*ప్లానింగ్ ఫర్ ది పూర్' గ్రంథ రచయిత*1. త్వరితగతిన పారిశ్రామికీకరణకు దేశం ప్రారంభించిన కొత్త విధానం ?
ఎ. ప్రయివేటు పారిశ్రామికవేత్తలకు వివిధ రకాల రాయితీలను కల్పించడం
బి. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం
సి. అనేక విదేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం
డి. పారిశ్రామిక నిర్వహణలో సరికొత్త విధానాలను ప్రవేశ పెట్టడం
2. వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతుడు ?
ఎ. రంగరాజన్ బి. అమర్త్యసేన్
సి. మన్‌మోహన్ సింగ్
డి. మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా
3. కేల్కర్ కమిటీ దేనికి సంబంధించింది ?
ఎ. ప్రత్యక్ష పన్నులు
బి. పరోక్ష పన్నులు
సి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండూ
డి. ఎగుమతి, దిగుమతుల సుంకాలు
4. జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, కిసాన్ వికాస్ పత్ర పథకాలను కొనసాగించవద్దని ఈ మధ్య సిఫార్సు చేసిన కమిటీ ఈ కింది వానిలో ఏది ?
ఎ. రాజా చెల్లయ్య కమిటీ
బి. కేల్కర్ కమిటీ
సి. రాకేశ్ మోహన్ కమిటీ
డి. నరసింహన్ కమిటీ
5. మిగులు విలువ సిద్ధాంతాన్ని కనుగొన్నది ?
ఎ. ఆడమ్ స్మిత్ బి. రికార్డో
సి. హెగెల్ డి. కార్ల్‌మార్క్స్
6. 'కిసాన్ క్రెడిట్ కార్డ్' పథకాన్ని సూత్రీకరించింది ?
ఎ. ఆర్.డి.ఐ బి. జి.ఐ.సి
సి. ఐ.సి.ఐ.సి.ఐ డి. ఎన్.ఎ.బి.ఎ.ఆర్.డి (నాబార్డ్)
7. భారతదేశంలో గణనీయమైన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు దోహదపడిన కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం ?
ఎ. 1977 బి. 1981
సి. 1991 డి. 1989
8. మొట్టమొదటి భారతదేశపు జాతీయ ఆదాయాన్ని, పద్ధతి ప్రకారం అధికారికంగా మదింపు చేసిన జాతీయ ఆదాయ కమిటీ 1949, అధ్యక్షులు ?
ఎ. పి.సి.మహాలనోబిస్
బి. వి.కె.ఆర్.వి.రావు
సి. డి.ఆర్.గార్గిల్
డి. కె.టి.షా
9. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి అనుసరించిన పద్ధతి ?
ఎ. వ్యాపార శేషము
బి. నికర గుణిజ పద్ధతి
సి. నికర ఎగుమతులు
డి. విదేశీ నిల్వలు
10. అటవీ సంరక్షణ కింద 33 శాతం లక్ష్యాన్ని చట్టబద్ధం చేసినది ?
ఎ. అటవీ విధానం, 1950
బి. అటవీ విధానం, 1956
సి. అటవీ విధానం, 1962
డి. అటవీ విధానం, 1952
11. కొత్త వ్యవసాయ వ్యూహ రచన (హరిత విప్లవం) ను మొట్టమొదట అంగీకరించింది ?
ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక
బి. రెండో పంచవర్ష ప్రణాళిక
సి. మూడో పంచవర్ష ప్రణాళిక
డి. నాల్గో పంచవర్ష ప్రణాళిక
12. గున్నార్ మిర్థాల్ ఇండియాను అభివర్ణించింది ?
ఎ. ఆదర్శరాజ్యం బి. సులభరాజ్యం
సి. బహుత్వరాజ్యం డి. ఉదారరాజ్యం
13. ఆరో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ?
ఎ. దీర్ఘకాలపు ప్రణాళిక
బి. కనీస అవసరాల పథకం
సి. నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్)
డి. గ్రామీణాభివృద్ధి పథకం
14. 'ప్లానింగ్ ఫర్ ది పూర్' అనే గ్రంథాన్ని రచించినవారు ?
ఎ. బి.ఎస్.మిన్‌హాస్ బి. వై.కె.అలఫ్‌ు
సి. జగదీష్ భగవతి డి. ఐ.జి.పటేల్
15. భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ?
ఎ. పశ్చిమ బెంగాల్ బి. మిజోరాం
సి. నాగాలాండ్ డి. పుదుచ్ఛేరి
16. ప్రణాళిక వనరులు అంచనాతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశిక సూత్రాలను తయారుచేసే బాధ్యత కలది ?
ఎ. ప్రణాళికా సంఘం
బి. జాతీయ అభివృద్ధి మండలి
సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి. కేంద్ర మంత్రివర్గం
17. భారతదేశంలో 1991 నూతన పారిశ్రామిక విధానంలోని ప్రతిపాదనలలో ఒక ముఖ్యమైన ప్రతిపాదన ప్రకారం 51.0 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి సౌకర్యం కల్పించింది ?
ఎ. అన్ని పరిశ్రమలకు
బి. ఆగ్రోప్రాసెసింగ్ పరిశ్రమలకు
సి. ఎగుమతి పరిశ్రమలకు
డి. హెచ్చు ప్రాధాన్యత గల పరిశ్రమలకు
18. భారతదేశంలో 14 బ్యాంకులను జాతీయం చేసిన రోజు ?
ఎ. 15 మార్చి 1967
బి. 10 ఏప్రిల్ 1968
సి. 19 జులై 1969
డి. 20 ఏప్రిల్ 1970
19. ఈ కింది వానిలో ఏ లావాదేవి కరెంట్ ఖాతా(చాలూ) ఖాతాలో రుణం అవుతుంది ?
ఎ. సరుకులను ఎగుమతి చేయడం
బి. నౌకరీలను ఎగుమతి చేయడం
సి. విదేశీయులకు ఒక బహుమతిని ఇవ్వడం
డి. విదేశీయుల నుంచి ఒక బహుమతిని పొందడం
20. భూమి అభివృద్ధి బ్యాంకులు ఈ కింది వానిలో దేని భాగస్వామ్యంలో ఉంటాయి ?
ఎ. వాణిజ్య బ్యాంకు
బి. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు
సి. భారత ఆహారసంస్థ
డి. సహకార పరపతి వ్యవస్థ
21. ఈ కింది చర్యలలో ఆర్థిక సంస్కరణల పరిధిలోకి రానిది ఏది ?
ఎ. ప్రత్యేక ఆర్థిక మండలాలు
బి. అధిక, కఠోర శ్రామిక చట్టాలు
సి. చిన్నతరహా రంగానికి తక్కువ ప్రత్యేకతలు
డి. పరిశ్రమలలో ప్రవేశ ప్రతిబంధనాలను తొలగించడం
22. భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ చర్య మంచి కోశ సంబంధమైన పాలనకు ఆటంకాన్ని కలిగిస్తుంది ?
ఎ. రుణ జిడిపి నిష్పత్తిని పెంచడం
బి. సంయుక్త పన్ను జిడిపి నిష్పత్తి వృద్ధి చేయడం
సి. ఆర్థిక లోటును సున్నాకు తగ్గించడం
డి. వడ్డీ చెల్లింపుల సాపేక్షతను రాబడి వసూళ్లకు తగ్గట్టుగా తగ్గించడం
23. లోటు ద్రవ్యం అనగా ?
ఎ. సమిష్టి వనరుల సమీకరణను ప్రభావితం చేయడం
బి. ద్రవ్య సరఫరా లోటుకు మూలం
సి. స్వభావంలో ప్రతి ద్రవ్యోల్బణం
డి. స్వభావంలో ద్రవ్యోల్బణం పెంచుతుంది
24. ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు సంబంధించి అధిక సంఖ్యాక లావాదేవీలను జరుపుతుంది ?
ఎ. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా
బి. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్
సి. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్
డి. ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్
25. కేంద్ర ప్రభుత్వం 1990-91లో దేశ ఆర్థిక విధానంలో చాలా వరకూ సంస్కరణలను చేయడానికి ప్రేరేపించిన సంక్షోభం ?
ఎ. చెల్లింపుల సమతూక సంక్షోభం
బి. ప్రభుత్వ రంగంలో సంక్షోభం
సి. ఆర్థిక సంక్షోభం
డి. విదేశీ మారకం
26. పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రధానమైన లక్ష్యం ?
ఎ. ప్రజలందరికీ ఆహారభద్రతను గట్టిపరచడం
బి. 9.5 శాతం అభివృద్ధి రేటును సాధించడం
సి. సరళీకృత విధానాల వల్ల సాధించిన కార్యసిద్ధిని స్థిరీకరించడం
డి. పెరుగుతున్న ఆదాయ అసమానతలను అతి తక్కువ స్థాయికి తగ్గించడం
27. ఒక కర్మాగారం ఎల్లప్పుడూ దేనిని కలిగి ఉంటుంది ?
ఎ. అమ్మకందారులను బి. ఫైళ్లు
సి. విద్యుచ్ఛక్తి డి. కార్మికులు
28. పొదుపు ఒక ?
ఎ. పెరుగుదలకు ప్రధానమైన నిర్ధారకం
బి. పెరుగుదల ఒకే ఒక నిర్ధారకం
సి. పెరుగుదలకు ఒకానొక నిర్ధారకం
డి. పెరుగుదలతో సంబంధం
సమాధానాలు : 1.బి, 2.బి, 3.సి, 4.సి, 5.డి, 6.డి, 7.సి, 8.ఎ, 9.బి, 10.డి, 11.సి, 12.డి, 13.సి, 14.ఎ, 15.డి, 16.బి, 17.డి, 18.సి, 19.సి, 20.డి, 21.బి, 22.ఎ, 23.డి, 24.సి, 25.ఎ, 26.బి, 27.డి, 28.సి