Wednesday, 28 June 2017

Banking Awareness


*మనదేశంలో బ్యాంకులకు అంతిమ రుణదాత ఏదీ?*

1. ఏ ద్రవ్యాన్ని విశాల ద్రవ్యం అంటారు?
ఎ) వీ1 బి) వీ2
సి) వీ3 డి) వీ0
2. ఖరీదైన ద్రవ్య విధానం అంటే ఏమిటి?
ఎ) ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులను పెంచడం
బి) ప్రభుత్వం పరోక్ష పన్నులను పెంచడం
సి) కేంద్ర బ్యాంకు అధిక కరెన్సీని ముద్రించడం
డి) కేంద్ర బ్యాంకు '' బ్యాంకు రేటు''ను పెంచడం
3. ఏ కమిషన్‌ సలహా మేరకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థాపన జరిగింది ?
ఎ) రాయల్‌ కమిషన్‌ బి) నర్సింహ్మం కమిషన్‌
సి) మల్హోత్రాకమిషన్‌ డి) ఎల్‌.కె. ఝా కమిషన్‌
4. బ్యాంకు అనే పదానికి అర్థం ఏమిటి?
ఎ) ద్రవ్యాన్ని దాచి ఉంచడం
బి) ద్రవ్యాన్ని ఖర్చుచేయడం
సి) ద్రవ్యాన్ని మారకం చేయడం
డి) ద్రవ్యాన్ని డిపాజిట్‌ చేయడం
5. సరియైన జతకానిది ఏది?
ఎ) కరెన్సీ ముద్రణ - రిజర్వు బ్యాంక్‌ బి) బ్యాంకు రేటు పెంచడం - చౌక ద్రవ్య విధానం
సి) వాణిజ్య బ్యాంకులు - పరపతి ద్రవ్యం డి) చెక్కులు - ఐచ్చికద్రవ్యం
6. ఏ డిపాజిట్‌లకు బ్యాంకులు వడ్డీని చెల్లించవు?
ఎ) పొదుపు డిపాజిట్‌ బి) కరెంట్‌ డిపాజిట్‌
సి) రికరింగ్‌ డిపాజిట్‌ డి) ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌
7. అప్పు పత్రాలు అనగా?
ఎ) వాటాలు బి) డిబెంచర్లు
సి) ఈక్విటీవాటాలు డి) ప్రాతినిధ్యపువాటాలు
8. పిలుపు ద్రవ్యం(కాల్‌ మనీ) ఎంత కాలానికి సంబం ధించినది?
ఎ) 31 రోజులు బి) 91 రోజులు
సి) 182 రోజులు డి) 1 రోజు
9. లిమిటెడ్‌ కంపెనీ అనగా అర్థం ఏమిటి?
ఎ) వాటాదారుల బాధ్యత పరిమితం
బి) వాటాదారుల బాధ్యత అపరిమితం
సి) వాటాదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటం
డి) వాటాదారులు తక్కువ సంఖ్యలో ఉండటం
10. మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి దేనిని సూచికగా తీసుకుంటున్నారు?
ఎ) వినియోగ వస్తువుల సూచి
బి) పారిశ్రామిక వస్తువుల సూచి
సి) వ్యవసాయ వస్తువుల సూచి
డి) టోకు ధరల సూచి

11. బొంబాయ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఏ స్ట్రీట్‌లో వుంది?
ఎ) దలాల్‌ స్ట్రీట్‌ బి) గాంధీ స్ట్రీట్‌
సి) నెహ్రూ స్టీట్‌
డి) సర్థార్‌ వల్లబారు పటేల్‌ స్ట్రీట్‌
12. ఏ కాలంలో కేంద్ర బ్యాంకు '' చౌకద్రవ్య విధానం'' అవలంభిస్తుంది?
ఎ) ద్రవ్యోల్బణం బి)ప్రతి ద్రవ్యోల్బణం
సి) రాజకీయ అస్థిరత డి) వ్యాపార చక్రాలు
13. బ్యాంకింగ్‌ ఖాతాదార్ల సమస్యలను పరిష్కరించేది ఎవరు?
ఎ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
బి) ఆర్‌.బి.ఐ సి) కోర్టులు డి) అంబుడ్స్‌మన్‌
14. బొంబారు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ లోని సెన్సెక్స్‌ ఇండెక్స్‌ లోని షేర్ల సంఖ్య ఎంత?
ఎ) 20 షేర్లు బి) 30 షేర్లు
సి) 40 షేర్లు డి) 50 షేర్లు
15. ఎస్చీట్స్‌ అనగా నేమి?
ఎ) ఎస్టేట్లపై విధించే పన్ను
బి) విదేశీ వ్యారం పై విధించే పన్ను
సి)వారసులు లేని వీలునామా రాయని వ్యక్తులు మరణించినప్పుడు వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం
డి) మూలధనంపై విధించే పన్ను
16. ప్రస్తుత సెబి చైర్మెన్‌ ఎవరు?
ఎ) అజరు త్యాగి బి) రంగరాజన్‌
సి) రఘురామ్‌ రాజన్‌ డి) అరుంధతి భట్టాచార్య
17. స్టాక్‌ ఎక్సేంజ్‌లతో సంబంధం లేని అంశం?
ఎ) బుల్స్‌ బి) బేర్స్‌
సి) షేర్స్‌ డి) బ్యాంక్‌ రేట్‌
18. నల్ల ధనం (బ్లాక్‌ మనీ) అనగా...
ఎ) లాటరీ ద్వారా వచ్చిన కరెన్సీ
బి) చెల్లని కరెన్సీ
సి) పాత కరెన్సీ
డి) పన్ను ఎగవేసిన కరెన్సీ
19. ప్రస్తుత నగదు నిల్వల నిష్పత్తి ఎంత?
ఎ) 4% బి) 5% సి) 6% డి) 7%
20. రిజర్వు బ్యాంకు పరిమాణాత్మక నియంత్రణ సాధనం కానిది ఏది?
ఎ) నైతికోద్భోద బి) బ్యాంకురేటు
సి) నగదు నిల్వల నిష్పతి
డి) బహిరంగ మార్కెట్‌ చర్యలు
21. కేంద్ర బ్యాంక్‌ విధి కానిది ఏది?
ఎ) కరెన్సీ ముద్రణ
బి) బ్యాంకులకు బ్యాంకు
సి) పరపతి ద్రవ్యాన్ని సష్టించడం
డి) ద్రవ్య విధానం అమలు
22. ట్రెజరీ బిల్లుల కాలపరిమితిలో లేనిది ఏది?
ఎ) 31 రోజుల బిల్లులు
బి) 91 రోజుల బిల్లులు
సి) 182 రోజుల బిల్లులు
డి) 364 రోజుల బిల్లులు
23. ద్రవ్య విధానాన్ని రూపొందించేది ఎవరు?
ఎ) కేంద్రబ్యాంక్‌ బి) వాణిజ్యబ్యాంక్‌లు
సి) గ్రామీణబ్యాంక్‌లు డి) నాబార్డ్‌
24. '' బుల్స్‌ మరియు బేర్స్‌ '' అనే పదాలు క్రింది వాటి లో దేనికి సంబంధించినది?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) అంతర్జాతీయ వ్యాపారం
సి) ప్రపంచ వాణిజ్య సంస్థ
డి) స్టాక్‌ ఎక్సేంజ్‌ మార్కెట్‌
25. టర్మ మనీ కాలం ఎంత?
ఎ) ఒక రోజు
బి) 1 నుండి 7 రోజులు
సి) 7 నుండి 14 రోజులు
డి) 15 రోజుల కంటె ఎక్కువ
26. కింది వాటిలో జాతీయాదాయం అంటే?
ఎ) మార్కెట్‌ ధరల వద్ధ స్థూల దేశీయోత్పత్తి బి) ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర జాతీయోత్పత్తి
సి) ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర దేశీయోత్పత్తి డి) మార్కెట్‌ ధరల వద్ధ నికర జాతీయోత్పత్తి
27. ట్రెజరరీ బిల్లులను ఎవరు జారీ చేస్తారు?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) రిజర్వు బ్యాంకు
సి) రాష్ట్ర ప్రభుత్వాలు డి) నాబార్డ్‌
28. వాణిజ్య పత్రాలను ఎవరు జారీ చేస్తారు?
ఎ) రిజర్వు బ్యాంకు బి) వాణిజ్య బ్యాంకులు
సి) కేంద్ర ప్రభుత్వం డి) కార్పోరేట్‌ సంస్థలు
29. వాణిజ్య బిల్లును దేనిగా పరిగణించవచ్చును?
ఎ) ప్రామిసరీ నోటు బి) పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌
సి) డిమాండు డ్రాఫ్ట్‌ డి) బాండు
30. ఒకదేశం స్వచ్ఛందంగా కరెన్సీ విలువను ఇతర దేశాల కరెన్సీల రూపంలో లేదా బంగారంలో తగ్గిం చడాన్ని ఏమంటారు?
ఎ) డంపింగ్‌ బి) మూల్య హీనీకరణ
సి) పత్ర బంగారం డి) ఏదీకాదు.

31. ఈ కింది వానిలో ద్రవ్యపరమైన చర్య కానిది ?
ఎ) బహిరంగ మార్కెట్‌ బి) బ్యాంకురేటు
సి) పన్నులు డి) నగదు నిల్వల నిష్పత్తి
32. ''వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని రిజర్వు బ్యాంకు వద్ద నగదుగా ఉంచ వలసిన '' దానికి గల పేరు.?
ఎ) డిస్కౌంట్‌ రేటు
బి) నగదు నిల్వల నిష్పత్తి
సి) రేపోరేటు డి) బ్యాంకు రేటు
33. అభివద్ధి చెందుతున్న దేశాలలో దీర్ఘకాలిక నిరుద్యో గిత దేనివల్ల ఏర్పడుతుంది?
ఎ) సమిష్టి డిమాండ్‌ వల్ల
బి) ప్రదర్శనా ఫలితం వల్ల
సి) మూలధన కొరత డి) సమిష్టి సప్లరు
34. మనదేశంలో బ్యాంకులకు అంతిమ రుణదాత ఏదీ ?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) స్టేట్‌ బాంక్‌ ఆఫ్‌ ఇండియా
సి) రిజర్వు బ్యాంక్‌
డి) అంతర్జాతీయ ద్రవ్యసంస్థ
35. పన్ను తొలి ప్రభావం, అంతిమ ప్రభావం వేరువేరు వ్యక్తుల మీద ఉంటే ఏ పన్నుగా భావిస్తాము. ?
ఎ) ప్రత్యక్షపన్ను బి) పరోక్షపన్ను
సి) అనుపాతపన్ను డి) నిర్బంధపు పన్ను
36. జాతీయాదాయం గణించడానికి ప్రస్తుతం ఏ సంవత్స రాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటు న్నారు?
ఎ) 2010-11 బి) 2011-12
సి) 2012-13 డి) 2013-14
37. స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు ఏ మార్కెట్‌లో భాగం?
ఎ) ప్రాథమిక మార్కెట్‌ బి) ద్వితియ మార్కెట్‌
సి) ద్రవ్య మార్కెట్‌ డి) ఏదికాదు.
38. ఐచ్చిక ద్రవ్యం కానిది ఏది?
ఎ) 2000 రూ. నోటు బి) 2000 రూ చెక్కు
సి) వాణిజ్య పత్రం డి) వినిమయ బిల్లు
39. ద్రవ్యోల్బణ నియంత్రణలో చేరివున్న అంశం ఏది?
ఎ) ద్రవ్య సప్లైను పెంచడం
బి) బ్యాంకు రేటును పెంచడం
సి) ధరలను పెంచడం
డి) పొదుపులను తగ్గించడం
40. నగదు నిల్వల నిష్పత్తి 4% గా వున్నప్పుడు ప్రాథమిక డిపాజిట్లు 1000 కోట్లు అయితే పరపతి ద్రవ్యం ఎంత సష్టిస్తారు?
ఎ) 5,000 కోట్లు బి) 10,000 కోటు
సి) 20,000 కోట్లు డి) 25,000 కోట్లు
41. అవర్జా ద్రవ్యం అనగా నేమి?
ఎ) ఆర్థిక కార్యకలాపాలకు వుపయోగించే ద్రవ్యం
బి) బంగారు,వెండి నాణేలు
సి) జమా ఖర్చులను రాసే ద్రవ్య యూనిట్లు
డి) చలామనిలో వుండే కరెన్సీ
42. ''మంచి ద్రవ్యాన్ని చెడు ద్రవ్యం తరిమివేస్తుంది'' దేనికి సంబంధించిన సూత్రం?
ఎ) కేంబ్రిడ్జి సూత్రం బి) ఫిషర్‌ సూత్రం
సి) గ్రేషమ్‌ సూత్రం డి) వినిమయ సూత్రం
43. ద్రవ్యం మంచి సేవకుడే గాని చెడ్డ యజమాని అన్నది ఎవరు?
ఎ) కార్ల్‌ మార్క్స్‌ బి) ఇర్వింగ్‌ ఫిషర్‌
సి) ఫ్రాన్సిస్‌ బాకెన్‌ డి) ఆడమ్‌స్మిత్‌
44. ద్రవ్యం నిశ్చల విధి కానిది?
ఎ) వినిమయ మాధ్యం బి) విలువల కొలమానం
సి) విలువల నిధి డి) ధరల యంత్రాంగం
45. ద్రవ్యపరిమాణానికి, ధరల స్థాయికి మధ్యగల సంబంధం?
ఎ) అనులోమ బి) విలోమ
సి) ధనాత్మక డి) స్థిరమైన
46. ద్రవ్యమే అన్ని అనర్థాలకు మూలం అన్నదెవరు?
ఎ) జె.యం. కీన్స్‌ బి) కౌటిల్యుడు
సి) కార్ల్‌ మార్క్స్‌ డి) రాబర్ట్‌ టిఫిన్‌
47. వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బంది ఏది?
ఎ) అవిభాజ్యత
బి) సంపద రూపంలో నిల్వవుంచడం కష్టం
సి) విలువల కొలమానం లేకపోవడం
డి) పైవన్నీ
48. ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకం వుంటుంది?
ఎ) ప్రధాన మంత్రి బి) రాష్ట్రపతి
సి) ఆర్థిక మంత్రి డి) ఆర్థికశాఖ కార్యదర్శి
49. వ్యాపార చక్రాలు సాధారణంగా ఏ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తాయి?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి) పైవన్నీ
50. ''అధిక ద్రవ్యం, అతి తక్కువ వస్తువులను వెంటా డమే ద్రవ్యోల్బణం'' అన్నది ఎవరు?
ఎ) డాల్టన్‌ బి) హాట్రే
సి) ఇర్వింగ్‌ ఫిషర్‌ డి) కీన్స్‌
సమాధానాలు
1.సి 2.డి 3.ఎ 4.సి 5.బి 6.బి 7.బి 8.డి 9.ఎ 10.డి 11.ఎ 12.బి 13.డి 14.బి 15.సి 16.ఎ 17.డి 18.డి 19.ఎ 20.ఎ 21.సి 22.ఎ 23.ఎ 24.డి 25.డి 26.బి 27.ఎ 28.డి 29.బి 30.బి 31.సి 32.బి 33.సి 34.సి 35.బి 36.బి 37.బి 38.ఎ 39.బి 40.డి 41.సి 42.సి 43.సి 44.డి 45.ఎ 46.సి 47.డి 48.డి 49.ఎ 50.ఎ

No comments:

Post a Comment