Monday, 26 June 2017

General Knowledge


☔గోదావరి నది - Godavari river⛱

- గోదావరి నది జన్మస్థానం-- నాసిక్.

- గోదావరి నది తెలంగాణలో ప్రవేశించు స్థలం-- బాసర.

- దేశంలోని పెద్ద నదులలో గోదావరి నది స్థానం-- రెండవది (దక్షిణ భారతదేశంలో పెద్దది).

- గోదావరి అంటే అర్థం-- అఖండ జలరాశి.

- గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది-- 1969.

- పుష్కరాలు జరుపుకొనే గోదావరి నది యొక్క ఉపనది-- ప్రాణహిత నది.

- నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు-- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.

- గోదావరి నది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించు దూరం-- 770 కిలోమీటర్లు.

- పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టు-- పోలవరం ప్రాజెక్టు.

- గోదావరి నది ముఖద్వారంగా పిలువబడు నగరం-- రాజమండ్రి.

No comments:

Post a Comment