Tuesday 27 December 2016

Current Affairs Syllabus Analysis

వర్తమాన సంఘటనలు



                               
 గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ లో పేర్కొన్న 3 అంశాలలో వర్తమాన సంఘటనలు ఒక్కటి .ఆర్థిక సామాజిక .రాజకీయ ,క్రీడా, సంకేతిక, సాంస్కృతిక, కళా , పరిపాలన , రంగాలలో, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యం కలగిన సంఘటనలు , వాటి అంశాలు, అనేది సిలబస్.
ఈ సిలబస్ ను మనం రెండు రకాలుగా విబజించవచ్చు .
అవి  1.జాతీయ ,అంతర్జాతీయ ప్రాముఖ్యత గల సంఘటనలు
 2 .జాతీయ ,అంతర్జాతీయ వర్తమాన అంశాలు
మొదటగా పేర్కొన్న జాతీయ అంతర్జాతీయ సంఘటనలు విభాగంలో దేశీయంగా మరియు అంతర్జాతీయ విడుదల చేసిన సూచిక[ఇండెక్సు]లు ,సర్వేలు ,రిపోర్టులు ,కమిషన్లు ,కమిటీలు ,పానెల్ రిపోర్టులు మొదలగునవి చేరుతాయి . ఇందులో సూచికలు[ఇండెక్సు}లు చదివేటప్పుడు ఈ సూచికను ఎవరు తయారు చేశారు .ఏ ఏ అంశాల ప్రాతిపదికన ఈ సూచిక తయారయ్యింది ఈ సూచిక లో భారత్ స్థానం ఎంత ?, మొదటి స్థానం లో ఏ దేశం ఉంది ?చివరి స్థానం లో ఏ దేశం ఉంది ?మన పొరుగు దేశాలు ఏ స్థానం లో వున్నాయి ?అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించి చదవాలి చాలా వరకు ప్రశ్నలు ఈ అంశాలనుంచే వస్తాయి ఉదాహరణకు ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం ఎంత ?అను ప్రశ్న నేరుగా రావచ్చు .
కమిషన్లు కమిటీల ఫై కూడా ఇలాంటి ప్రశ్నలే వచ్చే అవకాశం ఉంది అబ్యార్తులు  ఒక కమిటీ గురించి చదివేటప్పుడు ఆ కమిటీ ఎందుకొరకు నియమించబడింది ?అందులోని సభ్యుల సంఖ్య ?ఆ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టులు నందలి  ప్రధానంశాల గురించి అబ్యాసించాలి ఉదాహరణకు ఇటివల వార్తలలో నిలిచిన లోథా కమిటీ ఏ అంశం ఫై వేశారు ?ఈ క్రింది వానిలో లోథా కమిటీ రిపోర్టులో లేని అంశం ఏమిటి ?వంటి ప్రశ్నలు రావచ్చు .
ఇవేకాక జాతీయ ,అంతర్జాతీయ సంఘటనల క్రింద వార్తలలో ఇటివల నిలిచిన వ్యక్తులు ,అవార్డులు ,క్రిడాశాలు కూడా వస్తాయి .వార్తలలో నిలిచిన వ్యక్తులు అంటే వివిధ దేశాల ప్రధానమంత్రులుగా ,లేదా అధ్యక్షులుగా ఎన్నికైన  వ్యక్తులు {లేదా }ఇటివల మరణించిన ప్రముఖ దేశీయ లేదా విదేశీ వ్యక్తులు ,{లేదా } ఇటివల వార్తలలో నిలిచిన ప్రముఖ పుస్తకాలు వాని రచయితలు కావచ్చు అలాగే అవార్డుల విశయానికికోస్తే ఏ అవార్డును ఏ అంశం లో ఇస్తారు .ఇటివల వార్తలలో నిలిచిన అవార్డు గ్రహీతల వివరాలు ,ముఖ్యాగా నోబెల్ పురస్కారం ,వంటి అంతర్జాతీయ మరియు బారతరత్న ,పద్మభూషన్ వంటి దేశీయ పురస్కారాల గురించి సమగ్రంగా పాటించాలి వాటిలో ఈ సంవత్సరం విజేతలెవ్వరు  ? ఇంకా అందులో ముక్యమైన అంశాలేమిటి ?ఆంటే వాటి చరిత్రను గురించి కూడా కూలంకుశంగా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని సార్లు వర్తమాన అంశాలకు సంభoదించిన ప్రశ్నలు మాత్రమే కాక వాటి విషేశాంశాల ఫై కూడా ప్రశ్నలు అడిగే అవకాశముంది . ఉదాహరణకు :  భరతదేశంలో సాహిత్యరంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కా రమేది ? {లేదా } ఇటివల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు ? అలాంటి ప్రశ్నలు రావచ్చు .
ఇక రెండవది జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు ఈ విభాగంలో అంతర్జాతీయ కూటములు వాటి సదస్సులు ,భారతదేశానికి ఇతరదేశాలతో జరిగిన ఒప్పందాలు ,జాతీయంగా ఇటివల అమలులోకి వచ్చిన చట్టాలు , వాటి ప్రాముఖ్యత , వివిధ రాష్టాలలోని సామాజిక , సాంసృతిక అంశాల ఫై సుప్రీంకొర్ట్టు తీర్పులు మొదలగు అంశాన్ని ఈ విభాగంలో చేరుతాయి . సాంకేతికంగా భారత్ సాధించిన విజయాలు . అనగా అస్త్రోశాట్ , క్రయోజనిక్ ఇంజన్ , MOM , వంటి అంశాల ఫై కూడా దృష్టి సారించాలి .
 అంతర్జాతీయ కూటములు BRICS, SAARC, BIMSTEC మొదలగు కూటముల గురించి ఆబ్యాసించేటప్పుడు ముక్యంగా ఆ కూటమి ఏ ప్రధాన ఉదేశ్యం తో ఏర్పడింది ?ఏ సంవత్సరం లో ఏర్పడింది ?ఆ కుట మిలోని సభ్యుల సంఖ్య  , మొదటి మరియు రెండవ సమావేశాలు ఎక్కడ జరిగాయి ? ఇటివల సమావేశం ఎక్కడ జరిగింది ?ఆ సమావేశ ప్రధానచార్చంశాలు ఏమిటి ? అనే అంశాల ఫై సమగ్ర అధ్యయనం చేయాలి .అలాగే ఇటివల బాగా వార్తలలో నిలిచిన అంతర్జాతీయ అంశాలు అనగా బ్రేగ్జిట్ , చైనా కరెన్సీ విలువను తగ్గిచడం . అమెరికా అధ్యక్ష ఎన్నికలు ,ఐక్యరాజ్యసమితి సంస్కరణలు , సిరియా సంక్షోభం మొదలగు అంశాల ఫై సమగ్ర అధ్యయనం చేయాలి .
అలాగే దేశీయంగా కూడా . సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రభావం చూపే వర్తమాన o శాల ఫై పట్టు సాధించాలి . ఉదాహరణకు ఇటివల జల్లికట్టు అనే క్రీడను నిషేధిస్తున్నట్లు భారత ధర్మాసనం తీర్పునిచ్చింది . కాబట్టి ఈ క్రీడ విశేషంశాలను పట్టించాలి . అలాగే ఇటివల సుప్రీంకొర్ట్టు భారత రాజ్యాంగానికి చేసిన 99 వ రాజ్యాంగ సవరణ చేలిదంటూ సంచలనాత్మక తీర్పునిచ్చింది కావున ఆ సవరణకు సంభందించిన విశేశంశాలను పట్టించాలి .
 అలాగే జాతీయంగా అంతర్జాతీయంగా జరిగే క్రీడా విశేషాంశాలు T - 20 ప్రంపంచకప్ , ఆస్ట్రేలియా ఒపెన్ , ప్రెంచ్ ఓపెన్ , కబ్బడ్డి , ఒలoపిక్ క్రీడలు వంటి అంశాల గురించి సమగ్రంగా పఠీoచాలి.
సాధారణంగా అభ్యర్థులలో కరెంట్  అఫైర్స్ ను ఎలా చదవాలి ? నోట్స ఎలా ప్రిపేర్ చేయాలి ? అనే  అంశాల ఫై అనుమానం రావచ్చు డైలీ న్యూస్ పేపర్ ను చదవడం ఇపుడు ఫైన విశ్లేషించిన విధంగా పుస్తకమును క్రీడా , సాంకేతిక , సామాజిక  , ఆర్థిక అంశాలుగా విభజించుకొని ఆ రోజు విషేశంశాలను సంబoధిత విభాగం లో వ్రాసుకోవాలి . అలాగే గ్రూప్ - 2 కోసమే నిర్దేశించబడిన నాణ్యమైన మాసపత్రికను చదవాలి  

No comments:

Post a Comment