జాబ్ సాధించాలంటే...
జాబ్ ఇంటర్వ్యూకి వెడుతున్నారా? ఉద్యోగం సాధించాలంటే
కింద పేర్కొన్న అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అవి...
- మీరు హాజరవుతున్న కంపెనీకి సంబంధించిన సమచారాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి.
- ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఊహించి వాటికి జవాబులు ఎలా చెప్పాలో కూడా సిద్ధం కావాలి.
- ఇంటర్వ్యూకి వెళ్లేటప్పడు ఆహార్యం విషయంలో కూడా జాగ్రత్తవహించాలి.
- ఇంటర్వ్యూకు ఒక పది నిమిషాల ముందరే హాజరవాలి.
- మొదటి ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడాలి.
- ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సబ్జెక్టుమీద మంచి పట్టును ప్రదర్శించాలి.
- ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
- చెడు అలవాట్లు, మానరిజమ్స్‌ను పోగొట్టుకోవాలి.
- ఇంటర్వ్యూ చేసే వారిని వారి సంస్థ గురించి ప్రశ్నలు వేయొచ్చు. ఇందువల్ల ఉద్యోగంపై మీకున్న ఆసక్తిని ఇంటర్వ్యూ చేసేవారు గుర్తించగలరు.
- ఇంటర్వ్యూ అయిన తర్వాత ధన్యవాదాలు చెప్పాలి. ఈ-మెయిల్ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.
- ఇంటర్వ్యూ వీడియోలను చూస్తే ఇంటర్వ్యూ మరింత బాగా చేయగలరు.
- ఏ ఇంటర్వ్యూకు వె ళ్లినా అదే మీకున్న చివరి అవకాశంగా భావించాలి. అప్పుడే ఆ ఇంటర్వ్యూ విషయంలో సీరియస్‌గా ఉంటారు. సక్సెస్‌కైనా అదే పెద్ద వేదిక అవుతుంది. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అనే ధోరణిలో ఉన్నవారు ఏ ఒక్క ఇంటర్వ్యూకు తమ సర్వశక్తులూ వెచ్చించరు. అదే వారి వరుస వైఫల్యాలకు కారణమవుతుంది.
- ఇంటర్వ్యూ అనగానే ఎంతసేపూ కంపెనీ వారేదో అడుగుతారు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుందనే ధోరణితోనే చాలా మంది ఉంటారు. కానీ, ఫైనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి కూడా కంపెనీకి కొన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా,... ‘‘మీరిచ్చే ఉద్యోగానికి సదరు వ్యక్తి ఏ రకమైన నేపథ్యంతో ఉండాలని మీరు భావిస్తారు?, ఈ ఉద్యోగంలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లేమిటి? ఉద్యోగంలోకి ప్రవేశించిన తొలి 90 రోజుల్లో నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఏముంటాయి? ఇంకేదైనా విషయంలో నేను మరింత స్పష్టంగా ఏదైనా వివరణ ఇవ్వడం అవసరమని మీరనుకుంటున్నారా?’’ వంటి ప్రశ్నలను యాజమాన్యం మీద వినయంగా సంధించవచ్చు. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని, అంకిత భావాన్నీ తెలియచేస్తుంది.
- ఉద్యోగానికి అవసరమైన మీ అనుభవాలు, నైపుణ్యాల గురించే కాకుండా, మీ వ్యక్తిగ తమైన వివరాల గురించి కూడా ఇంకా వివర ంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు కొంత భిన్నంగా వ్యవహరించాలి. పొడిపొడిగా రొటీన్ సమాధానాలు చెప్పకుండా, ఒక కథలా చెబితే అవి వారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆ కథలో వారు ఆశించిన దానికన్నా మిన్నగా మీరు ఆ సంస్థకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాననే భావాన్ని ఆ కథ ద్వారా వారికి చెప్పగలిగితే మరీ మంచిది.
ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలంటే అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెబితే సరిపోదు. డ్రెస్ సెన్స్ నుంచి పెర్‌ఫ్యూమ్ వరకు అన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి చిన్న విషయాలే కదా నిర్లక్ష్యంగా ఉండకండి.
డ్రెస్ ఫిట్‌గా ఉండేలా చూసుకోండి : మీరు ధరించిన డ్రెస్ బాగా పొడవుగా ఉన్నా లేక చిన్నగా ఉన్నా చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి ధరించే దుస్తులు ఏవయినా ఫిట్‌గా ఉండేలా చూసుకోండి. కళ్ల జోడు కూడా ముఖానికి ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. ముక్కుపైకి జారిపోయినట్లుగా ఉండకూడదు.
స్ట్రాంగ్ పెర్‌ఫ్యూమ్ వద్దు : పెర్‌ఫ్యూమ్ వాడే అలవాటు ఉన్నా ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో స్ట్రాంగ్ పెర్‌ఫ్యూమ్‌ల జోలికి వెళ్లకూడదు. లైట్ పెర్‌ఫ్యూమ్‌ని ఉపయోగించవచ్చు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు.
షూస్ : ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో స్పోర్ట్స్ షూ ధరించకూడదు. ఫార్మల్ షూస్ మాత్రమే వేసుకోవాలి. అవి నీట్‌గా పాలిష్ చేసి ఉండాలి. ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి.
ముదురు రంగు దుస్తులు మేలు : లేత రంగు దుస్తులతో పోలిస్తే ముదురు రంగు దుస్తులు దృఢమైన అభిప్రాయాన్ని కలగిస్తాయి. ఒకవేళ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌తో బ్లెండ్ కాకుండా చూసుకోవాలి.
అభరణాలు అతిగా వద్దు : ఐదు వేళ్లకు ఐదు ఉంగరాలు, మెడలో గొలుసుతో ఇంటర్వ్యూకు అటెండ్ కావడం సరికాదు. సీ్త్రలు ఫిట్‌గా, చూడటానికి పర్‌ఫెక్ట్‌గా అనిపించే నగలను ధరించవచ్చు. అయితే అతిగా ఉండకుండా చూసుకోవాలి. చేతి గాజులు శబ్దం రాకుండా చూసుకోవాలి.
షేవింగ్ మరువద్దు : ఇంటర్వ్యూకు వెళ్లే రోజున షేవింగ్ చేసుకోవడం మరువద్దు. ఎలకి్ట్రక్ రేజర్స్, ట్రిమర్స్‌తో కట్ చేసుకున్నా గుడ్ లుకింగ్ ఉంటుంది.