Monday, 27 February 2017

ఇంగ్లీష్‌ ప్రాముఖ్యం ఎంత?

ఇంగ్లీష్‌ ప్రాముఖ్యం ఎంత?

ఎస్‌బిఐ పీఓ ప్రిలిమినరీ టెస్ట్‌ 

ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్స్‌/ మేగజైన్స్‌ / స్టోరీలు చదవడం అలవాటు చేసుకున్న వారే దీనిలో రాణిస్తారు. వీటన్నింటికి మించి గ్రామర్‌పై పట్టు, ఇంగ్లీష్‌ డిక్షనరీ అధ్యయనం ఉండాలి.  ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో కూడా టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఉంది కాబట్టి, దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
 
చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్‌ టెస్ట్‌కి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. కారణాలు అనేకం. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అలాగే డిగ్రీ చేస్తున్నవారిలో అధికులు తెలుగుమీడియంలో చదవడమే ప్రధాన కారణం. ఈ సమస్య ఒక్క తెలుగుభాష మాట్లాడే వారికే కాదు, హిందీ, కన్నడ, మరాఠి భాషల అభ్యర్థులకు కూడా ఉంది. పదిహేనేళ్ళ క్రితం పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో చదవలేదు. అలాంటి పిల్లలే పెరిగి పెద్దవారై ప్రస్తుతం బ్యాంకు పీఓ పరీక్షలు రాయడానికి తాపత్రయ పడుతున్నారు. ఆంగ్లభాష గురించి దిగులు పడవద్దు. అదేమి అధిగమించలేని సమస్య కాదు. కొంచెం శ్రమించాలి... పిల్లలు స్వతంత్రంగా ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్‌ చదవడం మొదలుపెడితే, ఒక ఆరు నెలల్లో బ్యాంకు పోటీ పరీక్షల్లో ‘టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీ్‌ష’లో చాలా సులువుగా మంచి మార్కులు సంపాదిస్తారు. ఐబిపిఎస్‌ పీఓ పరీక్ష కన్నా, ఎస్‌బిఐ పీఓ పరీక్ష కాస్తంత కఠినంగా ఉంటుంది.
 
ఎస్‌బిఐ బ్యాంకు ఆఫీసర్‌ ఎగ్జామ్‌ ప్రిలిమినరిలో ఉన్న ఇంగ్లీష్‌ టెస్ట్‌లో 30 ప్రశ్నలు ఉంటున్నాయి.
1) రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (ఒక పాసేజ్‌ని సమగ్రంగా, క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఇతరులకు బోధించేవిధంగా ఉండటం అన్నమాట.) 
ఈ అంశం కింద ఒక ఇంగ్లీష్‌ పాసేజ్‌ ఇస్తారు. దాదాపు వెయ్యి పదాలతో కూడిన ఈ పాసేజ్‌ ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్‌ నుంచి గ్రహించిన ఏదో ఒక టాపిక్‌పై ఉంటుంది. ఉదాహరణకు 2016 ఎస్‌బిఐ పీఓ ప్రిలిమ్స్‌లో ఇచ్చిన టాపిక్‌లు: (ఒక రోజున అన్ని స్లాట్‌ల / బ్యాచ్‌ల వారికి ఇచ్చిన పాసేజ్‌లు అన్నీ మహిళను దృష్టిలో పెట్టుకుని ఉండటం విశేషం).
ఎ) Indian Labour Organisation on women maternity leave (ప్రసూతి సెలవు)
బి)Women & Men Gender gap (లింగ వివక్ష) 
సి) Women work on various companies (పలు రకాల కంపెనీల్లో మహిళా ఉద్యోగులు) 
డి) WOMEN EMPOWERMENT (మహిళా సాధికారత)
 
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(ఆర్‌సి) కింద పది ప్రశ్నలు ఇస్తున్నారు. ఉదాహరణకు-
1) What is the main reason for huge gender disparities in women’s economic participation in India?
2) Share of women entrepreneurs is lowest in which of the following industries ?
3) Which of the following can help significantly in emboldening women entrepreneurs ?
4) Which of the following is FALSE in the context of the passage ?
5) What is the writing style used by the author in his passage ?
6) Which of the following is / are the reason(s) for district – industry with high rate of incumbent female employment ?
 

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నల్లోనే రెండు ప్రశ్నలు వ్యతిరేక పదాలు, రెండు పర్యాయ పదాలు గుర్తించేవి ఉన్నాయి. 
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌లో మంచి మార్కుల కోసం: 
ఛాలెంజ్‌: 30 ప్రశ్నలను 20 నిమిషాల్లో ఆన్సర్‌ చేయడం. 
మార్కులు: కనీసం 15 సంపాదించడం,
 
క్వాలిఫై కావడానికి టిప్స్‌:
1) క్లోజ్‌(Cloze) టెస్ట్‌(లేక)ను ముందుగా ఆన్సర్‌ చేయండి. ఖాళీలతో ఉన్న పేరాగ్రా్‌ఫను సరైన పదాలతో నింపాలి. అయిదు ప్రశ్నలుంటాయి. దీనిలోని సెంట్రల్‌ థీమ్‌ గుర్తించండి.(నోట్‌: ఒకే పేరాగ్రాఫ్‌ ఉంటుంది, అయిదు పదాల కోసం అయిదు బ్లాంక్‌లు ఉంటాయి) 
2) ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌ (ఇచ్చిన వాక్యంలో ఖాళీలు నింపడం) ఆన్సర్‌ చేయండి. ఒక్కొక్క వాక్యంలో రెండు ఖాళీలు ఇస్తున్నారు. దీనిలో అయిదు ప్రశ్నలుంటాయి. (నోట్‌: అయిదు సెపరేట్‌ వాక్యాలు ఉంటాయి. పది పదాలకు పది బ్లాంక్‌లు ఉంటాయి). 
3) తరవాత రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ చదవండి. దీనికింద ఉన్న పది ప్రశ్నలూ ఆన్సర్‌ చేయుండి. పాసేజ్‌ చదివేటప్పుడే సెంట్రల్‌ ధీమ్‌ గుర్తించండి.(ఇచ్చిన పాసేజ్‌కి సరైన టైటిల్‌/ హెడ్డింగ్‌ ఏది, రచయిత అభిప్రాయం ఏమిటి అన్నవి గమనించండి) 
4) తరవాత పారా జంబ్లింగ్‌ కింద ఇచ్చిన వాక్యాలను సరైన వరుసక్రమంలో అమర్చండి. దీని కింద అయిదు ప్రశ్నలుంటాయి. (నోట్‌: ఏ వాక్యం మొదట వస్తుంది, ఏ వాక్యం రెండో వాక్యం గా వస్తుంది, అలాగే వరుసగా 3, 4, 5 వాక్యాలు ఏమి వస్తాయో గుర్తించాలి) 
5) చివరగా సెంటెన్స్‌ కరక్షన్‌(ఇచ్చిన వాక్యంలోని ఎర్రర్‌ను గుర్తించడం) ఆన్సర్‌ చేయండి. దీనిలో అయిదు వాక్యాలుంటాయి.

గమనిక: రీడింగ్‌ కంప్రహెన్షన్‌ను ఆన్సర్‌ చేయలేకపోయినవారు, ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేకపోతున్నారు.
 
రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ సులువుగా ఆన్సర్‌ చేయడానికి ఏడు సూత్రాలు
ఠి ఇచ్చిన పాసేజ్‌ చదివి, దానిపై ప్రశ్నలు మనకి మనమే వేసుకోవడం: గిజిౌ, గిజ్ఛిుఽ, గిజ్ఛిట్ఛ, గిజిడ, గిజ్చ్టి, గిజిజీఛిజి, ఏౌఠీ పదాలతో మొదలయ్యే ప్రశ్నలు వేసుకొని ఆన్సర్‌ రాబట్టడం అన్నమాట. 
ఠి ఇచ్చిన పాసేజ్‌ను సమగ్రంగా అర్థంచేసుకోవడం. 
ఠి పాసేజ్‌లోని మనుషుల పేర వారిమధ్య గల సంబంధాలు 
ఠి ఏ సబ్జెక్టుపై పాసేజ్‌ ఇచ్చారు. 
ఠి పాసేజ్‌లోని ప్రతి ఇంగ్లీష్‌ పదాన్ని నోటితో చదవడం కాదు. దాని కన్నా ఆంగ్ల పదాలను గ్రూప్‌గా కంటిచూపుతో చదవడం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే స్పీడ్‌ రీడింగ్‌ వస్తుంది 
ఠి ఇచ్చిన పాసేజ్‌ని ఒక సినిమా కథ మాదిరిగా విజువల్‌గా, కళ్లకి కట్టినట్టుగా అర్థం చేసుకోవడం. 
ఠి ఇచ్చిన పాసేజ్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ ఇన్ఫర్మేషన్‌ మన దగ్గర ఉండటం (అంటే ఎకనామిక్‌, సోషల్‌, సైంటిఫిక్‌, కల్చరల్‌, పోలిటికల్‌ టాపిక్‌లపై కొంత అవగాహన మనకు ఉండాలి.)

No comments:

Post a Comment