Wednesday, 7 June 2017

ఇంగ్లిష్ గ్రామర్: Lesson # 2 : Regular Verbs – Irregular Verbs


ఇంగ్లిష్ గ్రామర్: Lesson # 2 : Regular Verbs – Irregular Verbs


        Verb అంటే ఏంటో lesson #1 లో నేర్చుకున్నారు. మీకు ఎన్ని ఎక్కువ verbs తెలిస్తే అంత మంచిది. Hope you are learning verbs!
ఈరోజు, REGULAR VERBS అంటే ఏంటో, IRREGULAR VERBS అంటే ఏంటో తెలుసుకుందాం.
ప్రతి verb కి different forms ఉంటాయి. తెలుగైనా, ఇంగ్లిష్ ఐనా – సమయాన్ని బట్టి, పని జరిగే కాలాన్ని బట్టి  ఒక verb వివిధ రూపాల్లోకి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘తినడం’ అన్న తెలుగు verb కి……. తింటాను-తిన్నాను–తింటున్నాను–తినేసాను-తినబోతున్నాను లాంటి forms ఉన్నట్లే, English verbsకి కూడా different forms ఉంటాయి. అందులో ముఖ్యమైనవి
  1. present form లేదా infinitive form లేదా Base form (V1)
  2. past form (V2)
  3. past participle form (V3)
ఉదాహరణకి కిందున్న ఈ verbs ని గమనించండి.
Present/base/infinitive form (V1)         Past form                     (V2)Past participle form     (V3)
1. playplayedplayed
2. finishfinishedfinished
౩. stopstoppedstopped
4. gowentgone
5. buyboughtbought
6. cutcutcut

గమనించారా, మొదటి మూడు verbs (play, finish,stop)  ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. present form కి ed కలిసి past మరియు past participle forms ఏర్పడ్డాయి. ఇలా ఒక regular pattern ఉంది కాబట్టి ఆ verbs ని REGULAR VERBS అంటారు.
◊Present form +‘ed’ = past form మరియు past participle form (REGULAR VERBS)
ఆ తరువాత ఉన్న మూడు verbs (go, buy, cut) అలా లేవు. ఒక pattern అంటూ లేకుండా,  past form  మరియు past participle form ‘ed’ తో end కాకుండా ఉండే verbs ని IRREGULAR VERBS అంటారు.
◊No specific pattern (IRREGULAR VERBS)
So…… ఇంగ్లిష్ బాగా మాట్లాడాలంటే irregular verbs తెలిసి ఉండాలి…. ఖచ్చితంగా వచ్చి వుండాలి. Good న్యూస్ ఏంటంటే irregular verbs యొక్క సంఖ్యా చాలా చిన్నది. కొన్నే ఉన్నాయి. ఒక వందో, రెండొందలో ఉంటాయి. కొంచెం శ్రద్ధ పెడితే అవి నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. అయితే, …….Bad న్యూస్ ఏంటంటే , సంఖ్యా పరంగా కొన్నే ఉన్నా, మన రోజు వాడే verbs లో ఎక్కువ శాతం verbs ఇర్రెగులర్ వర్బ్స్. అవి సరిగ్గా రాకపోతే మన బండి అస్సలు ముందుకు సాగదు. I buyed, she teached, they cutted, I runned, she gived అంటూ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది, కదా?
అందుకే,………. రండి…. irregular verbs నేర్చుకుందాం. బాగా నేర్చుకుందాం. రెండు రెల్లెంత అంటే నాలుగు అని ఎంత ఖచ్చితంగా చెప్తామో, feel అనగానే feel – felt – felt అని, drive అనగానే drive – drove – driven అని అంతే టక్కున  చెప్పేలా perfect గా నేర్చుకుందాం.
కింద కొన్ని ముఖ్యమైన irregular verbs list ఉంది. అందులో 88  irregular verbs ఉన్నాయి. First, వీటితో మొదలు పెట్టండి. కొన్ని రోజులాగి Complete లిస్టు ‘englishbadi’ లోనే పోస్ట్ చేద్దాం.
ఇంట్లో ఉన్న ప్రతీ గ్రామర్ పుస్తకం లో, డిక్షనరిల్లో, ఇంటర్నెట్ లో “irregular verbs” లిస్టు ఉంటుంది. సేకరించండి,  కొంచెం కష్టపడండి. ఇష్టంగా నేర్చుకోండి.
గుర్తుంచుకోండి, Irregular verbs బాగా తెలిసి ఉండటం ముందు ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది. V1, V2, V3.. present, past, past participle…… మీ ఇష్టం వచ్చిన పేర్లతో పిలవండి. అభ్యంతరం లేదు. మీకు irregular verbs ఖచ్చితంగా వచ్చి ఉండాలి. That’s all.
Happy Learning!.
    V1
beat
  V2
beat (బీట్)
   V3
beaten
becomebecamebecome
beginbeganbegun
bendbentbent
bitebitbitten
blowblewblown
breakbrokebroken
bringbroughtbrought
buildbuiltbuilt
buyboughtbought
catchcaughtcaught
choosechosechosen
comecamecome
cutcutcut
dealdealtdealt
digdugdug
dodiddone
drawdrewdrawn
drinkdrankdrunk
drivedrovedriven
eatateeaten
fallfellfallen
feedfedfed
feelfeltfelt
fightfoughtfought
findfoundfound
flyflewflown
forgetforgotforgotten
forgiveforgaveforgiven
getgotgot/gotten
givegavegiven
gowentgone
growgrewgrown
hanghunghung
havehadhad
hearheardheard
hidehidhidden
hithithit
holdheldheld
keepkeptkept
kneelkneltknelt
knowknewknown
leadledled
leaveleftleft
lendlentlent
letletlet
lightlitlit
loselostlost
makemademade
meanmeantmeant
meetmetmet
putputput
readread (రెడ్)read (రెడ్)
rideroderidden
ringrangrung
riseroserisen
runranrun
seesawseen
seeksoughtsought
sellsoldsold
sendsentsent
setsetset
shakeshookshaken
shineshoneshone
shootshotshot
showshowedshowed/shown
shutshutshut
singsangsung
sinksanksunk
sitsatsat
sleepsleptslept
speakspokespoken
spreadspreadspread
standstoodstood
stealstolestolen
sweepsweptswept
swimswamswum
taketooktaken
teachtaughttaught
teartoretorn
thinkthoughtthought
throwthrewthrown
understandunderstoodunderstood
weepweptwept
winwonwon
weavewovewoven
winwonwon
writewrotewritten

How to introduce yourself


How to introduce yourself – తప్పుల్లేకుండా, తడబడకుండా.

Learn and master the art of self introduction
ఈ పోటి ప్రపంచంలో మనల్ని మనం market చేసుకుంటూనే ఉండాలి, పర్సనల్ లైఫ్ లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా మనల్ని మనం చక్కగా, ప్రభావితం చేసేట్లుగా  పరిచయం చేసుకోవడం తప్పనిసరి. Self Introduction is one of the very important marketing tools.
చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇంజినీరింగ్ లు, ఎంబీఏలు, ఎమ్మెస్సిలు చేసిన చాల మంది తప్పులు లేకుండా, అంటే basic grammar mistakes లేకుండా ఇంగ్లిష్ లో తమల్ని తాము introduce చేసుకోలేకపోతున్నారు. సహజంగానే,  ఇది వాళ్ళ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది. Myself  XXXX, I was completed my engineering last year, my hobbies is  XXXX అని చెప్తే, ఎవరైనా ఎలా ఉద్యోగం ఇస్తారు చెప్పండి. అదీ 10 – 12 సంవత్సరాలు ఇంగ్లిష్ మీడియం లో చదివినవిద్యార్థులు.  వాళ్ళ గ్రామర్ అలా ఉండడం చాలా దురదృష్టకరం.
కొంచెం observation, కొంచెం preparation తో ఈ సమస్య ను solve చేసెయ్యొచ్చు.
  1. కిందున్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని చదవండి.
  2. అందులో మీకు సరిపోయే, మీ introduction కి ఉపయోగపడే, వాక్యాల్ని తీసుకొని చిన్న చిన్న మార్పులతో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ను రాసుకోండి.
  3. మీ ఓపిక ను బట్టి, రెండు మూడు versions of introduction ప్రిపేర్ చేసుకోండి ( ఒకటి సంక్షిప్తంగా, ఇంకొకటి కొంచెం డిటైల్డ్ గా, మరొకటి చాలా డిటైల్డ్ గా. అవసరాన్ని బట్టి ఏదో ఒక version వాడొచ్చు.)
  4. మీరు రాసింది వీలైతే, ఎవరితోనైనా కరెక్ట్ చేయించుకోండి.
  5. స్రిప్ట్ రెడీ అయిన తరువాత , దాన్ని ప్రాక్టిస్  చెయ్యండి. మీరు బాగా ప్రిపేర్ అయి అయ్యి వచ్చారు అన్న విషయం మిమ్మల్ని interview చేసేవాళ్ళకి తెలియనియ్యనంత నేచురల్ గా మీరు self introduce చేసుకోవాలి.
  6. మొదట కరెక్ట్ గా, ఎలాంటి  గ్రామర్ మిస్టేక్స్ లేకుండా introduce చేసుకోవడం నేర్చుకొని, ఆ తరువాత effective గా చెప్పడం నేర్చుకోండి.
ఇంత అవసరమా అనుకుంటున్నారా? ఇంటర్వ్యూలలో “Introduce yourself? ” అన్న మొదటి ప్రశ్నకే సరిగా జవాబివ్వక, మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న వందల, వేల ( లక్షల?) మంది లో మీరు ఉండకూడదనుకుంటే ఈ మాత్రం preparation అవసరమే.
Expressions:
  • I am XXXX.
  • My name is XXXX.
  • ( Imp: Please DO NOT say- Myself XXXX, It is incorrect)

  • I am from XXXX.
  • My native is XXXX.
  • I hail from XXXX.
  • I am from XXXX. Currently, I am staying in ABCD
  • I was born and brought up in XXXX

  • At present , I am studying XXXX in ABCD college/uiniversity.
  • At present, I am pursuing B.Tech in Mechanical Engineering from XXXXX University.
  • I am pursuing electronics and communication engineering in XYZ college/ABC university
  • I am pursuing Post Graduation from XXXX university
  • I am an engineering graduate from XXXX university.
  • I have completed graduation …….
  • I have just finished my post graduation in Computer Science from XXXX university.
  • I completed  B.Tech in 2014 from XXXX university.
  • I have done an internship with XXXX (Company name)

  • I am 21 years old
  • I am 21…..

  • I am from an agricultural family.
  • I hail from an agricultural family.
  • I belong to an agricultural family.

  • My father’s name is …….
  • My mother’s name is ………..
  • My father is a businessman/a farmer/a government employee/ a private employee/ a labourer/ a retired government employee
  • My mother is a businesswoman/ a farmer/ a house wife/ a home maker/ a domestic engineer/

  • Ours is a nuclear family…… Ours is a joint family.
  • My family consists of four members: my father, my mother, an elder sister and me.
  • There are four members in my family: my father, mother, a younger brother and me.

  • I have two siblings…… a sister and a brother. Both are elder to me.
  • I have an elder brother and a younger sister
  • I have two elder sisters.
  • I am the youngest in my family.
  • I have two brothers and I am the eldest.
  • I have two brothers and I am the youngest.
  • I have an elder sister and a younger brother.
  • My elder sister is married
  • My younger brother is pursuing engineering.
  • I have two younger sisters. The elder of the two is in intermediate and the other is in 10th

  • My hobbies are playing cricket and watching TV.
  • My hobbies are listening to music and reading books.
  • My hobby is watching TV.
  • Playing chess is hobby.
  • My hobbies are listening to music, reading books and watching movies.
  • I am interested in watching movies and collecting stamps.
  • I am interested in making friends and surfing the internet.
  • I love gardening.
  • I love playing with my pet dog.
  • I love spending time with my friends.
  • I like playing games on mobile….
  • In my free time, I help my father in his business.
  • In my free time, I love watching TV.
  • Playing chess is my favourite pastime.
  • Cooking is my favourite pastime.

  • My strengths are sincerity and hardworking nature.
  • My strength is self-confidence.
  • Strong communication skills are my greatest strength.
  • Knowledge in computers is my strength.
  • I have a positive attitude towards life.

  • I am good at marketing.
  • I have a good command over computer networking.
  • I have good analytical skills.
  • I am a team player…..
  • I’m very results-driven
  • I am proud of my communication skills

  • Doing a good job and achieving the desired end result is my primary motivation…..

  • My aim is to get a government job.
  • My aim is to become a government teacher.
  • My aim is to be a successful business woman.
  • I want to become a software engineer
  • I would like to be an IAS officer.

ఇంగ్లిష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ సంగతి తరువాత, అసలు తెలుగులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?


ఇంగ్లిష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ సంగతి తరువాత, అసలు తెలుగులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?

          కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది ‘ఇంగ్లిష్.  ఇంగ్లిష్ సంగతి పక్కన పెట్టి, మనల్ని మనం మొదట ప్రశ్నించుకోవాల్సింది – “అసలు తెలుగులో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?” అని.
ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? మేం రొజూ మా కుటుంబసభ్యులతో, పక్కింటి వాళ్ళతో, క్లాసు మేట్స్ తో, కొలీగ్స్ తో, పరిచయస్తులతో తెలుగులో చక్కగా, అనర్గళంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కమ్యూనికేట్ చేస్తునే ఉన్నాం కదా అని అనుకుంటున్నారా?
ఐతే ఒక్క నిమిషం ఆగండి.
మన ఫ్యామిలీ మెంబర్స్ తో, తెల్సిన వాళ్ళతో- ఎలా ఉన్నారు?, ఏం చేస్తున్నారు?, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అని మాట్లాడడం ఇన్ ఫార్మల్, transactional కమ్యూనికేషన్. చాలా మంది ఈ పని బాగానే చేస్తారు. కేవలం ఇదొక్కటే సరిపోదు. జీవితం లో మనం చాలా సార్లు కొత్త వ్యక్తులతో, మనకన్నా పై స్థాయిలో ఉన్న వారితో, విభిన్న మైన పరిస్తితుల్లో  కొన్నిసార్లు కష్టమైన, క్లిష్టమైన సందర్భాలలో ( తెలుగు లోనే) మాట్లాడాల్సి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు:
•  పైన ప్రస్తావించిన సిచుయేషన్స్ లో చక్కగా , ధైర్యంగా, ఎటువంటి భయం లేకుండా తెలుగులో మాట్లాడగలుగుతారా?
• ఒక పదిమంది కొత్తవారి ముందు మీకు బాగా తెల్సిన ఒక విషయాన్ని తెలుగులో వివరించగలుగుతారా?
• రైల్వే స్టేషన్ లోనో, బస్టాండ్ లోనో, ఒక కొత్త వ్యక్తి తో తెలుగులో సంభాషణ మొదలుపెట్టి, ఒక అర్ధగంట సేపు చక్కగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నైపుణ్యం మనలో ఎంత మందికుంది?
ఇంగ్లిష్ బాగా నేర్చుకొని, అందులో చక్కగా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మాతృభాషలోనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా లేనప్పుడు, ఎన్ని భాషలు నేర్చుకున్నా, వాటిల్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా బాగుండవు.
సో, భాషా పరిజ్ఞానం వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు అని గమనించండి. ఇంగ్లీష్ కంటే ముందు, మీ తెలుగును, తెలుగులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందింపచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా!

24 Basic English Questions

24 Basic English Questions


24 Basic English Questions
రోజూ మనం ఎందర్నో ఎన్నో ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంగ్లిష్లో… అయితే ఇంగ్లిష్ లో ఎలా  అడగాలో అర్థం కాక, చాలా మంది అసలు అడగడమే మానేస్తుంటారు.
కింద ఉన్న ఈ 24  బేసిక్ ఇంగ్లీష్ ప్రశ్నల్ని ఒకసారి చూడండి. వీలైతే, ఇంకోసారి చదవండి. మీరు ఇంతవరకు వాడని కొత్త ఎక్స్ప్రెషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాక్టిస్ చెయ్యండి. ఇవన్ని తెలిసినవే కదా అని తీసిపారెయ్యకండి.
తెలియడం వేరు, రెగ్యులర్ గా వాడటం వేరు, కదా?
  1. What’s your name?
  2. Where are you from? / Where do you come from? / What’s your native place?
  3. Where do you live? Where do you stay?
  4. What’s your phone/cell  number? / What’s your mobile number?
  5. How old are you?
  6. When were you born?/ Where were you born?
  7. When did you complete your SSC/intermediate/graduation/post graduation?
  8. How is life? / How are you?/ How are you doing?/ What’s up?
  9. What do you do? / What’s your job?
  10. What does your father do?/ What does your mother do?
  11. Where is your office/college?
  12. How do you go to office/college?
  13. How far is it from here?
  14. How long does it take to go there?
  15. How do you travel?/ How do you commute?
  16. What are your hobbies?
  17. How often do you watch movies/visit your native place/eat outside?
  18. What time is it? What’s the time?
  19. Where is the nearest ATM/  bank / supermarket / pharmacy / etc.?
  20. Whose is this /Whose is that?
  21. What’s it about?
  22. What happened?
  23. How is it?
  24. What are you doing tomorrow / this evening / next week/etc ?
On a lighter note: ఇరవై నాలుగే ఎందుకు అంటారా, మరీ అంత ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయకండి బాస్! 24 is just a number. That’s all.  ఈ 24 కి సూర్య హిట్ సినిమా కి ఎలాంటి సంబంధం లేదు:) ఇప్పటికి 24 ప్రశ్నలు. మిగతావేమైనా ఉంటే, ఇంకో ఆర్టికల్లో include చేద్దాం, సరేనా? 🙂

Learn English through Short Stories


Learn English through Short Stories – చిన్న చిన్న కథలు చదువుతూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోండి.

Learn English through Short Stories

ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు చాలా మంది ఇచ్చే మొట్ట మొదటి సలహా… ఇంగ్లిష్ న్యూస్ పేపర్ రోజూ చదవమని. న్యూస్ పేపర్స్ చదవడం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపొతే
  • న్యూస్ పేపర్స్ లో ప్రచురితమయ్యే వార్తల పట్ల ఆసక్తి లేకపోవడం,
  • చాలా విషయాల పట్ల అసలు  అవగాహన లేకపోవడం,
  • ఉపయోగించే భాష కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండటం,
  • పూర్తిగా చదివే సమయం లేకపోవడం …………..
లాంటి కారణాల వాళ్ళ, ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న చాలా మందికి న్యూస్ పేపర్స్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడట్లేదు. అటువంటి వాళ్ళందరికీ “ఇంగ్లిష్ బడి” ఇచ్చే సలహా ” చిన్న చిన్న కథలు చదవండి” Of course, ఇంగ్లిష్ కథలు 🙂
కథలంటే అందరికీ ఇష్టమే. కథలు మనల్ని ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తాయి. ఆ అందమైన ఊహా ప్రపంచంలో, కథల్లోని పాత్రలతో పాటు మనమూ ఒక పాత్ర అయిపోవడం వాళ్ళ, ఆ కథల్లోని భాష, సంభాషణలు మన మనస్సులలో అలా నిలిచి పోతాయి. ఆ కథల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, వీలైనప్పుడు దగ్గరివాళ్లకు కథలు చెప్పడం వలన ఆ కథల్లోని భాష మనకు అలవాటు అవుతుంది.. అందుకే, చిన్న చిన్న కథలు చదవడం ప్రారంభించండి..
చిన్న కథల్ని, ఎంత చిన్నవైనా సరే, LKG, UKG పిల్లలకోసం రాసిన కథలైనా పరవాలేదు. చదవండి. ఒక పదీ ఇరవై కథలతో మీరు రెగ్యులర్ గా ప్రాక్టిస్ చేస్తే. మీ ఇంగ్లిష్ లో మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు.
కథలు చదువుతూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు పాటించాల్సిన  సూచనలు:
  • దాదాపు అన్ని కథలు మనకు తెలిసినవే ఉంటాయి. కథ తెలిసినా సరే…. చదవండి
  • ఒక కథ చదివి అర్థం కాగానే, ఓస్.. ఇంతేనా అని అనుకోకండి.
  • ఒకే  కథని  నాలుగైదు సార్లు చదవండి. ఓపికుంటే పది సార్లయినా పరవాలేదు.
  • కథల్లో వాడిన భాషని  జాగ్రత్తగా గమనించండి.
  • కళ్ళు మూస్కొని ఆ కథని మీకు మీరు చెప్పుకోవడానికి ట్రై చెయ్యండి.
  • సాధ్యమైనంత వరకు, కథలోని భాషను మార్చకండి – పదాలను, వాక్యాలని  ఉన్నవున్నట్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
  • మీ ఫ్రెండ్స్ కో, ఇంట్లో వాళ్ళకో,  ముఖ్యంగా, పిల్లలకు ఈ స్టోరీస్ ని చెప్పడం అలవాటు చేసుకోండి.
  • కథకి తగ్గట్లు, గొంతులో కొంచెం ఇమోషన్స్, మొఖంలో ఎక్స్ప్రెషన్స్ ఉండేట్లు చూసుకోండి.
  • వీలైతే అద్దం ముందు నిలబడి, ఆ కథల్ని మీకు మీరే చెప్పుకోవడానికి ప్రయత్నించండి.
……. ఇలా ప్రాక్టిస్ చేస్తే ఆయా కథల్లో వాడిన పదాలు,  ఎక్స్ప్రెషన్స్  మీకు తప్పకుండా గుర్తుండిపోతాయి. ఇప్పుడు వాటిని మీ సంభాషణల్లో,  స్వంత వాక్యాల్లో  ఉపయోగించండి. మొదట్లో కొంచెం కొత్తగా, ఇబ్బంది గా అనిపించినా,  “reading & retelling stories” మీ ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ ని చాలా డెవలప్ చేస్తుంది. ఖచ్చితంగా…….నో డౌట్ అబౌట్ ఇట్!
మరెందుకు ఆలస్యం. కథలు చదవడం, వినడం, చెప్పడం ప్రారంభించండి!
కింద ఉన్నవి – మీకోసం ఇంగ్లిష్ బడి సెలెక్ట్ చేసి, rewrite చేసిన కొన్ని కథలు. ఇంకా చాలా కథలు మీకందించాలనుకుంటున్నాం. We will add more short stories. ఇప్పటికైతే వీటితో ప్రారంభించండి. రోజుకొక్క స్టొరీ అయినా పరవాలేదు కాని క్రమం తప్పకుండా చదవండి. ఓపికతో ప్రాక్టిస్ చెయ్యండి. పది కథలు తీసుకొని, ఒక నెల రోజులు కష్టపడి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవడం బ్రహ్మవిద్యేం కాదని మీకే అర్థం అవుతుంది.
So, happy reading and happy learning.
English Through Short Stories – Story #1
English Through Short Stories – Story #2
English Through Short Stories – Story #3

ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే, ఏదైనా స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం తప్పనిసరా?


ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే, ఏదైనా స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం తప్పనిసరా?


             మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడ్డం వస్తే మీ విజయావకాశాలు ఎక్కువ అవుతాయని మీరు అర్థం చేసుకున్నారు. సంతోషం. Congratulations and all the best.
థాంక్స్,  కానీ……… ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏదైనా స్పోకెన్ ఇంగీష్ ఇన్స్టిట్యూట్ కి తప్పనిసరిగా వెళ్ళాలా అని అడుగుతున్నారా?  ఐతే  ఇది చదవండి.
ఖచ్చితంగా ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ‘మాత్రమె ‘ ఇంగ్లిష్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎలా నేర్చుకోవాలో తెలిసి, మీ పట్టుదలకు, కొంచెం మోటివేషన్ను కలిపి, శ్రద్ధగా, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే, ఎక్కడికి వెళ్ళకుండానే ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడ్డం నేర్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళందరూ జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా?
అయితే, ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళే సమయం మీకుండి, కోర్సు ఫీజ్ కు కావాల్సిన డబ్బులు మీకు ప్రాబ్లం కాకపొతే ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని ఎంచుకొని రెగ్యులర్ అటెండ్ అవుతూ మీరు ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. మీలాంటి వాళ్ళు, ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళే ఈ కోర్స్ లకు వస్తారు కాబట్టి మీ క్లాస్మేట్స్ మీ ఇంగ్లిష్ ప్రాక్టీసు లో బాగా ఉపయోగపడుతారు.
అయితే, స్పోకెన్ ఇంగీష్ టీచర్ ను, ఇన్స్టిట్యూట్ ను, ఎంచుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించండి. ప్రకటనలను, ఫాల్స్  ప్రామిస్ లను చూసి మోసపోకండి. గుర్తుంచుకోండి… ఒక భాష నేర్చుకోవడం కొన్ని గంటల్లోనో, మున్నాలుగు వారాళ్లోనో జరిగే పని కాదు. ఇట్ టేక్స్ టైం. అలాగే,  ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ క్లాసు లో అయినా టీచర్ తక్కువగా మాట్లాడాలి, స్టూడెంట్స్ కి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉండాలి. టీచర్ ఎంత సేపటికి గ్రామర్ కాన్సెప్ట్స్ చెప్పడం మాత్రమే చేస్తే మీరు ఇంగ్లిష్ గ్రామర్ లో perfect అవుతారేమో గాని, ఇంగ్లిష్ లో మాట్లాడడం మాత్రం రాదు. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ ల  వలన కలిగే లాభం చాలా తక్కువ.
కాబట్టి, ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ కావడానికి ముందు, దాన్ని గూర్చికొంచెం రిసెర్చ్ చెయ్యండి.  ఇంతకుముందు ఆ ఇన్స్టిట్యూట్లో చదివినవాల్లని కలిసి ఆ ఇన్స్టిట్యూట్ గూర్చి & టీచర్ గురించి తెలుసుకోండి.
  • క్లాస్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు?
  • అసలు ఆ టీచర్/ టీచర్స్ ఎంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడతారు?
  • ఆ ఇన్స్టిట్యుట్ లో స్టూడెంట్స్ తో మాట్లాడిస్తారా లేదా?
  • స్టూడెంట్స్ మాట్లాడిన తరువాత క్వాలిటీ ఫీడ్ బ్యాక్ ఇస్తారా లేదా?
అన్న విషయాలు తెలుసుకోండి. అన్నీ పాజిటివ్ గా ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతె డబ్బులు వృధా, అంతకంటే ముఖ్యంగా సమయం వృధా.
ఒకవేళ ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే కిందున్నఈ కొన్ని విషయాలు మర్చిపోకండి.
  1. క్లాసెస్ మిస్ చేయకండి.
  2. హోం వర్క్ఇస్తే తప్పకుండా చెయ్యండి.
  3. క్లాస్స్ రూమ్ అక్టివిటిస్ లో చురుకుగా పాల్గొనండి.
  4. కీప్ ఎక్స్పిరిమెంటింగ్.  కమ్యూనికేషన్ స్కిల్స్ పై, మీరు నేర్చుకొనే అనేక విషయాలపై ప్రయోగాలు చెయ్యడానికి మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు ఒక మంచి వేదిక. ఈ ప్రయోగాలు మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ ని పెంచుతాయి.
  5. క్లాస్ రూంలో మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి.
మాట్లాడడానికి భయపడకండి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడి, టీచర్ మరియు మీ క్లాస్మేట్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత తొందరగా మీ ఇంగ్లిష్ నేర్చుకోవాలనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలా చేయకపోతే, మనం స్కూల్లల్లో & కాలేజీల్లో ఇంగ్లిష్ క్లాసెస్ లో చేసినట్లు – స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్ కూడా వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుంది. జాగ్రత్త!
ఏ కారణం చేతనైనా, మీరు స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం వీలుకాకపోతే, నిరుత్సాహపడకండి. మీరు స్వంతంగానే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. అలా నేర్చుకొని ఇంగ్లిష్ లో ఆత్మవిశ్వాసంతో, అనర్గళంగా మాట్లాడేవాళ్ళు మనచుట్టూ చాలా మంది ఉన్నారు. Remember, it’s possible and it’s easy.
Once again, all the best!!

QUIZ-07+


Q1. Name the city that has been handed over to the private firm to have India's first privately-run railway station.
Answer: Bhopal

Q2. Name the Actor who was honoured with a tribute at 60th San Francisco International Film Festival (SFIFF) in the USA.
Answer: Shah Rukh Khan

Q3. Manipur Chief Minister N Biren Singh launched the web applications to check corruption and keep track of government activities. The app is named as ____________.
Answer: DARPAN

Q4. Name the state that has become the first state to launch a special awareness drive to ensure that transgenders in the state register as voters.
Answer: Maharashtra

Q5. Name the Indian environmental engineer who has won 2017 prestigious ‘Cartier Women’s Initiative Award’ for providing women working on farms with water management solutions and protecting small farmers against droughts and flash floods.
Answer: Trupti Jain

Q6. The Data centre of which bank has achieved the distinction of becoming the country's first Platinum rated project under IGBC (Indian Green Building Council) Green Data Centre Rating System?
Answer: ICICI Bank

Q7. In which state government and Hindustan Petroleum Corporation Limited (HPCL) has signed an agreement for the Rs 43,129 crore Barmer refinery in the presence of Union Minister of state for petroleum and natural gas Dharmendra Pradhan?
Answer: Rajasthan

Q8. Uttar Pradesh government has changed the name of Gorakhpur and Agra Airports as well as the name of the department of welfare of the differently abled. The Gorakhpur Airforce Station has been renamed as _______________ after the founder of the Nath monastic movement.
Answer: Mahayogi Goraknath Airport

Q9. Expanding its digital presence, markets regulator SEBI (Securities and Exchange Board of India) has launched its revamped website having several user-friendly features and compatible with all desktop and mobile devices. Who is present chairman of SEBI?
Answer: Ajay Tyagi

Q10. In which state/states The Reserve Bank of India has recently set up its two new Offices of the Banking Ombudsman?
Answer: Jammu and Kashmir and Chhatisgarh

Q11. As per the government announcement the returns on small savings schemes, including Public Provident Fund (PPF), National Savings Certificate (NSC) and Kisan Vikas Patra, has been lowered by 0.1 percent for the April-June (2017) quarter. Kisan Vikas Patra (KVP) investments will yield 7.6% and mature in ________.
Answer: 112 months

Q12. The Loan Agreement for New Development Bank (NDB) financing of ____________ for Development and Upgradation of Major District Roads Project in Madhya Pradesh was signed between Government of India and the New Development Bank (NDB).
Answer: US$ 350 Million

Q13. Parliament has passed the Mental Healthcare Bill, 2016, which provides healthcare and services to the people with mental illness and also decriminalizes suicide. Who is the present Union Health Minister of India?
Answer: Jagat Prakash Nadda

Q14. Which two banks have launched co-branded credit cards for the customers recently?
Answer: SBI and Karnataka Bank

Q15. Who has appointed as the new chairman of Central Board of Excise and Customs (CBEC)?
Answer: Vanaja N. Sarna

QUIZ-07


Q1. World Homeopathy Day is observed globally on ___________.
Answer: 10 April

Q2. Union Home Minister Rajnath Singh launched the website and app named ____________, to facilitate the monetary contribution to the kin of soldier personnel killed in action.
Answer: Bharat Ke Veer

Q3. Minister of Housing and Urban Poverty Alleviation has recently launched 352 projects in 53 cities in 17 States across the country to build 2,03,851 affordable houses. Who is the Union Minister of Housing and Urban Poverty Alleviation in India?
Answer: M Venkaiah Naidu

Q4. Name the Indian-origin woman who was named 'Asian Businesswoman of the Year' at an event in Birmingham, England.
Answer: Asha Khemka

Q5. The Reserve Bank of India has recently allowed banks to invest in REITs and InvITs, a move that will help revive the cash-starved infrastructure sector. RIET stands for _____________.
Answer: Real Estate Investment Trust

Q6. ESAF Small Finance Bank has launched a social deposit scheme called _____________ in Thrissur, Kerala.
Answer: Hrudaya Deposit scheme

Q7. Name the mobile manufacturing company that has recently partnered with Airtel and BSNL to set up 5G internet speed in India to introduce a fast internet ecosystem in the country.
Answer: Nokia

Q8. Carme Chacon, the first female defense minister of which country has passed away recently.
Answer: Spain

Q9. Name the person who has recently become the youngest noble prize winner to address Canadian parliament.
Answer: Malala Yousafzai

Q10. The first rail freight service ‘British goods’ has started recently from the UK to which country?
Answer: China

Q11. India and Prime Minister of which country have started a partnership aimed at increasing cooperation in sports, in the presence of batting legend Sachin Tendulkar?
Answer: Australia

Q12. What was the name of India's first ever micro-drama festival that was held recently in New Delhi.
Answer: Thespis

Q13. Name the person who has been recently appointed as the new MD and CEO of Karnataka Bank Ltd.
Answer: M M Subrahmanya

Q14. Haldia Port has topped the List in the First-Ever Ranking of Ports on Sanitation Parameters in the exercise that was undertaken during the ‘Swachhta Pakhwada’ (in March 2017). Haldia Port is situated in _____________.
Answer: West Bengal

Q15. ESAF Small Finance Bank has recently launched a social deposit scheme called 'Hrudaya Deposit scheme' in ___________.
Answer: Thrissur