Thursday, 23 February 2017

insurance jobs


   జీవితం, ఆరోగ్యం, ప్రమాదం, వ్యాపారం, గృహం, ప్రయాణం... ఇలా అంశం ఏదైనా సరే... నేడు ప్రతిదానికీ బీమా తప్పనిసరిగా మారుతోంది. మన దేశంలో ఫైనాన్షియల్‌ సెక్టార్‌ పరిధిలో బ్యాంకింగ్‌ రంగంతోపాటు ఇన్సూరెన్స్‌ రంగం కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ఉజ్వల భవితకు మార్గం సుగమం చేస్తున్న బీమా రంగంలో కెరీర్‌ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

ఇన్సూరెన్స్‌... 
    ఈ పదం నేడు నగరాల నుంచి కుగ్రామాల వరకూ ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ప్రైవేటీకరణల నేపథ్యంలో బీమా సంస్థల కార్యకలాపాలు దేశం నలుమూలలకు విస్తరించాయి. ప్రైవేట్‌ బీమా సంస్థలకు కూడా ఐఆర్‌డిఎ అనుమతులు ఇవ్వడంతో గత పుష్కర కాలంగా ఈ రంగం విశేష ప్రగతి సాధిస్తోంది. ప్రైవేట్‌ కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. రానున్న కాలంలో బీమా రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. మన దేశంలో బీమా రంగం ఏటా 20 శాతం అభివృద్ధిని సాధిస్తోంది. పాలసీదారులకు, క్లయింట్లకు సేవలు అందించేందుకు ఈ రంగానికి మానవ వనరుల అవసరం చాలానే ఉంది. నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం 2020 నాటికి బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి 5 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుంది. దీనిలో దాదాపు 40 శాతం వరకూ అవకాశాలు బీమా రంగానికి వెళ్లనున్నాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండసీ్ట్రస్‌ నివేదిక ప్రకారం రానున్న పదేళ్ళలో బీమా రంగంలో పెట్టుబడులు 250 బిలియన్‌ డాలర్ల (17 లక్షల కోట్లు)కు పెరగనున్నాయి. ఈ సంవత్సరంలో బీమా రంగానికి 12 వేల కోట్లకు పైగా ఎఫ్‌డిఐలు వచ్చే అవకాశం ఉందని అసోచామ్‌ అంచనా.

ఆకర్షణీయమైన వేతనాలు:
ఇతర రంగాలతో పోలిస్తే ఇన్సూరెన్స్‌ రంగంలో కార్యకలాపాల నిర్వహణ భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఈ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ రంగంలో సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌కు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగికి ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వేతనాలు ఆఫర్‌ చేస్తున్నారు. కొద్దిపాటి అనుభవంతో మేనేజర్‌ స్థాయికి చేరుకొని కనీసం ఏడాదికి రూ.5 లక్షల వరకూ జీతం అందుకునే అవకాశం ఉంది. మెరుగైన పనితీరు చూపించే ఉద్యోగులకు ఈ రంగంలో ఎదుగుదల శరవేగంగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన చార్టర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందించే సర్టిఫికెట్లకు ప్రపంచవాప్తంగా గుర్తింపు ఉంది. సర్టిఫైడ్‌ ఇన్సూరెన్స్‌ నిపుణులు విదేశాల్లో పైతం ఉపాధి పొందవచ్చు.

ఉపాధి అవకాశాలు :
బీమా రంగంలో ప్రొఫెషనల్స్‌ అడ్మినిసే్ట్రటివ్‌ ఆఫీసర్లు, ఆసిస్టెంట్లుగా, బీమా ఏజెంట్లుగా, ఇన్సూరెన్స్‌ సర్వేయర్లుగా, యాక్చువరీలు, మైక్రో ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, అండర్‌ రైటర్లుగా జీవిత బీమా సంస్థలు, సాధారణ బీమా సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలు, థర్డ్‌ పార్టీ అడ్మినిసే్ట్రటర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఉద్యోగం పొందవచ్చు. ఇన్సూరెన్స్‌ సంస్థలతో ఒప్పందాలు ఉన్న బ్యాంకులు, బీపీఓలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ అవకాశాలు ఉంటాయి.

కోర్సులు:
బిఎ (ఇన్సూరెన్స్‌), యాక్చూరియల్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా బిఎస్సీ, మాస్టర్స్‌ ప్రోగ్రాం ఇన్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌, ఎమ్మెస్సీ ఇన్‌ యాక్చూరియల్‌ సైన్స్‌, పిజి డిప్లొమా ఇన్‌ సర్టిఫైడ్‌ రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, పిజి డిప్లొమా ఇన్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, పిజి డిప్లొమా ఇన్‌ ఇన్సూరెన్స్‌ సైన్స్‌, పిజి డిప్లొమా మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌మీడియెట్‌ విద్యార్హతతో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు :
ఈ రంగంలో రాణించాలనుకునే వారికి చక్కటి భావ వ్యక్తీకరణతోపాటు బృందంతో కలసి పనిచే యడం, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, సహనం, కస్టమర్లకు తమ ప్రోడక్ట్స్‌ గురించి వివరించి చెప్పడానికి కావాల్సిన నైపుణ్యాలు, త్వరగా నేర్చుకునే లక్షణాలు అవసరం. వీటితోపాటు బీమా చట్టాలపైనా మంచి అవగాహన ఉండటం అదనపు బలం.

ప్రధాన కంపెనీలు:
జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌ మహీంద్రా, ఐసిఐసిఐ పుడెన్షియల్‌, బిర్లా సన్‌లైఫ్‌, టాటా, రిలయన్స్‌, బజాజ్‌, హెడిఎ్‌ఫసి స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, మాక్స్‌ న్యూయార్క్‌ లైఫ్‌, రాయల్‌ సుందరం, చోళమండలం, ఇఫ్కో టోక్కో అండ్‌ టాటా ఏఐజీ, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌.

సంస్థల వివరాలు:

*ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌*,
 *హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్స్‌*, 
*హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ యాక్చూరియల్‌ సైన్సెస్‌*,
*హైదరాబాద్‌ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడమీ*, 
*పుణె ద ఐసిఎ్‌ఫఎఐ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌*, 
*హైదరాబాద్‌ యాక్చూరియల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా*, 
*ముంబై అమిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ యాక్చూరియల్‌ సైన్స్‌*, 
*నోయిడా కాలేజీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌, ముంబై*.

No comments:

Post a Comment