G S P N Mohan Rao, Tax Consultant
GST గురించి అందరికి ఎంతో కొంత అర్ధమయ్యే ఉంటుంది. GST అన్నది వ్యాపారంగంలో జరుతున్న ఒక సమూల మార్పు. రాష్ట్రాల ఆధిపత్యం - అధికారం నుండి కేంద్రానికి మారుతున్న చట్టం. గత 4 నెలలుగా ఫెడరేషన్ ద్వారా అవిశ్రాంతతతో మీ అందరికి సమయానుకూలంగా సమాచారం చేరవేస్తూనే ఉన్నాము. ఫెడరేషన్ ద్వారా కూడా ఎన్నో GST అవగాహన సదస్సులు కూడా నిరవర్తించబడ్డాయి.
అయితే, ఈ నెల 3 వ తారీఖున జరిగిన GST కౌన్సిల్ మీటింగ్ ద్వారా చాలా క్లుప్తమైన రూల్స్ మరియు పాలాసిస్ ని కేంద్ర ప్రభుత్వం అందరికి తెలియజేసింది.
అయిననూ ఇంకా చాల మంది మెంబర్స్ కి అది పూర్తిగా అర్థం కాలేదు. పాత వ్యాపార విధానాలకు సమూలమైన మార్పులు జరగడం వలన, కొత్తగా ఒకే రకమైన టాక్స్ అని మిగతా సర్వీస్ మరియు ఎక్సయిజ్ టాక్స్ ని మరియు VAT కూడా సేల్స్ కి అనుసంధానం చేసి అట్టి అమ్మకాలకు సంభందించి ఒకే పన్ను విధానం అమలు చేయడానికి నిర్మించిన కొత్త విధానమే GST.
మరి జులై ఒకటవ తారీకు నుండి తప్పకుండ అమలయ్యే ఈ కొత్త విధానానికి మీరంతా అలవాటు కావలి, నేర్చుకోవాలి. నేర్చుకోని పక్షాన పడబోయే జరిమానాలకు సిద్ధమవ్వాలి. గతంలో లాగ ఆఫిసుల్లో లాబ్బీ నడపడం కానీ, లంచాలతో గాని కాలం గడుపుకునే విధానాలకు కాలం పోయింది. అంతా ఆన్ లైన్ కార్యాలే. కంప్యూటర్ లే మన జీవిత భాగ్యాన్ని , తల రాతని రాస్తాయి.
కాబట్టి, ఈ GST అనే విధానాన్ని నేర్చుకోక తప్పదు. ఇది అంతానూ తెలుగులో మీ కోసం ఫెడరేషన్ అఫ్ తెలంగాణ మరియు ఫెడరేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యుల అభ్యర్థన మేరకు నేను తెలిసిన విధంలో మీ కోసం పంపుచున్నాను.
ఇప్పుడు GST కి సంభందించిన కొన్ని ముఖ్య అంశాలు తెలుగులో మీ కోసం:
* భారత దేశమంతటా GST విధానం జులై ఒకటి నుండి 100 % అమలులోకి రాబోతోంది.
* దీనితో ఇప్పటి వరకు రాష్ట్రాల్లో ఉన్న vat పన్ను పూర్తిగా రద్దవుతుంది. ఇక ముందు కేంద్రం ద్వారా విధించబడే కేవలం gst మాత్రమే అమలులో ఉంటుంది.
* ముఖ్యంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పిదప గతంలో లేని 4 ఉత్పత్తులు కూడా ఇప్పుడు టాక్స్ విధానంలో జత చేయబడ్డాయి. అవి ఏవి అనగా = చదువు, వస్త్రాలు, మందులు మరియు వృతి ద్వారా అందించే సేవలు. వీటికి కూడా పన్ను వివిధ రకాలుగా విధించబడుతుంది.
ఇప్పుడున్న VAT విధానం నుండి GST కి మారాలనుకుంటే సుమారు 17 డాక్యూమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.
:: 2 ::
ప్రభుత్వ పరంగా CTO 'S ఇప్పటివరకు చాలా మీటింగ్స్ జరిపారు కానీ ఏ వ్యాపారస్తునికి తనలోని అనుమానాలు తీరే విధంగా అట్టి మీటింగ్స్ జరగలేదు. పైగా అట్టి ఆఫిసర్ కి వ్యాపారస్తులకు మధ్య ఒక విధమైన GAP ఉంది కాబట్టి.. తంతుగా చెప్పింది విని వచ్చేసారు. అందుకని మన సభ్యులందరు అడిగినందుకు తెలుగులో రాస్తూ ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం GST ACT ని 6 పేజీలలో రాయలేము. కానీ మన వరకు సంభందించి చాలా మెయిన్ పాయింట్స్ ని కవర్ చేస్తూ రాస్తున్నామ
* VAT లో నుండి GST కి మార్చిన పిదప, మార్పుల తరువాత విధించిన పన్నును 7 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఏ విధంగా అనగా = 0, 5, 8, 12, 18, 28 & 40. ముఖ్యంగా మన FMCG వ్యాపారానికి సంభందించి చివరి 40 % వర్తించదు.
* GST- IGST: అనగా ఇంటిగ్రేటెడ్ IGST ... ఇట్టి లైసెన్స్ అప్లికేషన్ / మైగ్రేషన్ ద్వారానే మనకు లభిస్తుంది. వేరుగా అప్లై చెయ్యాల్సిన అవసరం లేదు. దీనిపైనా ఇంకా అవగాహన మీ ఛార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా తెలుసుకోగలరు. ఎందుకంటె ఇది వ్యాపారంలో అతి ముఖ్య భాగం కాబట్టి, దీనిపైన పూర్తి అవగాహన అవసరం.
* CGST - SGST: అంటే ముఖ్యంగా ఇది కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునే వారికి ఇది. ఇప్పుడు ఒకే కంపెనీ అయినా కూడా ఒక తయారీ రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ అనే ట్రాన్సాక్షన్ ఉండదు కాబట్టి, డిపో ట్రాన్స్ఫర్ సిస్టం టాక్స్ లేకుండా లేదు. అందుకని ఎవరైనా అప్లై చేసుకున్న తరువాత ఈ విషయమై ముందు మీ మీ కంపెనీలను అడిగి తెలుసుకోండి. నెల నెల మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు- మీరు నింపిన ఖరీదులు తప్పకుండ MATCH అవ్వాల్సి ఉంటుంది. లేనిచో మల్లి అట్టి సేల్స్ ని కంపెనీ కి రాసి నిర్ధారణ చేసుకుని సవరించుకోవాల్సి ఉంటుంది. అలా చేయనిచో INPUT TAX కి ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది.
* ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు ఉంటే గనక తప్పకుండ అప్లై చేసుకోండి. ENROLLMENT ( నమోదు చేసుకోవడం) సమయం కేవలం 15 వ తారీఖు JUNE వరకు మాత్రమే అవకాశం.
* రిజిస్ట్రేషన్ సెర్టిఫికెట్ ON LINE ద్వారా మీ మొబైల్ కి గాని ఇమెయిల్ కి గాని సమాచారం వచ్చిన పిదప డౌన్ లోడ్ చేసుకోవాలి.
* మొదటి సంవత్సరం ఎలాంటి చెక్ పోస్టులు ఉండవు. కానీ నియమించిన ఆఫీసర్స్ ద్వారా మొబైల్ చెక్ పోస్టులు అనగా దారి వెంట చెక్ చేసే అధికారులు తప్పకుండ అక్కడక్కడా ఉంటారు. కాబట్టి ప్రతి సప్ప్లై వెంట తగు బిల్లులు, వే బిల్లులు తప్పకుండ ఉంచాలి.
* యాభై వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లు అప్ లోడ్ చేసి వే బిల్ ఆన్ లైన్ ద్వారా పొందాలి. తదుపరి మాత్రమే అట్టి అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకి పంపాలి. ఇది బయట సప్ప్లై కి మాత్రమే కాదు మన ఇంటి పక్క వాడికైనా కూడా వే బిల్ తప్పనిసరి. ఇది లేకపోతే నేరము. దీనిని అనుసరించకుంటే కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య జైలు శిక్ష ఉంటుంది.
* ఈ GST సిస్టం లో నెల వారి అమ్మకాలకు నింపే VAT 200 కి బదులు కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇందులో మనo ప్రతి నెల సేల్స్ ని 5 రకాల పద్ధతుల్లో ఆన్ లైన్ ద్వారా పంపాల్సివస్తుంది - తెలుసుకోవాల్సి వస్తుంది. అన్నీ మ్యాచ్ చేయాల్సివస్తుంది.
1. R1 FORM on every month 10th,
2. R2 FORM ,, 13TH
3. R3 FORM ,, 15TH
4. R4 FORM ,, 17TH
5. R5 FORM ,, 20TH ( FINAL).
:: 3 ::
ఇవన్నీ మన మన ట్రాన్సక్షన్స్ కి సంబందించినవి. మొదటిది = మన ఖరీదుకు సంభందించినది. రెండవది = దాని నిర్ధారణ - ఇది GST డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేది. మూడవది, నాల్గవది మరియు ఐదవది... ఇవన్నీ కూడా నెల నెలా UPLOAD చేయవల్సినవే..ఇలా చివరి వరకు MATCH & MISMATCH తరువాత అమ్మకాల మరియు కొనుగోలు దారుల SUBMISSION Camparision చేసుకునే ప్రక్రియ. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. కాబట్టి ఇది ప్రత్యక్షంగా మీ మీ ఛేర్టెర్డ్ అకౌంటెంట్ ద్వారా గాని.. లేదా ఏదేని సాఫ్ట్ వెర్ కంపెనీలో గాని తెలుసుకోండి. ప్రాక్టికల్ గా నేర్చుకోవడం తప్పని సరి.
* ఈ GST విధానం లో లెక్కలు అన్నీ కూడా సుమారుగా VAT ఉన్నట్టుగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్ను రెకమండ్ చేసిన విధంగా కట్టాల్సి వస్తుంది. ప్రతి నెల ఇట్టి పన్ను ప్రభుత్వం నిర్ణయించిన సమయం లోపల కట్టాలి. లేదా గట్టి జరిమానాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త.
* అట్టి లావా దేవీలకు సంభందించిన చెల్లింపులన్నీ, బ్యాంకు ద్వారా గాని E- బ్యాంకింగ్ ద్వారా గాని - ఆన్ లైన్ ద్వారా గాని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ల ద్వారా గాని మాత్రమే చెల్లించాలి. చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.
గతంలో అనగా VAT విధానంలో నెలకు జరిపిన లావాదేవీలు అనగా ఖరీదులు గాని మరియు అమ్మకం గాని నెల ఆఖరున ఒకే సారి
VAT 200 ద్వారా తెలిపేవాళ్ళం. కానీ ఈ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి మీ అందరికి ఇంటర్నెట్ తప్పకుండ ఉండాలి. అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ మరియు ఇన్వెర్టార్ ఉండి తీరాలి.
* మన అమ్మకానికి సంభందించిన ప్రతి బిల్లు నంబర్ క్రమం తప్పకుండ ఉండడాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి లావాదేవీలు కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఒక ఆఫిసర్ ద్వారా గాని, చిన్న చిన్న పొరపాట్లు ఆఫిస్ కి వెళ్లి గాని మార్చుకునే అవకాశం గాని లేదు. తప్పిదాలకు ఏ ఆఫీసర్ కూడా ఏమి చెయ్యలేడు. ఒక్క సారి ప్రతి నెల ఇరవయ్యవ తారీఖున అప్ లోడ్ చేసిన పిదప ఇక ఎలాంటి మార్పు చేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశమే లేదు. అంత కంప్యూటర్ మయమే. కాబట్టి చివరగా అనగా 20 వ తారీకున వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. కాబట్టి జాగ్రత్త.
* ఒక ప్రొప్రయిటర్ పేరుతో ఒకరికి ఒక్క ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువగా ఫరములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్మ్ PAN కార్డు తో లింక్ అయి ఉంటుంది కాబట్టి అట్టి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త.
* ఇక ముందు GST అమలు తరువాత ఒక వేల ఒకే రాష్ట్రంలో గనక అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్ కి గాని, ఫ్యాక్టరీ నుండి గోడౌన్ కి గాని, ఫ్యాక్టరీ నుండి సి & ఎఫ్ కి గాని, గోడౌన్ నుండి ఆఫిస్ కి గాని స్టాక్ ట్రాన్స్ఫర్ అనే విధానం ఒక డెలివరీ చలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి ఇంకో డిస్ట్రిబ్యూటర్ కి కూడా సరుకు మార్పిడి ( ట్రాన్స్ఫర్) ఉండదు. దీనికి తప్పకుండ బిల్లు ఉంది తీరాలి. కాబట్టి ఒక వేళా ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒక వేల ఇతర రాష్టం నుండి గనక అయితే సొంత డిపో ఐన కూడా కంపెనీ బిల్లు ద్వారానే సరుకు పంపాల్సివస్తుంది.
* ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటి పైన కూడా పన్ను విధింపు ఉంది.. కాబట్టి జాగ్రత్త. ఒక్క కంపెనీ ద్వారా అది కూడా బిల్లు ద్వారా ఇచ్చే స్కీములకి మాత్రమే పన్ను ఉండదు. ఇది అందరూ గమనించగలరు.
* ఈ కొత్త పన్ను విధానం ద్వారా FMCG ప్రాడక్ట్స్ ధరలు తగ్గ వచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వేచి చూడాలి.
* * ఇక ముందు కూడా ప్రతి ప్యాక్డ్ ప్రాడక్టు పైన MRP విధిగా ఉంటుంది. .
:: 4 ::
* ఈ కొత్త పన్ను విధానం ద్వారా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ - C & F వ్యవస్థకి పెను ముప్పు రానుందని చెప్పాలి.
* ఇంకో కొత్త విధానం ఏమిటంటే; ధరల నియంత్రణ చట్టం. అనగా ఒక వేళ KISSAN JAM ధర Rs 150 /- ఉందనుకోండి. అదే JAM పైన ఇంకో ప్రాడక్టు ఉచితంగా ఇస్తే గనక దాని ధర నియంత్రణ చేసే అధికారం సంభందిత అధికారులకు ఉంటుంది కాబట్టి ఇది మీరందరూ కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి.. ఇది చాల క్లిష్టమైన సమస్య. కాలమే దీనికి సమాధానం చెబుతుంది.
* డిస్కౌంట్ అనేది ఒక వేళా బిల్లు ద్వారా వస్తే తప్ప మిగతా అయితే అట్టి డిస్కౌంట్ కి కూడా టాక్స్ పడుతుంది.
* ఇట్టి సవరణలను అర్థం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి, తప్పు చేసే వాళ్ళను పసి గట్టే విధానాన్ని అనుసరించేందుకు గాను, ప్రభుత్వం రేటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అన్నీ సక్రమంగా నిర్వర్తించే వాళ్లకి భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతే కాదు భవిష్యత్తులో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాము అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారి పోవచ్చు కూడా. ఇది గాకుండా భవిష్యత్తులో ఈ రేటింగ్ పద్దతి ద్వారానే బ్యాంకులు మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోన్ గాని, ఇల్లు లోన్ గాని, వ్యాపార లోన్ గాని ఈ విధానం లోనే చూడ బడుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంది.
* ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే... మేము అన్ని కంపెనీలకు వాస్తవాన్ని తెలియచేసాము. FAIDA ద్వారా లెటర్ పంపాము. చాలా వరకు FMCG కంపెనీలు మైగ్రేషన్ ( మార్పిడి) ద్వారా వచ్చే TAX డిఫ్ఫరెన్సు ని NET LOSS పద్దతిలో లెక్క గట్టి తప్పకుండ అట్టి నష్టాన్ని పూడుస్తామని లెటర్ ద్వారా తెలిపాయి. ఇది సంతోషించదగ్గ పరిణామం. ఇది నిజంగా FAIDA విజయం. అందుకని మీరందరూ క్లోసింగ్ స్టాకుని సక్రమంగా లెక్క చేసి పెట్టుకోండి. అట్టి ప్రాడక్టుల పైన ఉన్న TAX ని లెక్క చేయండి. ఇది మనం మన సబ్మిషన్ లో చెప్పాల్సి వస్తుంది. అట్టి TAX మనకి INPUT టాక్స్ క్రెడిట్ పద్దతిలో GST లోకి మారిపోతోంది. ఇది గాకుండా 18 % లోపు ఉన్న tax లకు 40 % ఎక్సయిజ్ tax పద్దతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మిగతా అంట మీ మీ కంపెనీలు మీకు నేర్పుతాయి. ఒక వేళా 18 % పైన గనక టాక్స్ ఉంటె అట్టి ప్రాడక్ట్స్ కి టాక్స్ + 60 % రిఫండ్ ఉంటుంది. ఇది మీకు కంపెనీ వాళ్ళు చెబుతారు.
* ఇక ముందు మనం అమ్మే ప్రతి ప్రాడక్టు కి HSN CODE విధానం వర్తిస్తుంది. ఇది ఏంటంటే మనం అమ్మే ప్రతి ప్రాడక్టు కి ఒక CODE ఇస్తుంది GST ఫార్మాట్ లో. అది మనం క్యాంపెయిన ద్వారా కలెక్ట్ చేసుకోవాలి. అది లేనిదే మనం బిల్లు చేయలేము. కాబట్టి మీ కంపెనీలను ఈ విషయమై అడగండి. అందుకని వారు చెప్పిందే కరెక్ట్ అని నమ్మకండి. మీరు కూడా నిజ నిర్ధారణ చేసుకోండి. నమ్మకం కలిగిన తరువాతే అట్టి transaction చేయండి.
* ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ గాని, డామేజ్ గాని, ఎక్సపెరి గాని, లేదా సేల్ మం శాలరీ గాని లేదా పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ గాని తొందరగా రెడీ చేయండి. ( GST మొదలయ్యే లోపు అన్నింటికీ సంభందించిన క్రెడిట్ నోట్స్ తయారు చేసుకొని కంపెనీకి పంపండి.) అట్టి డాక్యుమెంట్ ని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి. అయినంత వరకు కంపెనీల ద్వారా అట్టి డబ్బును తెప్పించుకోండి. ఎందుకంటె GST తరువాత అట్టి క్లెయిమ్స్ కి 18 % TAX పడే అవకాశం ఉంది. జాగ్రత్త.
* ఇట్టి ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్, లాడ్జీల బిల్లులు ఇతరత్రా పైన కట్టే టాక్సులను మనం ఇన్పుట్ క్రెడిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ బిల్లుపైన, స్టేషనరీ ఖరీదు పైన, రెంటాల పైన గాని ఏదేని టాక్స్ కట్టిన యెడల అది కూడా ఇన్పుట్ టాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
:: 5 ::
ఇది రిఫండ్ గా లెక్క చూసుకోవాలి. ఇది నెల అంతంలో నింపే రిటర్న్ లో క్లుప్తపరచాలి. ఈ విషయమై ఒక సారి మీ ఛార్టర్డ్ అకౌంటెంట్ ని అడగండి. IMP: No bank charges are allowed for input tax credit.
* అలాగే ఒక వేల ఇంటెరిమ్ సేల్స్ మేన్స్ కి గాని, డిస్ప్లే ఖర్చు గాని, లేదా కంపెనీ తరపున చేసిన ఖర్చును గాని కంపెనీల నుండి క్లెయిమ్ చెప్పుడు తప్పకుండ INVOICE రైజ్ చేసి టాక్స్ జోడించి పంపించాలి. అట్టి ట్యాక్సును ఇన్పుట్ - ఔట్పుట్ లో సరిగా క్లెయిమ్ చేసుకోవాలి.
సాధారణంగా న్యాయ పరమైన విధానాలు: ఈ విధానాలు అన్ని రకాల వ్యాపారాలకు వర్తిస్తాయి. అయితే మన కోసం కొన్ని ముఖ్య అంశాలు:
GST ద్వారా రిజిస్టర్ చేసుకొన్నా ప్రతి వ్యాపారి తమ వ్యాపార లావా దేవీల పుస్తకాలను గాని. software ద్వారా సమాచారాన్ని గాని దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. GST ఆఫిసర్ అడిగిన దరిమిలా అన్నీ రోజు వారీగా చూపించే విధంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన విషయం.
దీనికి గాను మీకంటూ ఒక ఫుల్ టైం అకౌంటెంట్ గాని లేదా మీరు గాని ఏళ్ళ వేళల సమాధానం ఇచ్చే పరిజ్ఞ్యానం కలిగి ఉండాలి.
మీ వ్యాపారం లో మీరిచ్చే జీతాల లెక్క సరిగా ఉంచాలి. మీ నెల జీతాలన్నీ ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒకవేళ అలా చెయ్యకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే గనక అట్టి జీతాల ఖర్చును ఖర్చు కింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది. జాగ్రత్త.. మీ మీ ట్రావెల్ ఖర్చులు, మీ ఇతర చెల్లింపులు తప్పకుండ ఫర్మ్ కింద క్లెయిమ్ చెయ్యాలి.
మీ దగ్గర ఉన్న కేవలం ఖరీదు చేసిన సరుకు అయితే నే TAX క్రెడిట్ క్లెయిమ్ చెయ్యాలి. ఇతరత్రాకి ఇన్పుట్ క్రెడిట్ రాదు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి అట్టి సరుకు ఎట్టి పరిస్థిలోను December లోపు అమ్ముకోవాలి. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు.
ఇక సి & ఎఫ్ - సూపర్ స్టాకిస్టు విధానానికి వస్తే పాత వ్యాపారానికి సంభందించి సి ఫార్మ్స్ కానీ, F ఫార్మ్స్ కానీ December లోగా తమ తమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైనా , తదుపరి లావా దేవీలపైనా TAX పడే అవకాశం ఉంది.
31 మర్చి 2017 క్లోసింగ్ స్టాక్ మరియు 30 జూన్ ఖరీదును సరిగా లెక్క చేసుకుని అట్టి క్లోసింగ్ స్టాక్ ని క్వాంటిటీ రూపేణా లెక్క కట్టుకుని GST ఇంప్లిమెంటేషన్ రోజు వరకు రెడీ గా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావా దేవీల అకౌంట్ కాపీ ని తప్పకుండ తెప్పించి పెట్టుకోవాలి. అట్టి కహ్రీదులను మీ పుస్తకాలతో సరి చూసుకోవాలి. అశ్రద్ధ పనికి రాదు.
అట్టి సరిచేసిన స్టాక్ ను పన్ను రేట్ల పరంగా తాయారు చేసుకోవాలి. ఇట్టి స్తతెమెంత్ ద్వారానే మీ GST లో ఇన్పుట్ క్రెడిట్ జమ అవుతుంది.
మీకు వచ్చిన మీ GSTIN నెంబర్ ని మీ సుప్ప్లిర్లు అందరికి ఇవ్వండి. అలాగే మీరు ఎవరైతే GSTIN కుమ్బర్ వాళ్లకి సప్ప్లై చేయాలనుకున్నారో అట్టి వారి నెంబర్ మొదలుగానే తీసుకోండి.
:: 6 ::
మీరు కొనే- లేదా అమ్మే ప్రతి ప్రాడక్టుకి HSN CODE ఉంటుంది. అది తప్పనిసరి కాబట్టి అట్టి ప్రాడక్ట్స్ యొక్క HSN CODES ని మోడల్ తెలుసుకుని మీ దగగ్ర ఒక షీట్లో రెడీగా పెట్టుకోండి. ఎందుకంటె GST తరువాత ప్రతి ప్రాడక్టు HSN CODE ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇక చట్టపరమైన జరిమానాలు. శిక్షలు, వాటి విధానం:
ఇక్కడ చట్టం చానా పకడ్బందీగా నిర్మానించబడింది. ఇక్కడ మన తప్పులకు ఆడిటింగ్ గాని, లోకల్ఆఫిసర్స్ నుండి గాని ఎలాంటి నోటీసు గాని రాదు. ఇక ముందు ఏ ఆఫీసర్ కి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులు ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒక వేల నిర్ధారించిన నాడు INVESTIGATION TEAM రావచ్చు. లేదా అట్టి తప్పులను నేరుగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్ట్ చేయవచ్చు. అలా అరెస్ట్ చేస్ముందు మనకు కారణాలు చూపిస్తారు. అయితే అరెస్ట్ ఐన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. ఆ పై వెంటనే BAIL దొరుకుతుంది. OFFENCES U / S 132 అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంది.
ఇట్టి 132 సెక్షన్ పరిధులెవనగా: ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశ్యపూర్వకముగా బిల్లు లేదా సర్వీస్ INVOICE లేకుండా సరుకు గాని, సర్వీస్ గాని సప్లై చేస్తూ దొరికినచో, లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించినచో, ....
లేదా ఏ సరుకు గాని, సర్వీస్ గాని ఇవ్వకున్నాను కేవలం ఇన్పుట్ టాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చి దొరికినచో.. తద్వారా ఎవరిని లాభపడినచో... లేదా.
సదరు వ్యాపారి input tax credit చేసుకుని తరువాత అట్టి టాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో .. దీనిని కావలి చేసిన ద్రోహం కింద పరిగణించి శిక్ష పేడే అవకాశం ఉంది. ఇట్టి తప్పుల వల్ల నేర నిర్ధారణ జరిగితే జైలు తప్పదు.
కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకోవడమే కాకుండామీ దగ్గర పని చేసే అకౌంటెంట్ కి కూడా నేర్పండి. లేదా లేని పోనీ చిక్కుల్లో పడతారు.
ఇంకో ముఖ్య విషయం. GST upload చెయ్యడానికి GST అథారిటీ పొందిన సాఫ్ట్ వెర్ నుండే సాధ్యం. ఒకవేళ ఏ కంపెనీ గాని ఇతర చిన్న చిన్న సాఫ్ట్ వెర్ కంపెనీలు గాని ఇంటర్నల్ GST బిల్లింగ్ కొరకు సాఫ్ట్ వెర్ ఇచ్చిననూ GST UPLOADING మాత్రం తప్పకుండ AUTHORISED సాఫ్ట్ వెర్ తప్పని సరి. ఇది జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సింది. దేశం మొత్తంలో కేవలం 34 soft ware CO 'S కి మాత్రమే ఆ AUTHORIZATION ఉంది. అందులో మన ట్రేడ్ సపోర్ట్ కంపనీలు చాలా తక్కువ..
TELECOM డిస్ట్రిబ్యూటర్లకు సంభందించి కొంత సమాచారం సేకరించాల్సి ఉంది. అందుకు ఇంకా రెండు రోజులు పట్టొచ్చు. కాబట్టి ఎదురు చూడగలరు. కానీ ప్రతి TELECOM డిస్ట్రిబ్యూటర్ తప్పనిసరిగా GST తీసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించగలరు. ఇందుకు గాను 18 % GST కూడా విధించబడింది. జాగ్రత్త. మీ విషయమై తరువాత వివరిస్తాము.
ఇక పోతే ముఖ్యంగా 30 జూన్ నెల నాటికి క్లోసింగ్ స్టాక్ కి సంభందించి సవరించుకోవాల్సిన విధానాలు:
:: 7 ::
మల్లి ఈ GST మీటింగ్ జూన్ 11 వ తారీఖున ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇంకా ఏదేని మార్పులు ఉన్నచో తప్పకుండా మీకు సరైన విధంలో తెలియ జేస్తుంది .
ఈ చట్టాన్ని, సవరణాలని, ఎంతో చదివి, ఇంకెంతో మంది ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ని కలిసి, ఇంకా GST డిపార్ట్మెంట్స్ తో సంప్రదింపులు జరిపి, నిజ నిర్ధారణ చేసుకుని, మీ వరకు పంపిస్తున్నాము. ఇందులో ఏ అనుమానం లేదు.
GST మార్పిడి సమయాన closing stocks పైన మనకు రావాల్సిన INPUT TAX CREDIT విధానాన్ని త్వరలో మరొక్క మెసేజ్ ద్వారా పంపిస్తాము. అయితే ఈ విషయంలో ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదు. మనకు రెండు విధాలలో INPUT TAX CREDIT వస్తుంది. వివరాలకు వేచి చూడండి.
ఇంతటి విలువైన సమాచారాన్ని కేవలం మీ వరకే పెట్టుకోకుండా మన సోదరులందరికి, తోటి వ్యాపారస్తులందరికి కష్టమనుకోకుండా పంపించండి. ఇందులో భేషిజాలు, బేధ భావాలూ లేవు, ఒకరికి తోడ్పడడమే మా ఉద్దేశ్యం.
ఇట్టి సమాచారం పైన మీ మీ అభిప్రాయాలూ తెలిపితే సంతోషిస్తాము.
మీ అందరికి ధన్యవాదాలు.