ఒకే ఒక్కటి చాలు! ...లైఫ్ సెటిల్!!
లక్షలాది మంది యువత ఏదో ఒక జాబ్ దొరికితే చాలనుకుంటుంటారు. కాని, సరైన అవగాహన, కుశలత, తర్ఫీదు లేకపోవడంతో విజయం ముందు బోర్లా పడుతుంటారు. ఈ కింది పరీక్షల్లో ఏదో ఒకదాంట్లో విజయం సాధించినా జీవితం సెటిల్ అయినట్టే...
1.ఐబిపిఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష...
బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇదొక మహదవకాశం. బ్యాంక్ పిఒ అనేది ఎంట్రీ లెవల్ పోస్టు. అయితే, రెండేళ్ల తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలను వహించవచ్చు. బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం... నోటిఫికేషన్ జూలైలో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్, మెయిన్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది.
2. ఎస్‌బిఐ పిఒ...
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్టేట్ బ్యాంక్ నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన వారికి మొదటి రెండేళ్లలో శిక్షణ, ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి. జనరల్ బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
3. ఐబిపిఎస్ స్పెషల్ ఆఫీసర్...
ఐబిపిఎస్‌లో స్పెషల్ ఆఫీసర్ నియామకం కూడా మంచి అవకాశంగా గుర్తించాలి. వీరిని వివిధ విభాగాల్లో ప్రత్యేక పాత్ర పోషించేందుకు నియమిస్తారు. వీరిలో ఐటి, లా, అగ్రికల్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, తదితర విభాగాలు ఉంటాయి.
4.ఎస్ఎస్‌సి సిజిఎల్...
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సివిల్ పోస్టులను ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో నియమిస్తారు.
ఎగ్జామినర్... అంటే వివిధ సరకులను పరీక్షించడం, శాంపిల్స్ సేకరించడం, ఎగుమతి, దిగుమతి అవుతున్న సరుకుల నాణ్యతను పరీక్షించడం,తదితర బాధ్యతలు ఉంటాయి.
అసిస్టెంట్ సిఎస్ఎస్... వివిధ శాఖలలో ఫైళ్ల నిర్వహణ, తదితర బాధ్యతలు ఉంటాయి. అలాగే, ప్రివింటివ్ ఆఫీసర్, ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎంఇఎ, సిబిఐలో సబ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, తదితర పోస్టులు ఉంటాయి.
5.ఆర్‌బిఐ గ్రేడ్ బి ఎగ్జామినేషన్...
ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, తదితర అంశాల గురించి అవగాహన కల్పించే ఉద్యోగం ఇది. అలాగే, ఐఎంఎ, వరల్డ్ బ్యాంక్, తదితర ఆర్థిక సంస్థలు, వాటి కార్యకలాపాల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
6.ఎల్ఐసి ఎఎఒ...
అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, డెవలప్‌మెంట్ రంగాల్లో వీరిని నియమిస్తారు. ఇది క్లాస్-1 ఆఫీసర్ కేడర్ పోస్టు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత కెరీర్‌లో ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి.
7.యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్...
వివిధ రకాల సివిల్ సర్వెంట్స్‌ను ఎంపిక చేస్తారు. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపిఎస్), ఐఎ అండ్ ఎఎస్... ఇండియన్ఆడిట్ ఎకౌంట్స్ సర్వీస్, ఐఆర్ఎస్, ఐసిఎఎస్...ఇండియన్ సివిల్ ఎకౌంట్స్ సర్వీసెస్, ఐసి అండ్ జిఇఎస్... ఇండియన్ కస్టమ్స్ అండ్ జనరల్ ఎక్సైజ్ సర్వీస్, ఐఆర్ఎస్ఒ... ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్స్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్, ఐఐఎస్... ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లకు ఈ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
8.ఐబిపిఎస్ అండ్ ఎస్‌బిఐ క్లర్క్...
వీరిని క్యాష్ డిపాజిట్ అండ్ విత్ డ్రాయల్ కౌంటర్లలో నియమిస్తారు. చెక్ లను వెరిఫై చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ లను ఇవ్వడం, లెడ్జర్ మెయింటినెన్స్, తదితర విధులు ఉంటాయి. ఎంపికైన తర్వాత ఆరు నెలల పాటు శిఓణ ఉంటుంది.
9.ఇండియన్ రైల్వేస్...
గ్రాడ్యుయేట్లకు ఇదొక మంచి అవకాశం. వందలాది పోస్టులను ఆర్ఆర్‌బి నాన్ టెక్నికల్ రిక్రూట్‌మెంట్ కింద నియమిస్తారు. కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెట్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ఎంక్వయిరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, సీనియర్ టైమ్ కీపర్, తదితర పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది.
10. టెట్...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఈ పరీక్షను నిర్వహిస్తాయి. ఏ గ్రాడ్యుయేట్ అయినా ఈ పరీక్ష వ్రాయవచ్చు. అన్ని స్థాయిల పాఠశాలల్లోనూ వీరిని నియమిస్తారు.
సో... ఈ పదింటిలో ఏ ఒక్క దాన్ని కొట్టినా జీవితంలో సెటిల్ అయిపోయినట్టే! మరి ఆయా సంస్థల వెబ్ సైట్లు, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈలోగా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది రెడీగా ఉండండి... ఆల్ ది బెస్ట్...
No comments:
Post a Comment