Tuesday, 27 June 2017

గ్రూప్స్‌, ఇతర పోటీపరీక్షల ప్రత్యేకం


గ్రూప్స్‌, ఇతర పోటీపరీక్షల ప్రత్యేకం, 26-06-2017, - మద్రాసులో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది?
1. విలియం బెంటింగ్‌చేత సతీసహగమనాన్ని రద్దు చేయించింది - రాజారామ్మోహన్‌రాయ్‌
2. రాజారామ్మోహన్‌రాయ్‌ 1815లో 'ఆత్మీయసభ'ను,
- 1828 సంవత్సరంలో ('బ్రహ్మసభ'ను బ్రహ్మసమాజంగా మారింది) స్థాపించాడు
3. బ్రహ్మధర్మం అనే గ్రంథం, తత్వబోధిని అనే పత్రికను వెలువరించింది - దేవేంద్రనాథ్‌ టాగూర్‌
4. 1839 సంవత్సరంలో దేవేంద్రనాథ్‌ టాగూర్‌ తత్వబోధిని సభను స్థాపించాడు. దేవేంద్రుని అనుచరులలో కేశవ్‌ చంద్రసేన్‌ ముఖ్యుడు. బ్రహ్మసమాజంలో చీలిక వచ్చింది
- 1866లో (దేవేంద్రనాథ్‌ అనుచరులు 'ఆదిబ్రహ్మసమాజం'గానూ, కేశవచంద్రుని అనుచరులు 'భారత బ్రహ్మసమాజం'గాను ఏర్పడ్డారు.)
5. ప్రార్థనా సమాజ్‌ను ముంబయిలో ఆత్మారామ్‌ పాండురంగ్‌ ఎప్పుడు స్థాపించాడు - 1867
6. దక్కన్‌ విద్యా సంస్థలను, వితంతు వివాహా సంఘాన్ని స్థాపించింది - మహదేవ్‌ గోవిందరనడే
7. దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని ముంబయిలో స్థాపించాడు. హిందూమత సంస్కరణకు ఉద్దేశించిన సంస్థ. వేదాలే విశ్వవిజ్ఞానానికి మూలాధారాలు అన్నాడు. దయానందసరస్వతి రాసిన పుస్తకం - సత్యార్ధప్రకాశిక (ఆర్య సమాజ్‌ శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది)
8. గో బ్యాంక్‌ టు వేదాస్‌ అన్నది ఎవరు - దయానంద సరస్వతి (అసలుపేరు -మూల్‌ చంద్‌)
9. 1875 సంవత్సరంలో మాడమ్‌ బ్లావట్‌స్కీ, కల్నల్‌ ఓల్‌కాట్‌లు థియోస్థాపికల్‌ సొసైటీని ఎక్కడ ప్రారంభించారు - అమెరికా
10. థియోసాఫికల్‌ సొసైటీని మద్రాసు వద్ద అడయారుకు ఎప్పుడు మార్చారు - 1879
11. ఎవరి చేరిక వల్ల (1893లో) థియోసాఫికల్‌ సొసైటీ మన దేశంలో ప్రచారంలోకి వచ్చింది - ఐరిస్‌ వనిత అనిబిసెంట్‌
12. బెనారస్‌ హిందూ కళాశాలను ఎవరు స్థాపించారు - మదన్‌ మోహన్‌ మాలవ్య
13. యువబెంగాల్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది - హెన్రీ విలియన్‌ డెరోజియో (మొదటి జాతీయవాద కవి)
14. 1887లో బారానగర్‌లో వివేకానందుడు రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేశారు. 1897లో బేలూర్‌లో రామకృష్ణమిషన్‌ ఏర్పాటు చేశాడు. ఈ రెండు సంస్థలు బేలూరు ప్రధాన కేంద్రంగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి- 1898
15. వివేకానందుడు అసలుపేరు - నరేంద్ర నాథ్‌ దత్‌
16. 1893 సంవత్సరంలో వివేకానందుడు చికాగోలో జరిగిన ప్రపంచమతాల పార్లమెంట్‌లో పాల్గొని హిందూమతాన్ని సంస్కృతిని గురించి అద్భుతంగా ప్రసంగించాడు. వివేకానందుడు 1900లో ఏ దేశంలో జరిగిన మత సభలకు హాజయ్యాడు - పారిస్‌
17. 1856 సంవత్సరంలో ప్రభుత్వంచే వితంతు పునర్వివాహ చట్టాన్ని చేయించింది - ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌
18. వితంతు వివేకము గ్రంథకర్త - ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌
19. విద్యాసాగర్‌ ఏ సంవత్సరంలో తన ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం చేయించాడు - 1865 సంవత్సరంలో
20. బ్రహ్మమతం స్వీకరించి రాజమహేంద్రవరంలో ప్రార్థనా సమాజాన్ని సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించిన ఆంధ్ర సంఘ సంస్కర్త ఎవరు - కందుకూరి వీరేశలింగం
21. కందుకూరి 1881 డిసెంబర్‌ 11న ఏ వివాహాలకు శ్రీకారం చుట్టారు - వితంతు వివాహాలు (ఆంధ్రప్రాంతంలో)
22. మహారాష్ట్రలో లోక్‌హితవాది అని ఎవరిని అంటారు - గోపాల్‌ హరిదేశ్‌ముఖ్‌
23. మహారాష్ట్రలో బడుగు వర్నాల వారికోసం 1873లో సత్యశోధక్‌ సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు - జ్యోతిరావుఫూలే
24. ఇస్లాం మతాన్ని పునరుద్ధరించడానికి ప్రారంభమైన వహాబి ఉద్యమాన్ని (ఇచ్చిన్‌ అబ్దుల్‌ వహాబ్‌ అరేబియాలో ప్రారంభించారు) ఇండియాలో వ్యాపింపజేసింది - సయ్యద్‌ అమ్మద్‌ బరెల్వీ
25. మహమ్మదీయులలో ఆధునిక విద్యను వ్యాపింపజేయడానికి స్త్రీ జనోద్ధరణకు ఆలీఘర్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది - సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ఖాన్‌
26. కోల్‌కతాలోని హిందూ కళాశాలని ఎవరు స్థాపించారు - డేవిడ్‌హార్‌ (1817)
27. ముంబయిలో దర్పణ్‌ వార పత్రికను నిర్వహించినవారు - బాలశాస్త్రి జుంభేకర్‌
28. బ్రిటిష్‌ పాలనలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వనరులను వేరుచేయడానికి ప్రయత్నించిన మొట్టమొదటి వేశ్రారు - లార్డ్‌మేయో
29. విక్టోరియారాణి భారతదేశపు రాణి బిరుదును ఎప్పుడు స్వీకరించింది - 1876
30. దక్కను ఎడ్యుకేషనల్‌ సొసైటీని ఎవరు స్థాపించారు - నౌరోజీపుర్దైన్‌జీ, దాదాభారు నౌరోజీ, ఎస్‌.ఎస్‌.బంగాలీ
31. ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ ఎప్పుడు ప్రారంభించారు - 1927
32. రాజకీయ సంస్కరణలు కావాలని ఉద్యమించిన మొట్టమొదటి భారతీయుడు - రాజారామ్మోహన్‌రాయ్‌
33. ముంబయి ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు - ఫిరోజ్‌షా మెహతా, కె.టి.తెలంగ్‌, త్యాబ్జీ
34. 1869-72 కాలంలో మన దేశంలో 1871 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది ఎవరి కాలంలో - లార్డ్‌ మేయో
35. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ మొదటిసారిగా ఇండియాను ఎప్పుడు సందర్శించారు - 1875
36. డ్రెయిన్‌ ఆఫ్‌ వెల్త్‌ గురించి చెప్పిన పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌రూల్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తక రచయిత - దాదాబాయి నౌరోజీ (గ్లాండ్‌ ఓల్డ్‌మెన్‌ ఆఫ్‌  ఇండియా)
37. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసే విద్యార్థులకు వయోపరిమితి 19 సంవత్సరాలు తగ్గించిన వైస్రారు
- లిట్టన్‌ (ఆయుధగార చట్టం, ప్రాంతీయ భాషా పత్రికల అపహరణ చట్టరూపశిల్పి - 1878 సంవత్సరంలో)
38. 1881లో కర్మాగార చట్టం ప్రవేశపెట్టిన వైస్రారు - రిప్పన్‌ (స్థానిక స్వపరిపాలన సంస్కరణ పిత)
39. విద్యాభివృద్ధిని రిప్పన్‌ హంటర్‌ కమిషన్‌ను ఎప్పుడు నియమించారు - 1882
40. భారత న్యాయమూర్తులు కూడా ఐరోపావారిని విచారించే అధికారం కలుగజేసేబిల్లు (ఇల్వర్ట బిల్‌)ను ప్రవేశపెట్టింది - రిప్పన్‌
41. లిట్టన్‌ పెట్టిన ఆయుధగార చట్టాన్ని రద్దు చేసింది - రిప్పన్‌
42. భారతీయ కాంగ్రెస్‌ 1885 డిసెంబర్‌ 28న 72 మంది డెలిగేట్స్‌తో ముంబయిలోని సంస్కృత కళాశాలలో ప్రారంభించారు. దీనికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌ పార్టీ స్థాపనకు ఎఓ.హ్యూమ్‌ బాధ్యుడు. అప్పటి వైస్రారు - లార్డ్‌ డిఫిన్‌
43. కర్జన్‌ (1899-1905) వైస్రారు కాలంలో ప్రాచీన శిధిలాల రక్షణ చట్టం ఎప్పుడు చేశారు - 1904లో
44. 1905లో బెంగాల్‌ను విభజించింది - కర్జన్‌
45. వందేమాతరం గీత రచయిత - బంకిం చంద్ర చటర్జీ (ఆనంద్‌మఠ్‌ నవలలోనిది)
46. ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌ పార్టీని ఆగాఖాన్‌ ఢాకానవాబు సలీముల్లా ఖాన్‌ ఎప్పుడు ప్రారంభించారు - 1906లో
47. వార్త పత్రికలు ఇంగ్లీషులో 'మరాఠా', మరాఠిలో 'కేసరి' స్థాపించింది - తిలక్‌ (తిలక్‌కు ఫాదర్‌ ఆఫ్‌ ఇండియాన్‌ ఆన్‌రెస్ట్‌ అనే బిరుదులున్నాయి)
48. 1906 ఐఎన్‌సి-కోల్‌కతా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించింది - దాదాబాయి నౌరోజీ
49. 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అతివాదులు, మితవాదులుగా చీలిపోయారు. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానాన్ని మితవాది అయిన ఎవరు అలంకించారు - రాసబిహారీఘోస్‌
50. మింటో మార్లే సంస్కరణ - 1909, మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణ - 1919
51. లార్‌ ్డ హోర్గింగ్‌ వైస్రారు కాలంలో 1911లో కింగ్‌జార్జి దేనిని సందర్శించాడు - ఢిల్లీ దర్బారును
52. రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చారు - 1912
53. తిలక్‌ జైలులో ఉన్నప్పుడు ఏ గ్రంథాన్ని రచించాడు - గీతరహస్య
54. పూనా కేంద్రంగా 1916 ఏప్రిల్‌లో తిలక్‌ హోంరూల్‌ లీగ్‌ను స్థాపించాడు. మద్రాసు కేంద్రంగా 1916 సెప్టెంబరులో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించింది - అనిబిసెంట్‌
55. న్యూ ఇండియా, ది కామన్‌ వీల్‌ పత్రికల స్థాపకులు - అనిబిసెంట్‌
56. 1916 లక్నోలో కాంగ్రెస్‌ సమావేశమైంది. తిలక్‌ కృషి వల్ల అతివాదులు, మితవాదులు కలిసి కాంగ్రెస్‌ ఏకమైంది. తిలక్‌, జిన్నాల కృషి వల్ల స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడాలని కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నిశ్చయించుకున్నాయి. దీనిని ఏమంటారు - లక్నోపాక్ట్‌
57. కోల్‌కతా విశ్వవిద్యాలయం ఎలా పనిచేస్తుందని దానిపై వేసిన కమిషన్‌ - సెడ్లర్‌ కమిషన్‌
58. రెవెన్యూ పరిపాలనను, న్యాయ పరిపాలనను వేరుపరచిన మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు - కారన్‌వాలీస్‌
59. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - వెల్లస్లీ
60. రైత్వారీ విధానం మద్రాసులో ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ప్రవేశపెట్టారు - లార్డ్‌ హేస్టింగ్స్‌
61. ధగ్గులు అనే దారిదోపిడీ దొంగలను నాశనం చేసిన బ్రిటీష్‌ జనరల్‌ ఎవరు - విలియం స్లీమాన్‌
62. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన ఆంగ్లేయుడు - లార్డ్‌మెకాలే
63. వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో రెవెన్యూ సంస్కరణలకు రూపశిల్పి - రాబర్ట్‌ బర్డ్‌
64. మద్రాసులో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి - సర్‌ థామస్‌మన్రో
65. భారతీయ పత్రికలపై నిషేధాలను ఎత్తివేసిన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ - ఛార్లెస్‌ మెట్‌కాఫ్‌
66. రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని ఉపయోగించి డల్హౌసి ఏఏ స్వదేశీ సంస్థానాలను ఆక్రమించాడు - సతారా (1848), జైపూర్‌, సంబల్‌పూర్‌ (1849), భరత్‌ (1850), ఉదరుపూర్‌ (1853), ఝాన్సీ నాగపూర్‌ (1854).
67. ప్రసిద్ధి చెందిన ఛార్లెస్‌ ఉడ్స్‌ డిస్పాచ్‌ ఎవరి కాలంలో నియమించారు - డల్హౌసీ
68. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్‌ వైశ్రారులలో ఒకే ఒక్క యూదుడు ఎవరు - లార్డ్‌ రీడింగ్‌
69. లార్డ్‌ కర్జన్‌ కాలంలో మాక్‌డొనల్‌ అధ్యక్షతన కరువు లేదా ఫేమిన్‌ కమిషన్‌ను, నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పర్చడం కోసం ఏ కమిషన్‌ను ఏర్పాటు చేశారు - మాంక్రిఫ్‌ కమిషన్‌
70. బ్రిటిష్‌ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించడానికి లార్డ్‌ లాండ్స్‌డౌన్‌ నియమించిన సంఘం పేరేమిటి - డ్యూరాండ్‌ కమిషన్‌

No comments:

Post a Comment