Sunday, 9 April 2017

ప్రింటెడ్‌ కర్టెన్లు అండ్ సోఫా కవర్లు


స్వయం ఉపాధి 
ఒకప్పుడు ఆహారం, దుస్తులు, ఇల్లు అనేవి కనీసావసరాలు. ప్రస్తుతం వీటిని అవసరాలుగా మాత్రమే కాదు స్టేటస్‌ సింబల్స్‌గా కూడా పరిగణిస్తున్నారు. అందంగా అలంకరించిన ఇంటిని సోషల్‌ స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. గృహాలంకరణకు లక్షలు/ కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. నిర్మాణానికంటే గృహాలంకరణకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం గృహాలంక రణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నవి మాత్రం డోర్‌/ విండో కర్టెన్లేనని కచ్చితంగా చెప్పవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సోఫాలు, పలు డిజైన్లతో రూపొందిన చెక్క కుర్చీలు, డైనింగ్‌ టేబుల్‌్క్ష చైర్స్‌ వంటివాటిపై వేసే కవర్స్‌, బెడ్‌షీట్స్‌, బ్లాంకెట్స్‌, పిల్లో కవర్స్‌, టవల్స్‌, హ్యాండ్‌నేప్‌కిన్స, డోర్‌/ విండో కర్టెన్స వంటి ఉత్పత్తుల తయారీ అనేది ‘హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం’గా గుర్తింపు పొందింది. ఈ రంగం ఏటా వృద్థి సాధిస్తూ లాభాల బాటలో ఉంది.
 
భారత హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం
మనదేశంలో హోమ్‌ టెక్స్‌టైల్స్‌ రంగం మార్కెట్‌ విలువ ఏడాదికి రూ.20,000 కోట్లు. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఏటా 30 శాతం వృద్ధి చెందుతోంది. మొత్తం టెక్స్‌టైల్స్‌ మార్కెట్లో కేవలం కర్టెన్లు, సోఫా ్క్ష ఫర్నిచర్‌ కవర్ల పరిమాణమే 40 శాతంగా అంటే రూ.8000 కోట్లుగా ఉంది. ఇది ఏటా 30 నుంచి 40 శాతం మేర వృద్ధి చెందుతోంది.
 
వివిధ రకాల ఫ్యాబ్రిక్స్‌
పాలిస్టర్‌, కాటన, సిల్క్‌, లైనెన, వెల్వెట్‌, లేస్‌, శాటిన ఇంకా ఇతర ముడిపదార్థాలతో తయారైన గుడ్డల ఆధారంగా కర్టెన్లు, ఫర్నిచర్‌ కవర్స్‌ తయారు చేస్తారు.
 
నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌
టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ విభాగంలో మానవ తయారీ ఫైబర్‌ ఆధారితమైన ఆధునిక ఉత్పత్తిగా ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ను చెప్పవచ్చు. ఇది గుడ్డ మాదిరి కనిపించే పొలి ప్రోపెలిన్. ఫైబర్‌ అమర్చిన, వడకని/ నేయని ప్రత్యేక తరగతికి చెందిన ఫ్యాబ్రిక్‌. స్పన్ బౌండ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ను ప్రస్తుతం అనేక రంగాల్లో వివిధ అవసరాల మేరకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌తో కర్టెన్లు, ఫర్నిచర్‌ కవర్లను తయారు చేయడం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.
 
నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ ప్రత్యేకత
చాలా తక్కువ బరువుతో ఉంటుంది, చదరపు మీటర్‌ 15 గ్రా. నుంచి 250 గ్రా. వరకు ఉంటుంది.
నీళ్లలో పెట్టినా కూడా కుంచించుకు పోదు
సులభంగా శుభ్రపరిచే వీలుంటుంది
అంటే స్ర్కీన్ ప్రింటింగ్‌, ఆఫ్‌సెట్‌, హీట్‌ ట్రాన్సఫర్‌ తదితర అన్ని విధాలైన ప్రింటింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది
పర్యావరణానికి అనుకూలం, రీసైక్లింగ్‌ చేసుకోవచ్చు
గాలి ప్రసరణ ధారాళంగా జరుగుతుంది
దీని తయారీ వ్యయం కూడా చాలా తక్కువ (ఇతర ఫ్యాబ్రిక్స్‌తో పోలిస్తే) అందుకే ఈ ఫ్యాబ్రిక్‌ను పలు అవసరాలకోసం విరివిగా ఉపయోగిస్తున్నారు
 
అవసరమైన యంత్ర పరికరాలు:
రోల్‌ టు రోల్‌ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ స్ర్కీన్, ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ యంత్రాలు
రోల్‌ స్లిట్టింగ్‌ మిషన్
ఇండస్ట్రియల్‌ స్టెబింగ్‌ మిషన్లు
డిజైన్ సాఫ్ట్‌వేర్‌
ఇతర పరికరాలు
 
ముడి పదార్థాలు
చదరపు మీటరు 50 నుంచి 120 గ్రాముల బరువుండే వివిధ రంగుల నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ రోల్స్‌
స్ర్కీన్ ప్రింటింగ్‌ ఇంక్‌
ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ఇంక్‌
రింగ్స్‌, దారాలు
 
తయారీ
పూర్తి స్థాయి పరిశ్రమలో నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌ ప్లెయిన్ రోల్స్‌ సేకరించి వాటిపై ముందుగా ఎంపిక చేసుకొన్న డిజైన్లను స్ర్కీన్/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ ద్వారా అందంగా ముద్రించి సైజుల వారీగా కర్టెన్లు కుట్టి మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. కేవలం ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ను కూడా రోల్‌/ కట్‌పీస్‌లుగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.
 
మార్కెటింగ్‌ విధానం
హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్లు, ఇతర ప్రైవేట్‌ కార్యాలయాలను సంప్రదించి మార్కెటింగ్‌ అవకాశాలను పొందవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను అనుసరించి కూడా మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగు పరచుకోవచ్చు.
 
పరిశ్రమ వివరాలు 
పూర్తిస్థాయి పరిశ్రమ: రోజుకు 3000 మీటర్ల ఫ్యాబ్రిక్‌ ప్రింటింగ్‌, కర్టెన్లు అండ్ ఫర్నిచర్‌ కవర్ల తయారీ 
పరిశ్రమ వ్యయం: రూ.100 లక్షలు (కోటి) 
సాధారణ పరిశ్రమ: కేవలం కర్టెన్లు, కవర్ల తయారీ
సామర్థ్యం: రోజుకు 500 కర్టెన్లు, 300 సోఫా కవర్లు తయారీ 
పరిశ్రమ వ్యయం: రూ.25 లక్షలు

No comments:

Post a Comment