Wednesday, 7 June 2017

ఇంగ్లిష్ గ్రామర్: Lesson # 2 : Regular Verbs – Irregular Verbs


ఇంగ్లిష్ గ్రామర్: Lesson # 2 : Regular Verbs – Irregular Verbs


        Verb అంటే ఏంటో lesson #1 లో నేర్చుకున్నారు. మీకు ఎన్ని ఎక్కువ verbs తెలిస్తే అంత మంచిది. Hope you are learning verbs!
ఈరోజు, REGULAR VERBS అంటే ఏంటో, IRREGULAR VERBS అంటే ఏంటో తెలుసుకుందాం.
ప్రతి verb కి different forms ఉంటాయి. తెలుగైనా, ఇంగ్లిష్ ఐనా – సమయాన్ని బట్టి, పని జరిగే కాలాన్ని బట్టి  ఒక verb వివిధ రూపాల్లోకి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘తినడం’ అన్న తెలుగు verb కి……. తింటాను-తిన్నాను–తింటున్నాను–తినేసాను-తినబోతున్నాను లాంటి forms ఉన్నట్లే, English verbsకి కూడా different forms ఉంటాయి. అందులో ముఖ్యమైనవి
  1. present form లేదా infinitive form లేదా Base form (V1)
  2. past form (V2)
  3. past participle form (V3)
ఉదాహరణకి కిందున్న ఈ verbs ని గమనించండి.
Present/base/infinitive form (V1)         Past form                     (V2)Past participle form     (V3)
1. playplayedplayed
2. finishfinishedfinished
౩. stopstoppedstopped
4. gowentgone
5. buyboughtbought
6. cutcutcut

గమనించారా, మొదటి మూడు verbs (play, finish,stop)  ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. present form కి ed కలిసి past మరియు past participle forms ఏర్పడ్డాయి. ఇలా ఒక regular pattern ఉంది కాబట్టి ఆ verbs ని REGULAR VERBS అంటారు.
◊Present form +‘ed’ = past form మరియు past participle form (REGULAR VERBS)
ఆ తరువాత ఉన్న మూడు verbs (go, buy, cut) అలా లేవు. ఒక pattern అంటూ లేకుండా,  past form  మరియు past participle form ‘ed’ తో end కాకుండా ఉండే verbs ని IRREGULAR VERBS అంటారు.
◊No specific pattern (IRREGULAR VERBS)
So…… ఇంగ్లిష్ బాగా మాట్లాడాలంటే irregular verbs తెలిసి ఉండాలి…. ఖచ్చితంగా వచ్చి వుండాలి. Good న్యూస్ ఏంటంటే irregular verbs యొక్క సంఖ్యా చాలా చిన్నది. కొన్నే ఉన్నాయి. ఒక వందో, రెండొందలో ఉంటాయి. కొంచెం శ్రద్ధ పెడితే అవి నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. అయితే, …….Bad న్యూస్ ఏంటంటే , సంఖ్యా పరంగా కొన్నే ఉన్నా, మన రోజు వాడే verbs లో ఎక్కువ శాతం verbs ఇర్రెగులర్ వర్బ్స్. అవి సరిగ్గా రాకపోతే మన బండి అస్సలు ముందుకు సాగదు. I buyed, she teached, they cutted, I runned, she gived అంటూ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది, కదా?
అందుకే,………. రండి…. irregular verbs నేర్చుకుందాం. బాగా నేర్చుకుందాం. రెండు రెల్లెంత అంటే నాలుగు అని ఎంత ఖచ్చితంగా చెప్తామో, feel అనగానే feel – felt – felt అని, drive అనగానే drive – drove – driven అని అంతే టక్కున  చెప్పేలా perfect గా నేర్చుకుందాం.
కింద కొన్ని ముఖ్యమైన irregular verbs list ఉంది. అందులో 88  irregular verbs ఉన్నాయి. First, వీటితో మొదలు పెట్టండి. కొన్ని రోజులాగి Complete లిస్టు ‘englishbadi’ లోనే పోస్ట్ చేద్దాం.
ఇంట్లో ఉన్న ప్రతీ గ్రామర్ పుస్తకం లో, డిక్షనరిల్లో, ఇంటర్నెట్ లో “irregular verbs” లిస్టు ఉంటుంది. సేకరించండి,  కొంచెం కష్టపడండి. ఇష్టంగా నేర్చుకోండి.
గుర్తుంచుకోండి, Irregular verbs బాగా తెలిసి ఉండటం ముందు ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది. V1, V2, V3.. present, past, past participle…… మీ ఇష్టం వచ్చిన పేర్లతో పిలవండి. అభ్యంతరం లేదు. మీకు irregular verbs ఖచ్చితంగా వచ్చి ఉండాలి. That’s all.
Happy Learning!.
    V1
beat
  V2
beat (బీట్)
   V3
beaten
becomebecamebecome
beginbeganbegun
bendbentbent
bitebitbitten
blowblewblown
breakbrokebroken
bringbroughtbrought
buildbuiltbuilt
buyboughtbought
catchcaughtcaught
choosechosechosen
comecamecome
cutcutcut
dealdealtdealt
digdugdug
dodiddone
drawdrewdrawn
drinkdrankdrunk
drivedrovedriven
eatateeaten
fallfellfallen
feedfedfed
feelfeltfelt
fightfoughtfought
findfoundfound
flyflewflown
forgetforgotforgotten
forgiveforgaveforgiven
getgotgot/gotten
givegavegiven
gowentgone
growgrewgrown
hanghunghung
havehadhad
hearheardheard
hidehidhidden
hithithit
holdheldheld
keepkeptkept
kneelkneltknelt
knowknewknown
leadledled
leaveleftleft
lendlentlent
letletlet
lightlitlit
loselostlost
makemademade
meanmeantmeant
meetmetmet
putputput
readread (రెడ్)read (రెడ్)
rideroderidden
ringrangrung
riseroserisen
runranrun
seesawseen
seeksoughtsought
sellsoldsold
sendsentsent
setsetset
shakeshookshaken
shineshoneshone
shootshotshot
showshowedshowed/shown
shutshutshut
singsangsung
sinksanksunk
sitsatsat
sleepsleptslept
speakspokespoken
spreadspreadspread
standstoodstood
stealstolestolen
sweepsweptswept
swimswamswum
taketooktaken
teachtaughttaught
teartoretorn
thinkthoughtthought
throwthrewthrown
understandunderstoodunderstood
weepweptwept
winwonwon
weavewovewoven
winwonwon
writewrotewritten

No comments:

Post a Comment