ఇంగ్లిష్ గ్రామర్: Lesson # 2 : Regular Verbs – Irregular Verbs
Verb అంటే ఏంటో lesson #1 లో నేర్చుకున్నారు. మీకు ఎన్ని ఎక్కువ verbs తెలిస్తే అంత మంచిది. Hope you are learning verbs!
ఈరోజు, REGULAR VERBS అంటే ఏంటో, IRREGULAR VERBS అంటే ఏంటో తెలుసుకుందాం.
ప్రతి verb కి different forms ఉంటాయి. తెలుగైనా, ఇంగ్లిష్ ఐనా – సమయాన్ని బట్టి, పని జరిగే కాలాన్ని బట్టి ఒక verb వివిధ రూపాల్లోకి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘తినడం’ అన్న తెలుగు verb కి……. తింటాను-తిన్నాను–తింటున్నాను–తినేసాను-తినబోతున్నాను లాంటి forms ఉన్నట్లే, English verbsకి కూడా different forms ఉంటాయి. అందులో ముఖ్యమైనవి
- present form లేదా infinitive form లేదా Base form (V1)
- past form (V2)
- past participle form (V3)
ఉదాహరణకి కిందున్న ఈ verbs ని గమనించండి.
Present/base/infinitive form (V1) | Past form (V2) | Past participle form (V3) |
1. play | played | played |
2. finish | finished | finished |
౩. stop | stopped | stopped |
4. go | went | gone |
5. buy | bought | bought |
6. cut | cut | cut |
గమనించారా, మొదటి మూడు verbs (play, finish,stop) ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. present form కి ‘ed’ కలిసి past మరియు past participle forms ఏర్పడ్డాయి. ఇలా ఒక regular pattern ఉంది కాబట్టి ఆ verbs ని REGULAR VERBS అంటారు.
◊Present form +‘ed’ = past form మరియు past participle form (REGULAR VERBS)
ఆ తరువాత ఉన్న మూడు verbs (go, buy, cut) అలా లేవు. ఒక pattern అంటూ లేకుండా, past form మరియు past participle form ‘ed’ తో end కాకుండా ఉండే verbs ని IRREGULAR VERBS అంటారు.
◊No specific pattern (IRREGULAR VERBS)
So…… ఇంగ్లిష్ బాగా మాట్లాడాలంటే irregular verbs తెలిసి ఉండాలి…. ఖచ్చితంగా వచ్చి వుండాలి. Good న్యూస్ ఏంటంటే irregular verbs యొక్క సంఖ్యా చాలా చిన్నది. కొన్నే ఉన్నాయి. ఒక వందో, రెండొందలో ఉంటాయి. కొంచెం శ్రద్ధ పెడితే అవి నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. అయితే, …….Bad న్యూస్ ఏంటంటే , సంఖ్యా పరంగా కొన్నే ఉన్నా, మన రోజు వాడే verbs లో ఎక్కువ శాతం verbs ఇర్రెగులర్ వర్బ్స్. అవి సరిగ్గా రాకపోతే మన బండి అస్సలు ముందుకు సాగదు. I buyed, she teached, they cutted, I runned, she gived అంటూ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది, కదా?
అందుకే,………. రండి…. irregular verbs నేర్చుకుందాం. బాగా నేర్చుకుందాం. రెండు రెల్లెంత అంటే నాలుగు అని ఎంత ఖచ్చితంగా చెప్తామో, feel అనగానే feel – felt – felt అని, drive అనగానే drive – drove – driven అని అంతే టక్కున చెప్పేలా perfect గా నేర్చుకుందాం.
కింద కొన్ని ముఖ్యమైన irregular verbs list ఉంది. అందులో 88 irregular verbs ఉన్నాయి. First, వీటితో మొదలు పెట్టండి. కొన్ని రోజులాగి Complete లిస్టు ‘englishbadi’ లోనే పోస్ట్ చేద్దాం.
ఇంట్లో ఉన్న ప్రతీ గ్రామర్ పుస్తకం లో, డిక్షనరిల్లో, ఇంటర్నెట్ లో “irregular verbs” లిస్టు ఉంటుంది. సేకరించండి, కొంచెం కష్టపడండి. ఇష్టంగా నేర్చుకోండి.
గుర్తుంచుకోండి, Irregular verbs బాగా తెలిసి ఉండటం ముందు ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది. V1, V2, V3.. present, past, past participle…… మీ ఇష్టం వచ్చిన పేర్లతో పిలవండి. అభ్యంతరం లేదు. మీకు irregular verbs ఖచ్చితంగా వచ్చి ఉండాలి. That’s all.
Happy Learning!.
V1
beat
|
V2
beat (బీట్)
|
V3
beaten
|
become | became | become |
begin | began | begun |
bend | bent | bent |
bite | bit | bitten |
blow | blew | blown |
break | broke | broken |
bring | brought | brought |
build | built | built |
buy | bought | bought |
catch | caught | caught |
choose | chose | chosen |
come | came | come |
cut | cut | cut |
deal | dealt | dealt |
dig | dug | dug |
do | did | done |
draw | drew | drawn |
drink | drank | drunk |
drive | drove | driven |
eat | ate | eaten |
fall | fell | fallen |
feed | fed | fed |
feel | felt | felt |
fight | fought | fought |
find | found | found |
fly | flew | flown |
forget | forgot | forgotten |
forgive | forgave | forgiven |
get | got | got/gotten |
give | gave | given |
go | went | gone |
grow | grew | grown |
hang | hung | hung |
have | had | had |
hear | heard | heard |
hide | hid | hidden |
hit | hit | hit |
hold | held | held |
keep | kept | kept |
kneel | knelt | knelt |
know | knew | known |
lead | led | led |
leave | left | left |
lend | lent | lent |
let | let | let |
light | lit | lit |
lose | lost | lost |
make | made | made |
mean | meant | meant |
meet | met | met |
put | put | put |
read | read (రెడ్) | read (రెడ్) |
ride | rode | ridden |
ring | rang | rung |
rise | rose | risen |
run | ran | run |
see | saw | seen |
seek | sought | sought |
sell | sold | sold |
send | sent | sent |
set | set | set |
shake | shook | shaken |
shine | shone | shone |
shoot | shot | shot |
show | showed | showed/shown |
shut | shut | shut |
sing | sang | sung |
sink | sank | sunk |
sit | sat | sat |
sleep | slept | slept |
speak | spoke | spoken |
spread | spread | spread |
stand | stood | stood |
steal | stole | stolen |
sweep | swept | swept |
swim | swam | swum |
take | took | taken |
teach | taught | taught |
tear | tore | torn |
think | thought | thought |
throw | threw | thrown |
understand | understood | understood |
weep | wept | wept |
win | won | won |
weave | wove | woven |
win | won | won |
write | wrote | written |