*వందనం _ పాదాభివందనం:*
మట్టి ముద్దలాంటి నన్ను మనిషిగా మార్చిన మాగురువులకు వందనం,
చీకటిలో బ్రతుకుతున్న నాలో అక్షర దీపాలు వెలిగించిన ఆ పుణ్యమూర్తులకు పాదాభివందనం,
జ్ఞానం పంచి వెలుగు మార్గం చూపిన ఆ త్యాగధనులకు అభివందనం,
విజ్ఞానంపెంచి భుక్తి మార్గం చూపిన నవయుగ ఋషివర్యులకు వినమ్రంగా శిరసాభి వందనం,
వివేచన పెంచి విముక్తిమార్గం చూపిన ఆధునిక మునిస్వరూపులకు సాష్టాంగ ప్రణామం,
ఎన్ని చేసినా తీరనిదివారిఋణం, తమవిద్యలతో నాకు మరో జన్మ ప్రసాదించిన గురువులా రా ...
ఏదో తృణంగా ఈ కవితను మీకు అంకితం చేస్తున్నాను..
విద్యార్థుల ఉన్నతికై ప్రతి క్షణం పరితపిస్తూ, ....
వారి విజయాలకై అహర్నిశలు శ్రమిస్తోన్న ....
ప్రతి ఉపాధ్యాయునికి నా హృదయ పూర్వక పాదాభివందనాలు...
నా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు... 🙏
No comments:
Post a Comment