గ్రామీణ బ్యాంకుల స్వాగతం!
బ్యాంకింగ్ కార్యకలాపాలు, సదుపాయాలు పల్లెటూరి ప్రజలకు అందించే ముఖ్యోద్దేశంతో ఏర్పడిన గ్రామీణ (రీజనల్ రూరల్) బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ల్ల, ఆఫీసర్ల నియామకానికి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ అభ్యర్థులకు ఇదో చక్కని అవకాశం. 2017-18లో ఐబీపీఎస్ నిర్వహించబోయే ఉమ్మడి పరీక్షల్లో మొదటగా నిర్వహించే ఈ పరీక్షల సన్నద్ధత రాబోయే పీఓ, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ల పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది!
దాదాపు 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నియామకాలు జరిగే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 253 ఆఫీస్ అసిస్టెంట్లు, 224 స్కేల్-1 ఆఫీసర్లు, తెలంగాణలో 746 ఆఫీస్ అసిస్టెంట్లు, 327 స్కేల్-1 ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్లు, స్కేల్-1 ఆఫీసర్ల ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ కనీస అర్హత కాగా స్కేల్-2, స్కేల్-3 ఆఫీసర్ల ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతోపాటు 1-5 సంవత్సరాల వరకు ఆయా రంగాలకు సంబంధించి ఉద్యోగానుభవం ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో అయిదు గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు. ఐబీపీఎస్ జనవరిలో విడుదల చేసిన పరీక్షల క్యాలెండర్‌లో పేర్కొన్న తేదీల్లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

ఎంపిక ఎలా?
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రెండంచెల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనిలో మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష. రెండో అంచెలో నిర్వహించే ప్రధాన పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
స్కేల్-1 ఆఫీసర్ పోస్టులకు రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. అదేవిధంగా స్కేల్-2, స్కేల్-3 పోస్టులకు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఒకే రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పరీక్షా విధానం
ఆఫీస్ అసిస్టెంట్ల్ల, స్కేల్-1 ఆఫీసర్ల రాతపరీక్షలు ఒకేవిధంగా ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ ఉండగా స్కేల్-1 ఆఫీసర్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో ఒక్కో విభాగంలో 40 ప్రశ్నలు, 40 మార్కుల చొప్పున రెండు విభాగాలు (రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్) ఉంటాయి.
ఈ 80 ప్రశ్నలు సాధించడానికి 45 నిమిషాల సమయం ఉంటుంది. ప్రధాన పరీక్షలో 40 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలతో అయిదు విభాగాలు ఉంటాయి. అవి: రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ (స్కేల్-1 ఆఫీసర్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్), జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్. వీటిలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీలకు 50 మార్కుల చొప్పున, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీలకు 40 మార్కుల చొప్పున, కంప్యూటర్ నాలెడ్జ్‌కి 20 మార్కులతో మొత్తం 200 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీ లాంగ్వేజీల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రధాన పరీక్షకు ఉన్న సమయం 2 గంటలు.
స్కేల్-2, స్కేల్-3 పరీక్షలు స్కేల్-1 ప్రధాన పరీక్ష మాదిరిగానే ఉంటాయి. కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ అవేర్‌నెస్ స్థానంలో ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఉంటాయి. స్కేల్-2 (స్పెషలిస్ట్ ఆఫీసర్) పరీక్షలో మాత్రం వీటికి అదనంగా 40 ప్రశ్నలు, 40 మార్కులతో ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం ఉంటుంది.
అన్ని పరీక్షల్లో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. గుర్తించే ప్రతి తప్పు సమాధానానికీ రుణాత్మక మార్కులుంటాయి.

ఎలా సన్నద్ధమవాలి?
సెప్టెంబరులో ప్రాథమిక పరీక్ష, నవంబరులో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. అయితే సెప్టెంబరులో జరిగే ప్రాథమిక పరీక్షలకు దాదాపు రెండు నెలలకు పైగా సమయముంది. అభ్యర్థులు ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకునే తమ సన్నద్ధతను కొనసాగించాలి. ఐబీపీఎస్ పీఓ, క్లర్క్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు వారి సన్నద్ధత ఈ పరీక్షకు సరిపోతుంది. తొలిసారిగా బ్యాంకు పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రం 20- 30 రోజుల సమయం వరకు అన్ని సబ్జెక్టుల భావనలు (ప్రాథమికాంశాలు) బాగా నేర్చుకుని వివిధ తరహా ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్షకు ఉండే సమయాన్ని నిర్దేశించుకుని వివిధ మాదిరి ప్రశ్నపత్రాలను సాధించాలి. ప్రతిరోజూ కనీసం ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని సాధించడం తప్పనిసరి. ప్రాథమిక పరీక్షలో కనీసం 50 మార్కులు రావాలి.
తమ ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గ్రామీణ బ్యాంకులు ఆ అవకాశాన్ని కల్పిస్తాయి. ఉద్యోగ భద్రత, చక్కని జీతభత్యాలకు అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ముఖ్యంగా అధికాసక్తికరమైనవి. బ్యాంకు పరీక్షలు కష్టమైనవి అనే భావన వీరిలో ఉంటుంది. అయితే ఈ పరీక్షలు అభ్యర్థికి ఎంత లోతైన పరిజ్ఞానం ఉంది అనే తెలుసుకునే ధోరణిలో కాకుండా అతని తెలివితేటలు, చురుకుదనం (అలర్ట్‌నెస్), వర్తమానాంశాల పట్ల అవగాహన మొదలైనవి తెలుసుకునేలా ఉంటాయి. బ్యాంకు పరీక్షల్లోని సబ్జెక్టులు కూడా తదనుగుణంగానే ఉంటాయి. పూర్వ ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా వివిధ సబ్జెక్టుల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలసుకుని, దానికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి.
కాస్త అటూఇటూగా ఒకే సమయంలో జరగబోయే ఐబీపీఎస్ పీఓ, క్లర్క్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు సరైన విధంగా సన్నద్ధమైతే ఏదో ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగం సంపాదించవచ్చు.
సెప్టెంబరులో జరిగే ప్రాథమిక పరీక్షలకు దాదాపు రెండు నెలలకు పైగా సమయముంది. అభ్యర్థులు ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకునే తమ సన్నద్ధతను కొనసాగించాలి. తొలిసారిగా బ్యాంకు పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మాత్రం 20- 30 రోజుల సమయం వరకు అన్ని సబ్జెక్టుల భావనలు (ప్రాథమికాంశాలు) బాగా నేర్చుకుని వివిధ తరహా ప్రశ్నలు సాధన చేయాలి.

సమయం సరిపోతుందా?
* నాన్ మేథమేటిక్స్ అభ్యర్థిని. నేను బ్యాంకు ఉద్యోగం సాధించగలనా?
* బ్యాంకు పరీక్షలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. వీటిలోనివి అన్నీ జనరల్ సబ్జెక్టులు. అరిథ్‌మెటిక్ మాత్రమే ఇంతకుముందు చదివుంటారు. అది కూడా పాఠశాల స్థాయిలోనే. అందువల్ల అభ్యర్థి ఏ నేపథ్యం (ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేథ్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ మొదలైనవి) వారైనా అందరూ సాధించే అవకాశముంది.
* బ్యాంకు పరీక్షకు ఉన్న రెండు నెలల సమయం సరిపోతుందా?
* పరీక్షలో ఉండే విభాగాలన్నింటి కాన్సెప్టులను నేర్చుకోవడానికి నెలరోజుల సమయం చాలు. మిగిలిన సమయం వివిధ రకాల ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలను సాధించడానికి సరిపోతుంది.
* రోజులు ఎన్ని గంటల సమయాన్ని కేటాయించాలి?
* ఇక్కడ ఎన్ని గంటలు అని కాకుండా ఎంత నాణ్యమైన సమయాన్ని కేటాయించారో అన్నది చూసుకోవడం ముఖ్యం. సబ్జెక్టులన్నింటికీ రెండు నెలల సమయంలో సిద్ధమవాలంటే రోజుకు 8-10 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది.
* తెలుగు మాధ్యమ విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాన్ని సాధించగలరా? ఆంగ్ల మాధ్యమం వారితో పోటీ పడగలరా?
* పరీక్ష ఆంగ్లంలో ఉంటుంది కాబట్టి తెలుగు మాధ్యమంవారు సబ్జెక్టులన్నీ ఇంగ్లిష్‌లోనే నేర్చుకోవాలి. తెలుగులో నేర్చుకున్న పదాలన్నింటికీ ముందుగా ఆంగ్ల అర్థాలను చూసుకోవాలి. ఇంగ్లిష్‌లోనే చదువుతూ, సాధనచేస్తూ ఉంటే వారూ అలవాటుపడతారు. అయితే ఆంగ్లమాధ్యమ విద్యార్థులతో పోలిస్తే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు అందరికీ ఒకటే కాబట్టి ఎవరు బాగా చేస్తే వారికే అవకాశం ఉంటుంది.
* పరీక్షలో ఏ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి?
* బ్యాంకు పరీక్షలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో విడివిడిగా ఉత్తీర్ణులు అవ్వాలి. కాబట్టి సబ్జెక్టులన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.

సబ్జెక్టులు- అవగాహన
న్యూమరికల్ ఎబిలిటీ/ క్వాంట్ ఆప్టిట్యూడ్: వీటి మధ్య పెద్దగా భేదం ఉండదు. న్యూమరికల్ ఎబిలిటీలో ప్రశ్నలు తక్కువ స్థాయిలో, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ స్థాయిలో ఉంటాయి. సాధారణంగా ప్రశ్నలు సింప్లిఫికేషన్, అప్రాక్సిమేట్ వాల్యూస్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, అరిథ్‌మెటిక్‌లోని వివిధ అంశాల నుంచి వస్తాయి. అయితే న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్స్ నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే విభాగం కాబట్టి కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగేలా సాధన చేయాలి. నంబర్ సరీస్ ప్రశ్నల్లో సంఖ్యల మధ్య సంబంధాన్ని కనుక్కుంటే వెంటనే సాధించవచ్చు. లేదా ఎక్కువ కాలయాపన చేయకుండా వాటిని వదిలేయడం మంచిది. కఠినంగా అనిపించే ప్రశ్నలకు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించడం మంచిది కాదు. తేలిక ప్రశ్నలను ముందుగా పూర్తిచేసి, సమయముంటే అప్పుడు కఠినమైన వాటిని ప్రయత్నించాలి.

రీజనింగ్: అకడమిక్ పరీక్షల్లో ఎక్కడా చదవని సబ్జెక్టు ఇది. ఆసక్తికరంగా, సులభంగా ఉండే సబ్జెక్టు అయినప్పటికీ ఈమధ్యకాలంలో దీనిలో ప్రశ్నలు కఠినంగా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువ సాధన అవసరం. వీటిలో ప్రశ్నలు కోడింగ్-డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫ´బెట్/ నంబర్ సీక్వెన్సెస్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్స్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్‌మెంట్ మొదలైనవాటితోపాటు అనలిటికల్ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్-అసంప్షన్స్/ కన్‌క్లూజన్స్/ ఇన్‌ఫరెన్సెస్/ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, ఇన్‌పుట్- అవుట్‌పుట్, పజిల్ టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్ మొదలైన వాటినుంచి ఉంటాయి. బాగా సాధన చేసినప్పుడే ఎటువంటి సంశయం లేకుండా సరైన జవాబులను గుర్తించే అవకాశం ఉంటుంది.
జనరల్ అవేర్‌నెస్: వీటిలో బ్యాంకింగ్, ఆర్థికాంశాలకు ప్రాధాన్యమిస్తూ వర్తమానాంశాలపై ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ బాగా చూసుకోవాలి. సాధారణంగా పరీక్ష సమయానికి 5, 6 మాసాల ముందు వరకూ ఉండే వర్తమానాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్‌బీఐ విధులు, దేశ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు, బడ్జెట్, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు- రచయితలు, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు మొదలైనవాటిని బాగా చూసుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: బ్యాంకింగ్ పరీక్షల్లో ఎక్కువమంది విఫలమవుతున్న విభాగమిది. దీనికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి సరైనవిధంగా సన్నద్ధం కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రశ్నల సరళిని గమనించి తదనుగుణంగా సన్నద్ధమైతే దీనిలో కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. దీనిలో వ్యాకరణం ఆధారంగా ఉండే సెంటెన్స్ కంప్లీషన్, పారా జంబుల్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, ఫైండింగ్ గ్రమాటికల్ ఎర్రర్స్, అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మొదలైనవాటి నుంచే దాదాపు సగం ప్రశ్నలుంటాయి. ఈ తరహా ప్రశ్నలు బాగా సాధన చేయాలి. వీటితోపాటు కాంప్రహెన్షన్, ఒకాబులరీ ప్రశ్నలు ఉంటాయి. వేగంగా చదివి, బాగా సాధన చేస్తే కాంప్రహెన్షన్ ప్రశ్నలను త్వరగా సాధించవచ్చు.
కంప్యూటర్ నాలెడ్జ్: ఎక్కువ మార్కులు సాధించగలిగే సబ్జెక్టు ఇది. ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, వివిధ కాంపోనెంట్స్- ఉపయోగాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్, నెట్‌వర్కింగ్, ఇంటర్నెట్, ఈ-కామర్స్, కంప్యూటర్ టర్మినాలజీ, వివిధ షార్ట్‌కట్ కీలు, డీబీఎంఎస్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.ibps.in
Notification | Apply Online |