Wednesday 16 August 2017

ఐబిపిఎస్‌లో ఉద్యోగాలు



ఐబిపిఎస్‌లో ఉద్యోగాలు











     ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబిపిఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న పలు జాతీయ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ (CWE PO/MT - VII) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
 
మొత్తం ఖాళీలు: 3562
 
జనరల్‌ వర్గానికి 1738 పోస్టులు కేటాయించారు. ఎస్సీలకు 578, ఎస్టీలకు 285, ఒబిసిలకు 961 పోస్టులు ఉన్నాయి.
 
పార్టిసిపేట్‌ చేస్తున్న బ్యాంకులు - ఖాళీలు: అలహాబాద్‌ బ్యాంక్‌ 235, ఆంధ్రా బ్యాంక్‌ 625, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 200, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 100, కెనరా బ్యాంక్‌ 1350, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 100, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 100, యూకో బ్యాంక్‌ 530, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 322
 
అర్హత: సెప్టెంబరు 5 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి 
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ద్వారా
 
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్‌ సెంటర్లు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ వివరాలు: పరీక్ష సమయం గంట. మొత్తం మార్కులు 100. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 35, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమినరీలో అర్హత పొందినవారిని మెయిన్‌ ఎగ్జామ్‌ కోసం షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు.
 
మెయిన్‌ ఎగ్జామ్‌ వివరాలు: పరీక్ష సమయం మూడున్నర గంటలు. మొత్తం మార్కులు 225. మొదటి మూడు గంటల సమయంలో రీజనింగ్‌ & కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 45ప్రశ్నలు(60 మార్కులు), జనరల్‌ / ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40(40 మార్కులు), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 35(40 మార్కులు), డేటా అనాలిసిస్‌ & ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 35(60 మార్కులు) ప్రశ్నలు ఇస్తారు. దీని తరవాత ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌( లెటర్‌ రైటింగ్‌ & ఎస్సే) పేపర్‌ ఉంటుంది. ఈ పేపర్‌కు అర్థగంట సమయం ఇస్తారు. ఈ పేపర్‌ కు 25 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్‌ టెస్టులు మినహా అన్ని పరీక్షలు ఇంగ్లీషు/ హిందీ మాధ్యమాల్లో జరుగుతాయి.
ప్రిలిమినరీ & మెయిన్‌ ఎగ్జామ్స్‌ రెంటిలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్‌ చేస్తారు. మెయిన్‌ ఎగ్జామ్‌లో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
 
ఇంటర్వ్యూ వివరాలు: మార్కులు 100. అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సిడబ్యుఇ(మెయిన్‌ ఎగ్జామ్‌) & ఇంటర్వ్యూల వెయిటేజీని 80:20గా నిర్ణయించారు.
 
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌: అక్టోబరు 7, 8, 14, 15
ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: నవంబరు 26
ఇంటర్వ్యూలు: 2018 జనవరి ్క్ష ఫిబ్రవరిలో
ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2018 ఏప్రిల్‌లో
 
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 16 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 5
వెబ్‌సైట్‌: www.ibps.in

No comments:

Post a Comment