Tuesday, 27 December 2016

పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు

పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు


•    రెండవ ప్రపంచ యుద్ధానంతరం  స్వాతంత్ర్యం పొందిన వెనకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా  చేసుకొని ఆర్థిక ప్రణాళికలు అమలుచేశాయి . ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయటం , నీర్ణిత కాల వ్యవధిలో , నిర్దేశించిన లక్ష్యాలు సాధించటానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించటాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు .
•     ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం .
1.    ఆర్థిక వ్యవస్థలో కనుగొనబడిన వనరుల సమగ్ర అంచనా ,
2.    దేశసమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీత కాలంలో సాధించవలసిన లక్ష్యాలు నిర్ణయించటం .
3.    నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన .
•    1934వ  సంవత్సరంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక విధానం మీద ప్రచురించిన “Palnned EconomyOf India” అనే పుస్తకం ఆర్థిక ప్రణాళికా విధానానికి జరిగిన మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు .
•    1937వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్, పండిత జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది .

•    1943వ సంవత్సరంలో ఎనిమిది మంది ముంబాయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశ ఆర్థికాభవృద్ధికి ఒక ప్రణాళికను తయారుచేసారు. దీనినే ‘ బోంబే ప్రణాళిక’ అంటారు . 
•    ‘ప్రజల ప్రణాళిక’ , ఎమ్.ఎస్.రాయ్ గారిచే తయారుచేయబడింది . ఇది 15,000 కోట్ల రూపాయల ప్రణాళిక. 

•    గాంధీ సిద్ధాంతాలతో గాంధీ ప్రణాళికను’ ఎస్ .ఎన్ అగర్వాల్ రూపొందించారు .కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సమృద్ధితో విస్తరించి వ్యవసాయ సమాజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు . 

ప్రణాళికా సంఘం , జాతీయ అభివృద్ధి మండలి
•    కేంద్ర ప్రభుత్వం మార్చి 1950వ సంవత్సరంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఈ సంఘానికి అధ్యక్షునిగా ఉంటారు .దీనిలో ఒక ఉపాధ్యక్షునితోపాటు కొంతమంది అఫిషియల్ , నాన్ అఫిషియల్ సభ్యులు ఉంటారు 
•    ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలను , వనరుల అభ్యతను మరియు రాష్ట్ర స్థాయి ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికా సంఘం , ఆర్థిక వ్యవస్థకు పంచవర్షప్రణాళికను రూపొందిస్తుంది .ఈ ప్రణాళికా కేంద్రమంత్రి వర్గం , జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందవలసి ఉంటుంది. 
•    జాతీయ అభివృద్ధి మండలిలో ప్రధానమంత్రితోబాటు, కేంద్రమంత్రి వర్గసభ్యులు ,రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మరియు ప్రణాళికా సంఘం సభ్యులు కూడా ఉంటారు . ప్రణాళికా సంఘంలాగే ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ . 
•    1952వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ముఖ్యమైన బాధ్యత ప్రణాళికా సంఘం తయారుచేసిన డ్రాఫ్టుప్రణాళికను  పరిశీలించడం . 
•    జాతీయ లేదా రాష్ట్రస్థాయి పంచవర్ష ప్రణాళికలు చివరగా ఈ మండలి ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు ఆమోదం కొరతాయి.
భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు 

1.    జాతీయ , తలసరి ఆదాయం పెంచటానికి , గరిష్ఠ ఉత్పత్తి సాధించటం.
2.    వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి
3.    పారిశ్రామిక ప్రగతి
4.    సంపూర్ణ ఉద్యోగిత సాధించటం .
5.    ఆదాయ సంపదల అసమానతలు తగ్గించటం
6.    సాంఘిక న్యాయం చేకూర్చటం
7.    ప్రాంతీయ అసమానతలు తగ్గించటం
8.    జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి
ప్రణాళికలలో వృద్ధి నమూనాలు 

మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాల ఆధారం. అవి

•    II నుంచి VII వ  ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిన్ మోడల్ : 1956 లో అమలుపరచిన రెండవ పంచవర్ష ప్రణాళిక, భారీపెట్టుడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్ధికాభివృద్ధికి అవసరమైన కీలకరంగాలు భారీ, మూలధన పరిశ్రమలు, అవస్థాపన పబ్లిక్ రంగ పెట్టుబడులతో జరగాలని , పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. ఏడవ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది . ఈ వృద్ధి నమూనా రెండవ పంచవర్ష ప్రణాళికలో చర్చించటమైంది.
•    VIII వ ప్రణాళిక తరువాత రావ్ మన్మోహన్ సింగ్ మోడల్  1990లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు సామ్యవాదం నుంచి స్వేచ్చా మార్కెట్లకు ప్రాతినిధ్యాన్నిచ్చాయి. మన దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో 1991లో సరళీకృత విధానాలను అమలుపరచారు . 1992-97 సంవత్సరాలకు రూపొందించిన ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పబ్లిక్ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటురంగం ప్రాముఖ్యత పెంచింది. ఈ వృద్ధి నమూనా ఎనిమిదవ ప్రణాళికలో చర్చించడమైంది.
భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు 

No comments:

Post a Comment