Saturday, 17 June 2017

GST..1st July నుండి అమల్లోకి రానున్న తరుణంలో.. పన్ను పరిధి..దాని పూర్తి వివరాలు

GST..1st July నుండి అమల్లోకి రానున్న తరుణంలో..
పన్ను పరిధి..దాని పూర్తి వివరాలు..ప్రియ మిత్రులకోసం..
^*^*^*^*^*
* GST అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతుంది..
* ప్రతి వ్యాపారి జాగ్రత్త వహించండి..
* పాత తరం విధానాలకి చరమగీతం పాడండి..
* లైసెన్స్ లేని వ్యాపారం ఇకపై కుదరదు..
* భారత వాణిజ్య విధానం ఇప్పటిదాకా ఒకరకం అయితే ఇకపై పూర్తిగా భిన్నమైన పరిస్థితి..
* ప్రతి అమ్మకం - కొనుగోలు పూర్తిగా పేపర్ పై చూపించాల్సి ఉంటుంది..
* కట్టు తప్పితే వేటుకు సిద్ధంగా ఉండండి..
★ దేశవ్యాప్తంగా జులై 1 నుండి GST విధానం 100% అమలులోకి వస్తుంది.
★ ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉన్న VAT విధానం పూర్తిగా రద్దవుతుంది..
★ దేశ స్వతంత్రానంతరం నేటి వరకు లేని 4 ఉత్పత్తులపై కూడా ఈ GST విధానంలో చేర్చబడ్డాయి. అవి.. విద్య, వస్త్రాలు, ఔషధాలు, వృత్తి ద్వారా అందించే సేవలు. ఇకపై వీటిని కూడా వివిధ రకాలుగా పన్ను సేవలలో చేర్చడం జరిగింది.
★ ఇప్పుడున్న VAT విధానం నుండి GST కి మరాలనుకుంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.
★ GST విధానంలో పన్నులు 7 రకాలుగా విభజించబడ్డాయి. 0, 5, 8, 12, 18, 28, 40 శాతం శ్లాబులు ఉన్నాయి. వీటిలో FMCG వ్యాపారానికి 40% వర్తించదు.
★ CGST-SGST : ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునేవారికి వర్తిస్తుంది. ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు. కేవలం డిపో ట్రాన్స్ఫర్ విధానం మాత్రమే ఉంటుంది. దానికి ఎలాంటి పన్ను లేదు. అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి.
★ ఇకపై ప్రతినెలా మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు, మీరు చూపించే ఖరీదులు తప్పకుండా Match అవ్వాల్సి ఉంటుంది. Match కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకొని సవరించుకోవాల్సి ఉంటుంది. Match కాని పక్షంలో Input టాక్స్ కి ప్రమాదం సంభవిస్తుంది.
★ మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్ పోస్టులు ఉండవు. సేల్ టాక్స్ అధికారులు మొబైల్ చెక్ పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడా సరుకు రవాణా వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు, వేబిల్లు తప్పనిసరిగా జత చేసి ఉండాలి.
★ 50వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్ కి అప్ లోడ్ చేసి ఆన్ లైన్ ద్వారా తప్పని సరిగా వేబిల్లు పొందాలి. తదుపరి మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి. ఇది ఒక ఊరి నుండి మరొక ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్న వేబిల్లు తప్పనిసరి. అది లేకుండా సరుకు మార్చుట తీవ్ర నేరంగా పరిగనించబడుతుంది. అనుసరించని వారికి కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య, జైలు శిక్ష విధించబడుతుంది
★ GST విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే VAT 200 కి బదులు కొత్తవిధానం అమలులోకి వచ్చింది. ఇందులో మనం ప్రతినెలా సేల్స్ ని 5 రకాల పద్ధతుల్లో ఆన్ లైన్ ద్వారా పంపాల్సి వస్తుంది.. తెలుసుకోవాల్సి వస్తుంది.. అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.
1. R1 Form ప్రతినెలా 10తేదీలోపు
2. R2 Form ప్రతినెలా 13తేదీలోపు
3. R3 Form ప్రతినెలా 15తేదీలోపు
4. R4 Form ప్రతినెలా 17తేదీలోపు
5. R5 Form ప్రతినెలా 20తేదీలోపు
1. మన ఖరీదుకి సంబంధించినది
2. దాని నిర్ధారణ (GST Dept ద్వారా వచ్చేది)
3, 4, 5 లు నెలనెలా అప్ లోడ్స్ చేయాల్సినవే.
★ ఇవన్నీ ప్రతినెలా అప్ లోడ్ చేయాల్సినవే. ఇలా చివరివరకు MATCH & MISMATCH తరువాత అమ్మకం మరియు కొనుగోలుదారుల Submission Comparision చేసుకునే ప్రక్రియ. ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ విషయమై మీ చార్టెడ్ అకౌంటెంట్ లేదా సంబంధిత సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ నుండి గానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవడం తప్పనిసరి.
★ ఈ GST విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెలా GST కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.
★ నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.
★ VAT విధానంలో ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగియుండాలి.
★ మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారాగానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకి వెళ్లి మార్చుకునే అవకాశంగానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమి చేయలేడు. ప్రతినెలా 20వ తేదీన అప్ లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పుచేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి..
★ ఒక యజమాని పేరుతో ఒకరికి ఒక ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటికంటే ఎక్కువ ఫర్ములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్ము PAN కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. కనుక ఒకరికి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త.
★ ఇక ముందు GST అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి గోడౌన్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి C & F కి గానీ, గోడౌన్ నుండి ఆఫీస్ కిగానీ, స్టాక్ ట్రాన్స్ ఫర్ అనే విధానం ఒక డెలివరీ చాలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి మరో డిస్ట్రిబ్యూటర్ కి కూడా సరుకు మార్పిడి (ట్రాన్స్ ఫర్ ) ఉండదు. దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాలి. కాబట్టి ఒక వేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా సరుకు పంపాల్సి ఉంటుంది.
★ ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది. కాబట్టి తరువాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్క కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీములకి మాత్రమే పన్ను ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు.
★ GST విధానం ద్వారా FMCG ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వేచి చూడాలి.
★ ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకులపైన MRP విధిగా ఉంటుంది.
★ ఇకపై GST పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ - C & F వ్యవస్థకి పెనుముప్పు రానుందని చెప్పాలి.
★ ఇంకో కొత్త విధానం ఏమిటంటే ధరల నియంత్రణ చట్టం. ఉదాహరణకి గులాబ్ జామ్ ధర రూ. 100/- అనుకోండి. అదే గులాబ్ జామ్ పైన మరో ప్యాకెట్ ఉచితంగా ఇస్తేగనుక దాని ధరను నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. కాలమే దీనికి సమాధానం చెబుతుంది.
★ ఇట్టి సవరణలను అర్ధం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి, తప్పు చేసేవాళ్లను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానం తీసుకువచ్చింది. అన్నీ సక్రమంగా నిర్వర్తించే వాళ్ళకి భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతేగాక భవిష్యత్ లో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాము అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారి పోవచ్చు కూడా. ఇది కాకుండా భవిష్యత్ లో ఈ రేటింగ్ పద్దతి ద్వారానే బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోను గానీ, ఇళ్లు లోన్ గానీ, వ్యాపార లోన్ గానీ ఈ విధానంలోనే చూడబడుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకి భవిష్యత్ ఉంది.
★ ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలావరకు FMCG కంపెనీలు మైగ్రేషన్(మార్పిడి) ద్వారా వచ్చే TAX డిఫరెన్స్ ని NET LOSS పద్దతిలో లెక్కగట్టి అట్టి నష్టాన్ని పూడుస్తామని వ్రాతపూర్వకంగా తెలిపాయి. అందుకని మీరందరూ క్లోజింగ్ స్టాక్ ని సక్రమంగా లెక్కచేసి పెట్టుకోండి. అట్టి ప్రొడక్ట్ లపై ఉన్న టాక్స్ ని కూడా లెక్కచేసి పెట్టుకోండి. ఇది వ్యాపారి సబ్మిషన్ లో చెప్పాల్సి ఉంటుంది. అట్టి టాక్స్ సంస్థ ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పద్దతిలో GST లోకి మారిపోతుంది. ఇది కాకుండా 18% లోపు ఉన్న టాక్స్ లకు 40% ఎక్సయిజ్ టాక్స్ పద్దతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ 18% పైన గనుక టాక్స్ ఉంటే అట్టి ప్రొడక్ట్ కి టాక్స్ + 60% రిఫండ్ ఉంటుంది. దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు.
★ ఇకముందు మనం అమ్మే ప్రతి ప్రొడక్ట్ కి HSN CODE విధానం ఉంటుంది. ఇది ఏమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి GST ఫార్మాట్ లో ఒక కోడ్ ఇస్తుంది. అది మనం క్యాంపెయిన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అది లేనిదే బిల్లు చేయలేరు. కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. దాటవేత ధోరణిని అంగీకరించకండి. వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మకం కలిగిన తరువాతనే వారితో లావాదేవీలు జరపండి. లేదంటే ప్రమాదంలో పడతారు.
★ ఇప్పటి వరకు మీరు లావాదేవీలు నెరపిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్, డామేజ్ స్టాక్, గడువుతీరిన సరుకు, సేల్స్ మ్యాన్ జీతభత్యాలు, పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి (GST మొదలయ్యేలోపు అన్నింటికీ సంబంధించిన క్రెడిట్ నోట్స్ తయారుచేసుకొని ఆయా కంపెనీలకు పంపండి). ఆ డాక్యుమెంట్ ని జాగ్రత్త చేయండి. వీలయినంతవరకు కంపెనీల ద్వారా రావలసిన బెనిఫిట్స్ త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే GST తరువాత అట్టి క్లెయిమ్స్ కి 18% టాక్స్ పడే అవకాశం ఉంది.
★ ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్, లాడ్జ్ బిల్స్ మరియు ఇతరములపై కట్టే టాక్స్ లను input క్రెడిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ ఖరీదు, అద్దెలు పైన గానీ టాక్స్ లు కట్టిన యెడల అది కూడా ఇన్ పుట్ టాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
★ ఇది రిఫండ్ గా లెక్క చూసుకోవాలి. దానిని నెల అంతంలో నింపే రిటర్న్ లో క్లుప్తపరచాలి. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
★ ఒకవేళ ఇంటర్మ్ సేల్స్ మేన్స్ కిగానీ, డిస్ప్లే ఖర్చుకి గానీ, కంపెనీ తరఫున చేసిన ఖర్చునుగానీ కంపెనీలనుండి క్లెయిమ్ చేయునప్పుడు తప్పకుండా invoice రైజ్ చేసి టాక్స్ జోడించి పంపించాలి. అట్టి టాక్స్ ని ఇన్పుట్, ఔట్ పుట్ లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి.
◆ సాధారణంగా న్యాయపరమైన విధానాలు..
★ GST ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని పుస్తకాల ద్వారా గానీ, కంప్యూటర్ ద్వారాగానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనిఖీ సందర్భంలో GST అధికారి అడిగిన దరిమిలా అన్నిటినీ రోజువారీగా చూపించే విధంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన విషయం
★ దీనికిగాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంటెంట్ గానీ, ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానంగానీ కలిగి ఉండాలి.
★ మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాల లెక్క సరిగ్గా ఉండాలి. మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒక వేళ అలాచేయకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే అట్టి జీతాల ఖర్చును, ఖర్చుల క్రింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది.
★ మీ మీ ట్రావెల్ ఖర్చులు, ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫర్మ్ కింద క్లెయిమ్ చేయాలి.
★ మీదగ్గర ఉన్న, కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి. ఇతరత్రాకి ఇన్ పుట్ క్రెడిట్ రాదు. కనుక జాగ్రత్త వహించి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు అమ్ముకోవాలి. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు.
★ C & F - సూపర్ స్టాకిస్ట్ లు పాతవ్యాపారానికి సంబంధించి C Form గానీ, F Form గానీ డిసెంబర్ లోగా తమతమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైనా లేదా తదుపరి లావాదేవీల పైన టాక్స్ పడే అవకాశం ఉంది.
★ 31 మార్చ్ 2017 క్లోజింగ్ స్టాక్ మరియు 30జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్కచేసుకొని అట్టి క్లోజింగ్ స్టాక్ ని క్వాంటిటీ రూపేణా లెక్కకట్టుకొని GST ఇంప్లీమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ కాపీని తప్పకుండా తెప్పించి పెట్టుకోవాలి. అట్టి ఖరీదులను మీ పుస్తకాలతో సరి చూసుకోవాలి. అశ్రద్ధ పనికి రాదు.
★ అలా సరిచేసిన స్టాక్ ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ GST లో ఇన్ పుట్ క్రెడిట్ జమ అవుతుంది.
★ మీకు వచ్చిన మీ GSTIN నెంబర్ ని మీ సరుకు సరఫరా దారులు అందరికీ ఇవ్వండి. అలాగే మీరు సరుకు సరఫరా చేసే కష్టమర్ల GSTIN నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి.
★ మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి HSN CODE ఉంటుంది. ఇది తప్పని సరి కాబట్టి అట్టి ప్రొడక్ట్స్ యొక్క HSN CODES యొక్క మోడల్ తెలుసుకొని ఒక షీట్ లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే GST తరువాత ప్రతి వస్తువు యొక్క HSN CODE ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.
■ జరిమానాలు - శిక్షలు
★ ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగా నిర్మించబడింది. మన తప్పులకు ఆడిటింగ్ గానీ, స్థానిక అధికారుల నుండి గానీ ఎలాంటి నోటీసులు ఇవ్వబడదు. ఇక మీదట ఏ అధికారికి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీమ్ రావొచ్చు. లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయవచ్చు. అలా అరెస్టు చేసే ముందు మనకు తగిన కారణాలను చూపుతారు. అరెస్టు అయిన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఆఫెన్సస్ U/S 132 యాక్ట్ కింద అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంది.
★ 132 సెక్షన్ పరిధి : ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా బిల్లు లేదా సర్వీసు invoice లేకుండా ఆ సరుకు గానీ, సర్వీసు గానీ సప్లై చేస్తూ దొరికినచో లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించిననూ.. ఏ సరుకు గానీ, సర్వీసుగానీ ఇవ్వకున్నను కేవలం ఇన్ పుట్ టాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చి దొరికినచో.. తద్వారా ఎవరైనా లాభపడినచో... సదరు వ్యాపారి input tax credit చేసుకొని తరువాత అట్టి టాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో.. దానిని కావాలని చేసిన ద్రోహం క్రింద పరిగణించి శిక్ష వేసే అవకాశం ఉంది. అట్టి తప్పుల వల్ల నేరనిర్ధారణ జరిగితే జైలు తప్పదు.
★ మరో ముఖ్య విషయం.. GST అప్లోడ్ చేయడానికి GST అథారిటీ పొందిన సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే సాధ్యం. ఒక వేళ ఏ ఇతర చిన్నచిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు గానీ ఇంటర్నల్ GST బిల్లింగ్ కొరకు సాఫ్ట్ వేర్ ఇచ్చిననూ GST uploding మాత్రం తప్పకుండా అర్థరైజ్డ్ సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే చేయగలరు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. దేశంలో మొత్తం 34 కంపెనీలు మాత్రమే అధరైజేషన్ కలిగిన సాఫ్ట్ వేర్ కలిగిఉన్నాయి. వాటిలో ఆయా ట్రేడ్ కి సపోర్ట్ చేసే సాఫ్ట్ వేర్ ని జాగ్రత్తగా ఎంచుకోండి...

No comments:

Post a Comment