ఇంగ్లిష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ సంగతి తరువాత, అసలు తెలుగులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?
కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది ‘ఇంగ్లిష్. ఇంగ్లిష్ సంగతి పక్కన పెట్టి, మనల్ని మనం మొదట ప్రశ్నించుకోవాల్సింది – “అసలు తెలుగులో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?” అని.
ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? మేం రొజూ మా కుటుంబసభ్యులతో, పక్కింటి వాళ్ళతో, క్లాసు మేట్స్ తో, కొలీగ్స్ తో, పరిచయస్తులతో తెలుగులో చక్కగా, అనర్గళంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కమ్యూనికేట్ చేస్తునే ఉన్నాం కదా అని అనుకుంటున్నారా?
ఐతే ఒక్క నిమిషం ఆగండి.
మన ఫ్యామిలీ మెంబర్స్ తో, తెల్సిన వాళ్ళతో- ఎలా ఉన్నారు?, ఏం చేస్తున్నారు?, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అని మాట్లాడడం ఇన్ ఫార్మల్, transactional కమ్యూనికేషన్. చాలా మంది ఈ పని బాగానే చేస్తారు. కేవలం ఇదొక్కటే సరిపోదు. జీవితం లో మనం చాలా సార్లు కొత్త వ్యక్తులతో, మనకన్నా పై స్థాయిలో ఉన్న వారితో, విభిన్న మైన పరిస్తితుల్లో కొన్నిసార్లు కష్టమైన, క్లిష్టమైన సందర్భాలలో ( తెలుగు లోనే) మాట్లాడాల్సి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు:
• పైన ప్రస్తావించిన సిచుయేషన్స్ లో చక్కగా , ధైర్యంగా, ఎటువంటి భయం లేకుండా తెలుగులో మాట్లాడగలుగుతారా?
• ఒక పదిమంది కొత్తవారి ముందు మీకు బాగా తెల్సిన ఒక విషయాన్ని తెలుగులో వివరించగలుగుతారా?
• రైల్వే స్టేషన్ లోనో, బస్టాండ్ లోనో, ఒక కొత్త వ్యక్తి తో తెలుగులో సంభాషణ మొదలుపెట్టి, ఒక అర్ధగంట సేపు చక్కగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నైపుణ్యం మనలో ఎంత మందికుంది?

ఇంగ్లిష్ బాగా నేర్చుకొని, అందులో చక్కగా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మాతృభాషలోనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా లేనప్పుడు, ఎన్ని భాషలు నేర్చుకున్నా, వాటిల్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా బాగుండవు.
సో, భాషా పరిజ్ఞానం వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు అని గమనించండి. ఇంగ్లీష్ కంటే ముందు, మీ తెలుగును, తెలుగులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందింపచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా!
No comments:
Post a Comment