Tuesday, 21 February 2017

POLICE


 పోలీస్‌ శాఖలోని కమ్యూనికేషన్‌ విభాగంలో 493 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులకు మార్చి 20 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు చైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు. బీసీ-సీ విభాగానికి చెందిన ఒక మహిళా అభ్యర్థి మినహా మిగతా వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. ఎంపికైన వారిలో 23 మంది ఎంటెక్‌ పూర్తిచేసిన వారుండగా, 271మంది బీటెక్‌ చదివిన వారు ఉన్నట్టు వెల్లడించారు. కాగా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాతపరీక్ష తుది ఫలితాలను మార్చి 15న విడుదల చేయనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష కీని సోమవారం విడుదల చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోపు పోలీస్‌ నియామక బోర్డుకు ఆన్‌లైన్‌ (మెయిల్‌) ద్వారా తెలియజేయవచ్చు.

No comments:

Post a Comment