Monday, 27 February 2017

గ్రూప్‌-2కు 73.5 శాతం హాజరు

నేడు ‘కీ’ విడుదల.. నెలరోజుల్లోగా ఫలితాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌- 2 స్ర్కీనింగ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 73.5 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దివ్యాంగులు, గర్భిణీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రశ్నాపత్రాన్ని మూస పద్దతిలో కాకుండా విశ్లేషణాత్మకంగా రూపొందించి, తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించారు. మొత్తం 6,57,010 మంది దరఖాస్తు చేసుకోగా 483321 (73.5 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 78.16 శాతం, తక్కువగా రంగారెడ్డి జిల్లాలో 47.81 శాతం హాజరు నమోదైంది. సోమవారం ‘కీ’ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవిఎ్‌సటీ సాయి తెలిపారు. అభ్యంతరాలుంటే కీతో ఇచ్చిన ఫార్మట్‌ను పూర్తిచేసి రాతపూర్వకంగా వారంరోజుల్లోగా ఏపీపీఎస్సీ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. ఈ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను నెలరోజుల్లో విడుదల చేయనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 5 వేల మందిని మే 20, 21న జరిగే మెయిన్స్‌కు అనుమతిస్తారు. ఇంటర్వ్యూ లేకుండా మెయిన్స్‌ పరీక్షే ఫైనల్‌గా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
 
మానవతా దృక్పథంతో అనుమతి
కొన్ని ప్రాంతాల్లో అసౌకర్యాన్ని గమనించి కాస్త ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా మూడు విభాగాల్లో సమానమైన ప్రశ్నలు కేటాయించకపోవడంతో ఆందోళనకు గురయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు. ఎకానమీ పేపర్‌ కాస్త క్లిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment