Monday, 6 March 2017

ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే


సోషల్ మీడియా ఉద్యమం : ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే

                                                                                                                                                     



               డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడు.. బ్యాలెన్స్ లేకపోయినా బాదుడే.. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చేశాయి. అత్యవసరం అయినా సరే.. నీ డబ్బు నువ్వు తీసుకోవటానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బే అయినా.. దానిపై అధికారం మాత్రం మాదే అంటున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు.. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బు డ్రా చేస్తామన్నా చార్జీలు వేస్తామంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ SBIతోపాటు ICICI, HDFC, AXIS ఇతర బ్యాంకుల నిర్ణయంపై ఖాతాదారులు మండిపతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి పిలుపునిచ్చారు.
         రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) కొత్త నిబంధనలపై సోషల్ మీడియాతోపాటు జాతీయ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ 6, 2017 (వచ్చేనెల) నో ట్రాన్సాక్షన్ డే నినాదం తీసుకొచ్చారు. ఏప్రిల్ ఆరవ తేదీన దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు.. లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్ లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. RBI కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడుపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి.. కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వటం విశేషం...

No comments:

Post a Comment