Tuesday 27 December 2016

12 పంచవర్ష ప్రణాళికలు

పంచవర్ష ప్రణాళికలు
1వ పంచవర్ష ప్రణాళిక (1951-56): వ్వవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. దీనిని హారడ్‌-డోమర్‌ వృద్ధి నమూనా ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళికలోనే సేంద్రియ ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ కర్మాగారం నిర్మాణం జరిగింది. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 2.1% కాగా 3.6% సాధించారు. 
2వ పంచవర్ష ప్రణాళిక(1956-61): మౌళిక,భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించారు. ఈ ప్రణాళికలోనే రూర్కెలా, భిలారు, దుర్గాపూర్‌ లలో మూడు ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది. దీనిని మహలనోబిస్‌ నమూనా ఆధారం గా రూపొందిం చారు. దీనిని ధైర్యంతో కూడుకున్నప్రణాళికగా (Bold Plan), ప్లాన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పేర్కొంటారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 4.5% కాగా 4.21% సాధించినారు.

3వ పంచవర్ష ప్రణాళిక(1961-66): సంతులిత వృద్ధి, స్వావలంబన సాధించడానికి వీలుగా కేటాయింపులు చేశారు. ఈ ప్రణాళికా కాలంలో రుతుపవనాలు అనుకూలించకపోవడంతోపాటు, 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా ప్రణాళికా లక్ష్యాలు నెరవేరలేదు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6% కాగా 2.8% సాధించినారు.

వార్షిక ప్రణాళికలు: 3 పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక అమలుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో 1966-69 మూడు సంవత్సరాలకు గాను మూడు వార్షిక ప్రణాళికలను రూపొందించారు. ఈ కాలాన్ని ప్రణాళికా విరామం ( Plan Gap) లేదా ప్రణాళికా సెలవు (Plan holiday) అంటారు.

4వ పంచవర్ష ప్రణాళిక (1969-74): సుస్థిర వృద్ధి, స్వయం పోషకత్వాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రణాళికా కాలంలోనే ''గరీబీ హటావో'' నినాదాన్ని నాటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఇచ్చింది. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.7% కాగా 3.3% సాధించారు.
5వ పంచవర్ష ప్రణాళిక (1974-79): పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా రూపకల్పన చేశారు. కనీస అవసరాలు తీర్చే కార్యక్రమం (Minimum Needs Programme), 20 అంశాల ఆర్థిక కార్యక్రమం మొదలైన వాటిని ఈ ప్రణాళికలో అమలు చేశారు. 1975లో అత్యవర పరిస్థితి విధించడం, 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో దీనిని 1978లో ఒక సంవత్సరం ముందుగానే ముగించారు.

1977లో అధికారంలోనికి వచ్చిన జనతా ప్రభుత్వం 1978-83 సంవత్సరాలకు గాను 6వ పంచవర్ష ప్రణాళికను నిరంతర ప్రణాళిక (Rolling Plan) రూపంలో అమలుకు రూపకల్పన చేశారు. అయితే జనతా ప్రభుత్వం పతనం కావడం తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోనికి రావడం వల్ల 1978-79, 1979-80 రెండు సంవత్సరాలను వార్షిక ప్రణాళికలుగా పరిగణిస్తారు. 

6వ పంచవర్ష ప్రణాళికలో (1980-85) నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత కల్పించినారు.ఉపాధి కల్పనకు అనేక పథకాలను ఈప్రణాళికలో చేపట్టారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.2% కాగా 5.7% సాధించారు.
7వ పంచవర్ష ప్రణాళిక (1985-90): ఆహారం, పని, ఉత్పాదకతలను మౌళిక ప్రాధాన్యతలుగా గుర్తించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.% కాగా 6.02% సాధించారు. రాజకీయ సుస్థిరత లేకపోవడం వల్ల 1990-91,1991-92 రెండు సంవత్సరాలకుగాను వార్షిక ప్రణాళికలను అమలుచేశారు.

8వ పంచవర్ష ప్రణాళికలో (1992-97) మానవ వనరుల అభివృద్ధితో పాటు పేదరిక, నిరుద్యోగ నిర్మూలన ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నారు. 1991 నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగానికి ఎక్కువ బడ్జెట్‌ కేటాయించారు. ఈ ప్రణాళిక నుండే సూచనాత్మక ప్రణాళికను అమలు చేశారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6% కాగా 6.68% సాధించారు.
9వ పంచవర్ష ప్రణాళికలో (1997-2002) సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడుకున్న వృద్ధిని ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 6.5.% కాగా 5.5% సాధించినారు. 
10వ పంచవర్ష ప్రణాళికలో (2002-07) ప్రాంతీయ అసమానతల తొలగింపు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 8% కాగా 7.8% సాధించారు. 

11వ పంచవర్ష ప్రణాళికలో (2007-12) అన్ని రంగాలలో సమ్మిళిత వృద్ధి రేటును సాధించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించినారు. 8.1% వృద్ధి సాధించారు. 

12వ పంచవర్ష ప్రణాళికలో (2012-17) వేగవంతమైన, స్థిరమైన, సమ్మిళిత వృద్ధి రేటును సాధించడం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 9%గా నిర్ణయించారు.

x

భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు

భారతదేశంలో అమలుచేసిన మొదటి ఆరు పంచవర్ష ప్రణాళికలు

మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)

  •    రెండవ ప్రపంచ యుద్ధం , దేశ విభజనవల్ల చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిదిద్దటం , జాతీయాదాయం పెరుగుదల , ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం
•    ప్రాధమిక లక్ష్యాలుగా 1951-56 సంవత్సరాలకు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టారు.
•    ఆహార ధాన్యాలు , పారిశ్రామిక ముడిపదార్థాల ఉత్పత్తి పెంచే వ్యవసాయరంగం పటిష్ఠం చేయటం , ఉద్యోగితాస్థాయి విస్తరింప చేయటానికి అవసరమైన పారిశ్రామిక పెట్టుబడులు . ఈ పెట్టుబడులను ఆకర్షించటానికి సాంఘిక పెట్టుబడులు , తద్వారా ప్రజాసంక్షెమ కార్యక్రమాలు చేపట్టి ద్రవ్యోల్బణ రహిత ఆర్థికవృద్ధి సాధించే దిశన మొదటి పంచవర్ష ప్రణాళిక రూపొందించారు.
•    వ్యవసాయం , నీటి పారుదల సదుపాయాల విస్తరణకు గరిష్ఠ ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికా వ్యయం రూ. 1960కోట్లలో , 31% ఈ రంగాల అభివృద్ధికి కేటాయించారు . రుతుపవనాలు , వాతావరణం అనుకూలంగా ఉండటంవల్ల మొదటి ప్రణాళికా లక్ష్యాలను అధిగమించిన ఉత్పత్తి సాధించారు .
•    మొదటి ప్రణాళికతో ధరల నియంత్రణతో పాటు , స్తబ్దంగా ఉన్న ఆర్థికవ్యవస్థను చైతన్యవంతంచేసే  ప్రణాళికాయుగం ఆరంభమైంది.


రెండవ పంచవర్ష ప్రణాళిక (1956-61)


•    సామ్యవాదరీతి ఆర్థికవ్యవస్థ , సమసమాజస్థాపన ధ్యేయాలుగా అర్హిక సంపద పంపిణిలో అసమానతలు తొలగించటం . రెండవ ప్రణాళిక లక్ష్యం 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పేర్కొన్న ప్రభుత్వ రంగ పెట్టుబడుల ద్వారా మౌలిక భారీ పరిశ్రమల స్థాపన , అవస్థాపనాభివృద్ధి  ప్రణాళికావ్యయం రూ. 4600 కోట్లలో ఈ రంగాల అభివృద్ధి వరుసక్రమంలో 20% , 28% కేటాయించారు.
•    ఆచార్య మహలనోబిన్ భారీ వ్యూహం ఆధారంగా సత్వర పారిశ్రామికాభివృద్ధికి రూపొందిన నాలుగు రంగాలవృద్ధి నమూనా అమలుచేశారు  . ఈ నమూనాలో ఆర్థిక వ్యవస్థను నాలుగు రంగాలు మూలధన ఉత్పత్తి రంగం (K), వినియోగవస్తువులను ఉత్పత్తి చేసే కర్మాగారాల రంగం (c1) కుటీర , చిన్నతరహా పరిశ్రమలు , వ్యవసాయం (c2), సేవలరంగం (c3) గా విభజించారు .
•    ప్రణాళికా కాలంలో 5% జాతీయాదాయం సగటు వృద్ధిరేటు , 11మి. ఉపాధి విస్తరణ లక్ష్యలుగా ఆర్థిక వ్యవస్థను ప్లవనదశకు సిద్ధం చేయాలనీ నిర్ణయించారు .
•    పారిశ్రామికీకరణానికి అవసరమైన భారీ యంత్రాలు ,ముడి పదార్థాలతో పాటు 1957 నుంచి ఏర్పడ్డ అనావృష్టి పరిస్థితుల కారణంగా ఆహారధాన్యాలు , దిగుమతి చేసుకోవలసి వచ్చింది .
•    భారీ దిగుమతులవల్ల వ్యాపార చెల్లింపుల శేషంలోటు , ద్రవ్యోల్బణంవంటి సమస్యలు ఏర్పడ్డాయి. కాని విదేశీ సహకారంతో పబ్లిక్ రంగంలో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యం గల మూడు ఉక్కు కర్మాగారాలు రూర్కెలా , దుర్గాపూర్ , భిలాయ్ లలో స్థాపించటం , మౌలికరంగాలలో స్వావలంబనకు గట్టి పునాది వేయటం గమనించదగ్గ అంశం .
•    ధైర్యంతో కూడిన ప్రణాళిక (Bold Plan)గా భావించే ఈ ప్రణాళికాకాలంలో  పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ సంఖ్య 40% పెరిగింది . జాతీయాదాయం 4.5% పెరుగుదలతో పాటు 10మి. ఉద్యోగాలు కల్పించగలిగారు.
•    సంస్థాగత పటిష్టత సాధించి ఆర్థిక వ్యవస్థను ప్లవనదశకు చేర్చిన రెండవ ప్రణాళిక భావిపంచవర్ష ప్రణాళికలకు ఆధారమైంది. 

 
మూడవ పంచవర్ష ప్రణాళిక (1961-66)


•    రెండవ ప్రణాళికలో ఏర్పడ్డ ఒడుదుడుకుల దృష్ట్యా స్వావలంబన , స్వయం సమృద్ధి లక్ష్యంగా 1961-66 సంవత్సరాలకు మూడవ ప్రణాళిక అమలు చేశారు. రూ.8577 కోట్ల వ్యయంతో సంతులన ప్రణాళికగా రూపొందించిన మూడవ ప్రణాళికలో వ్యవసాయ (21%) పారిశ్రామిక (23%) రంగాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు.
•    చైనా పాకిస్తాను దేశాలతో యుద్ధం కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందక ఏర్పడిన ఇబ్బందులు, ద్రవ్యోల్బణం,అంచనానుమించి 3..5:1గా ఉన్న మూలధన ఉత్పత్తి నిష్పత్తి కారణంగా ఈ ప్రణాళిక ఆశించిన ఫలితాలు అందించలేదు.
 వార్షిక ప్రణాళికలు (1966-69)                                                                                                    నాలుగవ ప్రణాళిక ప్రారంభించటానికి తగిన వాతావరణం లేక 1966-69, మూడు సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు అమలుచేశారు . వార్షిక ప్రణాళికల మూడు సంవత్సరాల కాలం 1966-69 ని ప్రణాళికా విరమంగా(Plan Holiday)వ్యవహరిస్తారు .

నాలుగవ పంచవర్ష ప్రణాళిక (1969-74)


•    1969వ సంవత్సరం ఆరంభమైన నాలుగవ ప్రణాళిక లక్ష్యం ఆర్థిక అనిశ్చలత తొలగించటం . రూ. 15,779 కోట్ల వ్యయంతో రూపొందించిన నాలుగవ ప్రణాళిక PL 480 ఆధారంగా చేస్తున్న ఆహార ధాన్యాల దిగుమతి తగ్గించటం , విదేశీ సహాయం తగ్గించటానికి ఎగుమతులు పెంచటం ,ప్రాంతీయ అసమానతలు తగ్గించటానికి ప్రాధాన్యత ఇచ్చింది . 
•    ప్రణాళికా వ్యయం రూ. 15,900 కోట్లలో వ్యవసాయరంగానికి 24% పరిశ్రమలకు 24% రవాణా సమాచారానికి 20% సాంఘిక సేవలకు 18% కేటాయించారు . ప్రతికూల వాతావరణం ,విద్యుచ్చక్తి  కొరత , పారిశ్రామిక అశాంతి , రవాణా ఇబ్బందుల వల్ల అన్ని రంగాలలో సాధించిన ఉత్పత్తి లక్ష్యాలకంటే తక్కువగా ఉంది . 
•    బంగ్లాదేశ్ విమోచన , కాందిశీకుల భారంవంటి భారం వంటి సమస్యలతో నాలుగవ ప్రణాళిక లక్ష్యం 5.5% జాతీయాదాయ వృద్ధి రేటు సాధించలేకపోయాం. జాతీయాదాయం 3.5%, 1.1% పెరిగింది . ఎగుమతులకు లభించిన ప్రోత్సాహంవల్ల వ్యాపార చెల్లింపుల శేషం అనుకూలంగా ఉంది . 
•    పాకిస్తాన్ యుద్ధం వల్ల మూడవ ప్రణాళికలో విదేశీ సహాయం అందటంలో ఏర్పడ్డ ఇబ్బందులవల్ల నాలుగవ ప్రణాళికలో దేశీయ బడ్జెటు వనరులు పెంచటం , దేశరక్షణకు సాయుధ బలాలు పటిష్ఠం చేయటం వంటి చర్యలు చేపట్టారు. బలహీన వర్గాలకు జాతీయ కనీస అవసరాలు కల్పించి సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి , పేదరిక నిర్మూలనకు గరీబీ హటావో నినాదం జోడించారు .
 
ఐదవ పంచవర్ష ప్రణాళిక (1974-79)


•    ఐదవ పంచవర్ష ప్రణాళిక 1974-79 సంవత్సరాలకు చమురు ధరలు , గోధుమల కొరతవల్ల ఏర్పడ్డ తీవ్ర ద్రవోల్బణ పరిస్థితులలో ఆరంభమైంది .పేదరిక నిర్మూలన , స్వావలంబన సాధనకు 5.5% జాతీయాదాయం వృద్ధి రేటు లక్ష్యంగా రూపొందించిన ఐదవ ప్రణాళికా వ్యయం రూ.39430 కోట్లు .
•    పబ్లిక్ రంగం వాటా ఈ ప్రణాళికలో గరిష్టంగా 70% ఉంది . ప్రణాళిక కేటాయింపులు రంగాల వారి వ్యవసాయం 22% , పరిశ్రమలు 26% , ఇంధనం 19% , రవాణా సమాచారం 18% , సాంఘిక సేవలు 17% వ్యవసాయరంగంలో నిరుద్యోగిత , అనుద్యోగిత , పేదవారికి ముఖ్యకారణంగా గుర్తించి గరిష్ట ఆర్థికవృద్ధిరేటు సాధించినంత మాత్రాన పేదరిక నిర్మూలన జరగదని గుర్తించారు .
•    గ్రామీణ పేదరికం తగ్గించటానికి ప్రత్యెక పథకాలు అవసరమని భావించి 20 సూత్రాల పథకం , సన్నకారు రైతుల అభివృద్ధి పథకం (MFAL) చిన్నతరహ రైతుల అభివృద్ధి పథకం (SFDA) కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం (DPAP) అమలుచేశారు .
•    లోటు ద్రవ్యవిధానం  అదుపు చేయటానికి విదేశీ సహాయం పెంచటంతో ఏర్పడ్డ సమస్యలు , పేదరికం , నిరుద్యోగిత నిర్మూలన లక్ష్యాలలో ఆదేశించిన ఫలితాలు సాధించకపోయినా ఈ ప్రణాళికా కాలంలో జాతీయాదాయం  5.2% తలసరి ఆదాయం 2.9% సాలుసరి వృద్ధిరేటు సాధించటం విశేషం .


ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980-85)


•    రాజకీయ పరిణామాల వల్ల ఆరవ పంచవర్ష ప్రణాళిక రెండుమార్లు ప్రవేశపెట్టబడింది . 1977లో అధికారం చేపట్టిన జనతా ప్రభుత్వం ఆర్థిక అసమానతలు , నిరుద్యోగం పెరగటానికి నెహ్రువృద్ధి నమునానే కారణంగా పేర్కొని భారీ ఉత్పత్తుల కంటే ఉపాధి విస్తరణ ముఖ్యమని భావించింది .
•    శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్దతులను ఉపయోగించే వ్యవసాయం , గ్రామీణ , చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగావకాశాలు కల్పించి పేదరిక నిర్ములనకు తోడ్పడుతుందని భావించింది .ఈ రంగాల అభివృద్ధి లక్ష్యంగా 1978-83 సంవత్సరాలకు నిరంతర ప్రణాళిక (Rolling Plan) ప్రవేశపెట్టింది నిరంతర ప్రణాళిక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధించిన విజయాలు , వైఫల్యాల ను విశ్లేషించి ప్రతి సంవత్సరం రాబోయే ఇదు సంవత్సరాలకు రూపొందించే ప్రణాళిక.
•    1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది . పేదరికం పై ప్రత్యక్షదాడి గరిష్ఠ  ఆర్థికవృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమని నిర్ణయించి వ్యయప్రయాసలతో కూడిన నిరంతరం ప్రణాళిక నిలిపివేసింది .
•    నెహ్రూ వృద్ధి నమునాను తిరిగి ప్రవేశపెట్టింది . ఆరవ ప్రణాళిక వ్యయం రూ. 1,09,240 కోట్లు . అందులో వ్యవసాయానికి 24% ఇంధనం 28% పరిశ్రమలు ,రవాణా సమాచారం ,సాంఘిక సేవలకు సమానంగా ఒక్కొక్క రంగానికి 16% కేటాయించారు .
•    ప్రణాళికా వ్యయంలో పబ్లిక్ రంగం వాటా 61% ప్రయివేటు రంగం వాటా 39% గా నిర్ణయించారు .
•    జిడిపి వృద్దిరేటు లక్ష్యం 5.2% కాగా వాస్తవ వృద్ధిరేటు 5.7% ఉండటం గమనించతగ్గ అంశం . రుణాత్మక వడ్డిరేటు , తీవ్ర ద్రవ్యోల్బణం, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం వంటి ఇబ్బందులతో ఆరంభమైన ఆరవ ప్రణాళిక లక్ష్యం .
•    ఉత్పాదకతతో కూడిన లాభసాటి ఉపాధికల్పన . ఈ లక్ష్యసాధనకు 46మి. ఉద్యోగావకాశాలు  కల్పించాలని నిర్ణయించారు .పేదరికం దిగువ జనాభా 307మి (48%) నుంచి 273మి(37%)కి తగ్గించటం లక్ష్యంగా నినయించి , లక్ష్యసాధనకు ఉపాధి విస్తరణ కల్పించే దిశగా సమగ్ర గ్రామీణాభివృద్ధి  పథకం (IRDP)గ్రామీణ ఉపాధి పథకం (NREP) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (RLEGP) స్వయం ఉపాధి కల్పించే గ్రామీణ యువకుల శిక్షణాపథకం (TRYCEM), జాతీయ కనీసావసరాల పథకం (NMNP) ప్రవేశపెట్టారు.
•    ఆరవ ప్రణాళికా కాలంలో జాతీయాదాయం వృద్ధిరేటు 5.2% గా విదేశీ సహాయం కనిష్టంగా 7.7% ఉంది. అదిక దిగుబదినిచ్చే వంగడాలు (Hyv), రసాయన ఎరువుల వాడకం వల్ల వ్యవసాయ దిగుబడి పెరగటం .
•    మోటార్ వాహనాలు , కంప్యూటర్లు , ఎలక్ట్రానిక్ వస్తువు వంటి దీర్ఘ కాల మన్నికగల వస్తువుల వాడకం గణనీయంగా పెరగటం ఈ ప్రణాళికాకాలంలో సాధించటం గమనించతగ్గ అంశం .

పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు

పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు


•    రెండవ ప్రపంచ యుద్ధానంతరం  స్వాతంత్ర్యం పొందిన వెనకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా  చేసుకొని ఆర్థిక ప్రణాళికలు అమలుచేశాయి . ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయటం , నీర్ణిత కాల వ్యవధిలో , నిర్దేశించిన లక్ష్యాలు సాధించటానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించటాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు .
•     ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం .
1.    ఆర్థిక వ్యవస్థలో కనుగొనబడిన వనరుల సమగ్ర అంచనా ,
2.    దేశసమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీత కాలంలో సాధించవలసిన లక్ష్యాలు నిర్ణయించటం .
3.    నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన .
•    1934వ  సంవత్సరంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక విధానం మీద ప్రచురించిన “Palnned EconomyOf India” అనే పుస్తకం ఆర్థిక ప్రణాళికా విధానానికి జరిగిన మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు .
•    1937వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్, పండిత జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది .

•    1943వ సంవత్సరంలో ఎనిమిది మంది ముంబాయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశ ఆర్థికాభవృద్ధికి ఒక ప్రణాళికను తయారుచేసారు. దీనినే ‘ బోంబే ప్రణాళిక’ అంటారు . 
•    ‘ప్రజల ప్రణాళిక’ , ఎమ్.ఎస్.రాయ్ గారిచే తయారుచేయబడింది . ఇది 15,000 కోట్ల రూపాయల ప్రణాళిక. 

•    గాంధీ సిద్ధాంతాలతో గాంధీ ప్రణాళికను’ ఎస్ .ఎన్ అగర్వాల్ రూపొందించారు .కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సమృద్ధితో విస్తరించి వ్యవసాయ సమాజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు . 

ప్రణాళికా సంఘం , జాతీయ అభివృద్ధి మండలి
•    కేంద్ర ప్రభుత్వం మార్చి 1950వ సంవత్సరంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఈ సంఘానికి అధ్యక్షునిగా ఉంటారు .దీనిలో ఒక ఉపాధ్యక్షునితోపాటు కొంతమంది అఫిషియల్ , నాన్ అఫిషియల్ సభ్యులు ఉంటారు 
•    ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలను , వనరుల అభ్యతను మరియు రాష్ట్ర స్థాయి ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికా సంఘం , ఆర్థిక వ్యవస్థకు పంచవర్షప్రణాళికను రూపొందిస్తుంది .ఈ ప్రణాళికా కేంద్రమంత్రి వర్గం , జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందవలసి ఉంటుంది. 
•    జాతీయ అభివృద్ధి మండలిలో ప్రధానమంత్రితోబాటు, కేంద్రమంత్రి వర్గసభ్యులు ,రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మరియు ప్రణాళికా సంఘం సభ్యులు కూడా ఉంటారు . ప్రణాళికా సంఘంలాగే ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ . 
•    1952వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ముఖ్యమైన బాధ్యత ప్రణాళికా సంఘం తయారుచేసిన డ్రాఫ్టుప్రణాళికను  పరిశీలించడం . 
•    జాతీయ లేదా రాష్ట్రస్థాయి పంచవర్ష ప్రణాళికలు చివరగా ఈ మండలి ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు ఆమోదం కొరతాయి.
భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు 

1.    జాతీయ , తలసరి ఆదాయం పెంచటానికి , గరిష్ఠ ఉత్పత్తి సాధించటం.
2.    వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి
3.    పారిశ్రామిక ప్రగతి
4.    సంపూర్ణ ఉద్యోగిత సాధించటం .
5.    ఆదాయ సంపదల అసమానతలు తగ్గించటం
6.    సాంఘిక న్యాయం చేకూర్చటం
7.    ప్రాంతీయ అసమానతలు తగ్గించటం
8.    జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి
ప్రణాళికలలో వృద్ధి నమూనాలు 

మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాల ఆధారం. అవి

•    II నుంచి VII వ  ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిన్ మోడల్ : 1956 లో అమలుపరచిన రెండవ పంచవర్ష ప్రణాళిక, భారీపెట్టుడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్ధికాభివృద్ధికి అవసరమైన కీలకరంగాలు భారీ, మూలధన పరిశ్రమలు, అవస్థాపన పబ్లిక్ రంగ పెట్టుబడులతో జరగాలని , పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. ఏడవ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది . ఈ వృద్ధి నమూనా రెండవ పంచవర్ష ప్రణాళికలో చర్చించటమైంది.
•    VIII వ ప్రణాళిక తరువాత రావ్ మన్మోహన్ సింగ్ మోడల్  1990లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు సామ్యవాదం నుంచి స్వేచ్చా మార్కెట్లకు ప్రాతినిధ్యాన్నిచ్చాయి. మన దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో 1991లో సరళీకృత విధానాలను అమలుపరచారు . 1992-97 సంవత్సరాలకు రూపొందించిన ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పబ్లిక్ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటురంగం ప్రాముఖ్యత పెంచింది. ఈ వృద్ధి నమూనా ఎనిమిదవ ప్రణాళికలో చర్చించడమైంది.
భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు 

APPSC SCREENING TEST SYLLABUS FOR GROUP-II SERVICES

ఏపీపీఎస్సీ  గ్రూప్‌ - II  స్క్రీనింగ్ టెస్ట్          150 Marks     

 ఎ) కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

బి) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.

సి) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.

       ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 1 > జనరల్‌ స్టడీస్‌        150 Marks 1. 

         1.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం వినియోగం.

4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలనః రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు

6. భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి

7. భారత ఉపఖండం - భౌతిక భూగోళశాస్త్రం

8..విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిర అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌


10. లాజిక‌ల్ రీజ‌నింగ్‌, అన‌లిటిక‌ల్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌11. దత్తాంశ విశ్లేషణ (ఎ) ట్యాబులేషన్‌ ఆఫ్‌ డేటా (బి) విజువల్‌ రిప్రజంటేషన్‌ ఆఫ్‌ డేటా (సి) బేసిక్‌ డేటా విశ్లేషణ.

12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో

ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదురయ్యే స‌వాళ్లు, దానివల్ల కలిగే ఆర్థిక పరమైన చిక్కులు

బి) ఉమ్మడి సంస్థల పంపకం, పున‌ర్నిర్మాణం

సి) ఉద్యోగుల పంప‌కం, వారి పున:స్థాపన, స్థానిక‌త స‌మ‌స్యలు

డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం

ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు

ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు

జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జ‌నాభా అంశాలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం

హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన సమస్యలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం

ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్ వ్యవస్థీకరణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు          

                        ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 2 > సెక్షన్‌ - 1 >ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర     75 Marks  

                1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు - చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు - సామాజిక, సాంస్కృతిక సేవ - తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి.

2. క్రీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మ‌త‌ప‌ర‌మైన‌ స్థితిగతులు; తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి. ఆంధ్ర చ‌రిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ

3. యూరోపియన్ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర. - 1857 తిరుగుబాటు - ఆంధ్రలో బ్రిటిష్‌ పాలనపై ప్రభావం - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు. 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, కిసాన్‌ ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం.

4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర..

5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు - విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం, దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు.

6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో

ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కుళ్లు

బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం

సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు

డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం

ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు

ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు 

జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం

హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం

ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు.

           ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 2 > సెక్షన్‌ - 2 >భారత రాజ్యాంగం - విహంగ వీక్షణం     75 Marks 


               1. భారత రాజ్యాంగ స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.

2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ నిర్వాహక - శాసన నిర్వాహక రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ తరహా, న్యాయనిర్వహణ - న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన నిర్వాహక, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, కాగ్‌.

4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్‌, ఎం.ఎం. పూంచీ కమిషన్‌, నీతి ఆయోగ్ - భారత రాజ్యాంగ కేంద్ర, సమాఖ్య లక్షణాలు.

5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్‌ మెహతా, అశోక్‌మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.

6. భారత రాజ్యాంగ పార్టీలు - జాతీయం, ప్రాంతీయం - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - జాతీయ సమైక్యత - భారత ఐక్యతకు ముప్పు/ సవాళ్లు. శ్రీకృష్ణ కమిటీ.

7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రొవిజన్స్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్‌, జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమిషన్స్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్‌, లోకాయుక్త. 

          ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 3 > సెక్షన్‌ - 1  భారత ప్రణాళికా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ     75 Marks 

                భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు - కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు, విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ). ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు.

భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు - 1986 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ అసమతుల్యత, ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్‌ అకౌంట్‌ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.సహజ వనరుల లభ్యత - అభివృద్ధి: జనాభా - పరిమాణం, కూర్పు, పెరుగుదల - ధోరణులు, వృత్తిపరమైన శ్రామిక విభజన - మానవాభివృద్ధి సూచీ. డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌.ద్రవ్యం బ్యాంకింగ్‌,

ప్రభుత్వ విత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా చర్యలు - బ్యాంకులు, పరపతి సృష్టి కారకాలు, పరిష్కారాలు - పన్ను, పన్నేతర ఆదాయం.వృద్ధి వివరణ - మాపనాలు: వృద్ధి, అభివృద్ధి, అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు - వృద్ధి వ్యూహం - అభివృద్ధి -ఎదుగుదల మధ్య తేడా, ఎదుగుదల మాపనం. డీరెగ్యులేషన్‌, ఎదుగుదల.          


           ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 3 > సెక్షన్‌ - 2 ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సమకాలీన సమస్యలు     75 Marks  




            1. జాతీయాదాయం, భావనలు - స్థూల జాతీయోత్పత్తి - నికర జాతీయోత్పత్తి, మానవాభివృద్ధి సూచీ (అభివృద్ధి మాపనంగా) -ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయం పాత్ర.

2. ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలు -కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు.

3. ఆంధ్రప్రదేశ్‌ భూ సంస్కరణలు - భూసంస్కరణల అవసరం - ఆంధ్రప్రదేశ్‌లో భూకమతాల స్వరూపం - అడవులు, సాగు నేల, సాగునీటి పారుదల విస్తీర్ణం - పంటల విధానం - వ్యవసాయ రుణాల వనరులు - వ్యవసాయ సబ్సిడీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ.

4. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు - వృద్ధి స్వరూపం - చిన్న, కుటీర పరిశ్రమల పాత్ర - సహకార వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా.

5. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యం - ఆంధ్రప్రదేశ్‌లో రవాణా, విద్యుత్‌, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ధి.


Group 2 Syllabus

SCHEME AND SYLLABUS FOR

GROUP-II SERVICES

Subject
Marks
Screening Test150
Paper-I
General Studies & Mental Ability
150
Paper-II
I. Social History of Andhra Pradesh i.e., the history of
various social and Cultural Movements in Andhra
Pradesh
II. General overview of the Indian Constitution

150
Paper-III
Planning in India and Indian Economy Contemporary problems and
Developments in Rural Society with special reference to Andhra
Pradesh.


150
TOTAL

450