ్‌ ఇంప్రెషన్‌ను క్రియేట్‌ చేస్తుంది.
 
భిన్నంగా
విద్యార్థి దశలో చదువు తప్ప ఎటువంటి బాధ్యతలు ఉండవు. అపరిమిత స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగ జీవితం సరిగ్గా దీనికి భిన్నం. ఉద్యోగిగా బాధ్యతలతోపాటు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. విద్యార్థి దశలో అన్నింటికీ టీచర్ల గైడెన్స్‌ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఇవి పరిమితం. విద్యార్థిలా ప్రతీదానికీ ఇతరులను సంప్రదించడం మంచిది కాదు.
 
తప్పనిసరైన సమయంలో మాత్రమే తోటి సహచరుల సహకారం తీసుకోవాలి. ఇచ్చిన సమయం/దానికంటే ముందు అందరిలా కాకుండా భిన్నంగా చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది.
 
అడాప్ట్‌ కల్చర్‌
ప్రతి కంపెనీకి తనదైన సొంత వర్క్‌ కల్చర్‌ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా దాన్ని అడాప్ట్‌ చేసుకోవాలి. పని వేళల నుంచి ఫైల్‌ ఎగ్జిక్యూషన్‌ వరకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వర్కింగ్‌ టైమ్‌, ఏం చేయాలి, ఏవిధంగా చేయాలి, సహోద్యోగులతో ఎలా ప్రవర్తించాలి, డ్రెస్‌కోడ్‌ వంటి అంశాల్లో కంపెనీ కల్చర్‌తో సింకవ్వాలి. అన్ని నిబంధనలు రాతపూర్వకంగా ఉండవు. కొన్నిటిపై అనుభవ పూర్వకంగా అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలో సీనియర్ల సలహాలు తీసుకోవచ్చు. సాధ్యమైనంత ఫెయిర్‌గా ఉండాలి.
 
నో పర్సనల్‌ వర్క్‌
చాలా మంది ఉద్యోగ నిర్వహణ టైమ్‌లో కూడా పర్సనల్‌ విషయాలతో బిజీగా కనిపిస్తుంటారు. వ్యక్తిగత మెయిల్స్‌ చెక్‌ చేస్తూ, సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ/చాట్‌ చేస్తూ బిజీగా ఉంటారు. ఆఫీస్‌ టైంలో ప్రొఫెషనల్‌ లైఫ్‌ను పర్సనల్‌ లైఫ్‌తో లింక్‌ చేయవద్దు. రెంటి మధ్య ఉండే సున్నితమైన పరిమితిని గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.
వర్క్‌ ప్లేస్‌లో సహచరులతో స్నేహ భావంతో ఉండటం తప్పులేదు. అంతేకానీ దాన్ని అవకాశంగా తీసుకుని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు.

No comments:

Post a Comment