Sunday, 18 June 2017

నియంత్రణ- సమన్వయం


నియంత్రణ- సమన్వయం

 మొక్కలు, జంతువులలో రసాయనిక సమన్వయం
 1.పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ------------ అంటారు.
 2.మొక్కలలో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటి సారిగా ప్రతిపాదించింది ------------.
 3.మొక్కల్లో ఆక్సిన్లు తయారయ్యే స్థలం ------------.
 4.ఆక్సిన్లు వేర్ల ------------ ను ప్రోత్సహిస్తాయి.
 5.ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం పేరు ------------.
 6.జిబ్బరెల్లా ప్యూజికొరై వరి పంటలో ------------ వ్యాధిని కలిగిస్తుంది.
 7.అనిషేక ఫలాలు అంటే ------------ ఫలాలు.
 8.కొన మొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడాన్ని ------------ అంటారు.
 9.పత్రాలు, ఫలాలు రాలడం ------------ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది.
 10.వాయువుల మార్పిడి, ఆకు నుంచి ఆవిరి రూపంలో బయటకు పోయే నీటిని నియంత్రించేది ------------.
 11.ప్రత్యేకంగా కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్ పేరు ------------.
 12.మొక్కల్లో నీరు నష్టపోకుండా సహకరించే హార్మోన్ ------------.
 13.ఫలాలు ముందుగా పక్వానికి వచ్చేందుకు ------------ రసా యనం సహకరిస్తుంది.
 14.పొట్టి మొక్కలను పొడవు చేయడంలో ------------ ప్రముఖ పాత్ర వహిస్తాయి.
 15.ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అనే రసాయన యౌగికాన్ని సాధారణంగా ------------ అని అంటారు.
 16.వినాళ గ్రంథులు వాటి స్రావాలను ------------ లోకి విడుదల చేస్తాయి.
 17.మెదడులో వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథిని ------------ అంటారు.
 18.రక్తంలో ------------ పరిమాణం తక్కువైనప్పుడు గ్లూకగా న్ స్రవిస్తుంది.
 19.పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్ ------------.
 20.గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చే హార్మోన్ ------------.
 21.------------ ని మిశ్రమ గ్రంథి అంటారు.
 22.కార్టిసాల్ అనే హార్మోన్‌ను స్రవించేది ------------.
 23.అవయవాలను సమన్వయపరిచే రసాయన పదార్థాల ను ------------ అంటారు.
 24.తగినంత మొత్తాల్లో వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాకపోతే ------------ వ్యాధి కలుగుతుంది.
 25.ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోతే ------------ గ్రంథి పరిమాణంలో పెద్దదవుతుంది.
 26.పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే అది ------------ అనే స్థితికి దారి తీస్తుంది.
 27.జరాయువు ఏర్పడటంలో సహాయం చేసే హార్మోన్‌ను ------------ అంటారు.
 28.శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి ------------.
 29.నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు వారధిలా పని చేసే గ్రంథి ____.
 30.____ లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది.
 31.____ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం.
 32.మానసిక ఉద్రేకాలను కలిగించే హార్మోన్ ____.

 సమాధానాలు
 1) క్షోభ్యత; 2) చార్లెస్ డార్విన్; 3) విభాజ్య కణాలు; 4) పెరుగుదలను; 5) 2,4-ఈ; 6) తెలివి తక్కువ మొలక; 7) విత్తనాలు లేని ఫలాలు; 8) అగ్రాధిక్యత; 9) అబ్‌సిసిక్ ఆమ్లం; 10) అబ్‌సిసిక్ ఆమ్లం; 11) సైటోకైనిన్; 12) అబ్‌సిసిక్ ఆమ్లం; 13) ఇథైలిన్; 14) జిబ్బరెల్లిన్లు; 15) ఆక్సిన్; 16) రక్తం; 17) అవటు గ్రంథి; 18) గ్లూకోజ్; 19) ప్రోజెస్టిరాన్; 20) గ్లూకాగాన్, 21) క్లోమం; 22) అడ్రినల్ గ్రంథి; 23) హార్మోనులు; 24) డయాబిటస్ ఇన్‌సిపిడస్; 25) అవటు; 26) టిటాని; 27) ప్రోజెస్టిరాన్, 28) పీయూష గ్రంథి; 29) పీయూష గ్రంథి; 30) థైరాక్సిన్; 31) ఇన్సులిన్, 32) ఎడ్రినలిన్.

 మానవ నాడీ వ్యవస్థ
 1.శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ -----------.
 2.నాడీ మండలం, శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులను ----------- ద్వారా గ్రహిస్తుంది.
 3.నాడీ కణాలకు ----------- కణాలు, పోషక పదార్థాన్ని అందజేస్తాయి.
 4.వార్తలను గ్రహించి, వాటిని సంశ్లేషించి, సమన్వయ పరిచే ముఖ్య కేంద్రం -----------.
 5.నాడీ కణ దేహం నుంచి వార్తలను తీసుకొని పోయే భాగాన్ని ----------- అంటారు.
 6.నాడీ కణదేహంలో ----------- అనే కణికలుంటాయి.
 7.పోలియో వంటి వ్యాధుల్లో వైరస్‌తో నశించేవి ----------- నాడీ కణాలు.
 8.నిస్సల్ కణికలు గల కణాలు -----------.
 9.ఒక క్రమంలో మైలీన్ తొడుగులో ఉండే ఖాళీలను ----------- అంటారు.
 10.-----------నాడులు, మెదడు, వెన్నుపాము నుంచి వార్తలను కండరాలకు తీసుకుపోతాయి.
 11.జ్ఞానాంగాల నుంచి ప్రచోదనాలు మెదడు లేదా వెన్నుపాముకు----------- నాడుల ద్వారా చేరుతాయి.
 12.శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు-----------.
 13.నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్ -----------.
 14.నాడీ కణ దేహానికి మరొక పేరు -----------.
 15.శరీరంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లేదా రిలేస్టేషన్ మాదిరి పనిచేసే నిర్మాణం -----------.
 16.మానవుడిలో మెదడు ఉండే అస్థికలతో తయారైన పెట్టెను ----------- అంటారు.
 17.మెదడులోని కణాలకు ----------- పోషక పదార్థాలను అందజేస్తుంది.
 18.హృదయ స్పందనలు ----------- కపాల నాడి ఆధీనంలో ఉంటాయి.
 19.మెదడును కప్పి ఉంచే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం -----------.
 20.మెదడును కప్పి ఉంచే బయటి పొర -----------.
 21.మెదడును కప్పి ఉంచే లోపలి పొర -----------.
 22.మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి -----------.
 23.మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య -----------.
 24.మానవునిలోని కపాలనాడుల జతల సంఖ్య-----------.
 25.మానవుడిలో పరిధీయ నాడుల జతల సంఖ్య-----------.
 26.ముందు మెదడుని-----------అని కూడా అంటారు.
 27.మెదడులో అతిపెద్ద భాగం-----------.
 28.మస్తిష్కంలో వెలుపలి బూడిద రంగు భాగాన్ని----------- అంటారు.
 29.మస్తిష్కార్థ గోళాలకు దిగువున ఉండే మెదడు భాగాన్ని ----------- అంటారు.
 30.మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం -----------.
 31.ముందు, మధ్య మెదడులను కలిపే మెదడు భాగం -----------.
 32.వెన్నుపాము అడ్డుకోతలో ఏ ఆకారంలో ఉండే పదార్థం -----------.
 33.వెన్నునాడులన్నీ ----------- నాడులు.
 34.మెదడు ఉపరితలం మీద ఉండే గట్ల వంటి వాటిని ----------- అంటారు.
 35.గైరీల మధ్య ఉండే గాడులను----------- అంటారు.
 36.శరీరం సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను నిర్వహించేది -----------.
 37.శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్త పీడనం వంటి అతి ముఖ్య చర్యలను నియంత్రించే కేంద్రాలు ----------- లో ఉంటాయి.
 38.ఆకస్మికంగా, మనకు తెలియకుండా జరిగి, ఆపద నుంచి రక్షించే చర్యలను ----------- చర్యలంటారు.
 39.ఉద్దీపనాల సమాచారాన్ని వెన్నుపాములోని ----------- విశ్లేషిస్తాయి.
 40.నిబంధన సహిత ప్రతిచర్యలపై ----------- అనే రష్యా శాస్త్రవేత్త పరిశీలన చేశారు.
 41.మన జాతీయ గీతాన్ని వినగానే, మనం లేచి నిలబడటం ఒక ----------- చర్య.
 42.1990 నుంచి 2000 సంవత్సరం వరకు గల దశాబ్దాన్ని ----------- అంటారు.
 43.శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు -----------.
 44.అసంకల్పిత ప్రతీకార చర్య నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ని ----------- అంటారు.
 45.అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని ____ ఆధీనంలో ఉంటాయి.
 46.జంతురాజ్యంలో అతి క్లిష్టమైన నిర్మాణంగా పరిగ ణించేది ____.
 47.మానవుని మెదడులో____ బిలియన్లకు పైగా నాడీ కణాలుంటాయి.
 48.మానవుడు తీసుకొనే మొత్తం ఆక్సిజన్‌లో మెదడు ____ శాతం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.

 సమాధానాలు
 1) నాడీ వ్యవస్థ; 2) గ్రాహకాలు; 3) గ్లీయల్; 4) మెదడు; 5) ఏగ్జాన్; 6) నిస్సల్ కణికలు; 7) చాలక; 8) నాడీ కణాలు; 9) రన్‌వీర్ కణుపులు; 10) చాలక; 11) జ్ఞాన; 12) నాడులు; 13) 55 మిల్లీ వోల్టులు; 14) సైటాన్/ పెరికార్యా; 15) వెన్నుపాము; 16) కపాలం; 17) మస్తిష్క మేరుద్రవం; 18) 10వ వేగస్; 19) మస్తిష్క మేరుద్రవం; 20) వరాశిక; 21) మృద్వి; 22) గైరి; 23) 31 జతలు; 24) 12 జతలు; 25) 43 జతలు; 26) మస్తిష్కం; 27) మస్తిష్కం; 28) మస్తిష్క వల్కలం; 29) ద్వారగోర్థం; 30) మస్తిష్కం; 31) ద్వారగోర్థం; 32) బూడిద రంగు పదార్థం; 33) మిశ్రమ; 34) గైరీ; 35) సల్సి; 36) అనుమస్తిష్కం; 37) మజ్జాముఖం; 38) అసంకల్పిత ప్రతీకార; 39) మధ్యస్థ నాడీకణాలు; 40) ఇవాన్‌పావ్‌లోవ్; 41) నిబంధన సహిత; 42) మెదడు; 43) రెండు శాతం; 44) ప్రతీకార చర్యాచాపం; 45) వెన్నుపాము; 46) మెదడు; 47) 10; 48) 2.

No comments:

Post a Comment