Current Affairs
జాతీయం
1.రైలు ప్రమాదాల నివారణకు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ సంస్థ పేరేంటి ?
జ: రైలు భద్రత ప్రాధికార సంస్థ ( Railway Safety Authority-RSA)
(నోట్: ఈ సంస్థకు రూ.1.9లక్షల కోట్ల నిధిని సమకూర్చాలని కేంద్ర భావిస్తోంది )
2.నౌకాశ్రయాల ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సామాజిక వర్గాల అభివృద్ధి, ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం పేరేంటి ?
జ: సాగరమాల
(నోట్: ఈ పథకం కింద 400 ప్రాజెక్టులను గుర్తించారు. )
3.సైన్యం చేతికి అత్యాధునిక రాడార్లు సప్లయ్ చేస్తున్నారు. ఇంటి పైకప్పుల్లో నక్కిన ఉగ్రవాదులను కూడా కనిపెట్టే సామర్థ్యం ఉన్న ఈ రాడార్ పేరేంటి ?
జ: త్రూ ద వాల్
4.కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ SDRF-2017 రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు ఎక్కడ జరుగుతుంది?
జ: ఢిల్లీ
5.ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: బోపన్న
(నోట్: కెనడా ప్లేయర్ గాబ్రియెలా డబ్రోస్కీతో కలసి గెలిచారు)
6.2017 ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటీఫుల్ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు ?
జ: మనీషా కోయిరాలా
7.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కి ఇండిపెండెంట్ డైరక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: KG కర్మాకర్, గౌరీ శంకర్
8.అన్షి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
9.నేషనల్ హెల్త్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా – 2017 ఏ నగరంలో జరుగుతోంది ?
జ: న్యూఢిల్లీ ( జూన్ 9, 2017)
10.జంతువుల హింసను నిరోధించేందుకు ఉద్దేశించిన కంబాలా బిల్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది ?
జ: కర్ణాటక ( Prevention of Cruelty to Animals (Karnataka Amendment) Bill)
11.కొత్త పుట్టిన పిల్లలకు తల్లి పాలను అందించేందుకు నేషనల్ హూమన్ మిల్క్ బ్యాంకును ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ప్రారంభించారు. ఈ బ్యాంకును ఏమని పిలుస్తారు ?
జ: వాత్సల్య మాత్రి అమృత్ కోష్
12.తక్కువ రేటులో విమాన ప్రయాణం కోసం ఉద్దేశించిన ఉడాన్ పథకంలో చేరేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖతో ఒప్పందం చేసుకుంది ?
జ: తమిళనాడు
13.లండన్ కు చెందిన ఓపెన్ సిగ్నల్ సంస్థ వెల్లడించిన ఇంటర్నెట్ డేటా స్పీడ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కి ఎంత ర్యాంక్ వచ్చింది ?
జ: 74 వ ర్యాంకు ( Average 4G download speed in India is 5.1Mbps)
(నోట్: పాకిస్థాన్, శ్రీలంక కన్నా వెనుకబడి ఉంది.
అంతర్జాతీయం
1.షాంఘై సహకార సంఘం (SCO) శిఖరాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్తాన్ రాజధాని అస్తానాకు వెళ్ళారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరు ఏంటి ?
జ: కజకిస్థాన్ అధ్యక్షుడు
2. నూర్సుల్తాన్ నజర్ బాయెవ్
షాంఘై సహకార సంస్థ (SCO)లో ఏ రెండు దేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించనుంది ?
జ: భారత్, పాకిస్థాన్
3.బ్రిటన్ లో ప్రస్తుత ప్రధాని థెరిసా మే ఉన్న పార్టీకే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ పేరేంటి ?
జ: కన్సర్వేటివ్ పార్టీ
4.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుకూలమైన మూడు దేశాలుగా వేటిని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సదస్సు ( UNCTAD) గుర్తించింది ?
జ: అమెరికా, చైనా, భారత్
5.ఆసియాలో వినియోగదారులకు అనుకూల మార్కెట్లు ఉన్న ఏ ఐదు దేశాలను BMI రీసెర్చ్ 2017 గుర్తించింది ?
జ: చైనా, శ్రీలంక, వియత్నాం, ఇండియా, ఇండోనేషియా
6.వాల్డ్ ఓషియన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: జూన్ 8
7.అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమగామిగా ఎంపికైన భారత అమెరికన్ ఎవరు ?
జ: రాజాచారి
(నోట్: ప్రస్తుతం ఈయన అమెరికా ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్నారు )
8.నేపాల్ లో 1200 మెగావాట్ల బుధి గండకీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏ దేశం సాయం చేయనుంది ?
జ: చైనా
9.2017 జూన్ 7 నుంచి 8 వరకూ బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు ఏ నగరంలో జరిగాయి ?
జ: బీజింగ్ (చైనా)
(నోట్: ఇందులో భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాకి చెందిన 25 మీడియా సంస్థలు పాల్గొన్నాయి. 10 లక్షల రూపాయలు (One Million Dollar Fund) తో దీన్ని ఏర్పాటు చేశారు)
10.WHO యాంటిబయోటిక్స్ ను మూడు విధాలుగా విభజించింది. వాటిని ఏమంటారు ?
జ: Access, Watch and Reserve
11. 2018 క్వాక్వారెల్లీ సిమండ్స్ ( Quacquarelli Symonds) ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్ లో భారత్ నుంచి మొదటగా నిలిచిన విద్యా సంస్థ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ
(నోట్: గతంలో IIT బెంగళూరు ఉండేది. ఇందులో మొదటి స్థానం అమెరికాకి చెందిన మాసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కి దక్కింది.)
No comments:
Post a Comment