Wednesday, 7 June 2017

Learn English through Short Stories


Learn English through Short Stories – చిన్న చిన్న కథలు చదువుతూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోండి.

Learn English through Short Stories

ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు చాలా మంది ఇచ్చే మొట్ట మొదటి సలహా… ఇంగ్లిష్ న్యూస్ పేపర్ రోజూ చదవమని. న్యూస్ పేపర్స్ చదవడం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపొతే
  • న్యూస్ పేపర్స్ లో ప్రచురితమయ్యే వార్తల పట్ల ఆసక్తి లేకపోవడం,
  • చాలా విషయాల పట్ల అసలు  అవగాహన లేకపోవడం,
  • ఉపయోగించే భాష కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండటం,
  • పూర్తిగా చదివే సమయం లేకపోవడం …………..
లాంటి కారణాల వాళ్ళ, ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న చాలా మందికి న్యూస్ పేపర్స్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడట్లేదు. అటువంటి వాళ్ళందరికీ “ఇంగ్లిష్ బడి” ఇచ్చే సలహా ” చిన్న చిన్న కథలు చదవండి” Of course, ఇంగ్లిష్ కథలు 🙂
కథలంటే అందరికీ ఇష్టమే. కథలు మనల్ని ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తాయి. ఆ అందమైన ఊహా ప్రపంచంలో, కథల్లోని పాత్రలతో పాటు మనమూ ఒక పాత్ర అయిపోవడం వాళ్ళ, ఆ కథల్లోని భాష, సంభాషణలు మన మనస్సులలో అలా నిలిచి పోతాయి. ఆ కథల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, వీలైనప్పుడు దగ్గరివాళ్లకు కథలు చెప్పడం వలన ఆ కథల్లోని భాష మనకు అలవాటు అవుతుంది.. అందుకే, చిన్న చిన్న కథలు చదవడం ప్రారంభించండి..
చిన్న కథల్ని, ఎంత చిన్నవైనా సరే, LKG, UKG పిల్లలకోసం రాసిన కథలైనా పరవాలేదు. చదవండి. ఒక పదీ ఇరవై కథలతో మీరు రెగ్యులర్ గా ప్రాక్టిస్ చేస్తే. మీ ఇంగ్లిష్ లో మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు.
కథలు చదువుతూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు పాటించాల్సిన  సూచనలు:
  • దాదాపు అన్ని కథలు మనకు తెలిసినవే ఉంటాయి. కథ తెలిసినా సరే…. చదవండి
  • ఒక కథ చదివి అర్థం కాగానే, ఓస్.. ఇంతేనా అని అనుకోకండి.
  • ఒకే  కథని  నాలుగైదు సార్లు చదవండి. ఓపికుంటే పది సార్లయినా పరవాలేదు.
  • కథల్లో వాడిన భాషని  జాగ్రత్తగా గమనించండి.
  • కళ్ళు మూస్కొని ఆ కథని మీకు మీరు చెప్పుకోవడానికి ట్రై చెయ్యండి.
  • సాధ్యమైనంత వరకు, కథలోని భాషను మార్చకండి – పదాలను, వాక్యాలని  ఉన్నవున్నట్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
  • మీ ఫ్రెండ్స్ కో, ఇంట్లో వాళ్ళకో,  ముఖ్యంగా, పిల్లలకు ఈ స్టోరీస్ ని చెప్పడం అలవాటు చేసుకోండి.
  • కథకి తగ్గట్లు, గొంతులో కొంచెం ఇమోషన్స్, మొఖంలో ఎక్స్ప్రెషన్స్ ఉండేట్లు చూసుకోండి.
  • వీలైతే అద్దం ముందు నిలబడి, ఆ కథల్ని మీకు మీరే చెప్పుకోవడానికి ప్రయత్నించండి.
……. ఇలా ప్రాక్టిస్ చేస్తే ఆయా కథల్లో వాడిన పదాలు,  ఎక్స్ప్రెషన్స్  మీకు తప్పకుండా గుర్తుండిపోతాయి. ఇప్పుడు వాటిని మీ సంభాషణల్లో,  స్వంత వాక్యాల్లో  ఉపయోగించండి. మొదట్లో కొంచెం కొత్తగా, ఇబ్బంది గా అనిపించినా,  “reading & retelling stories” మీ ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ ని చాలా డెవలప్ చేస్తుంది. ఖచ్చితంగా…….నో డౌట్ అబౌట్ ఇట్!
మరెందుకు ఆలస్యం. కథలు చదవడం, వినడం, చెప్పడం ప్రారంభించండి!
కింద ఉన్నవి – మీకోసం ఇంగ్లిష్ బడి సెలెక్ట్ చేసి, rewrite చేసిన కొన్ని కథలు. ఇంకా చాలా కథలు మీకందించాలనుకుంటున్నాం. We will add more short stories. ఇప్పటికైతే వీటితో ప్రారంభించండి. రోజుకొక్క స్టొరీ అయినా పరవాలేదు కాని క్రమం తప్పకుండా చదవండి. ఓపికతో ప్రాక్టిస్ చెయ్యండి. పది కథలు తీసుకొని, ఒక నెల రోజులు కష్టపడి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవడం బ్రహ్మవిద్యేం కాదని మీకే అర్థం అవుతుంది.
So, happy reading and happy learning.
English Through Short Stories – Story #1
English Through Short Stories – Story #2
English Through Short Stories – Story #3

No comments:

Post a Comment