Sunday, 9 April 2017

కరెంట్ అఫైర్స్... వీక్లీ రౌండప్


ఏపీ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించారు.
 
2012 సంవత్సరానికి
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు:ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు: సంగీతం శ్రీనివాసరావు 
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: దగ్గుపాటి సురేష్‌బాబు 
రఘుపతి వెంకయ్య అవార్డు: కోడి రామకృష్ణ
 
2013 సంవత్సరానికి
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు: హేమమాలిని
బిఎన్.రెడ్డి జాతీయ అవార్డు: కోదండరామిరెడ్డి 
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: దిల్‌ రాజు 
రఘుపతి వెంకయ్య అవార్డు: వాణిశ్రీ
 
ఇండియన్ ఐడల్‌ రేవంత్
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్‌’లో తెలుగు గాయకుడు ఎల్‌.వి. రేవంత్ విజేతగా నిలిచాడు. 2017 ఏప్రిల్‌ 2న జరిగిన తుది పోటీలో రేవంత్ విజేతగా నిలిచినట్లు సచిన తెందుల్కర్‌ ప్రకటించారు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. పంజాబ్‌కు చెందిన ఖుదాబక్ష్‌ రెండో స్థానంలో, మరో తెలుగు కుర్రాడు రోహిత్ మూడో స్థానంలో నిలిచారు.
 
దేశంలో పొడవైన సొరంగ మార్గం
జమ్మూ-శ్రీనగర్‌లను కలిపే దేశంలో అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 ఏప్రిల్‌ 2న ప్రారంభించారు. రూ.9000 కోట్ల ఖర్చుతో 9 కి.మీ. సొరంగ మార్గాన్ని నిర్మించారు. దీన్ని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. జాతీయ రహదారి-44 వెంబడి చెనాని-నాష్రీ మధ్య ఈ సొరంగం నిర్మించారు. సొరంగం నిర్మాణానికి ముందు వీటి మధ్య దూరం 41 కి.మీ., ఇప్పడది 10.9 కి.మీ. తగ్గింది. తద్వారా ఏటా రూ.99 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుంది.
 
విద్యా సంస్థల జాతీయ ర్యాంకింగ్‌ 
కేంద్ర ప్రభుత్వం విడదల చేసిన జాతీయ ర్యాం కింగ్స్‌ జాబితాలో బెంగళూరుకు చెందిన ఐఐఎస్‌సీ మొదటిస్థానంలో, ఐఐటీ మద్రాస్‌ రెండో స్థానంలో నిలిచాయి. ఏడు ఐఐటీలు, జేఎనయూ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. హైదారాబాద్‌లోని హెచ సీయూ 14, ఉస్మానియా వర్సిటీ 38, ఐఐటీహెచ 26, వరంగల్‌ నిట్‌ 82వ స్థానంలో నిలిచాయి.

ఇంధన సుస్థిరతలో భారత్‌కు 87వ స్థానం 
దేశ ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం పాత్ర, పర్యావరణ సుస్థిరత, అందరికీ విద్యుత్ వంటి 18 అంశాల ప్రాతిపదికన ప్రపంచ ఆర్థికమండలి విడుదల చేసిన జాబితాలో భారత్ 87వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉంది. ఇంధన సంబంధిత కాలుష్యం విషయంలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. అందరికీ విద్యుత్ విషయంలో 101, విద్యుత్ ఉత్పత్తి వల్ల వెలువడుతున్న కర్బన కాలుష్యం విషయంలో 117వ స్థానంలో భారత నిలిచింది. ప్రపంచ ఆర్థికమండలి అంతర్జాతీయ ఇంధన వనరుల వ్యవస్థ పనితీరు సూచి -2017 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది.
 
వ్యవసాయాభివృద్ధికి ‘రాఫ్తార్‌’ 
రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడంతో పాటు, గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాఫ్తార్‌ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాషీ్ట్రయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కేవీవై) స్థానంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకర విధానాలు పేరుతో దీన్ని ప్రారంభించింది. ఆర్‌కేవీవైని 4 శాతం వ్యవసాయాభివృద్ధి లక్ష్యంతో ప్రారంభించగా, ఈ రాఫ్తార్‌ 5-6 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
 
‘పవర్‌ టెక్స్‌ ఇండియా’ ప్రారంభం 
మరమగ్గాల ఆధునీకరణ, వస్త్ర ఉత్పత్తి రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ‘పవర్‌ టెక్స్‌ ఇండియా’ పథకాన్ని కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఏప్రిల్‌ 1న మహారాష్ట్ర భివండీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 8 ప్రధాన టెక్స్‌టైల్‌ క్లస్టర్లను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి సిరిసిల్లకు చోటు దక్కింది.
 
మలేషియా ప్రధాని భారత పర్యటన 
మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మొత్తం ఏడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారతీయ పర్యాటకులకు వీసా రుసుం రద్దు, యూరియా కొనుగోలు, ఏపీలో పామాయిల్‌ అభివృద్ధి తదితర అంశాలపై ఒప్పందం కుదిరింది.
 
స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ ప్రారంభం
వివిధ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే లక్ష్యంతో చేపట్టిన ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన- 2017’ను 2017 ఏప్రిల్‌ 1న కేంద్రమంత్రి ప్రకాశ జవదేకర్‌ నోయిడాలో ప్రారంభించారు. దేశంలోని 26 కేంద్రాల్లో ఈ హ్యాకథాన ప్రారంభమైంది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన’లో నవ కల్పనల్ని ప్రోత్సహిస్తూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనల్ని ఆహ్వానిస్తారు.

No comments:

Post a Comment