Friday, 20 October 2017

Polity bits

*POLITY Important BITS* 🌺
 భారత్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని (వ్యాపారంపై) ఏ చట్టం ద్వారా తొలగించారు?
– 1813 చార్టర్‌ చట్టం

భారత్‌లో మత మార్పిళ్లకు అవకాశం కల్పించిన చట్టం?
– 1813 చార్టర్‌ చట్టం

గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా నియమితులైన తొలి వ్యక్తి?
– విలియం బెంటింగ్‌

లా కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన తొలి వ్యక్తి?
– లార్డ్‌ మెకాలే

భారత్‌లో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా ఏ చట్టాన్ని అభివర్ణిస్తారు?
– 1833 చట్టం

భారత్‌లో మొట్టమొదటి వైశ్రాయ్‌గా నియమితులైన వ్యక్తి?
– లార్డ్‌ కానింగ్‌

భారతదేశ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులైన తొలి వ్యక్తి?
– ఎడ్వర్డ్‌ స్టాన్లీ

పోర్ట్‌ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టినవారు?
– లార్డ్‌ కానింగ్‌

ఏ చట్టం ద్వారా భారత శాసన వ్యవస్థలో రాజులు, జమీందారులకు ప్రాతినిధ్యం కల్పించారు?
– 1861 కౌన్సిల్‌ చట్టం

ఏ చట్టం ఆధారంగా భారత్‌లో హైకోర్టులు ఏర్పాటు చేశారు?
– 1861 కౌన్సిల్‌ చట్టం

భారత్‌లో మొదటి హైకోర్టును ఏర్పాటు చేసిన సంవత్సరం?
– 1862, మే 14

భారత్‌లో కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్య 10కి తగ్గకుండా 16కి మించకుండా ఉండాలని ఏ చట్టం ద్వారా నిర్ణయించారు?
– 1892 చట్టం

ఏ చట్టం ద్వారా భారత్‌లో గవర్నర్‌ జనరల్‌ అధికారాలను... శాసన, కార్యనిర్వాహక అధికారాలుగా విభజించారు?
– 1853 చార్టర్‌

భారత ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల మాగ్నా కార్టాగా ఎవరి ప్రకటనను పేర్కొంటారు?
– విక్టోరియా మహారాణి ప్రకటన

భారత్‌లో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
– 1892 చట్టం

మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
– లార్డ్‌ మింటో

గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు?
– సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా

ఏ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్ర శాసన సభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కు పెంచారు?
– 1909 చట్టం

‘‘1909 చట్టం హిందూ–ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు వేసి అడ్డుగోడలను సృష్టించింది. దేశ విభజనకు కారణమైంది’’ అని పేర్కొన్నవారు?
– నెహ్రూ

ఎవరి రాక సందర్భంగా భారత్‌లో ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నిర్మించారు?
– 5వ జార్జ్, బ్రిటిష్‌ రాజు

కేంద్ర శాసన సభలో మొదటిసారిగా ద్విసభ విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
– 1919 చట్టం

1919 చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి చైర్మన్‌గా నియమితులైన తొలి వ్యక్తి?
– సర్‌ ఫ్రెడరిక్‌ నైట్‌

భారతదేశంలో తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభాధ్యక్షుడు (స్పీకర్‌)?
– విఠల్‌ బాయ్‌ జే పటేల్‌

ఉద్యోగుల ఎంపిక కోసం ‘సెంట్రల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
– 1926లో

ఏ చట్టం ద్వారా ప్రజలకు విచక్షణా పూరిత ఓటు హక్కు కల్పించారు?
– 1919 చట్టం

సైమన్‌ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
– 1927 (1919 చట్టం పరిశీలనకు)

రాజ్యాంగ రచన చేయాలని 1927లో మద్రాసు కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
– ఇబ్రహీం అలీ అన్సారి

సమాఖ్య అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది?
– సైమన్‌ కమిషన్‌

1930, 1931, 1932ల్లో లండన్‌లో మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను ఏ నివేదిక గురించి చర్చించడానికి ఏర్పాటు చేశారు?
– సైమన్‌ కమిషన్‌ నివేదిక

కమ్యూనల్‌ అవార్డును ప్రకటించిన బ్రిటిష్‌ ప్రధాని?
– రామ్‌సే మెక్‌డొనాల్డ్‌

ఏ చట్టం ద్వారా భారత్‌లో మొదటి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేశారు?
– 1935

షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ) అనే పదం ఏ చట్టం ద్వారా ఉపయోగించారు?
– 1935

బ్రిటన్‌ పార్లమెంట్‌ చరిత్రలో ఆమోదించిన అతిపెద్ద చట్టం?
– 1935 భారత ప్రభుత్వ చట్టం

ఏ చట్టం ద్వారా భారత్‌లో తొలిసారిగా మహిళలకు పరిమిత ఓటు హక్కు కల్పించారు?
– 1935

1935 భారత ప్రభుత్వ చట్టం ప్రస్తుత రాజ్యాంగానికి జిరాక్స్‌ అని పేర్కొన్నవారు?
– కె.టి. షా

క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌కు నేతృత్వం వహించినవారు?
– సర్‌ ఫెడరిక్‌ లారెన్స్‌

ఎవరి సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్‌కు పరోక్ష ఎన్నికలు నిర్వహించారు?
– క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌

భారతదేశ స్వాతంత్య్ర చట్టాన్ని రూపొందించిన చివరి గవర్నర్‌ జనరల్‌?
– లార్డ్‌ మౌంట్‌ బాటన్‌

బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో వ్యవసాయం, ఆహార శాఖలను నిర్వహించినవారు?
– బాబూ రాజేంద్ర ప్రసాద్‌

భారత్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
– 1946, నెహ్రూ అధ్యక్షతన

యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా ఏ చట్టాన్ని భావిస్తారు?
–1947 స్వాతంత్య్ర చట్టం

రాజ్యాంగ పరిషత్‌ అనే భావనను తొలిసారిగా 1934లో వ్యక్తీకరించినవారు?
–ఎం.ఎన్‌. రాయ్‌

1939లో మహాత్మాగాంధీ ఏ పత్రికలో రాజ్యాంగ పరిషత్‌ గురించి డిమాండ్‌ చేశారు?
– హరిజన పత్రిక

రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్య?
–389

బ్రిటిష్‌ పాలిత ప్రాంతాల నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎంత మంది ఎన్నికయ్యారు?
–292

స్వదేశీ సంస్థానాల నుంచి ఎంతమంది నామినేట్‌ అయ్యారు?
–93

దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యుల సంఖ్య?
– 299

రాజ్యాంగ పరిషత్‌ మొదటి సమావేశం ఎప్పుడు నిర్వహించారు?
– 1946, డిసెంబర్‌ 9

రాజ్యాంగ పరిషత్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించినవారు?
– సచ్ఛిదానంద సిన్హా

రాజ్యాంగ పరిషత్‌కు 1946 డిసెంబర్‌ 11న ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు?
– బాబూ రాజేంద్ర ప్రసాద్‌

రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారు, తత్వవేత్త, మార్గదర్శి, చిత్తు రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తారు?
– బి.ఎన్‌. రావ్‌

రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో అఖిల భారత షెడ్యూల్డు కులాలకు ప్రాతినిధ్యం వహించినవారు?
– డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌

దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్‌ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు?
– సోమనాథ్‌ లహరి

ఫ్రాన్స్‌ సంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్ఛిదానంద సిన్హాను ప్రతిపాదించినవారు?
– జె.బి. కృపలానీ

రాజ్యాంగ పరిషత్‌ తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా పనిచేసినవారు?
– ఫ్రాంక్‌ ఆంటోని

రాజ్యాంగ పరిషత్‌లో అతిపెద్ద కమిటీ సలహా సంఘం. దాని చైర్మన్‌ ఎవరు?
– సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏ రోజున ఏర్పడింది?
– 1947 ఆగస్టు 29

డి.పి. ఖైతాన్‌ మరణించడంతో ఆయన స్థానంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎవరిని నియమించారు?
– టి.టి.కృష్ణమాచారి

*🙏🏻🙏🏻*

No comments:

Post a Comment