Tuesday, 27 December 2016

భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు

భారతదేశంలో అమలుచేసిన మొదటి ఆరు పంచవర్ష ప్రణాళికలు

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)

  •    రెండవ ప్రపంచ యుద్ధం , దేశ విభజనవల్ల చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిదిద్దటం , జాతీయాదాయం పెరుగుదల , ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం
•    ప్రాధమిక లక్ష్యాలుగా 1951-56 సంవత్సరాలకు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టారు.
•    ఆహార ధాన్యాలు , పారిశ్రామిక ముడిపదార్థాల ఉత్పత్తి పెంచే వ్యవసాయరంగం పటిష్ఠం చేయటం , ఉద్యోగితాస్థాయి విస్తరింప చేయటానికి అవసరమైన పారిశ్రామిక పెట్టుబడులు . ఈ పెట్టుబడులను ఆకర్షించటానికి సాంఘిక పెట్టుబడులు , తద్వారా ప్రజాసంక్షెమ కార్యక్రమాలు చేపట్టి ద్రవ్యోల్బణ రహిత ఆర్థికవృద్ధి సాధించే దిశన మొదటి పంచవర్ష ప్రణాళిక రూపొందించారు.
•    వ్యవసాయం , నీటి పారుదల సదుపాయాల విస్తరణకు గరిష్ఠ ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికా వ్యయం రూ. 1960కోట్లలో , 31% ఈ రంగాల అభివృద్ధికి కేటాయించారు . రుతుపవనాలు , వాతావరణం అనుకూలంగా ఉండటంవల్ల మొదటి ప్రణాళికా లక్ష్యాలను అధిగమించిన ఉత్పత్తి సాధించారు .
•    మొదటి ప్రణాళికతో ధరల నియంత్రణతో పాటు , స్తబ్దంగా ఉన్న ఆర్థికవ్యవస్థను చైతన్యవంతంచేసే  ప్రణాళికాయుగం ఆరంభమైంది.


రెండవ పంచవర్ష ప్రణాళిక (1956-61)


•    సామ్యవాదరీతి ఆర్థికవ్యవస్థ , సమసమాజస్థాపన ధ్యేయాలుగా అర్హిక సంపద పంపిణిలో అసమానతలు తొలగించటం . రెండవ ప్రణాళిక లక్ష్యం 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పేర్కొన్న ప్రభుత్వ రంగ పెట్టుబడుల ద్వారా మౌలిక భారీ పరిశ్రమల స్థాపన , అవస్థాపనాభివృద్ధి  ప్రణాళికావ్యయం రూ. 4600 కోట్లలో ఈ రంగాల అభివృద్ధి వరుసక్రమంలో 20% , 28% కేటాయించారు.
•    ఆచార్య మహలనోబిన్ భారీ వ్యూహం ఆధారంగా సత్వర పారిశ్రామికాభివృద్ధికి రూపొందిన నాలుగు రంగాలవృద్ధి నమూనా అమలుచేశారు  . ఈ నమూనాలో ఆర్థిక వ్యవస్థను నాలుగు రంగాలు మూలధన ఉత్పత్తి రంగం (K), వినియోగవస్తువులను ఉత్పత్తి చేసే కర్మాగారాల రంగం (c1) కుటీర , చిన్నతరహా పరిశ్రమలు , వ్యవసాయం (c2), సేవలరంగం (c3) గా విభజించారు .
•    ప్రణాళికా కాలంలో 5% జాతీయాదాయం సగటు వృద్ధిరేటు , 11మి. ఉపాధి విస్తరణ లక్ష్యలుగా ఆర్థిక వ్యవస్థను ప్లవనదశకు సిద్ధం చేయాలనీ నిర్ణయించారు .
•    పారిశ్రామికీకరణానికి అవసరమైన భారీ యంత్రాలు ,ముడి పదార్థాలతో పాటు 1957 నుంచి ఏర్పడ్డ అనావృష్టి పరిస్థితుల కారణంగా ఆహారధాన్యాలు , దిగుమతి చేసుకోవలసి వచ్చింది .
•    భారీ దిగుమతులవల్ల వ్యాపార చెల్లింపుల శేషంలోటు , ద్రవ్యోల్బణంవంటి సమస్యలు ఏర్పడ్డాయి. కాని విదేశీ సహకారంతో పబ్లిక్ రంగంలో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యం గల మూడు ఉక్కు కర్మాగారాలు రూర్కెలా , దుర్గాపూర్ , భిలాయ్ లలో స్థాపించటం , మౌలికరంగాలలో స్వావలంబనకు గట్టి పునాది వేయటం గమనించదగ్గ అంశం .
•    ధైర్యంతో కూడిన ప్రణాళిక (Bold Plan)గా భావించే ఈ ప్రణాళికాకాలంలో  పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ సంఖ్య 40% పెరిగింది . జాతీయాదాయం 4.5% పెరుగుదలతో పాటు 10మి. ఉద్యోగాలు కల్పించగలిగారు.
•    సంస్థాగత పటిష్టత సాధించి ఆర్థిక వ్యవస్థను ప్లవనదశకు చేర్చిన రెండవ ప్రణాళిక భావిపంచవర్ష ప్రణాళికలకు ఆధారమైంది. 

 
మూడవ పంచవర్ష ప్రణాళిక (1961-66)


•    రెండవ ప్రణాళికలో ఏర్పడ్డ ఒడుదుడుకుల దృష్ట్యా స్వావలంబన , స్వయం సమృద్ధి లక్ష్యంగా 1961-66 సంవత్సరాలకు మూడవ ప్రణాళిక అమలు చేశారు. రూ.8577 కోట్ల వ్యయంతో సంతులన ప్రణాళికగా రూపొందించిన మూడవ ప్రణాళికలో వ్యవసాయ (21%) పారిశ్రామిక (23%) రంగాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు.
•    చైనా పాకిస్తాను దేశాలతో యుద్ధం కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందక ఏర్పడిన ఇబ్బందులు, ద్రవ్యోల్బణం,అంచనానుమించి 3..5:1గా ఉన్న మూలధన ఉత్పత్తి నిష్పత్తి కారణంగా ఈ ప్రణాళిక ఆశించిన ఫలితాలు అందించలేదు.
 వార్షిక ప్రణాళికలు (1966-69)                                                                                                    నాలుగవ ప్రణాళిక ప్రారంభించటానికి తగిన వాతావరణం లేక 1966-69, మూడు సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు అమలుచేశారు . వార్షిక ప్రణాళికల మూడు సంవత్సరాల కాలం 1966-69 ని ప్రణాళికా విరమంగా(Plan Holiday)వ్యవహరిస్తారు .

నాలుగవ పంచవర్ష ప్రణాళిక (1969-74)


•    1969వ సంవత్సరం ఆరంభమైన నాలుగవ ప్రణాళిక లక్ష్యం ఆర్థిక అనిశ్చలత తొలగించటం . రూ. 15,779 కోట్ల వ్యయంతో రూపొందించిన నాలుగవ ప్రణాళిక PL 480 ఆధారంగా చేస్తున్న ఆహార ధాన్యాల దిగుమతి తగ్గించటం , విదేశీ సహాయం తగ్గించటానికి ఎగుమతులు పెంచటం ,ప్రాంతీయ అసమానతలు తగ్గించటానికి ప్రాధాన్యత ఇచ్చింది . 
•    ప్రణాళికా వ్యయం రూ. 15,900 కోట్లలో వ్యవసాయరంగానికి 24% పరిశ్రమలకు 24% రవాణా సమాచారానికి 20% సాంఘిక సేవలకు 18% కేటాయించారు . ప్రతికూల వాతావరణం ,విద్యుచ్చక్తి  కొరత , పారిశ్రామిక అశాంతి , రవాణా ఇబ్బందుల వల్ల అన్ని రంగాలలో సాధించిన ఉత్పత్తి లక్ష్యాలకంటే తక్కువగా ఉంది . 
•    బంగ్లాదేశ్ విమోచన , కాందిశీకుల భారంవంటి భారం వంటి సమస్యలతో నాలుగవ ప్రణాళిక లక్ష్యం 5.5% జాతీయాదాయ వృద్ధి రేటు సాధించలేకపోయాం. జాతీయాదాయం 3.5%, 1.1% పెరిగింది . ఎగుమతులకు లభించిన ప్రోత్సాహంవల్ల వ్యాపార చెల్లింపుల శేషం అనుకూలంగా ఉంది . 
•    పాకిస్తాన్ యుద్ధం వల్ల మూడవ ప్రణాళికలో విదేశీ సహాయం అందటంలో ఏర్పడ్డ ఇబ్బందులవల్ల నాలుగవ ప్రణాళికలో దేశీయ బడ్జెటు వనరులు పెంచటం , దేశరక్షణకు సాయుధ బలాలు పటిష్ఠం చేయటం వంటి చర్యలు చేపట్టారు. బలహీన వర్గాలకు జాతీయ కనీస అవసరాలు కల్పించి సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి , పేదరిక నిర్మూలనకు గరీబీ హటావో నినాదం జోడించారు .
 
ఐదవ పంచవర్ష ప్రణాళిక (1974-79)


•    ఐదవ పంచవర్ష ప్రణాళిక 1974-79 సంవత్సరాలకు చమురు ధరలు , గోధుమల కొరతవల్ల ఏర్పడ్డ తీవ్ర ద్రవోల్బణ పరిస్థితులలో ఆరంభమైంది .పేదరిక నిర్మూలన , స్వావలంబన సాధనకు 5.5% జాతీయాదాయం వృద్ధి రేటు లక్ష్యంగా రూపొందించిన ఐదవ ప్రణాళికా వ్యయం రూ.39430 కోట్లు .
•    పబ్లిక్ రంగం వాటా ఈ ప్రణాళికలో గరిష్టంగా 70% ఉంది . ప్రణాళిక కేటాయింపులు రంగాల వారి వ్యవసాయం 22% , పరిశ్రమలు 26% , ఇంధనం 19% , రవాణా సమాచారం 18% , సాంఘిక సేవలు 17% వ్యవసాయరంగంలో నిరుద్యోగిత , అనుద్యోగిత , పేదవారికి ముఖ్యకారణంగా గుర్తించి గరిష్ట ఆర్థికవృద్ధిరేటు సాధించినంత మాత్రాన పేదరిక నిర్మూలన జరగదని గుర్తించారు .
•    గ్రామీణ పేదరికం తగ్గించటానికి ప్రత్యెక పథకాలు అవసరమని భావించి 20 సూత్రాల పథకం , సన్నకారు రైతుల అభివృద్ధి పథకం (MFAL) చిన్నతరహ రైతుల అభివృద్ధి పథకం (SFDA) కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం (DPAP) అమలుచేశారు .
•    లోటు ద్రవ్యవిధానం  అదుపు చేయటానికి విదేశీ సహాయం పెంచటంతో ఏర్పడ్డ సమస్యలు , పేదరికం , నిరుద్యోగిత నిర్మూలన లక్ష్యాలలో ఆదేశించిన ఫలితాలు సాధించకపోయినా ఈ ప్రణాళికా కాలంలో జాతీయాదాయం  5.2% తలసరి ఆదాయం 2.9% సాలుసరి వృద్ధిరేటు సాధించటం విశేషం .


ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980-85)


•    రాజకీయ పరిణామాల వల్ల ఆరవ పంచవర్ష ప్రణాళిక రెండుమార్లు ప్రవేశపెట్టబడింది . 1977లో అధికారం చేపట్టిన జనతా ప్రభుత్వం ఆర్థిక అసమానతలు , నిరుద్యోగం పెరగటానికి నెహ్రువృద్ధి నమునానే కారణంగా పేర్కొని భారీ ఉత్పత్తుల కంటే ఉపాధి విస్తరణ ముఖ్యమని భావించింది .
•    శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్దతులను ఉపయోగించే వ్యవసాయం , గ్రామీణ , చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగావకాశాలు కల్పించి పేదరిక నిర్ములనకు తోడ్పడుతుందని భావించింది .ఈ రంగాల అభివృద్ధి లక్ష్యంగా 1978-83 సంవత్సరాలకు నిరంతర ప్రణాళిక (Rolling Plan) ప్రవేశపెట్టింది నిరంతర ప్రణాళిక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధించిన విజయాలు , వైఫల్యాల ను విశ్లేషించి ప్రతి సంవత్సరం రాబోయే ఇదు సంవత్సరాలకు రూపొందించే ప్రణాళిక.
•    1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది . పేదరికం పై ప్రత్యక్షదాడి గరిష్ఠ  ఆర్థికవృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమని నిర్ణయించి వ్యయప్రయాసలతో కూడిన నిరంతరం ప్రణాళిక నిలిపివేసింది .
•    నెహ్రూ వృద్ధి నమునాను తిరిగి ప్రవేశపెట్టింది . ఆరవ ప్రణాళిక వ్యయం రూ. 1,09,240 కోట్లు . అందులో వ్యవసాయానికి 24% ఇంధనం 28% పరిశ్రమలు ,రవాణా సమాచారం ,సాంఘిక సేవలకు సమానంగా ఒక్కొక్క రంగానికి 16% కేటాయించారు .
•    ప్రణాళికా వ్యయంలో పబ్లిక్ రంగం వాటా 61% ప్రయివేటు రంగం వాటా 39% గా నిర్ణయించారు .
•    జిడిపి వృద్దిరేటు లక్ష్యం 5.2% కాగా వాస్తవ వృద్ధిరేటు 5.7% ఉండటం గమనించతగ్గ అంశం . రుణాత్మక వడ్డిరేటు , తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం వంటి ఇబ్బందులతో ఆరంభమైన ఆరవ ప్రణాళిక లక్ష్యం .
•    ఉత్పాదకతతో కూడిన లాభసాటి ఉపాధికల్పన . ఈ లక్ష్యసాధనకు 46మి. ఉద్యోగావకాశాలు  కల్పించాలని నిర్ణయించారు .పేదరికం దిగువ జనాభా 307మి (48%) నుంచి 273మి(37%)కి తగ్గించటం లక్ష్యంగా నినయించి , లక్ష్యసాధనకు ఉపాధి విస్తరణ కల్పించే దిశగా సమగ్ర గ్రామీణాభివృద్ధి  పథకం (IRDP)గ్రామీణ ఉపాధి పథకం (NREP) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (RLEGP) స్వయం ఉపాధి కల్పించే గ్రామీణ యువకుల శిక్షణాపథకం (TRYCEM), జాతీయ కనీసావసరాల పథకం (NMNP) ప్రవేశపెట్టారు.
•    ఆరవ ప్రణాళికా కాలంలో జాతీయాదాయం వృద్ధిరేటు 5.2% గా విదేశీ సహాయం కనిష్టంగా 7.7% ఉంది. అదిక దిగుబదినిచ్చే వంగడాలు (Hyv), రసాయన ఎరువుల వాడకం వల్ల వ్యవసాయ దిగుబడి పెరగటం .
•    మోటార్ వాహనాలు , కంప్యూటర్లు , ఎలక్ట్రానిక్ వస్తువు వంటి దీర్ఘ కాల మన్నికగల వస్తువుల వాడకం గణనీయంగా పెరగటం ఈ ప్రణాళికాకాలంలో సాధించటం గమనించతగ్గ అంశం .

No comments:

Post a Comment