రాత పరీక్షతోనే ఉద్యోగం
ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 976 ఖాళీలు భర్తీ చేయడానికి ప్రకటన ఇచ్చింది. దీనిలో 20 ఆంధ్రప్రదేశ్, 25 తెలంగాణలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రిజిసే్ట్రషన్ మార్చి 29 వరకు ఉంటుంది.
వయస్సు
గత ఏడాది జూన్ 30 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠంగా 30 సంవత్సరాలు. రిజర్వుడు వర్గాలకు సడలింపు ఉంటుంది.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, అక్కడి ప్రాంతీయభాషలో నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి.
ఐబిపిఎస్ మాదిరిగానే ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
టైర్-1 ప్రిలిమినరీ
బ్యాంకు పరీక్ష మాదిరిగానే ఇందులోనూ మూడు టెస్టులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి నుంచి చెరి 35 మొత్తం 100 ప్రశ్నలుంటాయి. వంద మార్కుల ఈ పేపర్‌కు 60 నిమిషాలు సమయం ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. అభ్యర్థులు మెయిన్‌కు అర్హత సాఽధించాలంటే ప్రతి టెస్ట్‌లోనూ విడివిడిగా, ఓవరాల్‌గా కూడా క్వాలిఫై కావాలి.
టైర్-2 మెయిన్
దీనిలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహావే. అయిదు టెస్ట్‌లు ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటాయి. ఒక్కో టాపిక్‌పై 40 ప్రశ్నలు, 50 మార్కులకు ఉంటాయి. అంటే రెండు వందల ప్రశ్నలు 250 మార్కులకు అడుగుతారు. సమయం రెండు గంటలు (120 నిమిషాలు) కేటాయించారు. మెయిన్ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని షార్ట్ లిస్టు చేసి, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ రాయడానికి పిలుస్తారు. రీజినల్ లాంగ్వేజ్ (ప్రాంతీయ భాష) టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కలది.
ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ప్రిపరేషన్ వ్యూహం
ఐబిపిఎస్/ బ్యాంక్ క్లర్క్/ పీఓ పరీక్షల్లో మాదిరిగానే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఉంటుంది.
అయితే ప్రతి టెస్ట్ కోసం ఈ కింది సమాచారాన్ని సూచన ప్రాయంగా అందించారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్:
ఈ పరీక్ష అభ్యర్థికి ఇంగ్లీష్ ఏ మేరకు తెలుసు అనే విధంగా ఉంటుంది. గ్రామర్‌పై పట్టు, ఆంగ్ల పదాల అర్థాలు తెలియడం, వాక్య నిర్మాణంలో సమర్ధత, వాక్యాల పూరణ, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ఆంగ్ల పాసేజ్ కాంప్రహెన్షన్‌కు తోడు ఇతర రకాల ప్రశ్నలూ ఉండవచ్చు.
రీజనింగ్ టెస్ట్:
అభ్యర్థి ఎంత బాగా ఆలోచించగలరు అనే అంశం మీద ఈ టెస్ట్ ఉంటుంది.
క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్:
అభ్యర్థి ఎంతవేగంగా కచ్చితంగా లెక్కలు చేయగలరో తెలుసుకునే విధంగా ఉంటాయి. కంప్యుటేషన్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంట్రప్రిటేషన్ ఆఫ్ డేటా మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
నోట్: న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ ప్రకటనలో పూర్తి సిలబస్ ఏదీ పేర్కొనలేదు. కాని గత అనుభవం ప్రకారం బ్యాంకు పరీక్ష మాదిరి ప్రశ్నలే ఉంటాయని భావించి పరీక్షలకు అభ్యర్థి ప్రిపేర్ కావాలి. ఇది క్లర్క్ స్థాయి ఉద్యోగం కనుక ఇంటర్వ్యూ ఉండదు.
తెలుగులో పాసైతేనే పోస్ట్
ఇన్సూరెన్స్ కంపెనీల అసిస్టెంట్స్ (క్లరికల్) స్థాయి రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పెట్టడం దాదాపుగా ఇదే మొదటిసారి.
బ్యాంకు ఉద్యోగాలకు నిర్వహించే మెయిన్‌లో టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నె్‌సతోపాటు బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనలో సింపుల్‌గా టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ అని తెలిపారు.
ఈ పరీక్ష రాసే ఎస్టీ/ ఎస్టీ/ఓబీసి అభ్యర్థులకు ఉచితంగా ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ / కోచింగ్ ఇస్తామని ప్రకటించింది. ఇది నాన్ - రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. దీనికోసం అభ్యర్థులు www.newindia.co.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకొని రీజినల్ ఆఫీస్ లేదా ప్రీ - ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌కు అప్లికేషన్‌ను పంపుకోవాలి.
ఎంపికై మెట్రో నగరాల్లో పనిచేసే వారికి మొదట్లో నెలకు రూ.23,000 జీతం, ఇతర అలవెన్స్‌లు, సదుపాయాలు ఉంటాయి.
ప్రాంతీయ భాష:
ఎంపికైన అభ్యర్థికి ప్రాంతీయభాష పై ఏ మేరకు పట్టు ఉందో తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటేనే అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు.
మహిళ/ ఎస్టీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు కేవలం రూ.50 అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇతరులకు అప్లికేషన్ ఫీజు రూ.500
విద్యార్హత:
డిగ్రీ కనీస అర్హతగా మార్చారు.
గతంలో అన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉండేది. ఇప్పుడు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు.
No comments:
Post a Comment