Friday, 9 June 2017

ఉద్యోగాల్లో వారసత్వం చెల్లదు


ఉద్యోగాల్లో వారసత్వం చెల్లదు

అది రాజ్యాంగ విరుద్ధం..
హైకోర్టు తీర్పు సబబే..
సింగరేణి కేసులో సుప్రీం తీర్పు

       సింగరే ణి బొగ్గుగనుల్లో వారసత్వ ఉద్యోగాల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమంటూ మార్చి 16న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సింగరేణి, రాష్ట్ర ప్ర భుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ సింగ్‌ ఖేహర్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన కౌల్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ, సొలిసిటర్‌ జనరల్‌ రంజితకుమార్‌, ప్రభుత్వ న్యాయవాది ఉదయ్‌కుమార్‌ సాగర్‌, సింగరేణి కార్మికుల తరఫున సీనియర్‌ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపించారు. సింగరేణి సంస్థ ఉద్యోగులు, సిబ్బందిలో ఎవరైనా స్వచ్ఛం ద పదవీ విరమణ చేస్తే వారి తరఫున కుటుంబ సభ్యుల కు ఉద్యోగం ఇవ్వాలన్నదే ఉత్తర్వుల ఉద్దేశమని, సాధార ణ ఖాళీల భర్తీకి ఇవి వర్తించవన్నారు. సాధారణ ఖాళీల ను సాధారణ నియామక ప్రక్రియ ద్వారా నోటిఫికేషన జారీ చేసి, భర్తీ చేస్తామన్నారు. ఇవి కారుణ్య నియామకా ల కిందకే వస్తాయని వివరించారు. సింగరేణి లో 3 కి.మీ. మేర భూమి లోపలికి వెళ్లి పని చేయాల్సి ఉంటుందని, దీనికి చాలా నైపుణ్యం అవసరమన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ధ్రువీకరించుకున్న తర్వాతే ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు, వికలాంగులకు గనుల్లో పని ఇవ్వకూడదని చట్టాలు, తీర్పులు ఉన్నాయన్నారు. ఈ ఉద్యోగాలన్నీ నాలుగో తరగతికి చెందిన చిన్న స్థాయి ఉద్యోగాలే అన్నారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించేందు కు ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగంలోని 14, 16 నిబంధలనకు వారసత్వ ఉద్యోగాలు విరుద్ధమని చెప్పింది. హైకోర్టు తీర్పులో 16, 20 పేరాల్లోని అంశాలను సమర్థిస్తున్నామని ఆ తీర్పే చెల్లుబాటు అవుతుందని తెలిపింది.

వేజ్‌బోర్డు ఆదేశాలతో
అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రెండో వేజ్‌ బోర్డు సందర్భంగా 1979 ఆగస్టు 11న ఒప్పందం కుదిరింది. కొనసాగింపుగా 1981 జనవరి 21న చేసుకున్న ఒప్పందం ప్రకారం అనారోగ్యం తో స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్న కార్మికుల వారసులకు సింగరేణిలో ఉద్యోగాలిస్తున్నారు. 1998లో వీటిని రద్దు చేశారు. అప్పటి నుంచి కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు.

వారసత్వంపై ముందుకే!
వారసత్వ ఉద్యోగాలపై ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్ర భుత్వం భావిస్తోంది. ఆరునూరైనా వారసత్వ ఉద్యోగ హ క్కు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో 25 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను సింగరేణి కార్మికులు, కుటుంబాలు నిర్ణయిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కార్మికులంతా టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగ హక్కు పునరుద్ధరణకు తీవ్ర కసరత్తు చేసింది. 18 ఏళ్ల కిందటే ‘వారసత్వ ఉద్యోగ హక్కు’ను సింగరేణి యాజమాన్యం నిలిపివేసింది. 4 నెలల కిందటే సంప్రదింపులతో వారసత్వ ఉద్యోగ హక్కును పునరుద్ధరించారు.

No comments:

Post a Comment