కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ
1.కార్బోహైడ్రేట్లలో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ ----------.
2.అన్ని జీవక్రియల్లో ---------- ముఖ్యమైన జీవక్రియ.
3.కిరణజన్య సంయోగక్రియలో---------- వాయువు విడుదలవుతుంది.
4.విద్యుదయస్కాంత వికిరణంలో ---------- కంటికి కనిపించే కాంతి కంటే ఎక్కువ ధైర్ఘ్య తరంగాలుంటాయి.
5.ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను పరీక్షించే సమయం----------.
6.వాయువుల మార్పిడి, నీటి ఆవిరిని ఆకుల నుంచి నియంత్రించేవి----------.
7.---------- దొంతరలను గ్రానా అంటారు.
8.కిరణజన్య సంయోగక్రియలో పత్రహరిత అణువు ---------- చెందుతుంది.
9.అయోడిన్‌ను ---------- కలిగి ఉందని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు.
10. కాంతి మీద ఆధారపడే జీవ రసాయన చర్య ----------.
11.మెల్విన్ కాల్విన్---------- పై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతిని పొందారు.
12.మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే ----------.
13.---------- అనే జీవక్రియ జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
14.కంటికి కనిపించే కాంతి తరంగ ధైర్ఘ్యం----------.
15.కాంతి కిరణాలలో ఉండే శక్తిని ----------అంటారు.
16.శ్వాసక్రియ చెందే పదార్థాన్ని ---------- అంటారు.
17.మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడుతలను ---------- అంటారు.
18.ఆక్సిజన్ లేకుండా సూక్ష్మ జీవులు జరిపే శ్వాసక్రియను ---------- అంటారు.
19.చాలా రకాల బాక్టీరియాలు ఆక్సిజన్ లేనప్పుడు ---------- ఆమ్లాల్ని ఉత్పత్తి చేస్తాయి.
20.గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ----------.
21.ఫలాలను శీతల స్థలంలో ఉంచినపుడు ---------- రేటు తగ్గుతుంది.
22.ఒక గదిలో ఫలాలను ---------- ఉష్ణోగ్రత మధ్య ఉంచితే అవి తొందరగా పక్వానికి వస్తాయి.
23.గ్లూకోజ్ ఆక్సీకరణంలో మొదటి దశను ---------- అంటారు.
24.సిట్రిక్ ఆమ్లం ఏర్పడేందుకు ఎసిటైల్ కొ ఎంజైమ్ అ, నాలుగు కర్బన పరమాణువులు గల ---------- పదార్థంలో చేరుతుంది.
25.అఖ్కీలో ఎక్కువ శక్తి ---------- అకర్బన అణువుతో నిల్వ అయి ఉంటుంది.
26.అఈ్కకి శక్తిమంతమైన ఫాస్పేట్ కలయికను ---------- అంటారు.
27.గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ----------.
28.అఖ్కీని విస్తరించగా ----------.
29.ఆక్సీకరణ చెందడానికి కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ---------- రూపంలో ఉండాలి.
30.---------- క్రియను జంతువులు జరపలేవు.
31.గ్లైకాలసిస్ తుది దశలో ఏర్పడే ఆమ్లం ----------.
32.వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ----------.
33.మైటోకాండ్రియాలను ---------- అని కూడా అంటారు.
34.కిరణజన్య సంయోగక్రియలో నిలవ ఉండే శక్తి ---------- నుంచి లభిస్తుంది.
35.ఆక్సీకరణ భాస్వీకరణం ----------లో జరుగుతుంది.
36.అమీబాలో శ్వాసక్రియ ---------- పద్ధతి ద్వారా జరుగుతుంది.
37.కప్పలో నాశికలు ---------- లోకి తెరచుకుంటాయి.
38.వానపాములో హిమోగ్లోబిన్ రక్తంలోని----------లో ఉంటుంది.
39.బొద్దింక రక్తం ---------- గా ఉంటుంది.
40.చర్మ శ్వాసక్రియ ---------- లో జరుగుతుంది.
41.వానపాములో శరీర కుహర ద్రవం ---------- ద్వారా బయటకు వస్తుంది.
42.వాయునాళాలు ఉన్న జీవి ----------.
43.ఉపరికుల గల జీవి ----------.
44.స్వరపేటికను ---------- అని కూడా అంటారు.
45.మానవుడిలో గాలిగొట్టాన్ని శాస్త్రీయంగా---------- అంటారు.
46.మానవుడిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం ----------.
47.కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం ----------.
48.స్త్రీలలో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
49. పురుషుల్లో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
50.వాయుగోణులు --------- ల పరిమాణాలు.
51.కప్ప చర్మం ఎండిపోతే అది ---------.
52.బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య ---------.
53.బొద్దింకలో --------- శ్వాసేంద్రియాలు.
54.వానపాములో శ్వాసక్రియ ---------ద్వారా జరుగు తుంది.
55.పుపుస శ్వాసక్రియ --------- ద్వారా జరుగుతుంది.
సమాధానాలు
1) శ్వాసక్రియ; 2) కిరణజన్య సంయోగక్రియ; 3) ఆక్సిజన్; 4) పరారుణ కిరణాలు; 5) మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత; 6) పత్ర రంధ్రాలు; 7) థైలకాయిడ్; 8) ఆక్సీకరణం; 9) పిండి పదార్థం; 10) కిరణజన్య సంయోగ క్రియ; 11) కార్బన్ స్థాపన (నిష్కాంతి చర్య); 12) అవి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి; 13) ప్రత్యుత్పత్తి; 14) 400ఝ 700ఝ; 15) క్వాంటం శక్తి; 16) శ్వాసక్రియాధారాలు; 17) క్రిస్టే; 18) కిణ్వనం; 19) లాక్టిక్; 20) 300 సెంటీగ్రేడ్ నుంచి 400 సెంటీగ్రేడ్; 21) శ్వాసక్రియ; 22) 450 సెంటీగ్రేడ్; 23) గ్లైకాలసిస్; 24)ఆక్సాలో ఎసిటికామ్లం; 25) మూడో; 26) పాస్ఫోరిలేషన్; 27) 2 అఖ్కీలు; 28) ఎడినోసిన్ ట్రై పాస్ఫేట్; 29)గ్లూకోజ్; 30) కిరణజన్య సంయోగ క్రియ; 31) పైరువిక్ ఆమ్లం; 32) 0.03-0.04 శాతం; 33) శక్తి ఉత్పాదక కేంద్రాలు; 34) సూర్యకాంతి; 35) మైటోకాండ్రియా; 36) విసరణ/వ్యాపనం; 37) ఆస్యకుహరం; 38) ప్లాస్మా; 39) తెలుపు; 40) వానపాము/ కప్ప/ సాలమండర్; 41) పృష్ట రంధ్రాలు; 42) బొద్దింక (కీటకాలు); 43) అస్థి చేప; 44) శబ్దపేటిక; 45) వాయునాళం; 46) ‘ఇ’; 47) ఉపజిహ్వక/కొండ నాలుక; 48) పక్కటెముకలు; 49) ఉదర వితానం; 50) ఊపిరితిత్తులు; 51) చర్మం ద్వారా శ్వాసక్రియ జరపలేదు 52) 10 జతలు; 53) వాయునాళాలు; 54) చర్మం; 55) ఊపిరితిత్తులు.
రవాణా వ్యవస్థలు,
మానవ హృదయ నిర్మాణం
1ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా--------- ద్వారా జరుగుతుంది.
2.రక్త రవాణా వ్యవస్థలో --------- పంపు చేసే సాధనం.
3.కప్ప హృదయంలో కర్ణికలకు వెనుకగా --------- ఉంటుంది.
4.సరీసృపాల హృదయంలో --------- అసంపూర్ణంగా విభజన చెందిన గది.
5.ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని --------- అంటారు.
6.ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ---------లో కని పిస్తుంది.
7.శోష రసం --------- వ్యవస్థకి చెందుతుంది.
8.ఎర్రరక్త కణాలు లేని జీవి---------.
9.బొద్దింకలో --------- కండరాలు రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడతాయి.
10.ఉభయ జీవుల్లో మహాసిరలు కలిసి --------- ని ఏర్పాటు చేస్తాయి.
11.రక్త కోటరాలు ఉన్న జంతువు ---------.
12.13 గదుల హృదయం ఉన్న జంతువు ---------.
13.మెగాస్కోలెక్స్‌లో --------- ముఖ్య సిరగా పనిచేస్తుంది.
14.మెగాస్కోలెక్స్‌లో--------- ముఖ్య ధమనిగా పని చేస్తుంది.
15.స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ --------- లో ఉంటుంది.
16.నీలి రంగు రక్తం కలిగిన జంతువులు ---------.
17.పుపుస మహా ధమని --------- నుంచి బయలుదేరు తుంది.
18.మానవుడిలో సామాన్య రక్తపీడనం --------- ఉంటుంది.
19.మానవుడి సామాన్య రక్తపీడనం 120/80లో పై సంఖ్య --------- పీడనాన్ని తెలుపుతుంది.
20.హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి ---------.
21.---------లో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది.
22.ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలకు మధ్య కవాటం ---------.
23.బి.పి.ని కొలిచే పరికరం ---------.
24.శరీరంలో పైభాగాల నుంచి రక్తాన్ని---------సేకరిస్తుంది.
25.మానవ శరీరంలో --------- అతి పెద్ద ధమని.
26.గ్రద్వయ కవాటానికి మరోపేరు ---------.
27.హృదయంలోని కవాటాలను వాటి స్థానంలో ఉంచ డానికి తోడ్పడే బంధన కణ జాల తంతువులను --------- అంటారు.
28.ఊపిరితిత్తులకు, హృదయానికి మధ్య జరిగే రక్త ప్రసరణను --------- వలయం అంటారు.
29.హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే రక్త ప్రసరణను ____ వలయం అంటారు.
30.రెండు వలయాల్లో రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని ____ అంటారు.
సమాధానాలు
1) విసరణ/ వ్యాపనం; 2) హృదయం; 3) జఠరిక; 4) జఠరిక; 5) పుపుస హృదయం; 6) చేపల; 7) రవాణా; 8) వానపాము; 9) పక్షాకార; 10) సిరాసరణి; 11) బొద్దింక (కీటకాలు); 12) బొద్దింక; 13) పృష్ట రక్త నాళం; 14) ఉదర రక్తనాళం; 15) కీటకాలు; 16) పీత, నత్త; 17) కుడి జఠరిక; 18) 120/80; 19) సిస్టోల్; 20) పుపుస సిరలు; 21) హృదయ ధమని; 22) అగ్రద్వయ కవాటం; 23) స్ఫిగ్మో మానోమీటరు; 24) పూర్వ మహాసిర; 25) దైహిక మహా ధమని; 26) మిట్రల్ కవాటం; 27) స్నాయు రజ్జువులు; 28) పుపుస; 29) దైహిక; 30) ద్వి వలయ ప్రసరణ హృదయం.
రక్తం - దాని అంశాలు, రక్త వర్గాలు
1.శరీరంలో ------------- ద్రవరూపంలో ఉండే కణజాలం.
2.------------- రక్తంలోని మాతృక.
3.రక్తం గడ్డకట్టడంలో -------------ప్రముఖ పాత్ర వహిస్తాయి.
4.------------- ద్రావణాన్ని సెలైన్ అంటారు.
5.రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం-------------.
6.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ------------- చూస్తుంది.
7.రక్తం గడ్డకట్టినప్పుడు, దానిమీద ఉండే స్పష్టమైన ద్రవాన్ని ------------- అంటారు.
8.రక్తంలోని హెమోగ్లోబిన్ ------------- ని------------- మోసుకు పోతుంది.
9.ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ------------- అంటారు.
10.ఎర్రరక్త కణాలు ------------- కలిగి ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి.
11.చిచిచిలను శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అంటారు.
12.------------- తెల్ల రక్తకణాల అన్నింటిలోనూ అతి చిన్నవి.
13.కేంద్రకం లేని రక్తకణం -------------.
14.------------- వంటి క్షీరదాల ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉంటుంది.
15.ప్లాస్మాలో సుమారు ------------- శాతం కర్బన రసాయనా లుంటాయి.
16.అతిపెద్ద తెల్ల రక్తకణాలు -------------.
17.‘’ ఆకారంలో ఉండే కేంద్రకం ఉన్న రక్త కణం-------------.
18.రెండు తమ్మెల కేంద్రకం ఉన్న రక్తకణం-------------.
19.అనేక తమ్మెలు కలిగిఉన్న కేంద్రకం ఉన్న రక్తకణం-------------.
20.మూత్రపిండం ఆకారంలో ఉన్న కేంద్రకం ఉన్న రక్త కణం -------------.
21.ఎర్ర రక్తకణాల జీవితకాలం సుమారు -------------.
22.తెల్ల రక్తకణాల జీవిత కాలం-------------.
23.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా తక్కువ.
24.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా ఎక్కువ.
25.శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి -------------.
26.’అఆ’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను------------- అంటారు.
27.’ై’ రక్త వర్గం గల వ్యక్తులను------------- అంటారు.
28.ఒక వ్యక్తి రక్తం మరొక వ్యక్తికి అతని సిర ద్వారా ఎక్కించడాన్ని ------------- అంటారు.
29.అత్యవసర పరిస్థితుల్లో రక్త వర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ------------- రక్త వర్గాన్ని ఇవ్వొచ్చు.
30.’AB’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను విశ్వ గ్రహీతలు అనడానికి కారణం -------------.
31.కారల్ లాండ్ స్టీనర్ ------------- కనిపెట్టారు.
32.ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ------------ ద్వారా ఎక్కిస్తారు.
33.ప్రతిజనకాలు ’అ’, ’ఆ’ రెండూ లేని రక్త వర్గం------------.
34.రక్త గుచ్ఛకరణానికి కారణమైన చర్య ------------.
35.రక్తంలో ప్రతిరక్షకాలుండే స్థానం ------------.
36.రక్తంలో ప్రతిజనకాలుండే స్థానం ____.
సమాధానాలు
1) రక్తం; 2) ప్లాస్మా; 3) రక్త ఫలకికలు; 4) 0.9% సోడియం క్లోరైడ్; 5) 0.85-0.9%; 6) హిపారిన్; 7) సీరం; 8) ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్; 9) ఎరిత్రోపాయిసిస్; 10) హిమోగ్లోబిన్; 11) న్యూట్రోఫిల్స్; 12) లింఫోసైట్స్; 13) ఎరిత్రోసైట్స్; 14) ఒంటె; 15) 6-8; 16) మోనోసైట్స్; 17) బేసోఫిల్స్; 18) ఇస్‌నోఫిల్స్; 19) న్యూట్రోఫిల్స్) 20) మోనోసైట్స్; 21) 120 రోజులు; 22) 12-13 రోజులు; 23) బేసోఫిల్స్; 24) న్యూట్రోఫిల్స్; 25) ఇస్‌నోఫిల్స్; 26) విశ్వ గ్రహీతలు; 27) విశ్వదాతలు; 28) రక్త ప్రవేశనం; 29) ’ై’ రక్త; 30) అన్ని రకాల రక్త వర్గాల నుంచి రక్తాన్ని గ్రహించడం వల్ల; 31) రక్త వర్గాలను; 32) సిర; 33) ’ై’; 34) ప్రతిజనకం- ప్రతిరక్షకం చర్య; 35) ప్లాస్మా; 36) ఎర్ర రక్తకణాలు.