Saturday, 24 June 2017

📚 *_CURRENT AFFAIRS-24th JUNE_*🦋


📚 *_CURRENT AFFAIRS-24th JUNE_*🦋

*రాష్ట్రీయం*👨🏻‍🌾

1) మూడో విడత స్మార్ట్ సిటీల (టాప్ 30) జాబితాలోAP నుంచి ఏ నగరానికి చోటు దక్కింది ?
జ: Amaravati

2) స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో AP రాష్ట్రానికి ఎన్నో స్థానం దక్కింది ?
జ: ఏపీకి మూడో స్థానం
( మొదటి స్థానంలో తమిళనాడు )


*జాతీయం*🇮

1) కార్టోశాట్ 2 ఈ, ఓ స్వదేశీ ఉపగ్రహంతో పాటు మొత్తం 31 శాటిలైట్స్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్ ఏది ?
జ: PSLV C 38
2) PSLV C 38 రాకెట్ ద్వారా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి వెళ్ళాయి. అయితే మొదటి సిగ్నల్స్ ఎక్కడికి చేరుకున్నాయి ?
జ: కర్ణాటక – హసన్ లోని మాస్టర్ కంట్రోల్ రూం, మారిషస్ లోని గ్రౌండ్ స్టేషన్ కు
3) ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ ఎవరు ?
జ: A.S. కిరణ్ కుమార్
4) దేశవ్యాప్తంగా 30 స్మార్ట్ సిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరాలు ఏవి ?
జ: కేరళ రాజధాని తిరువనంతపురం మొదటి స్థానం,
5) కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీస్ జాబితాలో 2, 3 స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి ?
జ: 2)ఛత్తీస్ గఢ్ లోని నయా రాయ్ పూర్
3) గుజరాత్ లోని రాజ్ కోట్
6) ఇప్పటి వరకూ ప్రకటించిన 90 స్మార్ట్ నగరాల్లో ఎంత పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు ?
జ: రూ.1,91,155 కోట్లు
7) దేశవ్యాప్తంగా 116 నగరాలకు ప్రజల జీవన సూచి ప్రమాణాల ఆధారంగా ర్యాంకులు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అందుకోసం ఎన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలని భావిస్తోంది ?
జ: 79 అంశాలు
8) పట్టణాభివృద్ధి పథకాల అమలులో ఏ రాష్ట్రం మొదటగా నిలిచింది ?
జ: ఆంధ్రప్రదేశ్
(నోట్: ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి )
9) ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటిస్తున్నారు (జూన్ 24, 25,26,27) ఆ దేశాలేవి ?
జ: పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్
10) దేశంలోని మొదటగా ఏ నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు ?
జ: ఇండోర్
11) లండన్ లో జరిగిన 7వ ఆసియాన్ కార్యక్రమంలో Social Entrepreneur of the Year అవార్డు అందుకున్నది ఎవరు ?
జ: నిషా దత్ (ఇంటెల్ కాప్ ceo)
12) విదేశాల్లో ఉన్న భారీతీయ శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం VAJRA పోర్టల్ ని ప్రారంభించింది. VAJRA అంటే ?
జ: Visiting Advanced Joint Research Faculty
13) ఆపరేషన్ స్వర్ణ్ – ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది ?
జ: రైల్వే శాఖ
14) దేశంలో ఏ ప్రాజెక్టుకు 44 మిలియన్ల డాలర్ల రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరకర్ల బోర్డు ఆమోదించింది ?
జ: Assam State Public Finance Institutional Reforms (ASPIRe)
15) GST అమల్లోకి వస్తుండటంతో…అమ్మకం దారులు తమ ఉత్పత్తులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు క్లియర్ ట్యాక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ కామర్స్ కంపెనీ ఏది ?
జ: అమెజాన్
16) RBI వ్యవహారాల కమిటీకి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రదీప్ కుమార్
17) 2017 మాస్కో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్న భారతీయ సినిమా ఏది ?
జ: బాహుబలి 2
18) ఏ కేటగిరీలో విన్సో ఖుడ్రోస్ కి సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ?
జ: బాల సాహిత్యం
19) దేశంలో నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తునందుకు గాను ఎవరికి కార్నెగీ మెడల్ అవార్డు లభించింది ?
జ: విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ
20) మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బాండ్స్ రూపంలో నిధుల సేకరణను ప్రారంభించిన మొదటి పట్టణం ఏది ?
జ: పుణె
(నోట్: మహారాష్ట్ర లోని పుణెలో రూ.2,264 కోట్లు సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు )

*అంతర్జాతీయం*🌏

21) అణు సరఫరాదారుల బృందం (NSG) లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డుపడుతోంది. ప్రస్తుతం ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: బెర్న్
22) ఐటీ రంగంలో అమెరికన్లకు ఉపాధి కల్పించడంలో ఆ దేశంలో టాప్ గా నిలిచిన భారత్ కి చెందిన సంస్థ ఏది ?
జ: TCS ( టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ )
23) మహిళల వన్డే ప్రపంచ కప్ 2017 కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ?
జ: ఇంగ్లండ్
24) భారత మహిళల జట్టుకు కెప్టెన్ ఎవరు ?
జ: మిథాలీ రాజ్
25) ఐక్యరాజ్యసమితిలో కొత్తగా ఏర్పాటైన కౌంటర్ టెర్రరిజం డివిజన్ కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: వ్లాదిమిర్ వారన్ కోవ్
26) మారిషస్ – బ్రిటన్ మధ్య వివాదస్పదంగా ఉన్న ఏ దీవి విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో మారిషస్ కు భారత్ అండగా నిలిచింది ?
జ: ఛాగోస్ ఆర్కిషిలాగో ద్వీపం
27) ) ఐక్యరాజ్యసమితి ప్రజా సేవల దినం ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జూన్ 23
28) ఆకలితో బాధపడే వారి కోసం పోరాటం చేస్తున్న ఎవరికి 2017 క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డు దక్కింది ?
జ: అంకిత్ కవత్రా
(నోట్: ఫీడింగ్ ఇండియా అనే స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు. ఆకలి, పోషకాహారం, ఆహారం వృధాచేయడంపైన ఆయన పోరాడుతున్నారు )
29) తమ దేశంలో ఉంటున్న బయటి దేశాల పౌరుల మీద నెలకు ఎంత ఫీజు వసూలు చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది ?
జ: 100 రియాల్స్
30) ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో ఏ దేశం నాటోయేతర మిత్రపక్ష హోదా రద్దు చేయాలన్న డిమాండ్ అమెరికాలో వస్తోంది ?
జ: పాకిస్తాన్

No comments:

Post a Comment