ప్రభుత్వోద్యోగులకు సెలవులే సెలవులు
రుణాలు పొందడం చాలా సులభం
సర్కారు కొలువు.. సౌకర్యాల నెలవు
అవగాహన పెంచుకుంటే వినియోగం సులభం
ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు వేతనంతో పాటు అదనంగా పలు సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. విధుల్లో ఉన్నవారికే కాకుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సైతం ఈ అవకాశం కల్పించారు. రెగ్యులర్ ఉద్యోగులకు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులకు స్వల్ప తేడాతో సౌకార్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నది. పదవీ కాలంలో పలు రకాల సెలవులతో పాటు పండుగలకు అడ్వాన్స్‌లు, వారి పిల్లలకు విద్యా అలవెన్స్‌లు, మరణిస్తే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. వేతనానికి వేతనం, ఇతర సౌకర్యాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కల్పించబడుతాయి. అయితే చాలామంది సరైన అవగాహన లేక వీటిని వినియోగించుకోలేక పోతున్నారు.
సెలవులు...
ఆకస్మిక సెలవులు (క్యాజువల్ లీవ్స్): ఉద్యోగులకు సంవత్సరానికి 15 రోజులు క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తారు. ఈ సెలవుల కాలానికి పూర్తి వేతనం అందిస్తారు.
ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలీడేస్): ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలండర్ ఇయర్‌కు 5రోజులు ఐచ్చిక సెలవులు మంజూరు చేస్తారు. క్యాలండర్‌లో పేర్కొన్న పండుగలకు మాత్రమే ఈ లీవ్‌లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సెలవులకు వేతనంతో కూడినవి.
అర్ధ వేతన సెలవులు (ఆఫ్ ఫే లీవులు) : ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 20 అర్ధ వేతన లీవ్‌లు మంజూరు చేస్తారు. ఇవి వాడుకున్న ఉద్యోగులకు అర్ధ వేతనం చెల్లిస్తారు.
వేసెక్టమి ఆపరేషన్: కుటుంబ నియంత్రణ చేసుకున్న మగ ఉద్యోగికి వేతనంతో కూడిన ఆరు రోజుల లీవ్‌లు మంజూరు చేస్తారు.
పితృత్వ సెలవులు: డెలివరీ అయిన భార్యకు సేవలు అందించేందుకు భర్తకు 15రోజుల క్యాజువల్ లీవ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
మెటర్నిటీ లీవ్‌లు: మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌లు మంజూరు చేయడం జరుగుతుంది. డెలివరీ సమయంలో ఈ లీవ్‌లు వాడుకోవచ్చు. ఈ సెలవులు వేతనంతో కూడినవి.
ఎర్న్‌డ్ లీవ్‌లు (సంపాదిత సెలవులు): క్యాలండర్ ఇయర్‌కుగాను సంపాదిత సెలవులు 30 మంజూరు చేస్తారు. ఈ లీవ్‌లు వాడుకోగా మిగిలినవి అదే సంవత్సరం అమ్ముకోవచ్చు లేదంటే లీవ్ ఖాతాలో చేరుతాయి.
ప్రభుత్వ గుర్తింపు సంఘాల నేతలకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు సంఘ కార్యకలాపాలకు గాను ప్రతి సంవత్సరం 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవులు పెట్టుకునే అవకాశం ఉంది.
ఇతర సౌకర్యాలు...
ప్రభుత్వ ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు ఇంటర్ వరకు ప్రతి సంవత్సరం రూ.2500 ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద అందిస్తారు.
ఫెస్టివల్ అడ్వాన్స్ కింద (నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే) ప్రతి సంవత్స రం రూ.7500 వడ్డీ లేని రుణం (భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరికి మాత్రమే) అందిస్తారు. పది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకార్యాలు ఉచితంగా అందించడం జరుగుతుంది.
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియల నిమిత్తం రూ.20వేలు చెల్లిస్తారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి మరణిస్తే అం త్యక్రియల ఖర్చు నిమిత్తం రూ.10వేలు చెల్లిస్తారు.
పీహెచ్‌సీ అలవెన్స్ బేసిక్‌పేపై 10శాతం లేదా రూ.2వేలు మంజూరు చేయడం జరుగుతుంది. ఠ అంధ ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ మంజూరు చేస్తారు.
ఉద్యోగులకు అర్బన్, రూరల్ పరిధిని పరిగణనలోకి తీసుకుని హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.