Showing posts with label
రాజధాని యువతకు మలివిడత ఉపాధి శిక్షణ.
Show all posts
Showing posts with label
రాజధాని యువతకు మలివిడత ఉపాధి శిక్షణ.
Show all posts
రాజధాని పరిధిలోని యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించడం ద్వారా ఉపాధి కల్పనలో తోడ్పడే ఉద్దేశంతో సీఆర్డీఏ నిర్వహిస్తున్న కార్యక్రమంలో మలివిడతను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అమరావతి నగర పరిధిలోని 27 రెవెన్యూ గ్రామాల్లోని యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవల్‌పమెంట్)ను పెంచేందుకు ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీఆర్డీఏ సంయుక్తంగా ఈ శిక్షణ ఇప్పిస్తుండడం, ఇప్పటికే దీనికింద వివిధ కోర్సుల్లో పలువురు శిక్షణ పొంది, జీవనోపాదికి బాటలు వేసుకోవడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లభిస్తున్న స్పందన దృష్ట్యా మలిదశ శిక్షణకు అధికారులు సంకల్పించారు. మంగళగిరి మండలంలోని నవులూరులో ఏర్పాటు చేసిన అమరావతి స్కిల్ డెవల్‌పమెంట్ ఇనస్టిట్యూట్‌లో ఈ శిక్షణ ఇస్తారు. పూర్తి ఉచితంగా ఇచ్చే ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఎటువంటి స్టైపండ్ చెల్లించబోమని, ఈ శిక్షణ రాజధాని నగర పరిధిలోని 27 గ్రామాలకు చెందిన యువతీ యువకులకు మాత్రమేనని సీఆర్డీయే కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ గ్రామాల్లోని సీఆర్డీయే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో లేదా గ్రామ ఫెసిలిటేటర్ లేదా 95057 19172, 97000 25833 ఫోన నెంబర్లలో కానీ సంప్రదించవచ్చునన్నారు. శిక్షణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అన్ని కోర్సులకూ వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 40గా నిర్ణయించారు. అయితే వాటి కాలవ్యవధి, విద్యార్హతలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.
మొబైల్ టెక్నీషియన (45 రోజులు),
ఏసీ టెక్నీషియన (2 నెలలు),
కారు డ్రైవర్ (20 రోజులు),
బ్యుటీషియన (30 రోజులు),
స్కూటర్ మెకానిక్ (3 నెలలు)
కోర్సుల్లో విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఆసక్తి ఉన్న రాజధాని వాసులెవరైనా శిక్షణ పొందవచ్చు. 4 నెలలపాటు శిక్షణ కొనసాగే ల్యాండ్ సర్వేయర్ కోర్సుకు 10వ తరగతి, ఆపైన చదివి ఉండాలన్న అర్హత విధించగా, 3 నెలలు ట్రైనింగ్ జరిగే ల్యాబ్ టెక్నీషియన కోర్సు అభ్యసించేందుకు ఇంటర్ (బైపీసీ) చదివిన వారు అర్హులు. శిక్షణ కాలం 2 నెలలుండే అకౌంటెన్సీలో ఇంటర్ (సీఈసీ), బీకాం, ఎంకాం, ఎంబీఏ (ఫైనల్) చదివిన వారు చేరవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన రాజధాని నగర యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోర్సులు ఇవీ...